జగన్ పై చంద్రబాబు సీరియస్.. తోక జాడిస్తే కట్ చేస్తా..
posted on May 7, 2016 11:23AM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ చెట్టు-నీరు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు మాట్లాడుతున్న వారంతా ఆనాడు కుట్రపూరితంగా వ్యవహరించారని చంద్రబాబు ఆరోపించారు. తాను ఏపీకి వెన్నుపోటు పొడిచానని కొన్ని పత్రికల్లో ఫొటోలు వేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులు సహా నూతన రాజధాని అమరావతి... ఇలా అన్నిటినీ అడ్డుకునే యత్నం చేస్తున్నారు. చివరకు కాపుల ఉద్యమంలో ప్రవేశించి దారుణంగా వ్యవహరించారు. అయినా నా ముందు ఆటలు సాగవు. ఎవరైనా సరే తోక జాడిస్తే కట్ చేస్తా అని జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.