హృతిక్, కంగనాల లవ్ అప్పుడే స్టార్ట్ అయిందట..
posted on Mar 21, 2016 12:44PM

ప్రస్తుతం బాలీవుడ్ హాట్ టాపిక్ ఏదంటే హృతిక్ రోషన్, కంగనా రనౌత్ వ్యవహారమే అని చెప్పొచ్చు. వీరిద్దరి గురించి రోజుకో ఆసక్తికర విషయం బయటకు వస్తుంది. హృతిక్, కంగనా బ్రేకప్ తరువాత వీరిద్దరి మధ్య గొడవ కాస్త గట్టిగానే జరుగుతుంది. ఈ మధ్యనే కంగానా తన పేరు ఎక్కడపడితే అక్కడ ప్రస్థావిస్తుందని.. తనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ హృతిక్ ఆమెకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనికి కంగనా కూడా లీగల్ నోటీసులతో హృతిక్‌కు దీటుగా బదులిచ్చింది. అయితే ఇప్పుడు హృతిక్ క్లోజ్ ఫ్రెండ్ వీరిద్దరి ప్రేమాయణం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టినట్టు తెలుస్తోంది.
2009లో 'కైట్' సినిమా సెట్స్‌పై ఉండగా వీరిరువురి మధ్య లవ్ స్టార్ట్ అయిందట. దీంతో అప్పటి వరకూ ఓ మెక్సికన్ నటితో డేటింగ్‌లో ఉన్న హృతిక్ ఆమెను వదిలేసి మరీ కంగనాకు కనెక్ట్ అయ్యాడంట. అంతేకాదు హృతిక్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి కంగనాతో లవ్ ఎఫైరే కారణమని అతను తెలిపారు. ఇంతలో 'బ్యాంగ్ బ్యాంగ్' సినిమా షూటింగ్‌లో కత్రినా కైఫ్ తో హృతిక్ స్నేహం చేస్తున్న కారణంలో కంగనా రనౌత్ తో బ్రేకప్ అవడానికి దారి తీసిందని అతని మిత్రుడు తెలిపాడు. మరి రోజుకో ట్విస్ట్ ఇస్తున్న వీరిద్దరి వివాదం.. మరెన్ని ట్విస్టులు ఇస్తుందో చూడాలి.