ప్రతీకారం తీర్చుకున్న భారత్.. ఇద్దరికి..ఏడుగురు

 

భారత్ చెప్పినట్టే చేసింది. తమ సైనికలు మృతదేహాలను ముక్కలుగా చేసిన పాక్ కు గట్టిగా సమాధానం చెబుతామని.. ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పినట్టే తమ ప్రతీకారం తీర్చుకుంది. జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద బీఎస్ఎఫ్‌కు చెందిన పోస్టులపై ఉగ్రవాదులు దాడులు జరపగా పరమజిత్ సింగ్, ప్రేమ్ సాగర్ అనే ఇద్దరు సైనికులు మృతి చెందారు. అయితే పాక్ అక్కడితే ఆగకుండా నియంత్రణ రేఖ దాటి వచ్చి మరీ ఇద్దరు భారత జవాన్ల దేహాలను ఖండఖండాలుగా నరికి ఛిద్రం చేసి రెచ్చిపోయింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఇండియన్ ఆర్మీ... నియంత్రణ రేఖ వెంబడి కృష్ణ ఘాటీ సెక్టార్‌ కు సమీపంలో ఉన్న పాకిస్థాన్‌ కు చెందిన రెండు బంకర్లను ధ్వంసం చేసింది. అంతేకాదు వాటితో పాటు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఏడుగురు పాక్ సైనికులు ప్రాణాలు కొల్పోయారు. ఈ నేపథ్యంలో భారత్ మరోసారి వార్నింగ్ ఇచ్చింది. రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని, లేని పక్షంలో తీవ్ర చర్యలుంటాయని హెచ్చరికలు పంపింది. మరి దీనిపై పాక్ ఎలా  స్పందిస్తుందో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu