శ్రీలక్ష్మి కి న్యాయ సహాయం ఎందుకు చేయడం లేదు ?
posted on Jul 26, 2012 9:34AM
జగన్ అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడుపుతున్న ఐఏఎస్ అథికారులు ఏడుగురికి రాష్ట్రప్రభుత్వం న్యాయసహాయం మంజూరు చేసింది. అయితే ఐఏఎస్ మహిళా అథికారి శ్రీలక్ష్మికి ఎటువంటి సహాయం అందించలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఘటనపై దుమారం లేస్తోంది. ఐఏఎస్‌అథికారుల అందరి పేర్లూ ప్రకటించి ఆమెకు ఇవ్వకపోవటం వెనుక ఏమైనా కుట్ర ఉందా? కావాలనే ఆమె పేరు లేకుండా చేశారా? అసలు శ్రీలక్ష్మికి న్యాయసహాయం అందించాల్సినంత దారుణమైన పరిస్థితులే లేవా? అసలు ఏ ప్రాతిపదికన ఈ న్యాయసహాయం విడుదల చేశారు? ఎవరు ఈ పేర్లు ప్రతిపాదనలోకి తీసుకున్నారు? అసలు ఐఏఎస్‌లు న్యాయఖర్చులు భరించలేరనుకుంటే మరి శ్రీలక్ష్మి సహాయం వద్దన్నారా? వంటి పలురకాల ప్రశ్నలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి.
అసలు మహిళల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ఇది నిరూపిస్తోందని కొందరు బహిరంగంగానే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. శ్రీలక్ష్మి నేరం చేశారా? లేదా? అని నిర్ధారించాల్సినది కోర్టు అయితే న్యాయసహాయం విస్మరించటం మాత్రం ప్రభుత్వతప్పిదంగా పరిగణించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఐఏఎస్ అథికారులు మన్మోహన్‌సింగ్, శ్యామ్యూల్, రత్నప్రభ, ఆదిత్యనాథ్, సిబిఎస్‌కెశర్మ, ఎస్‌వి ప్రసాద్, జి.శ్యాంబాబులకు న్యాయసహాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.