రోజాకి దిమ్మతిరిగే షాక్.. అలవెన్సులను నిలిపివేయాలని నిర్ణయం

 

ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీకి అనుమతించవద్దని ప్రివిలేజ్ కమిటీ నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రోజాకు మరోషాక్ తగిలింది. ఇకపై రోజాకు ఎమ్మెల్యే హోదాలో అందుతున్న అలవెన్సులను కూడా నిలిపివేయాలని ప్రివిలేజ్ కమిటీ నివేదికను అందజేసింది. హైకోర్టు రోజా సస్సెన్షన్ ను కొట్టివేసిన నేపథ్యంలో దానిని తప్పు పడుతూ రోజా తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను టీడీపీ ఎమ్మెల్యే అనిత రోజాపై ప్రివిలేజ్ కమిటీలో ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన కమిటీ.. అనితపై రోజా చేసిన వ్యాఖ్యలు సభా నియమాలకు విఘాతమేనని తేల్చి చెప్పిన కమిటీ, రోజాపై సస్పెన్షన్ కరెక్టేనంటూ చెప్పింది. అక్కడితో ఆగకుండా..  రోజాకు అందుతున్న అలవెన్సులను నిలిపివేసి కఠినంగా వ్యవహరించాల్సిందేనని కమిటీ సిఫారసు చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu