నన్ను విలన్‌ను చేయొద్దు.. మీ శ్రమను వృథా చేసుకోకండి.. మాల్యా..
posted on Mar 14, 2016 4:37PM
.jpg)
ప్రస్తుతం విజయ్ మాల్యా లండన్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు ఈనెల 18న తమ ఎదుట హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది.. మరోవైపు చెక్ బౌన్సు కేసులో భాగంగా నాంపల్లి కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంటును జారీ చేసింది. ఇదిలా ఉండగా ప్రస్తుత పరిస్థితులపై విజయ్ మాల్యా స్పందిస్తూ.. ‘ద సండే గార్డియన్’ వార్త పత్రిక అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ.. ఏదో స్నేహితులను కలవడానికి వస్తే పారిపోయాడు అన్న ముద్ర వేశారు.. అని అన్నాడు. అంతేకాదు ఆ పత్రిక వాళ్లు మీరు భారత్‌కు ఎప్పుడు తిరిగి వెళ్లనున్నారని ప్రశ్నించగా, ఆయన ఆ ప్రశ్నకు.. ప్రస్తుతం నా వాదనను వినే పరిస్థితులు అక్కడ లేవు.. ఇప్పటికే నామీద క్రిమినల్ అనే ముద్ర వేశారు.. గతేడాది నాకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. కాని నేను పారిపోలేదు. మరి ఇప్పుడెందుకు నన్ను క్రిమినల్‌గా చిత్రికరిస్తున్నారు అని ప్రశ్నించారు. అంతేకాదు ‘నన్ను విలన్‌ను చేయొద్దు. నాకు మంచి ఉద్దేశాలే ఉన్నాయి అని అన్నారు.
అంతేకాదు.. బ్రిటన్‌లో మీడియా నా కోసం వెతుకులాడుతోంది. విచారకరమైన విషయమేమిటంటే.. ఇప్పటికీ వారు సరైన ప్రాంతాన్ని కనుగొనలేదు. అయినా నేను మీడియాతో మాట్లాడను. అందువల్ల మీ శ్రమను వృథా చేసుకోకండి’ అని ట్విటర్‌లో తెలిపారు.