మంత్రి గల్లా అరుణకుమారికి కాంట్రాక్టర్ల బెదిరింపు?
posted on Jul 26, 2012 9:15AM
పపంచవ్యాప్తంగా బంగారానికి పెరిగిన డిమాండు అందరికీ తెలిసిందే. అందువల్ల బంగారుగనుల తవ్వకాల కోసం వందల సంఖ్యలో రాష్ట్రప్రభుత్వానికి ధరఖాస్తులు చేస్తున్నారు. అయితే సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ముందు మాత్రం మూడు పేర్లను ప్రతిపాదించామని గనులశాఖామంత్రి గల్లా అరుణకుమారి తెలిపారు. ఈమె చేసిన ఈ ప్రకటన అస్మదీయులకు అవకాశంలా ఉందని అప్పుడే మిగిలిన ధరఖాస్తుదారులు మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్‌గా ఆ గనుల తవ్వకాలు చేయగల వారిని పరిశీలించి ప్రతిపాదించాలని ధరఖాస్తుదారులు కోరుతున్నారు.
అయితే మంత్రి మాత్రం తాము ముందుగానే ఫిక్స్ అయిపోయినట్లు ప్రకటించారు. ఇలా మంత్రి ఫిక్స్ అయ్యారంటే తెరవెనుక కథలు ఏమైనా జరిగాయా అని ధరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. ఆ ముగ్గురి అర్హతను బహిరంగపరచాలని డిమాండు చేస్తున్నారు. అసలు బంగారు గనుల తవ్వకాలంటే మన రాష్ట్రమే కాదు పొరుగురాష్ట్రాల నుంచి కూడా వలసవస్తారని అభిప్రాయపడుతున్నారు. ఆ మూడు గుత్తెదార్ల సంస్థల్లో ఎవరు ఎక్కువ ఇస్తే వారికి ప్రతిపాదించే అవకాశాలు లేవా? అని కూడా ధరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. మంత్రి ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా బంగారుగనుల తవ్వకాల గురించే చర్చిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆ మూడు గుత్తెదార్ల సంస్థల్లో అవకతవకలు ఎంచేంందుకు ధరఖాస్తుదారులు సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా ఈ వ్యవహారంలో ఏమైనా అక్రమాలు జరిగాయని తెలిస్తే మంత్రి గల్లా అరుణకుమారి అంతుచూసేస్తామని కూడా వారు హెచ్చరిస్తున్నారు.