నూతనవథువులకు తాళిబొట్టు పథకం?
posted on Jul 26, 2012 9:44AM
ఏదైనా కొత్తది ఆలోచించాలి అని ప్రయత్నిస్తూ పోతే ఒక్కటంటే ఒక్కటైనా కొత్త ఆలోచన వచ్చేస్తుంది. అలానే మంత్రి ధర్మానప్రసాదరావు నేతృత్వంలో ఏర్పాటు మంత్రివర్గ ఉపసంఘం ఎట్టకేలకు సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి, పిసీసీ చీఫ్ బొత్సా సత్యన్నారాయణకు ఓ నివేదిక సమర్పించింది. దానిలో ఆ కమిటీ రూపొందించిన కొత్తపథకం ఏమిటంటే నూతనవథువులకు తాళిబొట్టు పథకం. అంటే ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ కళ్యాణతంతులను మోగిస్తుందన్న మాట. ఈ పథకం కింద తాళిబొట్టు అందించాలంటే పెళ్లిళ్లకు వెళ్లాలి కదా! అలా వెళితే కాంగ్రెస్ పెళ్లిపెద్దగా వ్యవహరించినట్లే.
ఈ పథకం ప్రభుత్వపరంగా అమలు చేస్తే మంత్రులు పెళ్లిపెద్దలవుతారన్న మాట. ఏదేమైనా మంత్రులందరూ కలిసి ఓ కొత్తపథకాన్ని రూపొందించి ఆంథ్రప్రదేశ్ మ్యారేజీబ్యూరో కాంగ్రెస్ పార్టీ అనిపించుకుంటున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. అయితే ఈ కమిటీ మాత్రం గతం నుంచి అనుకున్నట్లే పత్రిక, న్యూస్‌ఛానల్ తప్పనిసరి అని ప్రతిపాదించింది. ప్రతీ ఇందిరమ్మ కాలనీలో ఇందిరమ్మ విగ్రహాన్ని నెలకొల్పాలని సూచించింది. పార్టీ బలోపేతం అవ్వాలంటే శిక్షణ అవసరమని గుర్తించింది. అలానే పెండిరగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవులు వెంటనే భర్తీ చేయాలని సూచించింది. స్థానిక ఎన్నికలు నిర్వహించాలంది. ఆరోగ్యశ్రీ పథకంలో గర్బిణులకు , బీసీ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది.