Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...‘పాపం పసివాడు’ టైటిల్ సాంగ్ రిలీజ్
posted on: Sep 21, 2023 12:40PM

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఓ కొత్త వెబ్ సిరీస్ ప్రారంభం కాబోతోంది. ‘పాపం పసివాడు’ పేరుతో సెప్టెంబర్ 29 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ది వీకెండ్ షో నిర్మాణంలో ఈ సీరిస్ రూపొందింది. ఇందులో 5 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రేమలో చిక్కుకున్న ఓ యువకుడి జీవితంలో ఎలాంటి గందరగోళం క్రియేట్ అయ్యిందనే విషయాన్ని అందరూ ఎంజాయ్ చేసేలా చక్కగా తెరకెక్కించారు.
పాతికేళ్ల కుర్రాడైన క్రాంతి.. ప్రేమ కోసం హృదయమంతా బాధతో పరితపిస్తూ ఎదురు చూస్తుంటాడు. అయితే ఉన్నట్లుండి ఒకరు కాదు ఇద్దరు కాదు.. ముగ్గురు అమ్మాయిలు అతని జీవితంలోకి ప్రవేశిస్తారు. దాంతో అతని జీవితంలో ఊహించని ఘటనలు జరుగుతాయి. లైఫ్ అనేక మలుపులు తిరుగుతుంది. ఈ రొమాంటిక్ జర్నీలో తెలియని గందరగోళం క్రియేట్ అవుతుంది. దాన్ని ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఈ సిరీస్‌కు అనుబంధంగా ఆహా ..‘పాపం పసివాడు’ అనే పాటను విడుదల చేసింది. సిరీస్‌లోని పాత్రలను తరచి చూస్తూనే భావోద్వేగ ప్రయాణాన్ని ఈ పాటలో ఆవిష్కరించారు. ఈ వెబ్ సిరీస్‌కు సంగీతం: జోస్ జిమ్మీ, ర్యాప్ సాంగ్ అండ్ సింగర్: ఆదిత్యరావ్ గంగసాని, ఓకల్స్: కార్తీక వైద్యనాథన్, ఆడిషనల్ ఓకల్స్ (డైలాగ్స్): ఐశ్వర్య దరూరి మిక్స్ అండ్ మాస్టర్డ్: కిషన్ శ్రీబల్.



.webp)


