రాఘవ లారెన్స్ ని ఇంటర్వ్యూ చేసిన విక్రమ్-నందిని

చంద్రముఖి 2 మూవీ రిలీజ్ అయ్యి దుమ్ము రేపుతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ వాసుని హీరో రాఘవ లారెన్స్ ని ఇంటర్వ్యూ చేశారు శ్రీవాణి భర్త విక్రమ్ ఆమె కూతురు నందు. "ప్రభుదేవా డాన్స్ చేసేటప్పుడు వచ్చే ఆ కిక్కే వేరు..ప్రభుదేవాని చూసినప్పుడు మన సౌత్ ఇండియన్ అనే ఒక గర్వంగా ఉంటుంది ఆ తర్వాత రాఘవ లారెన్స్ వచ్చి డాన్స్ చేయడం స్టార్ట్ చేసాక..ఇంటికొక డాన్సర్  తయారయ్యారు. ఇంటికొక డాన్సర్ ని తయారు చేసింది మాత్రం రాఘవ లారెన్స్" అని చెప్పి సెట్ కి వెళ్లి లారెన్స్ ని ఇంటర్వ్యూ చేశారు విక్రమ్. "వాసు డైరెక్షన్ లోనే శివలింగ కూడా చేశారు కదా అది సూపర్ హిట్ మరి శివలింగ 2 తియ్యకుండా చంద్రముఖి 2 తీశారు...రజనీకాంత్ నటించిన మూవీ సీక్వెల్ లో నటించడం ఎలా అనిపిస్తోంది".."మూవీ బిజినెస్ అవుతుంది కదా అందుకే..అలాగే రజనీకాంత్ నటించిన మూవీ సీక్వెల్ లో నటించడం హ్యాపీగా ఉంది. రజనీకాంత్ గారిలా చేయగలుగుతామా అని అనుకున్నా కానీ చేసాక..హ్యాపీగా అనిపించింది నేను కూడా చేయగలను అనుకున్నాను" అని చెప్పారు లారెన్స్. "మీరు కూడా డైరెక్టర్ కదా మరి వాసు గారి డైరెక్షన్ లో ఎలా చేశారు" అని నందు అడిగింది. "నేను డైరెక్టర్ అన్న విషయం మర్చిపోతేనే ఇక్కడ హీరోగా చేయగలను...ఇందులో కామెడీ ఉంది..వడివేలు గారి కామెడీ చాలా బాగుంటుంది. అలాగే వాసు గారి స్టయిల్లో మాస్ సాంగ్స్ కూడా ఉన్నాయి" అని చెప్పారు లారెన్స్. శ్రీవాణి ఫామిలీ మొత్తం కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అలాగే బుల్లితెర మీద అన్ని షోస్ లో కనిపిస్తూ ఉంటారు. రీసెంట్ గా నీతోనే డాన్స్ ఎపిసోడ్ లో మెరిశారు. వీళ్ళు చేసే డాన్స్ కి చాలామంది ఫాన్స్ కూడా ఉన్నారు.  

చీర పెట్టిన వియ్యపురాలు..గొడవ పెట్టిన కోడలు

సన... బుల్లితెర నటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటు సీరియల్స్ లో నటిస్తూ ఉంటుంది ఇటు సిల్వర్ స్క్రీన్ మీద రకరకాల సైడ్ క్యారెక్టర్స్ లో కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సన ఇప్పుడు తన అపార్ట్మెంట్ లో జరిగే వినాయక చవితి వేడుకల్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నట్టు ఒక వీడియో చేసి తన యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేసింది. అందులో తన వియ్యపురాలు కూడా ఈ ప్రోగ్రాంకి రావడాన్ని చూపించారు. అలాగే పిల్లలను ఇచ్చిన వియ్యపురాలు వచ్చి సనకి గిఫ్టులు ఇచ్చారు. అలాగే ఒక మంచి చీర దాంతో పాటు 1000 రూపాయలు కూడా ఇచ్చారు. ఇక సన ఆ చీరను చూసి మురిసిపోయింది. ఆ కలర్ తన దగ్గర లేదని చెప్పింది. ఇక వాళ్ళ అపార్ట్మెంట్ లో పెట్టిన షాపింగ్ మాల్ ని అందరూ చూసారు. అలాగే గంటలతో తయారు చేసిన వినాయకుడిని కూడా చూపించింది సన. ఇక సన ఇంటికి చాలా మంది చుట్టాలు వచ్చి రకరకాల వంటలు చేశారు..ఇక కోడలు సమీరా, కూతురు తబుస్సామ్ ఇద్దరూ తిని చూపించారు. అలాగే చీటికీ మాటికీ అత్తగారు సనతో గోడపాడుతూనే ఉంది కోడలు సమీరా.  అలాగే కూతురు, కోడలు చానెల్స్ ని సబ్స్క్రయిబ్ చేసుకోమని తన ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకుంది సన..సనా కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. సనాకి హీరోయిన్ గా  అవకాశాలు వచ్చాయి. కానీ అక్కడ  పరిస్థితులు  నచ్చక, అలాగే  హీరోయిన్ కావాలంటే స్విమ్ సూట్ లో కనిపించాలి, బాగా ఎక్స్ పోజ్ చేయాలి అనేసరికి ఆ ఆఫర్స్ ని వదులుకుంది సన. ఆమె  `మెట్రో క‌థ‌లు` వెబ్ సిరీస్ లో రొమాంటిక్ రోల్ లో కనిపించేసరికి అందరూ షాకైపోయారు. స‌హ న‌టుడు అలీ రెజాతో కలిసి రొమాంటిక్ సీన్స్ లో  యాక్ట్ చేసి తన ఫాన్స్ కి షాకిచ్చారు.    

సీరియల్ బ్యాచ్ వర్సెస్ శివాజీ... రైతుబిడ్డని‌ తిట్టిన అమర్ దీప్!  

బిగ్ బాస్ హౌజ్ లో సీరియల్ బ్యాచ్ చేసే పనులతో మిగిలిన కంటెస్టెంట్స్ కి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది.  శోభా శెట్టి, ఆట సందీప్, ప్రియాంక జైన్, అమర్ దీప్ మాట్లాడిన విధానం చూస్తుంటే వాళ్ళంతా కలిసి శివాజీని టార్గెట్ చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అయితే శివాజీ లాజిక్ గా వ్యాలిడ్ పాయింట్లు మాట్లాడేసరికి ఒక్కొక్కరికి దిమ్మతిరిగిందనే చెప్పాలి. అసలేం జరిగిందంటే బజర్ టాస్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదని ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ బజర్ దగ్గర ఉండి తింటున్నారు. అయితే వాళ్ళు అలా తినడం చూసిన ఆట సందీప్.. ఏంటి వాళ్ళు అక్కడ తింటున్నారని ప్రియాంక జైన్ ని అడుగగా.. ఇప్పటికీ ఆరు చపాతీలు తిన్నాడని చెప్తుంది. ఇక శుభశ్రీ ఆమ్లెట్ కూడా తిన్నాడని చెప్తుంది. ఇక అప్పుడే పల్లవి ప్రశాంత్ అన్నం తీసుకొని వెళ్ళగా యావర్ తింటున్నాడు. అది చూసి ఆట సందీప్ .. అసలేంటి వీడు, ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నాడేంటని అన్నాడు. ఇక అప్పుడే శివాజీ వచ్చి రెండు చపాతీలు ఇవ్వండని యావర్ కోసమని అడిగితే.. ఇది చాలా అన్ ఫేర్ అన్న, ఇప్పుటికే వాడు ఆరు చపాతీలు తిన్నాడు, ఎగ్స్ తిన్నాడు.. ఇప్పుడు మీరొచ్చి మళ్ళీ రెండు చపాతీలు తీసుకెళ్తున్నారంటూ గొడవకి దిగాడు.‌ ఇప్పుడేంటి తినకూడదా,‌ ఇలా తినే ఫుడ్ దగ్గర చేయడం బాగోదని అన్నాడు. అయినా సరే వినకుండా శోభా శెట్టి వితండవాదం చేసింది. జనాలు చూస్తున్నారని శివాజీ మాట్లాడగా.. అన్న మీరు కావలనే మమ్మల్ని నెగెటివ్ గా పోట్రేట్ చేస్తున్నారంటూ మాట్లాడింది. అమ్మ నువ్వు ఇక్కడికి చపాతీలు చేయడానికి రాలేదు. నువ్వు చేసేది జనాలు చూస్తున్నారంటూ శివాజీ మాస్ వార్నింగ్ ఇచ్చాడు.‌ ఇక ఆ తర్వాత అమర్ దీప్, ఆట సందీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి కలిసి సిగరెట్ తాగే ప్లేస్ లో కూర్చొని.. శివాజీ అన్న కావాలని ప్రిన్స్ యావర్ ని వెనకేసుకొస్తున్నాడంటూ మాట్లాడుకున్నారు. ఇప్పటి దాకా గ్రూప్ గా ఆడలేదు. ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తామంటూ అమర్ దీప్ చెప్పాడు. ఇక గ్లాస్ లో కన్నీళ్ళు నింపే టాస్క్ లో అమర్ దీప్ చీప్ మెంటాలిటి బయటపడింది. అక్కడ అమర్ దీప్, గౌతమ్ కృష్ణ కలిసి ఏదో విధంగా కన్నీళ్ళు నింపాలని నిమ్మకాయ, ఉల్లిపాయలు కళ్ళలో పిండుకొని కన్నీళ్ళతో గ్లాస్ లో పోస్తున్నారు. ఇక అప్పుడే బిగ్ బాస్ ఏదో విధంగా కాదు ఏడ్చి లేదా నవ్వితే వచ్చిన కన్నీళ్ళతో గ్లాస్ నింపాలని బిగ్ బాస్ చెప్తాడు. అయితే అప్పటికే తన కన్నీళ్ళతో సగం గ్లాస్ నింపిన ప్రశాంత్.. అవును అన్న నా గ్లాస్ లోని కన్నీళ్ళు కూడా పడబోసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తానని అనగానే అమర్ దీప్ విని.. రేయ్ నువ్వు అంతగా నటించకురా, నీ బతుకేంత, నువ్వెంత నాకు తెలుసు. బయట నీ వీడియోలు చూస్తేనే తెలుస్తుందంటు చీప్ గా హేళన చేస్తూ మాట్లాడాడు. అయితే బిగ్ బాస్ మేకర్స్ కావాలని దీన్ని టీవీలో ప్రసారం చేయకుండా ఎడిటింగ్ లో తీసేశారు. ఇలాగే ప్రతీసారీ అమర్ దీప్ కి ఫేవర్ గా ఫుటేజ్ కి ప్లే చేస్తున్నారంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే అమర్ దీప్ మెంటాలిటి చూసిన నెటిజన్లు.. ఒక్కసారి నామినేషన్లోకి వస్తే ఇక బ్యాగ్ సర్దుకోవాల్సిందేనంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సీరియల్ బ్యాచ్ చేసే పాలిటిక్స్ కి సిన్సియర్ గా గేమ్ ఆడే మిగతా కంటెస్టెంట్స్ ఎన్ని రోజులు బలి అవుతారో ఏమో చూడాలి మరి!  

నాల్గవ హౌజ్ మేట్ ఫైనల్ రేసులో ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్!

బిగ్ బాస్ సీజన్-7 లో రోజు రోజుకి అంచనాలు తారుమారవుతున్నాయి. ఏదీ ఊరికే రాదు. లక్, హార్డ్ వర్క్ ఉంటే సరిపోతుందని అనుకునే  వాళ్ళకి ఈ షో.. అల్టిమేట్ ట్విస్ట్ లని అందిస్తుంది. అదేలా అంటే ఈ షోలో మొదటగా పద్నాలుగు మంది కంటెస్టెంట్ వచ్చారు. అందులో మొదటివారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయింది. రెండవ వారం షకీల, మూడవ వారం దామిణి అయింది. నాల్గవ వారం మొత్తం ఆరుగురు నామినేషన్లో‌ ఉన్నారు. వీళ్ళలో ఎవరు బయటకు వెళ్తారనే ఆసక్తి అందరిలో‌ నెలకొంది. గురువారం జరిగిన ఎపిసోడ్‌లో  బజర్ ని ఎవరు ఫస్ట్ ప్రెస్ చేస్తారో వారికే కంటెండర్ కోసం పోటీపడే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో అందరు కంటెస్టెంట్స్ పోటీలో పాల్గొనగా అమర్ దీప్ మొదటగా బజర్ ప్రెస్ చేశాడు. దాంతో అతనికి సపోర్ట్ గా పల్లవి ప్రశాంత్ ని ఎన్నుకున్నాడు యావర్. ఇక పోటీలో వారికి ప్రత్యర్థులుగా అమర్ దీప్, గౌతమ్ కృష్ణలని ఎన్నుకున్నాడు యావర్. 'గ్లాస్ ఈజ్ షార్డ్ ఫిల్ ఇట్ ఫాస్ట్' అనే టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్.‌ ఇదేంటంటే ఇచ్చిన గ్లాస్ లో తమ‌ కన్నీళ్ళతో‌ ఆ గ్లాస్ ని నింపాలి. ఎవరైతే ఫస్ట్ ఆ గ్లాస్ నింపుతారో వాళ్ళే విజేతలని బిగ్ బాస్ ప్రకటించగా.. ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ ‌మొదడ కన్నీళ్ళని గ్లాస్ లో నింపి విజేతలుగా నిలిచారు. దాంతో అమర్ దీప్, గౌతమ్ కృష్ణల దగ్గరున్న బిబి కాయిన్స్ యావర్, ప్రశాంత్ లకి లభించాయి. అలా నాల్గవ హౌజ్ మేట్ కోసం జరిగే పోటీకి యావర్, పల్లవి ప్రశాంత్ అర్హత సాధించారు. అయితే ఇప్పటి దాకా సీరియల్ బ్యాచ్ అమర్ దీప్, శోభా శెట్టి,‌ ప్రియాంక జైన్ కలిసి ఆడేవారు.‌ ఇప్పుడు యావర్ సంఛాలక్ గా పూర్తిగా విఫలమయ్యాడు. ఈ సారి కూడా నాగార్జున ‌శోభా శెట్టి, ఆట సందీప్ ల బ్యాటరీ తగ్గించే అవకాశం ఉంది. ఎందుకంటే బజర్ మొదట అమర్ దీప్ ప్రెస్ చేశాడని ఆట సందీప్, శోభా శెట్టి వాదించారు. లేదని శివాజీ ఎంత చెప్పిన వినలేదు. అయితే మొదట పల్లవి ప్రశాంత్ వచ్చి బజర్ ప్రెస్ చేశాడా లేక అమర్ దీప్ ప్రెస్ చేశాడా అనేది తెలియాలంటే వీకెండ్ లో నాగార్జున వచ్చి.. టీవీలో ప్లే చేస్తేనే తెలుస్తుంది. అయితే రోజు రోజుకి సీరియల్ బ్యాచ్ చుట్టు ఉంటున్న ఆట సందీప్ వాళ్ళలో కలిసిపోయి కావాలని యావర్, పల్లవి ప్రశాంత్, శివాజీలని టార్గెట్ చేస్తున్నాడు. ఇక వీకెండ్ లో ఈ సీరియల్ బ్యాచ్ కి గట్టిగానే క్లాస్ పడేలా ఉంది. చూడాలి మరి నాల్గవ హౌజ్ మేట్ గా ఎవరు ఎంపిక అవుతారో చూడాలి మరి.  

బోల్డ్ ఫోటోలతో రెచ్చిపోతున్న ప్రేమ ఎంత మధురం అను!

బుల్లితెరపై టీవీ సీరియల్స్ కి ఉండె క్రేజ్ అంతా ఇంత కాదు. తెలుగు రాష్ట్రాలలో స్టార్ మా టీవీ, జీ తెలుగు సీరియల్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఇందులో బ్రహ్మముడి, త్రినయని, గృహలక్ష్మి, కృష్ణ ముకుంద మురారి సీరియల్స్ టాప్ లో ఉండగా.. ప్రేమ ఎంత మధురం టాప్-10 లో ఉంది. ప్రేమ ఎంత మధురం సీరియల్ లో అను, ఆర్యవర్థన్ ల ఆన్ స్క్రీన్ మీద చేసే నటనకి ఫ్యాన్స్ చాలానే ఉన్నారు. 'ప్రేమ ఎంత మధురం' .. జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్. ఇందులో శ్రీరామ్ వెంకట్ మరియు వర్ష హెచ్ కె నటించారు. ఇది మరాఠీ టీవీ సిరీస్ 'తులా పహతే రే' యొక్క అధికారిక రీమేక్ . ఈ సీరియల్  10 ఫిబ్రవరి 2020 న మొదలైంది. సాయి వెంకట్ దర్శకత్వం వహిస్తున్న 'ప్రేమ ఎంత మధురం' సీరియల్ కి శ్రీరామ్ వెంకట్ నిర్మాతగా చేస్తున్నాడు.   ఈ సీరియల్ కథ విషయానికొస్తే.. టికెఆర్ కళాశాల ఆర్యవర్ధన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు తన కారుకు జరిమానా విధించినందున అతను కళాశాలకు సైకిల్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దురదృష్టవశాత్తు, అతని సైకిల్ పంక్చర్ అయింది, కాబట్టి అతను ఆటోలో  కాలేజీకి వెళ్తాడు. ఆ ప్రయాణంలో కాలేజీ ఫంక్షన్‌లో తనకు స్వాగతం పలికేందుకు స్పీచ్‌ని సిద్ధం చేస్తున్న అనును కలుస్తాడు. రెండు రూపాయలకు కూడా విలువ ఇచ్చే ఆమె తత్వానికి అతను ముగ్ధుడవుతాడు. ఆర్య వర్ధన్ ఈ ఫిలాసఫీని ఉపయోగించి 10rs రీఛార్జ్ కార్డ్ ధరను 8rs కి తగ్గించాడు. ఇది  వర్ధన్ కంపెనీకి భారీ లాభాన్ని అందించింది. దాంతో అతను అనుకు తన కంపెనీలో ఉద్యోగం కూడా ఇచ్చాడు. అలా ఒకే కంపెనీలో ఉండేసరికి వారిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే అను తల్లి తన మేనల్లుడు సంపత్‌ని పెళ్లి చేసుకునేందుకు అనును ఒప్పించాలని ఆర్య వర్ధన్‌ని కోరింది. ఆర్య వర్ధన్ సంపత్‌ని పెళ్లి చేసుకోమని అడుగగా.. అను గుండె ముక్కలైనంత పని అయింది. అను సంపత్‌తో పెళ్లికి అంగీకరిస్తుంది. తరువాత, సంపత్ తండ్రి రఘుపతి తన కంపెనీతో వ్యాపార సంబంధాల కోసం వివాహాన్ని ఉపయోగించుకుంటున్నాడని ఆర్య వర్ధన్ తెలుసుకుంటాడు. అతను రఘుపతి యొక్క నిజమైన ఉద్దేశ్యాన్ని అను కుటుంబానికి తెలిసేలా చేస్తాడు. దాంతో అను పెళ్ళి ఆగిపోతుంది. అతని కంపెనీకి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన జెండే ఆర్య వర్ధన్ కి ప్రాణస్నేహితుడు. అతని పతనానికి అను కారణం కావచ్చని అనుకొని తనకి ఆర్యవర్థన్ ని దూరంగా ఉండమని హెచ్చరిస్తాడు. కాబట్టి ఆర్య వర్ధన్ అనును వైజాగ్‌కు బదిలీ చేయాలని నిర్ణయించుకున్నాడు కానీ అతను అను పట్ల తనకున్న భావాలను గ్రహించి తన మనసు మార్చుకుంటాడు‌. మరియు ఆమెను తిరిగి హైదరాబాద్‌కు తీసుకువచ్చాడు. అలా ఈ కథ ముందుకి సాగుతుంది. ఆర్య వర్ధన్, అనుల లవ్ స్టోరీకి ఇప్పటికే ఈ సీరియల్  అభిమానులు ఫిధా అయ్యారు.అను, ఆర్య వర్ధన్ లకి ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ క్రేజ్ ఉంది. అను అలియాస్ హర్ష వికే తాజాగా థాయ్ లాండ్ కి వెకేషన్ కి వెళ్లింది. అక్కడ దిగిన కొన్ని ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అయితే అందులో కొన్ని బోల్డ్ గా ఉన్నాయి. సీరియల్ లో సంప్రదాయబద్ధంగా కన్పించే ఈ అను.. బయట హర్షగా తన పర్సనల్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేసింది. తనకి ఖాళీ ఉన్న టైమ్ లో ఫ్రెండ్స్ తో వెకేషన్స్ కి వెళ్తూ సరదాగా గడుపుతుంది.  

జగతిని అమ్మ అని పిలవాలని రిషి తపన.. శైలేంద్ర గురించి నిజం తెలుస్తుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'.ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -880 లో.. వసుధార దగ్గరికి శైలేంద్ర వచ్చి.. వసుధారకి కోపం వచ్చేలా మాట్లాడతాడు. నీ నిజస్వరూపం ఇంక బయటపెట్టడం లేదని దాన్ని అలుసుగా తీసుకోవడం మంచిది కాదని వసుధార అంటుంది. అప్పుడే వాళ్ళిద్దరి దగ్గరికి రిషి వస్తాడు. ఇక్కడేం చేస్తున్నారని రిషి అడుగుతాడు. అది ఎలా జరిగిందని అడుగుతున్నానని, నీకేం కాలేదు కదా రిషి అని శైలేంద్ర యాక్టింగ్ చేస్తాడు. ఆ తర్వాత వసుధార ఏదో చెప్పబోతుంటే.. రిషి ఆపి పదండి అక్కడికి వెళదామని అంటాడు. మరొకవైపు రిషికి నిజం చెప్పాలని ఒక లెటర్ లో జరిగిందంత జగతి రాసి రిషి చేస్తున్న కాలేజీకీ పోస్ట్ చేస్తుంది. అలా పోస్ట్ చేసిన  ఆ లెటర్ కాలేజీ లోకి వస్తుంది. అటెండర్ తీసుకొని వచ్చి లెటర్ ని ప్రిన్సిపల్ కి ఇవ్వగా  రిషి వచ్చాక ఇద్దామని ఓపెన్ చెయ్యకుండా తన టేబుల్ దగ్గర పెడతాడు. మరొకవైపు దేవయాని భుజాలపై రిషి పడుకొని.. జగతి పట్ల తను ప్రవర్తించిన తీరుని గుర్తుచేసుకొని బాధపడతాడు. నా కన్నతల్లి అన్న విషయం మర్చిపోయి చాలా బాధపెట్టానంటూ రిషి ఎమోషనల్ అవుతుంటాడు. నా తల్లికి ఏం కాదు కదా పెద్దమ్మ అని రిషి ఎమోషనల్ గా అడుగుతుంటే.. అందరు ఎమోషనల్ అవుతారు. లోపల జగతి చెడు కోరుకుంటూ బయటకు జగతికి ఏం కాదంటూ రిషికి దేవయాని  దైర్యం చెప్తుంది. ఏం ఇచ్చి నా తల్లి ఋణం తీర్చుకోవాలని రిషి అంటాడు. ఆ తర్వాత అసలు ఇదంతా ఎవరు చేశారని మహేంద్రని ఫణీంద్ర అడుగుతాడు. మహేంద్ర చెప్పకుండా శైలేంద్ర డైవర్ట్ చేస్తాడు. ఆ తర్వాత పోలీసులు హాస్పిటల్ దగ్గరికి వచ్చి రిషితో మాట్లాడతారు. సీసీ టీవీ  ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నామంటూ SI చెప్తాడు. ఆ తర్వాత శైలేంద్రకి రౌడీ ఫోన్ చేసి డబ్బులు కావాలని అడుగుతాడు. సరే నేనే వచ్చి డబ్బులు ఇస్తానని కోపంగా రౌడీతో మాట్లాడతాడు శైలేంద్ర. ఆ తర్వాత వసుధారతో రిషి తన మనసులో జగతి పట్ల ఉన్న ప్రేమని చెప్తాడు. ఇన్ని రోజులు అమ్మ అని పిలవలేదు కానీ ఇప్పుడు స్పృహలోకి‌ వస్తే,  వచ్చినప్పటి నుండి నా జీవితం మొత్తం అమ్మ అనే పిలుస్తానంటూ రిషి ఎమోషనల్ గా వసుధారతో చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

స్వప్నని కాపాడటానికి కనకం ఏం చేయనుంది?

స్టార్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -213 లో.. కావ్య వేసే ప్రశ్నలకు రాహుల్ కన్ఫ్యూస్ అవుతుంటే.. ఎక్కడ నిజం తెలిసిపోతుందోనని రుద్రాణి కావ్యని డైవర్ట్ చెయ్యడానికి ప్రయత్నిస్తుంది. కానీ కావ్య మాత్రం మా అక్క ఎక్కడ అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తునే ఉంటుంది. మరొక వైపు మైఖేల్ మార్కెట్ కి వస్తాడు. అప్పుడే రాహుల్ ఫోన్ చేసి స్వప్న గురించి అడుగుతాడు. స్వప్నని చంపేసేమని మైఖేల్ చెప్పగానే రాహుల్ సంతోషపడతాడు. కానీ మైఖేల్ స్వప్నని చంపాలని అనుకోడు. పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. మరొకవైపు కనకం కూరగాయలు కొంటు ఉంటుంది. అప్పుడే మైఖేల్ వచ్చి పెళ్లికి దండలు కొనడానికి కనకం హెల్ప్ తీసుకుంటాడు. ఆ తర్వాత నాకు పెళ్లి. నా కాబోయే భార్యని చూడండంటూ కనకంని మైఖేల్ ఇబ్బంది పెడతాడు. కాసేపటికి స్వప్న ఫోటోని మైఖేల్ చూపించగానే.. కనకం చూసి షాక్ అవుతుంది. అక్కడ నుండి మైఖేల్ వాళ్ళు వెళ్ళిపోతారు. మరొక వైపు రాహుల్ ని కొట్టి స్వప్నని తీసుకొని వెళ్లిన వారి గురించి కనుక్కోవడానికి పోలీసులు వస్తారు. ఆ తర్వాత స్వప్న కనిపించడం లేదని కావ్య బాధపడుతుంటే రాజ్ ఓదారుస్తాడు. అప్పుడే కావ్యకి కనకం ఫోన్ చేసి.. స్వప్న ఎక్కడ ఉందని అడిగేసరికి.. కావ్య చెప్పలేకపోతుంది. దాంతో కనకంతో స్వప్నని ఎవరో కిడ్నాప్ చేశారని రాజ్ చెప్పగానే.. కనకం షాక్ అవుతుంది.‌ వెంటనే ఫోన్ కట్ చేస్తుంది కనకం. ఆ తర్వాత కనకం ఆలోచిస్తుంటుంది. అంటే ఇందాక వచ్చిన వాళ్ళు నిజంగానే స్వప్నని కిడ్నాప్ చేశారా?  నా కూతురిని ఎలా కాపాడుకోవాలని అనుకొని వాళ్ళు తన దగ్గర ఉన్నప్పుడు ఎవరితనో ఫోన్ మాట్లాడుతు అడ్రస్ గురించి మాట్లాడడం గుర్తుచేసుకుంటుంది. మరొక వైపు మైఖేల్ వాళ్ళు పూజారి దగ్గరికి వస్తారు.‌ ఎందుకు అన్న పూజారి.. పోయినసారి కూడా పూజారి వల్లే స్వప్నతో పెళ్లి ఆగిపోయిందని మైఖేల్ దగ్గరున్న అసిస్టెంట్ అంటాడు. నేను సెంటిమెంట్ బాగా ఫాలో అవుతానని తెలుసుకదా అని మైఖేల్ అంటాడు. మరొకవైపు  అక్కడ పూజారిలా రెడీ అయి కనకం ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

కృష్ణ ముకుందల మధ్య ఛాలెంజ్ లో గెలుపెవరిది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -274 లో.. భవానికి తన ప్రేమ విషయం చెప్పాలని  అనుకుంటుంది ముకుంద. ఆదర్శ్ గురించి ఏదో చెప్పబోతుండగా, ఎక్కడ భవానికి ముకుంద తన ప్రేమ విషయం చెప్పేస్తుందోనని కృష్ణ భవాని గదిలోకి వస్తుంది. ముకుందని చెప్పనీయకుండా డైవర్ట్ చేస్తుంది. పెద్ద అత్తయ్యను డిస్టబ్ చేస్తున్నావ్ పడుకోనివ్వంటు కృష్ణ అంటుంది. పదా మనం కబుర్లు చెప్పుకుందామంటూ ముకుందని కృష్ణ బయటకి తీసుకొని వస్తుంది.  ఆ తర్వాత కృష్ణ, ముకుంద ఇద్దరు మాట్లాడుకుంటారు. నేను ఆదర్శ్ ని తేవాలని అనుకుంటున్నాను, తెస్తాను. నేను అనుకున్నది సాధిస్తాను. నువ్వు అనవసరమైన దాని గురించి టెన్షన్ పడకంటు ముకుందకి కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత కృష్ణ మాటల్లో ముకుంద తన ప్రేమ విషయం తెలిసిందిమని అర్థం అవుతుంది. ఇక డైరక్ట్ మ్యాటర్ లోకి వచ్చేస్తుంది ముకుంద‌. నేను మురారిని ప్రేమించాను తప్పనిసరి పరిస్థితులలో ఇద్దరం వేరు వేరు పెళ్లిళ్లు చేసుకున్నామని కృష్ణతో ముకుంద అంటుంది. పరాయి మగాడి మీద ఇష్టాన్ని పెంచుకోనే ఆడదాన్ని ఏం అంటారో నాకు తెలియదని కృష్ణ అంటుంది. మురారి మనసులో నాకు స్థానం ఉంది. అది ఒక్కప్పుడా, ఇప్పుడా అనేది ముఖ్యం కాదు. మరి మురారి మనసులో నీకు స్థానం ఉందా అని ముకుంద అడుగుతుంది. అప్పుడు కృష్ణ తన మెడలో మురారి కట్టిన తాళిని చూపిస్తూ ఇది ఉందని అంటుంది. మాది భార్యభర్తల బంధమని కృష్ణ అంటుంది. ఆ తర్వాత కృష్ణ ముకుంద ఇద్దరు అనుకున్నది నెరవేర్చుకుంటానంటు ఇద్దరు ఛాలెంజ్ విసురుకుంటారు. ఆ తర్వాత కృష్ణ పడుకున్న  మురారిని చూస్తుంటుంది. మురారి మనసులో ముకుంద లేదు. నాకు సంతోషం కానీ ఏసీపీ సర్ మనసులో నా మీద ప్రేమని చెప్పేలా చేసుకోవాలని కృష్ణ అనుకుంటుంది. కృష్ణ తల తుడ్చుకుంటుంటే మురారి చూసి.. అలా కాదంటు కృష్ణ తల తుడుస్తాడు మురారి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ముంబై హోటల్‌లో బిగ్ బాస్  ప్రియాంక బోల్డ్ లుక్!

జబర్దస్త్ ద్వారా ఫేమ్ సంపాదించిన ప్రియాంక సింగ్ అలియాస్ సాయితేజ.. బిగ్ బాస్ -5 లో ఛాన్స్ కొట్టేసింది. జబర్దస్త్ కి ముందు నుంచే ఆమె ట్రాన్స్ జెండర్.. కాగా సొసైటీలో ట్రాన్స్ జెండర్ పై చిన్న చూపు అంటూ ఆమె చాలా సందర్భాలలో చెప్పుకొచ్చింది. అయితే తన ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా ప్రియాంక సింగ్ ఇండస్ట్రీకి వచ్చింది. బిగ్ బాస్- 5 లో అవకాశం రావడంతో ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది. అయితే తన బాడీని ఒక అమ్మాయిలాగా మేకోవర్ చేపించుకొని, హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోని అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ప్రియాంక సింగ్. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో బిగ్ బాస్ ప్రేక్షకులకు మరింత చేరువైన తను.. బిగ్ బాస్ లో తన హౌస్ మేట్ అయిన మానస్ తో సన్నిహితంగా ఉండేది. బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక పలు టీవీ షోస్ లో మెరిసిన ప్రియాంక సింగ్.. చేసే ప్రతి పనిని వ్లాగ్ చేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో, యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తుంటుంది. అలా తను సమాజంలో ట్రాన్స్ జెండర్స్ మీద ఉన్న చులక‌న భావాన్ని కాదని.. ఒక్కతే బ్రతికి చూపిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. చాలా మంది ఆమెని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు. ప్రియాంక సింగ్ మొదట్లో సింప్లిసిటీకి కేరాఫ్ గా ఉండేది. ఆమధ్య బోల్డ్ ఫొటోస్ పెట్టి నెగెటివ్ కామెంట్స్ ని తెచ్చిపెట్టుకుంది. ప్రియాంక ఈ మధ్యే "సమ్మోహనుడా" పాటకి హాట్ డాన్స్ చేసింది‌. ప్రియాంక పక్కన ఒక అతను డాన్స్ చేశాడు. అతని మొహం మాత్రం కనిపించకుండా చూసేవాళ్ళకి ఎవరతను అనే క్యూరియసిటి పెంచింది. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మానస్ ని తన క్రష్ గా చెప్పిన ప్రియాంక.. హౌస్ లో ఉన్నన్ని రోజులు తన వెంటే తిరిగేది. అయితే ఈ సమ్మోహనుడా పాటలో ప్రియాంకతో కలిసి డాన్స్ చేసింది మానస్ అని కొందరు నెటిజన్లు అన్నారు. అయితే మానస్ కి రీసెంట్ గా ఎంగేజ్ మెంట్ అయిన విషయం తెలిసిందే. అయితే ప్రియాంక ఇప్పుడు ఒక షూట్ కోసం ముంబై వెళ్ళింది. అక్కడ తను బోల్డ్ లుక్ లో కన్పించింది. థైస్ చూపిస్తూ‌ తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

అక్కడ శిల్పశెట్టి... ఇక్కడ రీతూ చౌదరి!

ఆలీతో ఆల్ ఇన్ వన్ ఈ వారం షో మంచి ఫన్నీగా సాగింది. ఈ షోకి రీతూ చౌదరి, జెస్సి, స్రవంతి  వచ్చారు. ఇక ఈ షోలో ఆలీ రీతూని తెగ పొగిడేశారు. స్టేజి మీదకు రాగానే రీతుతో కలిసి ఆలీ డాన్స్ చేశారు. "మీ నేటివ్ ఎక్కడ" అని అడిగేసరికి "ఖమ్మం.. ఆంధ్ర తెలంగాణ బోర్డర్. అందుకే నేను అక్కడ, ఇక్కడా ఉంటాను" అని చెప్పింది. "నీ గొంతు  బాగుందని ఎవరైనా చెప్పారా" అని అడిగేసరికి "నా గొంతుకు చాలామంది ఫాన్స్ ఉన్నారు ఎం  మీకు  నా గొంతు  నచ్చలేదా " అని అడిగింది  "ఎందుకు  బాలేదు , అద్భుతం  నాకు తెలిసి  హిందీ స్టార్స్ లో  శిల్పశెట్టికి  ఈ గొంతు  ఉంది ఇక్కడేమో రీతూకి ఉంది" అని తెగ బిల్డప్  ఇచ్చారు. తర్వాత జెస్సి ఎంట్రీ ఇచ్చాడు "నువ్వు ఇండస్ట్రీకి రావడానికి ఎవరు ఇన్స్పిరేషన్" అని అడిగారు "పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్..ఆయన్ని చూసే మార్షల్ ఆర్ట్స్ నేను మూడేళ్లు నేర్చుకున్నా. రెడ్ బెల్ట్ వరకు వచ్చి ఆగిపోయాను తర్వాత నాంచాక్ తిప్పడం వంటివన్నీ ప్రాక్టీస్ చేశాను" అని చెప్పాడు. తర్వాత స్రవంతి ఎంట్రీ ఇచ్చింది.."నీకు ఇండస్ట్రీలోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు" అనేసరికి "అనసూయ యాంకరింగ్  అంటే ఇష్టం..ఆమెను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను. అలాగే నాది లవ్ మ్యారేజ్ మా ఆయన నేను పవన్ కళ్యాణ్ ఫాన్స్...అందుకే మా బాబుకు కూడా అకీరానందన్  అని పేరు  పెట్టుకున్నా " అని చెప్పింది. ఇలా ఈ ముగ్గురితో గేమ్స్ ఆడించాడు ఆలీ. ఇక ఈ ముగ్గురు కూడా సోషల్ మీడియాలో ఫుల్ అప్ డేట్ గా ఉంటారు. రీల్స్ తో వాళ్ళ వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ లో ఫాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు.

షాకింగ్ ఓటింగ్స్... ప్రియాంక ఎలిమినేషన్ పక్కా!

బిగ్ బాస్ హౌజ్ లో ఒక్కో కంటెస్టెంట్ పర్ఫామెన్స్ ని బట్టి నామినేషన్లో ఉన్నవారికి ప్రేక్షకులు ఓట్లు వేస్తున్నారు. మొదటి వారం నుండి యాక్టివ్ గా ఉంటూ ఒంటరి పోరాటం చేస్తున్న ప్రిన్స్ యావర్ కి ఓట్ల వర్షం కురుస్తుంది. ది బెస్ట్ గేమ్ ఛేంజర్ గతవారం ఎక్కువ బ్యాడ్జ్ లు తీసుకున్నాడు ప్రిన్స్ యావర్‌. అత్యధిక ఓటింగ్ తో మొదటి స్థానంలో ఉన్నాడు యావర్. రెండవ స్థానంలో శుభశ్రీ రాయగురు ఉంది. చివరి స్థానంలో ప్రియాంక జైన్ ఉంది. నెగెటివ్ మాటలతో అందరి ముందు బ్యాడ్ అయింది ప్రియాంక జైన్. గతవారం హోస్ట్ నాగార్జున అందరి ముందు ప్రియాంక జైన్ ని.. ఒపినీయన్ మార్చుకోవచ్చా అని ఎందుకు రిక్వెస్ట్ చేశావని అడుగుతాడు. దానికి ప్రియాంక జైన్ చెప్పిన సిల్లీ రీజన్ సరిపోలేదు. తను యాక్టింగ్ చేస్తుందని, మోసం చేసి గెలవాలనుకుందని, మాస్క్ వేసుకుందని స్పష్టంగా తెలుస్తుంది. దీంతో తనకి నెగెటివిటి పెరిగింది. ఓట్లు భారీగా తగ్గాయి. ఇక హౌజ్ లో కంటెంట్ కోసం రోజు రోజుకి దిగజారుతున్న రతిక కూడా ప్రియాంక జైన్ కంటే స్వల్ప తేడాలో ఉంది. అయితే సీరియల్ బ్యాచ్ లోని అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి, ఆట సందీప్ అంత కలిసి ఆడుతున్నారని స్పష్టంగా తెలుస్తుంది. నిన్నటి బిబి కాయిన్స్ టాస్క్ లో ప్రియాంక జైన్ కి అత్యధిక బిబి కాయిన్స్ ఇచ్చింది శోభా శెట్టి. అయితే శోభా శెట్టి దగ్గరికి పల్లవి ప్రశాంత్  వచ్చి ఎంతో రిక్వెస్ట్ చేస్తే.. అయిదు కాయిన్లు ఇచ్చింది. మరి ఇన్నేనా అక్కా అని పల్లవి ప్రశాంత్ అంటే.. ఇచ్చినవాటికి కనీసం థాంక్స్ చెప్పకుండా ఇంతేనా అంటావా అని ఆ ఇచ్చిన అయిదు కాయిన్లు తీసుకుంది శోభా శెట్టి. ఇక అమర్ దీప్, టేస్టీ తేజలకి శోభా శెట్టి, ఆట సందీప్ ఎక్కువ కాయిన్లు ఇచ్చారు. దీన్ని బట్టి వీళ్ళ బ్యాచ్ లోని వారే గెలవాలని కావాలని చేస్తున్నారని బిగ్ బాస్ ప్రేక్షకులకు స్వష్టంగా తెలుస్తుంది. అయితే వీళ్ళ ప్రవర్తన కారణంగానే ప్రియాంక జైన్ కి స్వల్ప ఓట్లు పడుతున్నాయడంలో ఆశ్చర్యం లేదు. ప్రిన్స్ యావర్, శుభశ్రీ ఇద్దరు ఇండివిడ్యువల్ గేమ్ తో ఆకట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళ పర్ఫామెన్స్ కి ప్రేక్షకులు సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక రతిక ఏం చేసిన అది నెగెటివ్ గానే అవుతుంది. ప్రతీసారీ పల్లవి ప్రశాంత్ ని అడ్డుపెట్టుకొని కంటెంట్ కోసం చేస్తుందని ప్రేక్షకులకి ఇప్పటికే అర్థమైంది. మరి ఈ వారం నామినేషన్లో ఉన్న ఆరుగురిలో.. ఓటింగ్ లో ఫస్ట్ యావర్, చివరి స్థానంలో ప్రియాంక జైన్ ఉంది. ఓటింగ్ కి ఇంకా రెండు రోజులే ఉండటంతో, ఈ ఓటింగ్ ఇలాగే కొనసాగితే సీరియల్ బ్యాచ్ లోని   ప్రియాంక జైన్ అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందేనంటున్నారు నెటిజన్లు. ఈ సీజన్-7 ఉల్టా పల్టా థీమ్ తో ఆకట్టుకుంటున్న విషయం తెలసిందే. లాస్ట్ మినట్ లో కంటెంట్ కోసం తనని ఎలిమినేట్ కాకుండా ఆపేసిన ఆపేస్తారేమో చూడాలి.

బిగ్ బాస్ బ్యూటీకి పెళ్ళి అవసరం లేదంట!

శ్రీసత్య ఇప్పుడు సోషల్ మీడియా నీ షేక్ చేస్తున్న బ్యూటీ నిన్న మొన్నటి వరకు తమ బిబి ఫ్రెండ్స్ వాసంతి కృష్ణన్, గీతు రాయల్ తో కలిసి విదేశాలకి వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చింది. ఉన్నది ఒక్కటే జిందగి అంటూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ వస్తుంది ఈ అమ్మడు. తనని బిగ్ బాస్ సీజన్-6 లో 'బ్యూటీ క్వీన్' అని  చెప్తారు. మొన్న జరిగిన శ్రీసత్య పుట్టినరోజుని బిగ్ బాస్ స్నేహితులు అందరు కలిసి గ్రాంఢ్ గా సెలబ్రేట్ చేశారు‌. కంటెస్టెంట్స్ దాదాపుగా అందరు వచ్చి సందడి చేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అర్జున్ కళ్యాణ్ తో లవ్ ట్రాక్ నడిపిన శ్రీసత్య.. ఆ తర్వాత రేవంత్, శ్రీహాన్ లతో కలిసి స్నేహం పేరుతో గ్రూప్ గా ఆడింది. హౌజ్ లో ఫ్యామిలీ వీక్ ముందు వరకు శ్రీసత్య ఖచ్చితంగా వెళ్ళిపోతుందనుకున్నారంతా కానీ ఫ్యామిలీ వీక్ లో వాళ్ళ అమ్మనాన్న రావడంతో ఒక్కసారిగా అంచనాలు మారిపోయాయి. తనకున్న నెగెటివ్ టాక్ కాస్త అమ్మ సెంటిమెంట్ తో పాజిటివ్ అయిపోయింది. ఇక ఆ తర్వాత ఎక్కువ రోజులు ఉన్న శ్రీసత్య ఫైనల్ కి వారం ముందు ఎలిమినేట్ అయి బయటకి వచ్చింది.  ఆ తర్వాత బిబి జోడి డ్యాన్స్ షోలో శ్రీసత్యతో కలిసి మెహబూబ్ డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే మెహబూబ్ ఈ సెలబ్రేషన్స్ లో తన డ్యాన్స్ స్టెప్స్ తో ఫుల్ జోష్ గా కనిపించాడు. శ్రీసత్య కూడా చిందులు వేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ లో ఉన్న బ్యూటి శ్రీసత్య. శ్రీసత్య తన తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్ వాసంతిని ఎప్పుడు కలుస్తూనే ఉంటుంది. బిగ్ బాస్ సీజన్-6 లో  గ్లామర్  క్వీన్ గా బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీసత్య తన ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా ఫోటోలు, రీల్స్ తో బిజీగా ఉంటుంది. ఎప్పుడు తనకున్న ఫాలోయింగ్ ని పెంచుకుంటుంది. తాజాగా తను 'ఆస్క్ మీ క్వశ్చనింగ్' స్టార్ట్ చేసింది శ్రీసత్య. మీ ఫోన్ గ్యాలరీలోని ఫోటోని అప్లోడ్ చేయండని అడుగగా.. తన ఫోటోని అప్లోడ్ చేసింది శ్రీసత్య. మీ పెళ్ళి ఎప్పుడని ఒకతను అడుగగా..  ఇప్పట్లో పెళ్ళి చేసుకోనని, భవిష్యత్తులో కూడా పెళ్ళి చేసుకోనని శ్రీసత్య అంది. మీరు జీ తెలుగుకి ఎప్పుడు వస్తారని ఒకరు అడుగగా.. త్వరలోనే వస్తానని శ్రీసత్య అంది. బిబి హౌజ్ లో ఉన్నప్పుడు రాపోని మిస్ అయ్యారా అని అడుగగా.. అవునని చెప్పింది. మీ ఎక్స్ కి పెళ్ళి అయిందంట కదా ఎలా ఫీల్ అవుతున్నారని ఒకరు అడుగగా.. అవును ఫీల్ అవుతున్నాను, పాపం ఆ అమ్మాయి అని సానుభూతిని తెలియజేసింది శ్రీసత్య. విజయవాడలో మీ ఫేవరెట్ ఫుడ్ ఎక్కడ తిన్నారని ఒకతను అడుగగా.. విజయవాడలోని గాంధీనగర్ లో ఒక పంజాబీ దాబా ఉంటుంది. అందులో చికెన్ రోస్ట్ బాగుంటుందని శ్రీసత్య అంది. ఇలా తన అభిప్రాయలని ప్రేక్షకులకి పంచుకుంది ఈ బిగ్ బాస్ బ్యూటీ.

పాలల్లో మత్తు మందు కలిపిచ్చిన ముకుంద.. కృష్ణ పసిగడుతుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -273 లో.. దోమలను కొడుతున్న కృష్ణ దగ్గరికి మురారి వస్తాడు. తన చిన్న పిల్లల చేష్టలు చూసి నవ్వుకుంటాడు. బయట ముకుంద టార్చర్ చేస్తున్న నీ దగ్గరికి వచ్చేసరికి అవన్నీ మర్చిపోతానని మురారి తన మనసులో అనుకుంటాడు.  ఆ తర్వాత దోమలని ఎలా రాకుండా చెయ్యాలని మురారికి కృష్ణ పెద్ద ప్లానే చెప్తుంది. అది విన్న మురారి.. ఇందుకే కదా నిన్ను తింగరి పిల్ల అనేదని మురారి అంటాడు. ఆ తర్వాత నవ్వుతు దోమలు రాకుండా రీఫిల్ పెడితే చాలని కృష్ణకి చెప్తాడు. మరొక వైపు ముకుంద ఒంటరిగా మురారి గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. అలా బాధపడుతున్న ముకుంద దగ్గరికి అలేఖ్య వస్తుంది. నువ్వేనా ఇలా బాధపడేదని అడుగుతుంది. ముకుంద మౌనంగా ఉంటుంది. నీ ప్రేమని నువ్వు సాధించుకో అంటు ముకుందకి అలేఖ్య సలహా ఇస్తుంది. నా ప్రేమ మురారికి అర్థం కావడం లేదు, నా ప్రాణం పోయిన  మురారిని మాత్రం వదలనని ముకుంద అనగానే.. నీకు ఈ విషయంలో ఎలాంటి హెల్ప్ కావాలన్న చేస్తానని అలేఖ్య చెప్తుంది. మరొక వైపు మురారికి కృష్ణ కాఫీ తీసుకొని వస్తుంది. ఇందాక మధు అలేఖ్య ఇద్దరు కాఫీ ఎవరు ముందు తాగారని గొడవ పడ్డారని అనగానే.. కలికాలం పాతకాలం రోజుల్లో భార్యలు ఇలా ఉండేవారు అలా ఉండేవారని కృష్ణకి మురారి చెప్తాడు. ఆ తర్వాత నువ్వు కాఫీ తాగావా అని కృష్ణని మురారి అడుగుతాడు. మీరు తాగాక తాగుతానని చెప్పేసి కృష్ణ వెళ్ళిపోతుంది. ఈ కృష్ణ ఏంటో అసలు అర్థం కాదని మురారి అనుకుంటాడు.  మరొక వైపు భవానికి పాలు కలుపుకొని వెళ్లి అందులో మత్తుగా ఉండి నిద్రపోయేలా పాలలో ముకుంద ఏదో కలుపుతుంది. అలా భవాని నిద్ర పోయాక తన ఫోన్ లో ఉన్న కల్నల్ నెంబర్ ని డిలీట్ చెయ్యాలనుకుంటుంది ముకుంద. ఆ తర్వాత  ఈ పాలు తీసుకొని వెళ్లి భవాని అత్తయ్యకి ఇవ్వమని అలేఖ్యకి ముకుంద చెప్పగానే.. నాకు భయం. నేను వెళ్ళనని అలేఖ్య అంటుంది. దాంతో ముకుంద భవాని దగ్గరికి వెళ్లి పాలు ఇస్తుంది. భవాని పాలు తాగకుండా పక్కన పెట్టి ఏదో మాట్లాడాలని వచ్చినట్టు ఉన్నావ్ ఏంటని అడుగుతుంది. ఇక ఇదంతా వద్దు డైరెక్ట్ నిజం చెప్పేస్తానని ముకుంద అనుకుంటుంది. అదంత కృష్ణ భయట నుండి చూస్తూ నిజం చెప్పేస్తుందా ఏంటి అని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ‌

రవికాంత్‌పై క్రష్ ఉంది... స్వాతి పెళ్ళి చూపులు!

సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి ఈ వారం "మంత్ ఆఫ్ మధు" మూవీ టీమ్ ఎంట్రీ ఇచ్చింది. నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి వచ్చారు. రాగానే సుమ "నవీన్ చంద్రా ఎలా ఉన్నారు" అని సుమా అడిగేసరికి "తానెప్పుడూ జంటిల్మెన్నే" అని స్వాతి ఆన్సర్ ఇచ్చింది దానికి సుమ కౌంటర్ వేసి స్వాతిని ఇరికించింది. "నవీన్ జెంటిల్ మ్యాన్ ఐతే మన హీరో నాన్ని ఏమిటి" అనేసరికి స్వాతి షాకైపోయింది. తర్వాత ఒక గేమ్ ఆడించింది. అందులో "శీతాకాలం అనగానే మనకు గుర్తొచ్చేది  ఏమిటి" అని అడిగింది సుమ "దుప్పట్లు" అని చెప్పింది స్వాతి. ఐతే ఆ ఆన్సర్ రాంగ్ అయ్యేసరికి "దుప్పట్లు అనగానే అన్నీ వచ్చేస్తాయేమో అనుకున్నా" అంది స్వాతి ..దానికి సుమ "దుప్పట్లోకి అన్నీ రావు ఒకరిద్దరి వస్తారు" అని చెప్పింది సుమ. దానికి స్వాతి షాకైపోయింది. తర్వాత పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తుంది సుమ.."సుబ్బారావు పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయి..అతన్నే చేసుకుంటా" అని స్వాతి మొండి పట్టు పడుతుంది..దానికి సుమ "నేనెక్కడి నుంచి సుబ్బారావును తీసుకురాను" అంటుంది. ఆ తర్వాత షోలోకి రవికాంత్ వచ్చాడు. నవీన్ చంద్ర, రవికాంత్, మధు అలియాస్ స్వాతి ముగ్గురూ ఒక టీమ్ గా కనిపించేసరికి "ఇది మంత్ ఆఫ్ మధు ఫామిలీనా, బేబీ ఫామిలీనా" అర్ధం కావడం లేదు అని సుమ అనేసరికి "పాత కాలంలో తాతయ్యలకు ఇద్దరు అమ్మమ్మలు ఉండేవాళ్ళు కదా..నాకు ఇద్దరు తాతయ్యలు ఉన్నారు" అని స్వాతి కామెడీగా చెప్పేసరికి సుమ నవ్వేసింది. ఫైనల్ గా స్వాతి ఒక ట్విస్ట్ ఇచ్చింది "ఈటీవీలో అఫీషియల్ గా చెప్తోంది ఏంటంటే నాకు రవికాంత్ మీద క్రష్ ఉంది" అని చెప్పింది స్వాతి. దానికి రవికాంత్ తెగ సిగ్గుపడిపోయాడు.

బిబి కాయిన్స్ వేటలో కంటెస్టెంట్స్ దూకుడు.. గేమ్ ఛేంజర్ గా టేస్టీ తేజ!

