దేవయాని ఎమోషనల్ డ్రామా.. రిషి తన భార్యని ఏంజిల్ కి చూపిస్తాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్‌- 875 లో.. ఫణీంద్ర, శైలేంద్ర, దేవయాని, మహేంద్ర, జగతి,  అందరు కలిసి మాట్లాడుకుంటారు. రిషిని ఎంత బ్రతిమాలినా రాలేదని ఫణీంద్రతో శైలేంద్ర అంటాడు. అవునా.‌. రిషి ఈ పెద్దమ్మ మాట వింటాడు. నేను చెప్తే వింటాడు. నేను వెళ్తున్నాను. ఎవరి మాట విననని చెప్పి వెళ్తుంటే తనని ఎవరూ ఆపరు. దాంతో ఎవరు ఆపట్లేదేంటి అని దేవయాని అనుకొని కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటిస్తుంది. ఇక అది చూసి శైలేంద్ర మరింత రెచ్చిపోయి .. అయ్యో మమ్మీ ఏమైంది‌. తమ్ముడి కోసం ఇంతలా ఆలోచించాలా వస్తాడులే అని దేవయానితో శైలేంద్ర అంటాడు. ఇక‌ సృహ తప్పిపోయినట్టుగా దేవయాని నటించి కాసేపటికి కళ్ళు తెరుస్తుంది. అదంతా చూసిన ఫణీంద్ర నమ్మేసి.. దేవయానిని తమ గదిలోకి తీసుకెళ్ళమని శైలేంద్ర, ధరణిలతో చెప్తాడు.‌ వాళ్ళిద్దరు కలిసి దేవయానిని తన గదిలోకి తీసుకెళ్తారు. మరొకవైపు పాండియన్ ఇంట్లో ఉన్న రిషికి కావలసిన విధంగా భోజనం వడ్డించి, రిషి ఉండే గదిని అందంగా అలంకరిస్తుంది వసుధార. ఇక అదంతా చూసిన రిషి.. వసుధార మేడమ్ కదా ఇదంతా చేసిందని పాండియన్ తో అంటాడు. కాదని పాండియన్ చెప్పే ప్రయత్నం చేయగా.. నువ్వేం అబద్ధాలు చెప్పకు తనే చేసింది నాకు తెలుసని పాండియన్ తో రిషి అంటాడు. ఆ తర్వాత వసుధార దగ్గరికి పాండియన్ వచ్చి.. మీరే ఇదంతా చేస్తున్నారని తెలిసిపోయింది మేడమ్ అని అంటాడు. అవునా.. ఏం పర్లేదులే అని వసుధార అంటుంది. నాకొక డౌట్ ఉంది మేడమ్ అని వసుధారతో పాండియన్ అంటాడు. ఒకరిని ఎవరైనా ఇష్టపడితేనో, దగ్గరివాళ్ళైతేనో వారి ఇష్టాలు, అభిరుచులు తెలుస్తాయి కదా మేడమ్ అని వసుధారతో పాండియన్ అనగా.. హా అవునని వసుధార అంటుంది. అదే రిషి సర్ మీరే చేశారని అలా ఎలా చెప్పాడు మీకు ముందే పరిచయం ఉందా? మీ ఇద్దరి మధ్య ఏమైనా బంధం ఉందా అని పాండియన్ అడుగుతాడు. అదేం లేదు‌. రిషి సర్ స్మార్ట్, ఇంటలిజెంట్ అతన్ని ఎవరైనా ఇష్టపడతారని వసుధార కవర్ చేస్తుంది. ఆ తర్వాత రిషికి పాండియన్ భోజనం తీసుకెళ్ళగా అది తిన్న రిషి.. వసుధార మేడమ్ ఇవన్నీ చేసిందని నాకు తెలుసు, నేను తినేవరకు తను వెళ్ళదని తెలుసని పాండియన్ ని తీసుకురమ్మని చెప్తాడు‌. ఇక బయటకు వచ్చిన పాండియన్ వసుధార దగ్గరికి వచ్చి‌.. రిషి సర్ రమ్మంటున్నాడని చెప్తాడు. అవునా అని రిషి దగ్గరికి వసుధార వెళ్తుంది. నా బాగోగులు ఎందుకు చూసుకుంటున్నావ్? నేనెక్కడుంటే అక్కడికి వస్తున్నావు ఎందుకని రిషి అడుగుతాడు. మీరెక్కడుంటే నేనక్కడుంటానని వసుధార అంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. అదే విషయం వసుధార వాళ్ళ నాన్న చక్రపాణికి రిషి కాల్ చేసి చెప్తాడు.  మరుసటి రోజు ఉదయం ఏంజిల్ ని తీసుకొని వసుధార వస్తుంది. ‌ఏంజిల్ ని చూసిన రిషి షాకవుతాడు. నువ్వెందుకొచ్చావని రిషి అనగా.. అదేంటి రిషి అలా మాట్లాడతావని ఏంజిల్ అంటుంది. మనిద్దరి మధ్య ఉంది స్నేహం మాత్రమే.. నువ్వెప్పటికి నాకు మంచి స్నేహితురాలివేనని  రిషి అంటాడు. నీ భార్య గురించి నాకు చెప్తానన్నావ్, ఆ గడువు దగ్గరికొచ్చింది. నువ్వు చెప్పలేకపోతే నన్నే పెళ్ళి చేసుకోవాలని ఏంజిల్ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వసుధార కూడా రిషిని అదే ప్రశ్న అడుగుతుంది. దాంతో ఇక్కడి నుండి వెళ్ళిపోమని వసుధారతో రిషి చెప్తాడు.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

విగ్రహాలని రాజ్ కనిపెట్టి కృష్ణమూర్తి ఫ్యామిలీకి అండగా ఉంటాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-208 లో.. కృష్ణమూర్తి చేసిన విగ్రహాల దగ్గరికి వెళ్ళి అన్నీ చూస్తుంటాడు. అప్పుడే అక్కడికి రాహుల్ పంపించిన రౌడీలు వస్తారు. రాహుల్ వాళ్ళకి కాల్ చేసి.. ఏమైందని అడుగుతాడు. ఏం చేయలేదు సర్.. ఆ కృష్ణమూర్తి ఉన్నాడని, మీరే కదా ఎవరికి కనబడకుండా పని పూర్తి చేయమన్నారని ఆ రౌడీ చెప్తాడు. ఇంకో గంట అయితే తెల్లారిపోతుంది అందరికి తెలిసిపోతుంది ఏదో ఒకటి తొందరగా చేయండని రాహుల్ అంటాడు.  మరొకవైపు కావ్య, అప్పు, కనకం ఇంటిముందు డీజే పాటలతో డ్యాన్స్ చేస్తుంటారు. అప్పుడే రాజ్ వచ్చేసరికి అందరు సిగ్గుపడుతూ డ్యాన్స్ చేయడం ఆపేస్తారు. ఆ తర్వాత అప్పు చూసి.. మన బావే కదా.. రా బావ అని డ్యాన్స్ చేద్దామని బలవంతం చేయగా.. బుల్లెట్ బండి పాటకి అందరు కలిసి డ్యాన్స్‌ చేస్తుంటారు. మరొక రౌడీలు కృష్ణమూర్తిని బెదిరించి వినాయకుడి విగ్రహాలు తీసుకెళ్తుంటారు. మా కష్టార్జితం బాబు, తీసుకెళ్ళొద్దంటూ ఎంత రిక్వెస్ట్ చేసిన ఆ రౌడీలు వినకుండా కృష్ణమూర్తిని కొట్టేసి డీసీఎమ్ వ్యాన్ లలో ఎక్కించుకొని తీసుకెళ్తుంటారు. ఇక అక్కడే ఉన్న బంతి అనే అబ్బాయి.. ఈ విషయం ఎలాగైనా కావ్య అక్కకి చెప్పాలని పరుగున ఇంటికి వస్తాడు. అక్కడికొచ్చి విగ్రహాలన్నీ తీసుకెళ్తున్నారని చెప్తాడు. అది విని రాజ్, కావ్య, అప్పు , కనకం అందరూ ఆ ప్లేస్ కి వచ్చేస్తారు. వాళ్ళంతా అక్కడికి వచ్చేసరికి వొంటి నిండ రక్తపు మరకలతో కృష్ణమూర్తి పడి ఉంటాడు. అతడిని చూసి ఇంట్లో వాళ్ళంత కన్నీరుమున్నీరవుతారు. నా ఆశలన్నీ అడియాశలయ్యాయి బాబు, అప్పు కోసం ఈ కాంట్రాక్ట్ ఒప్పుకున్నాను. ఈ డబ్బులొస్తే సొంత ఇల్లు దక్కుతుంది. ఆ ఇల్లు చూసి అయిన అప్పుకి మంచి సంబంధం తీసుకొద్దామని అనుకున్నాను, ఇప్పుడు చేతకానివాడిలా మిగిలిపోయాయని రాజ్ తో కృష్ణమూర్తి అంటాడు.  ఇక కృష్ణమూర్తి అలా విగ్రహాలు పోయాయని చెప్తుండగా ఆ కాంట్రాక్టర్ వస్తాడు. అయ్యో అయ్యో విగ్రహాలు పోయాయా? నా ప్రాణాలు తీసేస్తారు ఆర్డర్ ఇచ్చినవాళ్ళు అని అంటాడు. రాజ్ డబ్బులిస్తానని అనగా.. డబ్బులెవరికి కావాలి సర్. విగ్రహాలు కావాలిని, డబ్బులతో ప్రతీ దాన్ని కొనలేరని రాజ్ తో ఆ కాంట్రాక్టర్ అంటాడు. కాసేపటికి రాజ్ ఒక క్లూ కనిపెడతాడు. మనం వస్తున్నప్పుడు రెండు డీసీఎమ్ వ్యాన్ లు వెళ్ళాయని, అందులోనే ఆ విగ్రహాలని తీసుకెళ్ళారని, ఇదొక్కటే ఈ ప్లేస్ కి రావడానికి దారి అని, ఆ  డీసీఎమ్ ల నెంబర్లు చెప్తాడు రాజ్‌. దాంతో అప్పు తన మనుషులతో వెతుకుతుంటుంది. రాజ్ తన పలుకుబడి ఉపయోగించి వ్యాన్ ల కోసం వెతుకుతుంటాడు. మరొకవైపు రాహుల్ కి ఆ రౌడీలు  కాల్ చేసి..ఈ విగ్రహాలని ఏం చేయమంటారని అడుగుతాడు. ఎక్కడైనా చెరువులో పడేయండని రాహుల్ అనగానే వద్దు సర్.. అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయని ఆ రౌడీ అంటాడు. అలా ఆశపడకండి మీరు కావాలన్నంత డబ్బు ఇస్తాను వాటిని ఎవరూ చూడకుండా చెరువులో పడేయండని రాహుల్ అనగానే.. సరేనని ఆ రౌడీ అంటాడు. మరొకవైపు రాజ్ వాళ్ళ కోసం తీవ్రంగా గాలిస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే .  

అమర్ దీప్‌కి వెన్నుపోటు పొడిచిన ప్రియాంక జైన్!

నా అనుకున్నవాళ్ళే మోసం చేస్తే దానిని ఏం అంటారు. నమ్మినవాళ్ళే మనల్ని అనర్హులని అంటే ఎలా ఉంటుంది. అయిన వాళ్ళని మనవాళ్ళలా చూస్తే ఏం జరుగుతుంది. ఇవన్నీ బిగ్ బాస్ బ్యూటీ అరియాన చెప్పిన మాటలు. బిగ్ బాస్ సీజన్-7 లో ఇప్పటికే కంటెస్టెంట్స్ తమ‌ స్ట్రాటజీలతో గేమ్స్ ఆడుతున్నారు. సీరియల్ బ్యాచ్ అంటూ ఎప్పుడు కలిసి ఉండే ప్రియాంక జైన్, అమర్ దీప్, శోభా శెట్టి మధ్య కూడా పాలిటిక్స్ జరుగుతున్నట్టు నిన్నటి ఎపిసోడ్‌లో తెలిసింది. అమర్ దీప్ కి ప్రియాంక జైన్ నిజంగానే వెన్నుపోటు పొడిచింది. దీనిపై స్పందిస్తూ ఓ పోస్ట్ ని షేర్ చేసింది అరియాన. అరియాన గ్లోరీ.. ఇప్పుడు ట్రేడింగ్ లో ఉన్న బ్యూటీ. బిగ్ బాస్ తో మంచి క్రేజ్ సంపాదించుకొని సెలబ్రిటీ అయిపోయింది అరియాన.. అరియాన మొదటగా తన కెరీర్ ని కుకింగ్ షోస్ తో మొదలు పెట్టింది. ఆ తర్వాత కామెడీ షోలకి యాంకర్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చెయ్యడం అవి కాంట్రవర్సిటికీ దారితీయడంతో ఫేమస్ అయింది అరియాన. స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఒక ఇంటర్వ్యూ  చేయగా అది కాస్త వైరల్ గా మారింది. దాంతో అరియాన ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయిందని అనడంలో ఆశ్చర్యం లేదు. అరియాన అలా ఫేమస్ అయి బిగ్ బాస్ లో అవకాశం చేజిక్కించుకుంది. బిగ్ బాస్-4 లో ఎంట్రీ ఇచ్చి.. మేల్ కంటెస్టెంట్స్ తో నువ్వా, నేనా అన్నట్టు ఆర్గుమెంట్ చెయ్యడం వల్ల అరియానాలోని మరొక కోణం బయటకు వచ్చింది. అయితే జబర్దస్త్ అవినాష్ తో కలిసి బిగ్ బాస్ హౌస్ లో చేసిన కొన్ని సంభాషణలు జనాలకి బాగా కనెక్ట్ అయ్యేలా చేసాయి. వీళ్ళిద్దరి టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ ప్రేక్షకులకు వినోదాన్ని  అందించాయి. అయితే అనుకోకుండా బయటకు వచ్చిన అరియాన చాలా బాధపడింది. కొత్తగా పరిచయమైన కంటెస్టెంట్స్ కి అమర్ దీప్ డిజర్వింగ్ అనిపించింది.‌ కానీ బయటను, ఇంట్లోను క్లోజ్ గా ఉండే ఒకరికి మాత్రం అన్ డిజర్వింగ్ అనిపించింది. అమర్ దీప్ వెనుకలా అతను వీక్ కంటెస్టెంట్ అని చెప్పి, పోటీకీ అనర్హుడని చెప్పి , మళ్లీ తనకి ఎక్కడ తెలిసిపోతుందోనని.. 'బిగ్ బాస్ నా ఒపీనియన్ ని చేంజ్ చేసుకోవచ్చా' అని రిక్వెస్ట్ చేసింది ప్రియాంక జైన్. తను వెన్నుపోటు పొడుస్తుందని నా‌ మొద్దు ఫ్రెండ్ అమర్ దీప్ కి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో.‌ అమర్ నువ్వు బయటకొచ్చాక ఈ వీడియో చూడమని అరియాన తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.  

మూడవ హౌజ్ మేట్ కోసం పోటీపడుతున్న ఆ ముగ్గురు!

బిగ్ బాస్ సీజన్-7 అట్టహాసంగా ప్రారంభమైంది. గత సీజన్ తో పోల్చితే ఈ సీజన్ గట్టిగానే వర్కవుట్ అయిందని చెప్పాలి. హౌజ్ లోకి మొత్తంగా పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ వచ్చారు. అందులో నుండి మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండవ వారం షకీల బయటకొచ్చేశారు. ప్రస్తుతం మూడవ వారం జరుగుతుంది. ఈ వారం కంటెండర్ షిప్ కోసం జరిగే పోటీలు మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. ఈ సారి ఉల్టా పల్టా థీమ్ తో బిగ్ బాస్ మతిపోగెట్టుస్తున్నాడు. అయితే ఒక్కో కంటెస్టెంట్ ఒక్కో  గేమ్ ప్లాన్ తో  హౌజ్ లో మెల్లి మెల్లగా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అవుతున్నారు. నిన్న మొన్నటి దాకా నామినేషన్ లో లేని ప్రియాంక జైన్ అసలు హౌజ్ లో ఉందా లేదా అని అనుకున్నారంతా కానీ గురువారం జరిగిన ఎపిసోడ్‌లో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చినట్టుగా రేస్ లోకి వచ్చింది. గత నాలుగు రోజుల నుండి సాగుతున్న కంటెండర్ షిప్ కోసం హౌజ్ లోని కంటెస్టెంట్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మూడవ హౌజ్ మేట్ కోసం బిగ్ బాస్.. అమర్ దీప్, యావర్,‌ శోభా శెట్టి లని ముగ్గురిని సెలెక్ట్ చేశాడు. అయితే వీరిని హౌజ్ లోని మిగతా వాళ్ళలోని కొందరు వద్దని అపోజ్ చేశారు. దీంతో బిగ్ బాస్ అపోజ్ చేసిన వాళ్ళకి టాస్క్ ఇచ్చాడు. ఇప్పటికీ యావర్ మూడవ హౌజ్ మేట్ కోసం జరిగే పోటీకి ఎంపిక అయ్యాడు.‌ శోభా శెట్టి కారం ఎక్కువగా ఉన్న చికెన్ పీస్ లని తిని తను పోటీకి ఎంపిక అయింది. ఇక అమర్ దీప్, ప్రియాంక జైన్ ఇద్దరికి బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు. ఎవరైతే తమ జుట్టుని త్యాగం చేస్తారో వారే మూడవ హౌజ్ మేట్ కోసం జరిగే పోటీకి అర్హులని బిగ్ బాస్ కోరగా.. తనకి ఇష్టమైన హీరో రవితేజ అని, తన జుట్టు మీద ఇలా చేయి చేసి బాగుందని అన్నాడని, నేను నా జుట్టుని తీయనని అమర్ దీప్ అంటాడు. అది విన్న టేస్టీ తేజ.. కొన్ని రోజులకి నీ జుట్టు నీకు వస్తుందిలే అని అన్నాడు.‌ ఇక అమర్ దీప్, ప్రియాంక జైన్ మధ్య కాసేపు చర్చల తర్వాత అమర్ దీప్ త్యాగం చేస్తున్నానని పోటీ నుండి తప్పుకుంటున్నట్టుగా బిగ్ బాస్ కి చెప్తాడు. ఆ తర్వాత ప్రియాంక జైన్ హెయిర్ కట్ చేయించుకొని మూడవ హౌజ్ మేట్ కోసం జరిగే పోటీకి అర్హతను సాధించింది. ఇక ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, ప్రియాంక జైన్ లకి ఈరోజు(శుక్రవారం) పోటీ జరుగుతుంది. వీరి ముగ్గురిలో మూడవ హౌజ్ మేట్ ఎవరవుతారనే ఆసక్తి నెలకొంది.  

వేర్ ఈజ్ దీపికా పిల్లి... అంటూ అడుగుతున్న నెటిజన్స్

ఢీ ప్రీమియర్ లీగ్ షో లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక షోకి హోస్ట్ ప్రదీప్ పవన్ కళ్యాణ్ మూవీ బ్రో నుంచి "మై డియర్ మార్కండేయ" సాంగ్ కి డాన్స్ చేస్తూ వచ్చాడు. ఆ వెనకే హైపర్ ఆది చంద్రముఖి మూవీలో రజనీకాంత్ వేసిన గెటప్ వెంకటపతి రాజాలా వచ్చాడు. ఆ గెటప్ చూసి హోస్ట్ ప్రదీప్ ఒక డైలాగ్ వేసాడు. "ఐతే నీ పేరులో చిన్న కరెక్షన్... వెంకట పతి రాజా కాదు వెంకట పత్తి రాజు ఐతే కరెక్ట్ గా ఉంటుంది" అనేసరికి ఆది నవ్వేసాడు. ఆ వెంటనే వెంకటపతి రాజు కోసం చంద్రముఖి గెటప్ లో విద్యురామన్ ఎంట్రీ ఇచ్చింది. కాసేపు ఆది వెనక పరిగెత్తాక "నాకు నా గుణశేఖర్ కావాలి" అని ఆదిని అడిగింది విద్యురామన్.."అదిగో ఆయనే అంటూ శేఖర్ మాష్టర్ ని చూపిస్తూనే కౌంటర్ వేసాడు...ఆయన గుణశేఖర్ కాదు..గునపం శేఖర్" అని ఆది పెద్ద డబుల్ మీనింగ్ డైలాగ్ వేసాడు...దానికి ఎం అనాలో తెలియక శేఖర్ మాష్టర్ నవ్వేసాడు. ఇక లాస్ట్ పెర్ఫామెన్స్ లో మదర్ సెంటిమెంట్ తో ఒక డాన్స్ కం స్కిట్ చేసేసరికి టీం లీడర్ కృష్ణ ఏడ్చేశాడు. దాంతో ప్రదీప్ మిగతా డాన్సర్స్ అంతా వచ్చి కృష్ణని ఓదార్చారు.  "ఫైనల్ డేకి ముందు చేసిన కృష్ణ ఫస్ట్ పెర్ఫార్మెన్స్ అదే వాళ్ళ అమ్మ చూసిన లాస్ట్ పెర్ఫార్మెన్స్ అదే...వాళ్ళ అమ్మ మన మధ్య లేరు" అంటూ ప్రదీప్ చెప్పేసరికి కృష్ణ వాళ్ళ అమ్మ ఫోటో వైపు తిరిగి దణ్ణం పెట్టాడు. ఐతే కొన్ని వీక్స్ నుంచి ఈ షోలో ఆదికి జోడీగా దీపికా పిల్లి కనిపించడం లేదు...దాంతో ఫాన్స్ "వేర్ ఈజ్ దీపికా పిల్లి...పిల్లి లేని షో చూడలేకపోతున్నాం...మాకు దీపికా పిల్లి కావాలి " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

పెళ్లి చేసుకోబోతున్న శ్రీముఖి...ఫోన్ లో కౌంటర్ ఇచ్చిన మానస్ ఫియాన్సీ

ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్ లో శ్రీముఖి ఒక ఇంటరెస్టింగ్ కామెంట్ చేసింది. ఇక ఈ షోకి పాలేరు రోల్స్ లో వచ్చిన ఎక్స్ప్రెస్ హరిని, అవినాష్ ని చూసి "నేను అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను" అని సిగ్గు పడుతూ చెప్పింది శ్రీముఖి. దానికి అవినాష్ షాకయ్యాడు. అవినాష్ షాకింగ్ ఎక్స్ప్రెషన్ కి  హరి కౌంటర్ ఇచ్చాడు. శ్రీముఖి చేసుకుంటాను అన్నది నిన్ను కాదు అన్నాడు. ఏదేమైనా శ్రీముఖి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నాలాంటి యూత్ హర్ట్ అవుతారు అన్నాడు అవినాష్. ఇక "సింగిల్స్ వెర్సెస్ కమిటెడ్" థీమ్ తో కొంతమంది ఫేమస్ సీరియల్ యాక్టర్స్ ని పిలిచింది. అందులో బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్, హీరోయిన్ దీపికా రంగరాజు వచ్చారు. ఇక మానస్ పెళ్లి గురించి శ్రీముఖి లొల్లి చేసింది. ఇక మానస్ గురించి దీపికా ఏం అనుకుంటోంది అని శ్రీముఖి అడిగేసరికి "మనసున ఉన్నది చెప్పేది కాదని" అంటూ బ్రేకప్ సాంగ్ పాడేసరికి అందరూ నవ్వేశారు. బాబోయ్ దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నాడు మానస్. ఇక పెళ్లి గురించి డాక్టర్ బాబు అలియాస్ పరిటాల నిరుపమ్ భారీ డైలాగ్ చెప్పాడు..."పెళ్లి అనేది ఇంటి భోజనం లాంటిది పెళ్లి చేసుకోండి" అని చెప్పాడు. తర్వాత మానస్ ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయితో శ్రీముఖి మాట్లాడింది " నీ పేరు పక్కన ఒక హార్ట్ పెట్టాడు..అదే నా పేరు పక్కన నాలుగు హార్ట్స్ పెట్టాడు" అని చెప్పేసరికి "నా చేతికి రింగ్ పెట్టాడు" అని అవతల నుంచి మానస్ ఫియాన్సీ రిప్లై ఇచ్చేసరికి శ్రీముఖి షాకయ్యింది. తర్వాత దీపికతో కలిసి సరదాగా గేమ్స్ ఆడించింది... ఫ్రీడమ్ దొరకలేదు అంటారు అంతా 1947 లో దొరికింది ఏంటి ఫ్రీడమ్ కాదా అని దీపికా అమాయకంగా చెప్పేసరికి అందరూ నవ్వేశారు...   

మీరు మా పెళ్లి కార్డు చదివారా?

స్మాల్ స్క్రీన్ మీద ఎవర్ గ్రీన్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..  ఇండస్ట్రీలో ఎంతో మంది సక్సెస్ అందుకున్న సీనియర్ యాంకర్  సుమకు సాటి ఎవరూ లేరు. ఆమె టీవీ షోస్ కి, మూవీ ఈవెంట్స్ కి యాంకరింగ్ చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. సుమ కేరళకు చెందిన అమ్మాయి అయినప్పటికీ తెలుగు ఎంతో స్పష్టంగా మాట్లాడుతుంది. ఇక ఈమె తెలుగు నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకున్న సంగతి   తెలిసిందే. వీళ్లది అప్పట్లోనే లవ్ మ్యారేజ్. ఐతే వీళ్ళ లవ్ పేరెంట్స్ ఒప్పుకొని పేరెంట్స్ సుమ ని గదిలో బందించారంటూ ఒక ఇంటర్వ్యూ లో కూడా చెప్పింది. సుమ మాత్రం తన మాట మీద నిలబడడం చూసి తన తల్లిదండ్రులు చివరికి వీరికి రాజీవ్ కనకాలతో పెళ్లి చేసారని చెప్పారు. ఇలా వీరి వివాహం 1999 ఫిబ్రవరి 10వ తేదీ  ఘనంగా తెలుగు, కేరళ సాంప్రదాయ పద్ధతులలో జరిగింది. వీళ్ళ పెళ్ళై పాతికేళ్లయిన సందర్భంలో సుమ సోషల్ మీడియా వేదికగా తన వెడ్డింగ్ కార్డ్ ను షేర్ చేసుకోవడంతో అది  కాస్త వైరల్ అయ్యింది.  ఇలా సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి పత్రికను షేర్ చేయడమే కాకుండా మీరు కార్డు చదివారా ? 1999లోనే సరికొత్త పద్దతిలో మా  వెడ్డింగ్ కార్డ్‌ అంటూ సుమ చెప్పడంతో అది ఇంకా పాపులర్ అయింది. ఇక సుమ రాజీవ్ దంపతులకు ఒక కుమారుడు, కూతురు ఉన్న విషయం తెలిసిందే. ఇక కుమారుడు చదువులను పూర్తి చేసుకొని ఈయన కూడా సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సుమ కెరీర్ స్టార్టింగ్ లో చాలా మూవీస్ లో ఆఫర్స్ వచ్చిన అటు వైపు ద్రుష్టి పెట్టకుండా కేవలం సీరియల్స్ మీదే ద్యాస పెట్టిందట. ఐతే  1996లో దాసరి నారాయణరావు డైరెక్షన్ లో వచ్చిన  కళ్యాణ ప్రాప్తిరస్తు మూవీలో సుమ కనకాల హీరోయిన్‌గా కనిపించింది.  ఆ తర్వాత పెద్దగా మూవీస్ చేసిందే లేదు. కేవలం  సీరియల్స్ , యాంకరింగ్ వైపే తన కెరీర్ ని బిల్డ్ చేసుకుంది. బుల్లితెర మీద కొన్నేళ్లుగా  సుమ కనకాల టాప్ యాంకర్‌గా కొనసాగుతోంది. కొంత కాలం క్రితం జయమ్మ పంచాయతీ అనే మూవీలో నటించింది.

దేవయానికి వార్నింగ్ ఇచ్చిన జగతి.. పాండియన్ ఇంటికి రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -874  లో.. రిషి ఏంజిల్ ఇంటినుండి బయటకు వెళ్లిపోతాడు. అసలు రిషి సర్ ఎక్కడికి వెళ్తున్నాడని వసు ఫోన్ చేస్తుంది. వసుధార ఫోన్ చేస్తుంటే కట్ చేస్తాడు రిషి. ఆ తర్వాత మీరు ఎక్కడికి వెళ్తున్నారు సర్ అని వాయిస్ మెసేజ్ పెడుతుంది వసుధార. ఆ తర్వాత ఫోన్ చేసి ఎక్కడికి వెళ్తున్నారని వసుధార అడిగితే రిషి చెప్పకుండానే ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత పాండియన్ కి వసుధార ఫోన్ చేస్తుంది. రిషి హోటల్ లో ఉండడానికి వెళ్తాడు కానీ రిషి వెళ్లేసరికి పాండియన్ అక్కడ ఉంటాడు. సర్ నాతో పాటు రండి అని అనగానే నేను పీస్ అఫ్ మైండ్ కోసం వచ్చానని రిషి అనగానే.. నాతో పాటు రండి మీకు కావలిసిన పీస్ అఫ్ మైండ్ ఉంటుందని రిషిని తీసుకొని వెళ్తాడు పాండియన్. మరొక వైపు దేవయాని, శైలేంద్ర ఇద్దరు రిషి గురించి మాట్లాడుకుంటారు. రిషిని ఎలాగైనా వేసేయాలి. ఎప్పుడు మనకి అడ్డు పడుతునే ఉన్నాడని శైలేంద్ర అనగానే.. అది మీ వల్ల కాదంటూ జగతి వస్తుంది. రిషి దగ్గరికి వెళ్ళాలి అంటే మమల్ని దాటుకొని వెళ్ళాలని జగతి అంటుంది. ఇవ్వాన్ని ఎందుకు సింపుల్ గా శైలేంద్రని కాలేజీ ఎండీ చేస్తే సరిపోతుంది కదా వాడి ముచ్చట తీరుతుంది కదా అని దేవయాని అంటుంది. రిషి కాలేజీ నీ వేరేవాళ్లకి కట్టబెట్టాలా? సమస్య వచిన్నపుడు రిషి ఖచ్చితంగా వస్తాడు. ఆ తర్వాత శైలేంద్ర, దేవయానిలకి జగతి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. మరొక వైపు రిషిని తీసుకొని పాండియన్ తన ఇంటికి వస్తాడు. మురుగన్ రిషికి వెల్ కమ్ చెప్తాడు. అయిన నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావని పాండియన్ ని రిషి అడుగుతాడు. మీరు ఇక్కడ మీకు నచ్చినట్టు ఉండొచ్చు. మీ ప్రైవసీ కి ఎవరు అడ్డు రారని మురుగన్,  పాండియన్ ఇద్దరు కలిసి రిషిని వాళ్ళింట్లో ఉండడానికి ఒప్పిస్తారు.  ఆ తర్వాత రిషికి తన గదిని చూపిస్తారు. ఆ గది అంత కూడా రిషికి నచ్చేలా ఉంటుంది. ఎవరు ఇలా చేశారని రిషి అడుగుతాడు. వసుధార చేసిందని మురుగన్ చెప్తాడు. నేను ఎక్కడకి వెళ్లిన నా గురించి ఆలోచిస్తావ్ వసుధార అని తన ప్రేమని గుర్తు చేసుకుంటాడు రిషి. మరొక వైపు రిషి ఇంటికి వచ్చేలా ఏదైనా పూజ చేయించాలని దేవాయని పూజారిని పిలుస్తుంది. అదంతా నటన అని జగతి మహేంద్రలకు తెలుసు.  కావాలనే ఫణింద్ర ముందు రిషి పై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతుంది దేవయాని‌. అదంతా అవసరం లేదని పూజారిని పంపిస్తాడు ఫణీంద్ర. ఆ తర్వాత రిషి గురించి తనకి చెప్పకుండా దాచినందుకు ఫణింద్ర బాధపడుతాడు.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ముకుంద ప్లాన్ ని కృష్ణ పసిగట్టగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -268 లో.. అందరి ముందు మురారిని కృష్ణ ఆటపట్టించిందని తననీ కూడా అటపట్టించాలని మురారి అనుకుంటాడు. కాసేపటికి  కృష్ణని గట్టిగా పట్టుకుంటాడు మురారి. ఇద్దరు తమ మనసులో ఇద్దరిపై ప్రేమని చెప్పుకుంటారు. ఆ తర్వాత మీరెప్పుడు మీ ప్రేమని చెప్తారు సర్ మీరు చెప్పేదాకా నా ప్రేమని దాచుకోలేకపోతున్నానని కృష్ణ అనుకుంటుంది. ఆ తర్వాత నేను  ఎంత తెగించిన అలుసు అయిపోతున్నాను తప్ప మురారికి నా ప్రేమ అర్థం కావడం లేదు. ఇంట్లో అందరు నాకు ప్రత్యర్థులే  అని ముకుంద ఫీల్ అవుతుంది. మరొక వైపు మురారి తన కాలేజీ డేస్ గురించి కృష్ణకి చెప్తూ వస్తుంటాడు. ముకుంద అలాగే చూస్తూ ఉండిపోతుంది. నిన్న మురారికి ఇష్టమైనవి చేసావ్. ఈ రోజు ఎవరికీ ఇష్టమైనవి చేసావని ముకుందని కృష్ణ అడుగుతుంది. ఇష్టమైన వాళ్ళు తినడానికి చేసానని ముకుంద చెప్తుంది.  ఆ తర్వాత అందరికి నేనొక నిర్ణయం తీసుకున్నానని, హాస్పిటల్ కి లాంగ్ లీవ్ పెట్టానని కృష్ణ చెప్తుంది. ఎందుకని భవాని అడుగుతుంది. ఆదర్శ్ వచ్చేలోపు ముకుందకి అన్ని పనులు నేర్పిస్తానని కృష్ణ చెప్తుంది. అవసరం లేదు నువ్వు హాస్పిటల్ కి వెళ్ళమని రేవతి చెప్తుంది. అలా అనగానే కృష్ణని ఈ రకంగా ఇంట్లో నుండి పంపించొచ్చని ముకుంద మనసులో అనుకుంటుంది. నాకు అన్ని నేర్పించడానికి నేను ఒప్పుకుంటున్నాని ముకుంద చెప్తుంది. ఆ తర్వాత మురారి పక్కనే ఉండి  ముకుంద వడ్డిస్తుంటే కృష్ణకి కోపం వస్తుంది. మరొక వైపు కృష్ణకి నిజం తెలిసిపోయిందని తెలియక రేవతి కంగారు పడుతుంది. ఎక్కడ కృష్ణకి ముకుంద నిజం చెప్తుందోనని అదే విషయం టెన్షన్ పడుతు మురారికి చెప్తుంది రేవతి. మరొక వైపు ముకుందకి అలేఖ్య కాఫీ తీసుకొని వస్తుంది. నాకు ఎందుకో కృష్ణకి మీ ప్రేమ సంగతి తెలిసిపోయిందని అనిపిస్తుందని అలేఖ్య అంటుంది. తెలిస్తే ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. తెలియాలనే కదా నా ప్రయత్నమని అలేఖ్యతో ముకుంద అంటుంది. మరొక వైపు అమ్మాయిలు, అబ్బాయిల సైకాలజీ గురించి కృష్ణ, మురారి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.    

కావ్య కాంట్రాక్ట్ పూర్తిచేయగలదా.. ఆ రౌడీలు ఏం చేయనున్నారు?

    స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -207 లో.. కావ్యని తీసుకొని వెళ్ళడానికి రాజ్ తన అత్తింటికి వస్తాడు. రాజ్ రావడం చూసిన కావ్య.. మీరు వచ్చారా నేను రావడం లేట్ అవుతుందని తాతయ్యకు చెప్పానని కావ్య అనగానే.. లేట్ అవుతుందనే నేను నిన్ను తీసుకొని వెళ్ళడానికి వచ్చానని రాజ్ అంటాడు. ఆ తర్వాత కనకం, కృష్ణమూర్తిలు రాజ్ నీ ఇంట్లోకి పిలుస్తారు. ఆ తర్వాత కావ్య బొమ్మలకు కలర్స్ వేస్తుంటే కావ్య దగ్గరే  రాజ్ కూర్చొని ఉంటాడు. కృష్ణమూర్తి విగ్రహల దగ్గరికి వెళ్తున్నానని వెళ్తాడు. రాహుల్ పంపిన రౌడీలు విగ్రహలు తీసుకొని వెళ్ళడానికి వస్తారు.‌ మరొక వైపు కృష్ణమూర్తి ఇంకొక అబ్బాయి విగ్రహల దగ్గరే ఉంటారు. మరొక వైపు కావ్య కలర్స్ వేస్తుంటే కావ్యనే చూస్తుంటాడు‌ రాజ్. ఆ తర్వాత ఈ రోజు మీరు ఇక్కడే ఉంటారా కాంట్రాక్టు పూర్తి అవుతుంది. రేపు మీతో గుమ్మడి కాయ కొట్టించాలని మా వాళ్ళు అనుకుంటున్నారు. కాంట్రాక్టు మీ వల్లే వచ్చింది కాబట్టి మా వాళ్ళు హ్యాపీగా ఉంటారని రాజ్ తో కావ్య అనగానే.. సరే అని రాజ్ అంటాడు. మరొక వైపు దుగ్గిరాల ఇంట్లో.. మీరు కావ్య ఏం చెప్తే అది చెయ్యకండి. ప్రతిసారీ పుట్టింటికి వెళ్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారని సీతారామయ్యతో అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత సీతరామయ్య రాజ్ కి ఫోన్ చేస్తాడు. కాసేపు మాట్లాడిన రాజ్.. ఈ రోజు ఇంటికి రావడం లేదని చెప్పగా.. సరేనని సీతారామయ్య చెప్తాడు. అపర్ణ కూడా రాజ్ మాటలు వింటుంది. ఆ మాటలు విన్న అపర్ణ.. రాజ్ అక్కడికి వెళ్తే వాడిని మార్చేస్తారని అనుకుంటుంది. ఆ తర్వాత రాహుల్ కి రుద్రాణి ఫోన్ చేసి.. ప్లాన్ ఎక్కడి వరకు వచ్చిందని అడుగుతుంది.‌ మరొకవైపు కావ్య, కనకం,  అన్నపూర్ణ, అప్పు అందరు కబుర్లు చెప్పుకుంటారు. వాళ్ళు మాట్లాడుకునే మాటలన్ని కూడా రాజ్ వింటాడు. ఆ తర్వాత పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తూ సంతోషంగా ఉంటారు. కృష్ణమూర్తి చేసిన విగ్రహాల దగ్గరికి రాహుల్ పంపిన రౌడీలు వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

పర్సనల్ ఫోటోలు బయటకి ఎలా వచ్చాయి.. రతిక ముందే ప్లాన్ చేసిందా?

రాహుల్ సిప్లిగంజ్.. ప్రస్తుతం క్రేజ్ ఉన్న సింగర్. ఆర్ఆర్ఆర్ సినిమాలోని తను పాడిన నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డ్ రావడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. ఇన్ స్టాగ్రామ్ లో తన రెగ్యులర్ అప్డేట్స్ ని షేర్ చేస్తూ అభిమానులకి దగ్గరగా ఉండే రాహుల్ సిప్లిగంజ్.. షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. తన పర్సనల్ ఫోటోలు బయటకు ఎలా వచ్చాయంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు రాహుల్ సిప్లిగంజ్. " నాకొక ప్రశ్న ఉంది. ఆరు సంవత్సరాల తర్వాత తన ఫోన్ లో నుండి పర్సనల్ గా దిగిన ఫోటోలు ఎలా బయటకొచ్చాయి. లోపలికి వెళ్ళేముందే ప్రీప్లాన్ చేసుకొని వెళ్ళారా? మీరు ఇది అర్థం చేసుకుంటే మీకు తెలుస్తుంది. అది అబ్బాయి అయిన అమ్మాయి అయిన నేనెవరి లైఫ్ ని నాశనం చేయలేదు. ప్రతీ ఒక్కరు విజయం కోసం కష్టపడుతుంటారు. ప్రతీ ఒక్కరికి గతం ఉంటుంది. అది తెలుసుకోకుండా అంచనా వేయకూడదు. నన్ను అర్థం చేసుకున్నవాళ్ళకి థాంక్స్. నా గురించి నెగెటివ్ ని షేర్ చేయాలనుకున్నవారికి ఆల్ ది బెస్ట్' అంటూ ఈ పోస్ట్ లో రాసుకొచ్చాడు రాహుల్ సిప్లిగంజ్. అసలు విషయానికొస్తే రతిక, రాహుల్ సిప్లిగంజ్ గతంలో ప్రేమికులని, కొన్ని నెలలపాటు రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలొస్తున్నాయి. అది కూడా బిగ్ బాస్ సీజన్-7 మొదలైన వారం నుండి ఈ వార్త బయటకొచ్చింది. రతికరోజ్ ని ప్రమోట్ చేసే PR బ్యాచ్.. రాహుల్, రతిక కలిసి దిగిన ఫోటోలని నెట్టింట పోస్ట్ చేస్తున్నారని రాహుల్ సిప్లిగంజ్ అంటున్నాడు. అయితే ఎప్పుడో ఆరు సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరు కలిసి ఉన్నారని, ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్ లో పాపులారిటీ కోసం తనని వాడుకోవడం కరెక్ట్ కాదని రాహుల్ సిప్లిగంజ్ అన్నాడు. అయితే బిగ్ బాస్ హౌజ్ లో రతికని ఇప్పటికే రాధిక అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మొదటి వారం నుండి పల్లవి ప్రశాంత్ తో ప్రేమ అంటూ డ్రామాలు చేసి, ఇప్పుడు ప్రిన్స్ యావర్ తో ఫేక్ ఫీలింగ్స్ ను చూపిస్తుంది రతిక.  దీంతో బిగ్ బాస్ ప్రేక్షకులకు రతికపై నెగెటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయింది‌. ఇక రాహుల్ సిప్లిగంజ్ చేసిన ఈ పోస్ట్ తో రతికని ఏ రేంజ్ లో ట్రోల్స్ చేస్తారో చూడాలి మరి. 

‘పాపం పసివాడు’ టైటిల్‌ సాంగ్‌ రిలీజ్‌

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఓ కొత్త వెబ్‌ సిరీస్‌ ప్రారంభం కాబోతోంది. ‘పాపం పసివాడు’ పేరుతో సెప్టెంబర్‌ 29 నుంచి ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతుంది. ది వీకెండ్‌ షో నిర్మాణంలో ఈ సీరిస్‌ రూపొందింది. ఇందులో 5 ఎపిసోడ్స్‌ ఉంటాయి. ప్రేమలో చిక్కుకున్న ఓ యువకుడి జీవితంలో ఎలాంటి గందరగోళం క్రియేట్‌ అయ్యిందనే విషయాన్ని అందరూ ఎంజాయ్‌ చేసేలా చక్కగా తెరకెక్కించారు.  పాతికేళ్ల కుర్రాడైన క్రాంతి.. ప్రేమ కోసం హృదయమంతా బాధతో పరితపిస్తూ ఎదురు చూస్తుంటాడు. అయితే ఉన్నట్లుండి ఒకరు కాదు ఇద్దరు కాదు.. ముగ్గురు అమ్మాయిలు అతని జీవితంలోకి ప్రవేశిస్తారు. దాంతో అతని జీవితంలో ఊహించని ఘటనలు జరుగుతాయి. లైఫ్‌ అనేక మలుపులు తిరుగుతుంది. ఈ రొమాంటిక్‌ జర్నీలో తెలియని గందరగోళం క్రియేట్‌ అవుతుంది.  దాన్ని ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్‌ చేస్తారు. ఈ సిరీస్‌కు అనుబంధంగా ఆహా ..‘పాపం పసివాడు’ అనే పాటను విడుదల చేసింది. సిరీస్‌లోని పాత్రలను తరచి చూస్తూనే భావోద్వేగ ప్రయాణాన్ని ఈ పాటలో ఆవిష్కరించారు. ఈ వెబ్‌ సిరీస్‌కు సంగీతం: జోస్‌ జిమ్మీ, ర్యాప్‌ సాంగ్‌ అండ్‌ సింగర్‌: ఆదిత్యరావ్‌ గంగసాని, ఓకల్స్‌: కార్తీక వైద్యనాథన్‌,  ఆడిషనల్‌ ఓకల్స్‌ (డైలాగ్స్‌): ఐశ్వర్య దరూరి మిక్స్‌ అండ్‌ మాస్టర్డ్‌: కిషన్‌ శ్రీబల్‌.

ఇప్పటికి నా బాధ అర్ధమయ్యింది ...చిన్మయి కామెంట్స్ వైరల్

సింగర్ చిన్మయి అంటే చాలు ఇండస్ట్రీలో  రెవల్యూషన్ కి కేరాఫ్ అడ్రెస్స్ గా చెప్పుకుంటారు. ఆమె చేసే మీటూ ఉద్యమం, క్యాస్టింగ్ కౌచ్ గురించి అందరికీ తెలిసిందే. వైరముత్తు మీద ఆమె ఒకప్పుడు చేసిన  ఆరోపణలు కోలీవుడ్‌ను షేక్ చేసేసిన విషయం తెలిసిందే.  వైరముత్తు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆమె చేసిన హాట్ కామెంట్స్ అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే వాటికి ప్రూఫ్స్ అనేవి లేవు...ఉండవు కూడా.  కానీ ఆమె అంత ధైర్యంగా చేసిన కామెంట్స్ తో ఆమెకు సపోర్ట్ గా కొంతమంది బయటకు వచ్చి వైరముత్తు స్వరూపాన్ని చూపించడానికి ట్రై చేసారు కానీ అతని  బ్యాక్ గ్రౌండ్ వల్ల వాళ్ళ ఆరోపణలు అన్ని కూడా గాల్లోనే కలిసిపోయాయి.  వైరముత్తు మీద చేసిన ఆరోపణల వలన  కోలీవుడ్‌లో చిన్మయిని బ్యాన్ చేశారు. డబ్బింగ్ చెప్పడానికి సాంగ్స్ పాడడానికి ఆమెకు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. కానీ  చిన్మయి వీటిని పెద్దగా పట్టించుకోలేదు.  తన దారిలో తాను ప్రశ్నిస్తూనే వెళ్ళింది. ఐతే రీసెంట్ గా వైరముత్తుకు సంబంధించిన ఓ రీల్ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక సింగర్ సీరియస్ గా సాంగ్ పాడుతుంటే "మీ నవ్వు బాగుంది" అంటూ పక్కనే ఉన్న వైరముత్తు కామెంట్  చేశారు. ఈ వీడియోని టాగ్ చేసి స్పందించింది చిన్మయి. "ఆయన  చేసిన కామెంట్ కి ఆమె చాలా ఇబ్బంది పడిందన్న విషయం చూసే వాళ్లందరికీ తెలుసు..ఐనా ఆమె మాత్రం పెద్దగా రెస్పాండ్ కాకుండా తన పాట పాడుకుంటూ వెళ్ళింది" అని చెప్పింది.  "ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో  చూస్తే ఒకప్పటి నా బాధ  అందరికీ అర్థం అవుతుంది.. మీటూ ఉద్యమం గురించి  తెలియని వాళ్లు చాలా మాట్లాడారు.. నిజం బయటకు రావడానికి కొంచెం టైం పడుతుంది.   నేను మాత్రం బాధితులకు  సపోర్ట్‌గా నిలబడతాను..  అవతలి ఉన్నది ఎవరైనా పట్టించుకోను.. నేనేమీ బుద్దుడి టైపు కాదు.. అయితే ఏదో ఒక రోజు నేను బుద్దుడి టైపే ఉండాలనుకుంటున్నా.. మంచి చెడులు లేవు.. అందరూ సమానమే అనే ఆలోచనలు రావాలి..  నేను ఇలానే ఉంటాను.. బాధితుల తరుపున పోరాడతాను.. నన్ను ఏం అన్నారో.. ఎలా అన్నారో అన్నీ గుర్తు పెట్టుకున్నాను.. అందులో సో కాల్డ్ ఫెమినిస్టులున్నారు.. సో కాల్డ్ ప్రోగ్రెసివ్, సో కాల్డ్ ఉమెన్ రైట్స్ పర్సన్స్ ఉన్నారు..  నాకు సహనం, ఓపిక ఉన్నాయి. నేను వెయిట్ చేస్తాను.."  అంటూ చిన్మయి తన వెర్షన్ మొత్తాన్ని ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది.    

మలేషియాలో ఫస్ట్ వ్లాగ్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ

  బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా మలేషియాలో వెకేషన్ ఎంజాయ్ చేసింది. తాజాగా మలేషియా ట్విన్ టవర్స్ ముందు దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మలేషియా వెళ్లి అక్కడి తీసిన ఫస్ట్ వీడియోని అంటూ యూట్యూబ్ లో అప్ డేట్ చేసింది. ట్విన్ టవర్స్ ని చూడడానికే మలేషియా వెళ్లినట్లు చెప్పింది..కార్ లో వెళ్తూ మొత్తాన్ని వీడియో తీసింది. ఇక ఇనాయ ఫ్రెండ్ ట్విన్ టవర్స్ ప్లేస్ ని చూసి హైదరాబాద్ కూడా ఇలాగే డెవలప్ కావాలి అని  మిగతా దేశాల వాళ్ళు కూడా వచ్చి అలాగే ఫొటోస్ దిగాలి అంటూ కోరుకునేసరికి హైదరాబాద్ గవర్నమెంట్ వినిపిస్తోందా అంటూ ఇనాయ కామెడీ చేసింది. ఇక అలా వెళుతూ మలేషియాలోని టాలెస్ట్ బిల్డింగ్ ని చూపించింది అందులో 116 ఫ్లోర్స్ ఉంటాయని చెప్పింది. స్ట్రీట్ ఫుడ్ కార్నర్ కి వెళ్లారు వెరైటీ ఫుడ్ తినడానికి...అక్కడ ఇనాయ తనకు ఎంతో ఇష్టమైన పనస తొనలు తీసుకుంది. తర్వాత తమతో వచ్చిన బర్త్ డే బాయ్ కి షూస్ కొనడానికి అన్ని షాప్స్ కి వెళ్లారు. చివరికి ఒక మాల్ లో ఆ పిల్లాడికి కావాల్సినవి తీసుకున్నారు. అలా చివరికి ఇండియన్ ఫుడ్ తినడానికి వెళ్లి అక్కడ ఫుడ్ తినేసి మళ్ళీ చీకట్లో ఒకసారి ట్విన్ టవర్స్ ని చూపించి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయింది ఇనాయ సుల్తానా.  తెలుగులో  ‘బుజ్జి ఇలా రా, నటరత్నాలు… యద్భావం తద్భవతి వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించింది. కానీ ఆమెకు ఒక్క హిట్ కూడా పడలేదు.  సోషల్ మీడియాలో బాగానే ఫాలోవర్స్ ను సంపాదించుకున్న ఇనాయ  బిగ్ బాస్ హౌస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి రచ్చ చేసిన విషయం తెలిసిందే.

పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ గా మరొక బిగ్ బాస్ కంటెస్టెంట్!

బిగ్ బాస్ సీజన్-7 లో ప్రస్తుతం మూడవ వారం కొనసాగుతుంది.  రెండవ వారంలో బీటెక్-రైతు అంటు‌ పల్లవి ప్రశాంత్ పై అమర్ దీప్ చేసిన వ్యాఖ్యలు కాంట్రావర్సికి కేరాఫ్ గా మారిన విషయం తెలిసిందే. దానికి కారణం లేకపోలేదు. పల్లవి ప్రశాంత్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భావించాడు అమర్ దీప్. అతనితో పాటు హౌజ్ లోని మిగత  కంటెస్టెంట్స్ అందరు అతన్ని టార్గెట్ చేసి నామినేట్ చేశారని బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు తెలిసింది‌. అయితే ఆ వారం నామినేషన్ లో అందరు వరుసగా పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేసి, వారికి తెలియకుండానే  అతడిని మరింత స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని చేసేసారు.  ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్. అయితే అతను సింపథీ కోసమే అలా ప్రతిసారీ హౌజ్ లో రైతుబిడ్డ అంటూ వస్తున్నాడని తోటి కంటెస్టెంట్స్ అభిప్రాయం. అందుకే ఎక్కడ గెలుస్తాడో అని అతడిని బయటకు పంపించే పనిలో పడ్డారు. నామినేషన్ తర్వాత ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన పల్లవి ప్రశాంత్ తనని తాను రైతుబిడ్డ అని చెప్పడంలో తప్పేముందని చాలా వరకు చర్చలు జరిగిన విషయం తెలిసిందే. అయితే మొన్న జరిగిన ఎపిసోడ్ లో గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్ ల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత.. నేనొక డాక్టర్ ని, నా దగ్గర వచ్చి బాడీ చూపిస్తూ మాట్లాడతాడా అంటూ గౌతమ్ కృష్ణ అన్నాడు. అయితే ఇప్పుడు అది హాట్ టాపిక్ గా మారింది. దీని గురించి బిగ్ బాస్ 4 రన్నర్ అఖిల్ సార్థక్.. పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ అందుకే రైతు బిడ్డ అని చెప్పుకున్నాడు. అలా చెప్పుకోవడం కరెక్ట్ కాదన్న వాళ్ళే ఇప్పుడు డాక్టర్ అని ఎందుకు చెప్పినట్టు అంటూ గౌతమ్ కృష్ణని ఉద్దేశించి అఖిల్ సార్థక్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఇదేవిధంగా గీతు రాయల్ కూడా రైతు బిడ్డ రైతు అని చెప్పుకుంటే తప్పా? డాక్టర్ నేను డాక్టర్ అని చెప్పుకుంటే తప్పు లేదా అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్  చేసింది.  ఇప్పుడు ఆరోహీ రావు తన ఇన్ స్టాగ్రామ్ లో పల్లవి ప్రశాంత్ ని సపోర్ట్ చేయండంటూ పోస్ట్ చేసింది‌. ఎప్పుడు చూసిన ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలతో, రీల్స్ తో యాక్టివ్ గా ఉండే ఆరోహీ రావు.. ఆస్క్ మీ క్వశ్చనింగ్ స్టార్ట్ చేసింది. అందులో బిగ్ బాస్ సీజన్-6 లో‌ మీ బెస్ట్ మెమోరీ ఏంటని ఒకరు అడుగగా.. ఒకరోజు నేను అన్నం తినకుండా పడుకున్నాను. అందరు తినేస్తున్నారు. ఆ రోజు ఫుల్ మీల్స్ అండ్ చికెన్ వచ్చింది. ఎవరు నా కోసం వెతకట్లేదు. కానీ కీర్తీ తను తినకుండా, తన ప్లేట్ నా ప్లేట్ పట్టుకొని హౌజ్ అంతా తిరిగి నన్ను లేపి ఫుడ్ ఇచ్చిందంటూ చెప్పుకొచ్చింది ఆరోహీ. ప్రెజెంట్ బిగ్ బాస్ సీజన్-7 లో మీ సపోర్ట్ ఎవరికి అక్క అని ఒకరు అడుగగా.. అందులో ఉన్న అందరు టీవీల్లో, సినిమాల్లో నటించినవారే దాదాపు అందరికి పరిచయమే. కానీ కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన ప్రశాంత్ కి ఎవరు లేరు. అందుకే నా సపోర్ట్ తనకే అంటు ఆరోహీ అంది. దీంతో సోషల్ మీడియాలో రోజురోజుకి పల్లవి ప్రశాంత్ ని సపోర్ట్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.                                                                                                                                                                

దామిణి, రతికల పైశాచికత్వం.. ప్రిన్స్ యావర్ వన్ మ్యాన్ షో!

యావర్.. అన్వర్.. ప్రిన్స్. ఇవన్నీ పేర్లు ఒక్కడివే. అతనే ప్రిన్స్ యావర్. బిగ్ బాస్ హౌజ్ లో రతిక ఆడించే ఆటలో ప్రిన్స్ యావర్ ని అన్వర్ అని పిలుస్తుంది. హౌజ్ లో‌ కొంత మంది ప్రిన్స్ అని మరికొందరు యావర్ అని పిలుస్తున్నారు. అసలు విషయానికొస్తే ప్రిన్స్ యావర్ కి అదిరిపోయే కమ్ బ్యాక్ కంటెంట్ లభించింది. బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్ నుండి హౌజ్ మేట్ గా మారడానికి అవకాశం లభించింది. యావర్, అమర్ దీప్,  శోభా శెట్టిలని హౌజ్ మేట్ కోసం ఎంపిక చేయగా దామిణి,  టేస్టి తేజ, రతిక అనర్హుడని సీక్రెట్ రూమ్ లో చెప్పారు.  అయితే తనని తాను స్ట్రాంగ్ అని నిరూపించుకోవడానికి బిగ్ బాస్ అవకాశాన్ని ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలోని ఒక స్టాండ్ కి ప్రిన్స్ యావర్ ని తన చిన్ ని ఉంచి నిల్చోమన్నాడు. ఇక ప్రిన్స్ యావర్ ని ఎవరైతే అపోజ్ చేశారో వారిచేత భిన్నమైన పద్దతులలో, వాళ్ళకి నచ్చింది చేసి యావర్ ని ఒక గంటలో ఆ ప్లేస్ నుండి వచ్చేలా చేయాలని, ఏదో ఒకటి చేసి యావర్ ని ఓడించాలని చెప్పాడు బిగ్ బాస్. దాంతో దామిణి, రతిక కలిసి రకరకాల ప్రయోగాలు చేశారు. మొదట రతిక టమాటలు, ఎగ్స్ తెచ్చి యావర్ మోహంపై కొట్టింది. ఇక టేస్టి తేజ తెచ్చిన ఐస్ ని ప్రిన్స్ యావర్ డ్రాయర్ లో వేశారు.‌ ఇక రతిక అలియాస్ రాధిక జండు బామ్ ని యావర్ ముక్కుకి ఆనించి పైశాచికత్వాన్ని పొందింది. ఇక దామిణికి వైల్డ్ థాట్స్ వస్తున్నాయంటూ చిన్న చిన్న కట్టె పుల్లల్ని యావర్ ముక్కులో, చెవిలో పెట్టింది. అప్పటికైన సంచాలకులుగా చేస్తున్న ఆట సందీప్, శివాజీ వారికి అలా చేయొద్దని చెప్పాడు. అయినా వినకుండా అలానే చేశారు.‌  సబ్బు నీళ్ళు, సబ్బు నురగతో దామిణి తనకి నచ్చినట్టుగా యావర్ ని టార్చర్ చేసింది. కాసేపటికి పేడ నీళ్ళని చల్లారు. అయిన సరే ప్రిన్స్ యావర్ చలించలేదు. చివరివరకు స్ట్రాంగ్ గా నిల్చొని పోటీలో నిలిచి, తను యునిక్ అంటు నిరూపించుకున్నాడు యావర్. ఈ ఎపిసోడ్ తో ప్రిన్స్ యావర్ కి ఫ్యాన్ బేస్ పెరిగే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే తనని ఇండివిడ్యువల్ గేమ్ ఆడుతున్నాడని, టీమ్ గా ఆడట్లేదని హౌజ్ లోని కంటెస్టెంట్స్ అనుకుంటుండగా మూడవ హౌజ్ మేట్ కోసం జరుగబోయే రేస్ లో  స్థానం దక్కించుకున్నాడు ప్రిన్స్ యావర్. ఓటింగ్ లో అయిదు, ఆరు స్థానాలలో ఉన్న యావర్ గ్రాఫ్ పెరిగి మూడవ స్థానంలోకి చేరుకున్నాడు. టాస్క్ లతో పాటు తోటి కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ కమ్యూనికేషన్ ని పెంచుకుంటే టాప్-5 లో ఉండే అవకాశం ఉంది. ముందు ముందు ఎలా ఆడతాడో చూడాలి మరి!  

గౌతమ్-శోభా శెట్టి మధ్య బిగ్ బాస్ పెట్టిన చిచ్చు.. అందుకే చొక్కా విప్పి చూపించాడా?

బిగ్ బాస్ హౌజ్ లో రోజురోజుకి హీటెడ్ ఆర్గుమెంట్స్ ఎక్కువవుతున్నాయి. నిన్నటి దాక యావర్-గౌతమ్ ల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. కాగా బుధవారం నాటి ఎపిసోడ్‌లో శోభా శెట్టి-గౌతమ్ ల‌ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇద్దరి మధ్య పీక్స్ లో గొడవ జరిగింది. హౌజ్ లో ఎవరూ తగ్గట్లేదు. ఎవరికి వారే ఇండివిడ్యువల్ గేమ్ ప్లాన్ తో చెలరేగిపోతున్నారు.  హౌజ్ లో కంటెస్టెంట్స్ గా ఉన్నవారిలో మూడవ హౌజ్ మేట్ కోసం మూడవ వారం జరుగుతున్న ఈ ప్రక్రియలో ఉల్టా పల్టా థీమ్ ని అప్లై చేస్తున్నాడు బిగ్ బాస్. మూడవ హౌజ్ మేట్ కోసం అమర్ దీప్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టిలని పోటీలో ఉంచాడు బిగ్ బాస్. ఆ తర్వాత హౌజ్ లోని ఒక్కో కంటెస్టెంట్ ని సీక్రెట్ రూమ్ కి పిలిచి, పోటీలో ఉన్న ఈ ముగ్గురిలో ఎవరు అనర్హులుగా భావిస్తున్నారో చెప్పమని చెప్పాడు బిగ్ బాస్. దాంతో మొన్న జరిగిన ఎపిసోడ్‌లో యావర్ ని దామిణి అనర్హుడని చెప్పడంతో.. ప్రాపర్ రీజన్ కావాలంటూ యావర్ గొడవకి దిగిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు సీక్రెట్ రూమ్ లో శోభా శెట్టి అనర్హురాలని గౌతమ్ కృష్ణ చెప్పింది చూపించాడు బిగ్ బాస్. దాంతో వీళ్ళిద్దరి మధ్య గొడవ ముదిరింది. పుల్ రాజా పుల్ గేమ్ లో నీకంటే ఎక్కువ సేపు ఉన్నాను, ఆ రోజు కుస్తీ పట్టు టాస్క్ లో 58 సెకండ్స్ ఉన్నానంటూ శోభా శెట్టి తన పాయింట్లను చెప్పగా.. నువ్వు హౌజ్ లో ఎక్కువ కనిపించడం లేదు. అందరితో కనెక్ట్ అవ్వట్లేదు. ఎక్కువ టైమ్ మేకప్ వేకుంటున్నావ్.. అందుకే నాకు అలా అనిపించింది చెప్పాను అది నా రీజన్ అంటూ గౌతమ్ కృష్ణ అన్నాడు. నన్ను అలా ఎలా అంటావని శోభా శెట్టి, అది నా ఒపీనియన్, నా డెసిషన్ అంటూ గౌతమ్ కృష్ణ అన్నాడు. నువ్వు చెప్పిన రీజన్.. బక్వాస్ రీజన్ అని శోభా శెట్టి అంది. మరి నేను జిమ్ చేస్తే నీకేంటి ప్రాబ్లమ్ అంటు గౌతమ్ కృష్ణ అన్నాడు. అందుకే నువ్వు ఏం చేయలేకపోయావ్ అని శోభా శెట్టి అంది. నా జిమ్ నా ఇష్ణం పొద్దున్న ఎత్తుతా, సాయంత్రం ఎత్తుతా, నా బాడీ నా ఇష్టమంటూ శోభా శెట్టి ముందు చొక్కా విప్పి జిమ్ చేశాడు గౌతమ్. చొక్కా విప్పి షో ఆఫ్ చేస్తే ఎవడు బయపడడని, పోరా పో అంటూ శోభా శెట్టి అనగా‌.‌. నన్ను బిగ్ బాస్ సెలెక్ట్ చేశాడు మా నాన్న సెలెక్ట్ చేయలేదంటూ గౌతమ్ కృష్ణ అన్నాడు. ఇలా ఇద్దరి మధ్య చాలా సేపు గొడవ జరిగింది. అయితే తనని అనర్హురాలని అలా ఎలా చెప్తాడనేది శోభా శెట్టి వాదనైతే, నా ఒపీనియన్ నా ఇష్టమని గౌతమ్ వాదన. అయితే ఈ ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అనేది బిగ్ బాస్ మూడవ హౌజ్ మేట్ ని ప్రకటించేప్పుడు చెప్తాడు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో వీరిద్దరి మధ్య జరిగిన గొడవ పీక్స్ లో ఉంది.  

