ఎమర్జెన్సీ చీకటి రోజులపై బిజెపి అవగాహన సదస్సులు

 

దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తియన సందర్భంగా నాటి చేదు ఘటనలు, ఆ చీకటి రోజులపై నేటి తరానికి తెలియజేసే లక్ష్యంతో బీజేపీ ఆంధ్రప్రదేశ్  వ్యాప్తంగా బుధవారం (జూన్ 25) అవగాహన సదస్సులు నిర్వహించనుంది.  దేశం లో  ఎమర్జెన్సీ సమయంలో అప్పటి కాంగ్రెస్  ఇష్టానుసారం గావ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందనీ,   ఎమర్జెన్సీ పేరుతో  కాంగ్రెస్ వ్యవహరించిన నియంతృత్వ ధోరణులను, నాటి అమానుష ఘటనలను నేటి యువతరానికి  తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు బీజేపీ పేర్కొంది.  

21 నెలల పాటు కొనసాగిన ఎమర్జెన్సీ కాలంలో లక్షలాది మంది జైళ్ల పాలయ్యారనీ, అసలు దేశమే ఒక జైలుగా మారిపోయిందనీ ఆ పార్టీ పేర్కొంది. ఎమర్జెన్సీ కాలంలో   ప్రశ్నించిన ప్రతి ఒక్కరు జైలు పాలయ్యారని బీజేపీ రాష్ట్ర శాఖ పేర్కొంది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  ఏలూరులో జరిగే అవగాహన సదస్సుకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  సత్యకుమార్ యాదవ్, అలాగే పాలకొల్లులో జరిగే సదస్సుకు రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ, బీజేపీ జాతీయ అధికార ప్రతినిథి భువనేశ్వర్హాజరౌతారని తెలిపారు. అలాగే తిరుపతి సదస్సు కు , ఎంపీ అపరాజిత సారంగి ముఖ్య అతిథి గా హాజరౌతారు.