మాకేం కావాలో చంద్రబాబుకు తెలుసు... 'ఒంగోలు గిత్త' సినిమా గుర్తుకొస్తుంది..
posted on May 2, 2017 11:17AM
.jpg)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆనం బ్రదర్స్ కలిశారు. ఈ సందర్భంగా ఆనం వివేకానంద రెడ్డి మాట్లాడుతూ... నెల్లూరులో టీడీపీ అభ్యర్థి ఎవరైనా సరే గెలిపిస్తామని చంద్రబాబుకు చెప్పామని.. వాటితో పాటు తమకు ఉన్న అవసరాలన్నీ తమ నియోజకవర్గంలోని ప్రజల్లో ఒకరికి పెన్షన్ ఇప్పించడం, మరొకరికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పించడం తప్ప ఇంక పనులేమీ ఉండవని చెప్పారు. దానితో పాటు పార్టీలో చేరినప్పుడు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చంద్రబాబును కోరాం అని అన్నారు. అసలు చంద్రబాబును చూసే పార్టీలో చేరాం.. తమను, తమ సేవలను ఎలా ఉపయోగించుకోవాలో ఆయనకు తెలుసు.. తమకేం కావాలో చంద్రబాబును ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదని.. చంద్రబాబు తమకు మేలే చేస్తారని ఆయన తెలిపారు.
ఇంకా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గుంటూరులో చేస్తున్న రైతు దీక్ష గురించి మాడ్లాడుతూ ఆయనపై సెటైర్లు విసిరారు. జగన్ దీక్ష చూస్తుంటే 'ఒంగోలు గిత్త' సినిమా గుర్తుకొస్తుంది.. ఆసినిమాలో మిర్చియార్డు ఛైర్మన్ గా ప్రకాశ్ రాజ్ నటించాడని... ఉదయాన్నే పూటుగా తయారై ప్రజల ముందుకు వస్తాడని... ప్రజల బాధలు వింటాడు, కన్నీరు పెడతాడు..సాయంత్రం ఇంటికెళ్లి గుడ్డలిప్పి కూర్చుని మందుకొడతాడని అన్నారు... అలా జగన్ దీక్ష ముగిసిన తర్వాత లోటస్ పాండ్ లో కూర్చుంటాడా? అని ఆయన ఎద్దేవా చేశారు. మరి దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇవన్నీ ఇలా ఉండగా.. ఈ మధ్యకాలంలో ఆనం బ్రదర్స్ టీడీపీ ను వీడి.. వేరే పార్టీలో చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి జోరుగా ప్రచారం పొందిన సంగతి తెలసిందే. మొదట వైసీపీ పార్టీలో చేరుతారని అన్నారు..ఆ తరువాత జనసేన పార్టీలో చేరుతారని.. దానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారని కథనాలు ప్రచురితమయ్యాయి. కానీ ఆనం మాట్లాడిన మాటల్లో పార్టీ మార్పు గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదు. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.