గంటాకు చంద్రబాబు క్లాస్.. 'యూజ్ లెస్ ఫెలో' అంటుంటే ఏం మాట్లాడరా..?

మన ఏపీ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో అప్పుడప్పుడు తిట్లు తినిపించుకోవడం అలవాటుగా మారిపోయింది. ప్రతిపక్షాలకు సరైన సమాధానాలు చెప్పలేకపోవడం.. దానికి మీరు ఏం చేస్తున్నారు.. మాట్లాడరా అని చంద్రబాబు వారికి క్లాస్ పీకడం.. క్లాస్ పీకించుకున్న తరువాత వారు అప్పుడు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి అప్పుడు ప్రతిపక్షమంపై విరుచుకుపడటం పరిపాటైపోయింది.. తాజాగా ఇప్పుడు గంటా మరోసారి చంద్రబాబుతో క్లాస్ పీకించుకున్నట్టు తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్లలో భాగంగా చంద్రబాబుపై.. ప్రభుత్వ వైఖరిపై మాటల తూటాలు పేల్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై గంటా నోరు మొదపలేదు. దీంతో అప్పుడే చంద్రబాబు గంటాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ తరువాత ఎలాగొలా ముద్రగడ నోరు కట్టడి చేశారు.

 

అయితే ఇంతలో  కాంగ్రెస్ సీనియర్ నేత సి.రామచంద్రయ్య ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. చంద్రబాబును ఏకంగా 'యూజ్ లెస్ ఫెలో' అంటూ తీవ్రమైన పదజాలం వాడారు. దీనికి చంద్రబాబు ఆగ్రహించి.. ''రామ చంద్రయ్య ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. మీరు కడప జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రి. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? ఇలాగైతే ఎలా? ఇది పద్ధతిగా లేదు'' అని గంటాకు క్లాస్ తీసుకున్నారట. మరి ఇప్పుడైనా  గంటా స్పందిస్తారో లేదో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu