కూటమి మేనిఫెస్టో సూపర్!.. జగన్ శిబిరం బేజార్!

కూటమి ఉమ్మడి మేనిఫెస్టో మంగళవారం విడుదల చేసింది. ఇప్పటికే అధికార వైసీసీ నవరత్నాలు ప్లస్ అంటూ మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో కూటమి మేనిఫెస్టోతో జగన్ మేనిఫెస్టోను పోలుస్తూ జనం చర్చించుకుంటున్నారు. జగన్ కొత్తగా ఇచ్చేదేమీ లేకపోగా, నవరత్నాలుప్లస్ అని గత ఎన్నికలలో విఫల హామీలకే కొద్ది పాటి నగదును చేర్చి ప్రకటించారన్న పెదవి విరుపు వైసీపీ వర్గాల నుంచే వ్యక్తం అవుతోంది. అదే సమయంలో చంద్రబాబు గ్యారంటీలతో పాటుగా కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో పట్ల సామాన్య జనం నుంచి కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.  

అందుకు భిన్నంగా జగన్ 2019లో ప్రకటించిన నవరత్నాలు కొద్దినగదు పెంపుతో  పాతమేనిఫెస్టోనే ప్రకటించడం ఆ పార్టీ నాయకులు , అభ్యర్థులలోనే అసంతృప్తి వక్తం అవుతోంది.  రైతు రుణ మాఫీ, పింఛన్లునాలుగు వేలకు పెంపు, రైతు భరోసా భారీ పెంపు ,మెగా డీఎస్సీ  వంటివి జగన్ మేనిఫెస్టోలో ఉంటాయని అంతా బావించారు. కానీ జగన్ వీటి వేటి ఊసూ తన మేనిఫెస్టోలో ఎత్తలేదు.  అలాగే జగన్ తాను ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమం ఖర్చు నెలకు 70వేల కోట్లు అవుతుందన్నారు. టీడీపీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు నెలకు లక్షా ఇరవై నుంచి 50వేలకోట్ల రూపాయలు వరకూ అవుతుందని,అది అసాధ్యమని జగన్ విమర్శలు గుప్పించారు.

దీనిపై విపక్ష తెలుగుదేశం కూటమి నుంచే కాదు, సామాన్య జనం నుంచీ, వైసీపీ శ్రేణుల నుంచీ కూడా విమర్శలు వెల్లువెత్తాయి. నెలకు రూ.70వేల కోట్లు సమకూరడమే గగనమని చెబుతున్న జగన్ తన ఐదేళ్ల పాలనలో లక్షల కోట్లు అప్పులు ఎందుకు చేసారని నిలదీస్తున్నారు.  ఇక తెలుగుదేశం కూటమి నేతలైతే తాము  సంక్షేమం తో పాటు అభివృద్ధి చూపిస్తామని, సంపద సృష్టికి, అభివృద్ధికి అసలు సిసలు చిరునామా చంద్రబాబు అని చెబుతున్నారు.  జగన్ ఐదేళ్లలో ఒక్క పరిశ్రమను కూడా తేలేకపోయారన్నారు. అభివృద్ధి అనేది రాష్ట్రంలో కనిపించలేదు. విడతలవారీగా మద్యపానం నిషేధం అన్నారు. కానీ   ఆచరణలో జే బ్రాండ్ మద్యం అమ్మకాలను అడ్డూ అదుపూ లేకుండా పెంచేశారని విమర్శిస్తున్నారు.  సంక్షేమం అంటూ రూపాయి ఇచ్చి వంద రూపాయలు దోచేశారని ఆరోపిస్తున్నారు. వైసీపీ మేనిఫెస్టోతో మేనిఫెస్టో కంటే ముందే తెలుగుదేశం ప్రకటించిన గ్యారంటీలు ఎంతో గొప్పగా ఉన్నాయని అభివృద్ధి సంక్షేమానికి పూచిపడుతున్నాయని ప్రశంసించారు. 

ఇక ఇప్పుడు తెలుగుదేశం కూటమి తన మేనిఫెస్టోను ప్రకటించేసింది. ఇందులో 25 అంశాలను పొందుపరిచింది. దీంతో తెలుగుదేశం కూటమి మేనిఫెస్టో పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుండటంతో జగన్ శిబిరం బేజారైపోతోంది. తెలుగుదేశం కూటమి మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు

1.మెగా డీఎస్సీపై తొలి సంతకం

2.వృద్ధాప్య పెన్షన్ రూ.4000

3.దివ్యాంగుల పెన్షన్ రూ.6000

4.18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1500

5.ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం

6.యువతకు 20 లక్షల ఉద్యోగాలు 

7.రూ.3000 నిరుద్యోగ భృతి 

8.తల్లి వందనం ఏడాదికి ఒక్కో బిడ్డకి రూ.15000

9.మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ

10.ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు పెట్టుబడి 

11.వలంటీర్లకు గౌరవ వేతనం నెలకు రూ.10,000 

12.ఉచిత ఇసుక 

13.అన్నా క్యాంటీన్లు 

14.భూ హక్కు చట్టం రద్దు 

15.ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్

16.బీసీ రక్షణ చట్టం 

17.పూర్ టూ రిచ్ పథకం

18.చేనేతకు 200 యూనిట్లు, మరమగ్గాలుంటే 500యూనిట్ల విద్యుత్ ఫ్రీ

19.కరెంటు చార్జీలు పెంచం

20.బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్

21.పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం 

22.పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం 

23.పెళ్లి కానుక రూ.1,00,000/-

24.విదేశీ విద్య పథకం

25.పండుగ కానుకలు