శాంతి ర్యాలి కాదు 24 గంట‌ల బంద్‌

 

ఈ నెల 7న హైద‌రాబాద్‌లో స‌మైక్య వాదుల సేవ్ ఆంద్రప్రదేశ్ స‌భ నేప‌ధ్యంలో తెలంగాణ జెఎసి కూడా గేమ్ ప్లాన్ సిద్దం చేస్తుంది. ఇన్నాళ్లు అదే రోజు శాంతి ర్యాలి చేయాల‌న‌కున్న టి జెఎసి ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. అదే రోజు తెలంగాణ బంద్‌కు పిలుపు నిచ్చింది రాజ‌కీయ జెఎసి. శుక్రవారం రాత్రి నుంచి శ‌నివారం రాత్రి వ‌ర‌కు 24 గంట‌ల‌పాటు బంద్ పాటించ‌నున్నట్లు తెలిపారు.

శాంతి ర్యాలికి బదులుగానే బంద్ పాటిస్తున్నట్టుగా ప్రక‌టించిన జెఎసి ఇది సీమాంద్ర స‌భ‌కు వ్యతిరేకం కాద‌న్నారు. ప్రభుత్వం తెలంగాణ‌కు వ్యతిరేకంగా వ్యవ‌హ‌రిస్తుంద‌ని అందుకు నిర‌స‌న‌గానే బంద్ పాటిస్తున్నామ‌ని, తెలంగాణ మొత్తం వ్యవ‌స్థను స్తంబింప చేస్తామ‌న్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడిక్క‌డే శాంతి ర్యాలిల‌తో పాటు ఊరేగింపులు నిర్వహిస్తామ‌న్నారు. సీమాంద్రు విభ‌జ‌న‌కు స‌హ‌క‌రిస్తే వారి స‌భ‌ను తామే విజ‌య‌వంతం చేస్తామ‌న్నారు.

కిర‌ణ్‌కుమార్ రెడ్డి కావాల‌నే విద్వేశాలు రెచ్చగొడుతున్నార‌రు. ఆయ‌న వ్యవ‌హార శైలికి నిర‌స‌న‌గానే బంద్‌కు పిలుపు ఇస్తున్నట్టుగా తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితి రాజుగారు త‌లుచుకుంటే ఏదైనాజ‌రుగుతుంది అనేలా ఉంద‌న్న కోదండ‌రామ్ ఎట్టి ప‌రిస్ధితుల్లోనూ బంద్ విజ‌యవంతం చేసి తీరుతామ‌న్నారు.