పరశురామ్ నెక్స్ట్ హీరో కూడా ఫ్యామిలీ స్టారే
on Apr 30, 2024
పలానా హీరో, పలానా డైరెక్టర్ కాంబో లో మూవీ వస్తే బాగుండు.. తెలుగు సినిమా పుట్టినప్పటి దగ్గర నుంచి ఆ మాట అనుకోని ప్రేక్షకుడు ఉండడు. పైగా కథ కూడా ఊహించేసుకుంటాడు. ప్రేక్షకుడు అంతగా అప్ డేట్ అయ్యాడు. తాజాగా సినీ సర్కిల్స్ లో వస్తున్న ఒక న్యూస్ తో వాళ్ళ కోరిక నెరవేరేలా ఉంది
పరశురామ్.. రామ్ పోతినేని..ఒకరు దర్శకుడు అయితే ఇంకొకరు హీరో.. ఎన్నో భారీ విజయాలు ఆ ఇద్దరి ఖాతాలో ఉన్నాయి. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. ఇప్పుడు ఈ కాంబోలో మూవీ తెరకెక్కబోతుంది. పరశురామ్ ఆల్రెడీ రామ్ కి కథ కూడా వినిపించాడు. మరికొన్ని రోజుల్లో రామ్ ఫైనల్ చెయ్యబోతున్నాడు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తతో ఇద్దరి ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఫ్యామిలీ కథ లకి లైట్ మాస్ మసాలా ని జోడించడంలో పరశురామ్ స్పెషల్. రామ్ కూడా సేమ్ అదే ఫార్మేట్ లో కింగ్. ఫ్యామిలీ ఆడియెన్స్ కి రామ్ కి మంచి క్రేజ్ ఉంది. దీంతో ఆ ఇద్దరి కాంబో ఆసక్తిగా మారనుంది.బ్యానర్ విషయంలో కూడా మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.
ఇక పరశురామ్ లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ హిట్టా ఫట్టా అనే విషయంలో అందరకి ఫుల్ క్లారిటీ వచ్చేసింది.సిల్వర్ స్క్రీన్ మీద ఫట్టు. స్మాల్ స్క్రీన్ మీద హిట్టు. చాలా మంది ఓటిటి లో మూవీ చూసి సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్లాప్ టాక్ వల్లే థియేటర్స్ కి వెళ్లలేదని కూడా కామెంట్స్ చేస్తున్నారు.ఇక ట్రోల్ల్స్ రాయుళ్లు కూడా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారనుకోండి. ఇక ఓటిటి లో హిట్ టాక్ రావడంతో దర్శకుడు పరశురామ్ మరింత ఉత్సాహంతో రామ్ మూవీకి సిద్ధం కాబోతున్నాడు
Also Read