రాహుల్ చేసిన ఆ పోస్ట్ తన కోసమేనా!

బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్స్ హౌజ్ లో కొనసాగడానికి చాలా తిప్పలే పడుతున్నారు.‌ ఎవరికి వారు స్ట్రాటజీ ప్లే చెయ్యడంలో వంద శాతం సక్సెస్ అవుతున్నారనడంలో ఆశ్చర్యం లేదు. ఒక విధంగా చెప్పాలంటే కంటెస్టెంట్స్ ప్రేక్షకుల సింపతీ పొందాలి. అలా అయితేనే హౌజ్ లో ఎక్కువ రోజులు ఉంటామన్న భ్రమతో ఇప్పుడున్న వాళ్లు అనుకుంటున్నారు. బిగ్ బాస్ హౌజ్ లో శివాజీ, అట సందీప్ తప్ప మిగతావాళ్ళంత ఏదో ఒక సింపతీతో కంటెంట్ ఇవ్వాలని,  స్క్రీన్ స్పేస్ తీసుకోవాలని చూస్తున్నారు. అసలు విషయానికొస్తే ప్రస్తుతం హౌజ్ లో ఎప్పుడు  ఒక ఎమోషన్ తో ఉంటూ వస్తుంది మన రతిక బేబీ. మొదటి వారంలోనే మీరు ఎవరినైన మిస్ అవుతున్నారా అని బిగ్ బాస్ అడిగినప్పుడు.. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని మిస్ అవుతున్ననంటూ చెప్పుకొచ్చింది రతిక. మొదటి వారంలో పల్లవి ప్రశాంత్ లక్కీ ఛామ్ బ్యాండ్ ని రతికకి కట్టడంతో మొదలైన వారి రిలేషన్.. రోజు రోజుకి పీక్స్ కి వెళ్తుంది. ఇప్పుడు తాజాగా రతిక ఖాతాలో మరొక బకరా చేరాడు. అది ఎవరో కాదు ప్రిన్స్ యావర్. అతనికి తెలుగు రాదు, ఈమెకి హిందీ రాదు. ఇప్పటికే పల్లవి ప్రశాంత్ ని వెనుక తిప్పుకొని నామినేషన్లో వెన్నుపోటు పొడిచింది‌. ఇప్పుడు తాజాగా యావర్ ని సపోర్ట్ చేస్తానని చెప్పి సీక్రెట్ రూమ్ లో యావర్ అనర్హుడని చెప్పింది‌. ఇదంతా చూస్తున్న బిగ్ బాస్ ప్రేక్షకులు ఇప్పటికే రతికని.. డీజే టిల్లు సినిమాలోని రాధిక తో పోల్చుతూ ట్రోల్స్ చేస్తున్నారు. రతిక మాజీ ప్రియుడు అంటే ఎవరో కాదు బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్. అయితే అతని ఫ్యాన్ బేస్ ని తనవైపుకు తిప్పుకోవడానికే రతిక ఆడుతున్న డ్రామా అని అదంతా ఫేక్ అని రాహుల్ సిప్లిగంజ్ తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో తెలియజేశాడు. ' ఫేక్ సింపతీ గేమ్ ఎప్పటివరకు? అందరు తమ సొంత ట్యాలెంట్ మీద ఆధారపడి తమని తాము నిరూపించుకుంటారు. కానీ కొంతమంది ఇతరుల ట్యాలెంట్ ని పేరుని వాడుకొని నటిస్తుంటారు. ఫేమ్ కోసం అవసరానికన్నా ఎక్కువ వాడుకుంటున్నారు. లోపల ఉన్న పర్సన్ కి ఆల్ ది బెస్ట్. పైసల్ తీసుకొని తనకి సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్న పేడ్ బ్యాచ్ కి కంగ్రాట్స్' అంటూ రాహుల్ సిప్లిగంజ్ ఈ పోస్ట్ లో చెప్పుకొచ్చాడు. అయితే ఈ పోస్ట్ తనకోసమే అని చాలామందికి ఇప్పటికే తెలిసిపోయింది. కాగా ఇప్పుడు ఈ పోస్ట్ ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది.   

వెడ్డింగ్ కార్డ్ తో కళ్యాణ్ కి లవ్ ప్రపోజల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -206 లో.. కావ్య తన పుట్టింటికి వెళ్ళడానికి అపర్ణ అనుమతి తీసుకోగ అపర్ణ వెళ్ళమని చెప్తుంది. ఈ రోజుతో కాంట్రాక్టు పూర్తవుతుంది. మా పుట్టింటి వాళ్ళ అప్పు తీరిపోయి వాళ్ళకి ఇల్లు సొంతం అవుతుందని సీతారామయ్య, ఇందిరాదేవిల దగ్గర కావ్య ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోతుంది. మరొక వైపు అనామికని కలవడానికి కళ్యాణ్ వెళ్తాడు. అప్పు ఫోన్ చేసిన లిఫ్ట్ చెయ్యకుండా అనామికని కలిసి గుడ్ న్యూస్ తో అప్పుని కలుస్తానని కళ్యాణ్ అనుకుంటాడు. కాఫీ షాప్ లో అనామికని కలుస్తాడు. అనామిక ఒక వెడ్డింగ్ కార్డు ఇచ్చి.. ఇది నా వెడ్డింగ్ కార్డు చదువు అని అనగానే కళ్యాణ్ డిస్సపాయింట్ అవుతాడు. ఆ తర్వాత కార్డు లో కళ్యాణ్ పేరు ఉండడం, అబ్బాయి అతనే అని సంబరపడిపోయి అనామికని హగ్ చేసుకుంటాడు. మీ కవితలే కాదు మీరు కూడా ఇష్టమని కల్యాణ్ తో అనామిక చెప్తుంది. ఒక వైపు కృష్ణమూర్తి దగ్గరికి‌ కావ్య వెళ్తుంది. మిగిలిన బొమ్మలకు కలర్ లు వేస్తుంది. మరొకవైపు రాహుల్ కి రుద్రాణి ఫోన్ చేసి.. ఈ రోజుతో కావ్య చేసే కాంట్రాక్ట్ పూర్తి అవుతుందంట. నువ్వేం చేస్తావో నాకు తెలియదు కావ్య పుట్టింటి వాళ్ళకి ఇల్లు సొంతం కాకూడదని రాహుల్ కి రుద్రాణి చెప్తుంది. నేను చూసుకుంటానని రాహుల్ అంటాడు.  మరొక వైపు సీతరామయ్యకి రాజ్ ఫోన్ చేసి.. టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతాడు. నేను వేసుకున్న కానీ నీ భార్య పుట్టింటికి వెళ్ళింది. వస్తుందా లేదా అని ఫోన్ చెయ్యాల్సిన అవసరం లేదా అని సీతారామయ్య అడుగుతాడు. సరే చేస్తానని రాజ్ అనగానే.. అవసరం లేదు కావ్య రావడం లేట్ అవుతుంది అంట అని సీతరామయ్య చెప్తాడు. సరే నేను వెళ్లి తీసుకొని వస్తానని రాజ్ అనగానే.. సీతరామయ్య హ్యాపీగా ఫీల్ అయి సరే అంటాడు. ఆ తర్వాత కావ్యని తీసుకొని రావడానికి రాజ్ తన అత్తగారింటికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.