బిగ్ బాస్ సీజన్-7 లో రోజు రోజుకి అంచనాలు తారుమారు అవుతున్నాయి. నిన్నటి దాకా నామినేషన్ల హీటెడ్ ఆర్గుమెంట్ లు టాక్ ఆఫ్ ది హౌజ్ గా ఉన్నాయి. నిన్నటి బుధవారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ గేమ్ లోకి వచ్చేశారు. ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకొని ఆట సందీప్, శివాజీ, శోభా శెట్టి ముగ్గురు హౌజ్ మేట్స్ గా కన్ఫమ్ అయ్యారు. ఇక నాల్గవ వారం పోటీ కోసం బిగ్‌బాస్ బిబి‌ కాయిన్స్ తో టాస్ మొదలుపెట్టాడు. హౌజ్ లో ఎవరి దగ్గర ఎక్కువ బిబి కాయిన్స్ ఉంటాయో వారికి నాల్గవ కంటెస్టెంట్ కోసం తర్వాతి లెవెల్ కి వెళ్ళడానికి అర్హులని బిగ్ బాస్ చెప్పాడు. ఆ తర్వాత శోభా శెట్టి, శివాజీ, ఆట సందీప్ కి కొన్ని బిబి కాయిన్స్ ఇచ్చాడు. అయితే అవి కంటెస్టెంట్స్ రిక్వెస్ట్ చేసుకొని తీసుకోవాలని కోరగా.. ఒక్కో కంటెస్టెంట్ ముగ్గురి దగ్గరికి వెళ్ళి వారిను రిక్వెస్ట్ చేసుకున్నారు. ఇక ఫస్డ్ టాస్క్ ముగిసే సరికి యావర్ లీడ్ లో ఉండగా తర్వాత స్థానంలో అమర్ దీప్ ఉన్నాడు.  కంటెస్టెంట్స్ లో ఎవరైతే ముందు వెళ్ళి బిబి ఏటీఎమ్ బజర్ ప్రెస్ చేస్తారో వారికే నాల్గవ కంటెస్టెంట్ ఆడటానికి అర్జులని, వారు మరొక కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. ఆ తర్వాత వారికి ప్రత్యర్థులను ఎన్నుకునే హక్కు కూడా బిగ్ బాస్ ఇచ్చాడు.  అయితే అమర్ దీప్ ఫస్ట్ బజర్ ప్రెస్ చేసినట్టుగా శోభాశెట్టి, ఆట సందీప్, శివాజీ చెప్పారు. ఇక అమర్ దీప్ తనకి సపోర్ట్ గా గౌతమ్ కృష్ణని తీసుకున్నాడు. వారికి ప్రత్యర్థులుగా రతిక, టేస్టీ తేజలని సెలెక్ట్ చేసుకున్నాడు అమర్ దీప్. టాస్క్ ఏంటంటే.. యాక్టివిటీ ఏరియాలో ఇసుక పోసి ఉంటుంది. ఆ ఇసుకని దాటి వెళ్ళి పసుపు రంగు గల స్కేర్ లో నిల్చొని ఫోటోకి ఫోజు ఇవ్వాలి. అది స్మైలీ. దాన్ని ఫోటోగ్రాఫర్ ని నిర్వహిస్తున్న శివాజీ క్యాప్చర్ చేస్తాడు. వీలైనన్ని ఎక్కువ స్మైలీ ఫోటోలని నవ్వుతూ దిగాలి. ఇందులో గౌతమ్ కృష్ణ, అమర్ దీప్  గెలిచారు. టేస్టీ తేజ, రతిక ఓడిపోవడంతో వారి దగ్గరున్న కాయిన్స్ అన్నీ అమర్ దీప్, గౌతమ్ కృష్ణల సొంతమయ్యాయి. ఈ టాస్క్ కి సంచాలకుడిగా శివాజీ ఉన్నాడు.

రాహుల్ ది యాక్టింగ్ అని కనిపెట్టేసిన కావ్య.. స్వప్నకి ప్రమాదం పొంచి ఉందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -212 లో.. రాహుల్ ప్లాన్ లో భాగంగా స్వప్నకి రింగ్ గిఫ్ట్ ఇస్తున్నానంటూ ప్రేమగా మాట్లాడతాడు. అప్పుడే స్వప్న వెనకాల నుండి మైఖేల్ వచ్చి స్వప్న తలకి గన్ పెడతాడు. మైఖేల్ వచ్చిన వాళ్ళు రాహుల్ తలపై కొడతారు. దాంతో రాహుల్ కిందపడిపోయినట్లు నటిస్తాడు. స్వప్నని మైఖేల్ కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత రాహుల్ లేచి.. ఇప్పుడు కదా అసలైన  కథ మొదలైందని అనుకుంటాడు.  మరొకవైపు కావ్య బట్టలు ఐరన్ చేస్తుండగా.. అందులో రాజ్ షర్ట్  బటన్ ఊడిపోతుంది. అది తెలియకుండా రాజ్ షర్ట్ వేసుకుంటాడు.  ఊడిపోయింది చూసిన కావ్య షర్ట్ వేసుకున్నాక బటన్ కుడుతుండగా.. రాజ్ ఇబ్బంది పడతాడు. మరొక వైపు రాజ్, కావ్య ఇద్దరు సంతోషంగా ఉండడం చూసిన ఇందిరాదేవి సంతోషపడుతు సీతారామయ్యకు చెప్తుంది. కావ్యని సంతోషంగా చూసుకుంటానని రాజ్ నాకు మాటిచ్చాడని ఇందిరాదేవీతో సీతరామయ్య చెప్తాడు. ఆ తర్వాత రాజ్ టిఫిన్ చెయ్యడానికి రెడీ అయి వస్తాడు. హాల్లో కూర్చొని ఉన్న సుభాష్ కి ఎవరో ఫోన్ చేసి రాహుల్ కీ దెబ్బలు తగిలి హాస్పిటల్ లో ఉన్నాడని చెప్పగానే అందరు కంగారు పడతారు.. రుద్రాణికి ప్లాన్ ముందే తెలుసు కానీ తన నటన మొదలుపెడుతుంది. రుద్రాణి, కావ్య,సుభాష్, రాజ్ లు హాస్పిటల్ కి వెళ్తారు. మరొక వైపు స్వప్నని కిడ్నాప్ చేసిన మైఖేల్ తనని ఒక రూమ్ లో బంధిస్తాడు. నా రాహుల్ మిమ్మల్ని వదిలిపెట్టడంటూ స్వప్న అంటుంది. ఒక్క దెబ్బకే పడిపోయిన వాడు నన్నేం చేస్తాడు. నన్ను పెళ్లి చేసుకోమని స్వప్నతో మైఖేల్ చెప్తాడు. మరొక వైపు రాహుల్ అక్కడున్న నర్సుతో ఫ్లర్టింగ్ మొదలుపెడతాడు. ఆ తర్వాత ఎవరో వచ్చి మీ వాళ్ళు వస్తున్నారని చెప్పగానే.. రాహుల్ బెడ్ మీద పడుకొని స్పృహ లేనట్టు నటిస్తాడు. ఆ తర్వాత రాహుల్ ని అలా చుసిన రుద్రాణి.. ఏమైంది అంటూ నటిస్తుంది. ఆ తర్వాత రాహుల్ ఏర్పాటు చేసిన డాక్టర్ వచ్చి.. దెబ్బలు బాగా తగిలాయని చెప్తాడు. అప్పుడే నర్సు వచ్చి పేషెంట్ స్పృహ లోకి వచ్చాడని చెప్పగానే అందరూ లోపలికి వెళ్తారు. రాహుల్ నటిస్తూ..  కొందరు రౌడీలు నన్ను కొట్టి స్వప్నని తీసుకొని వెళ్లారని చెప్పగానే కావ్య టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత కావ్య.. మీరు ఊటీకి వెళ్లారు కదా అంటూ అన్ని అడిగేసరికి వచ్చాము. స్వప్న కీ సర్ ప్రైజ్ అని రింగ్ ఇవ్వడానికి ప్లాన్ చేసాను. ఇలా జరిగిందంటూ రాహుల్ చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ కావ్య అడిగే ప్రశ్నలకి రాహుల్ తడబడతాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

అమ్మ ప్రేమను తెలుసుకున్న రిషి.. జగతి ప్రాణాలు నిలబడతాయా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -879 లో.... జగతికి బల్లెట్ తగలగానే రిషీ, వసుధార అందరు కలిసి హాస్పిటల్ కి తీసుకెళ్తారు. ఆ సిచువేషన్ లో జగతిని చూసిన మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. మహేంద్ర తనలోని బాధని రిషికి చెప్తాడు. జగతి ఎప్పుడు నీకోసం ఆలోచిస్తుంది. తన ప్రాణాలను లెక్కచెయ్యకుండా నీ విషయంలో ఎంతో తెగువ చూపించిందని రిషికి మహేంద్ర చెప్తాడు. ఆ తర్వాత రిషి ఇప్పటికి అయిన తనని అర్థం చేసుకోమని మహేంద్ర అంటాడు. తను మీ అమ్మ.. నిన్ను కన్న తల్లి.. ఈ క్షణం వరకు నీ క్షేమం గురించి ఆలోచించింది. ఎంత సేపు నా కొడుకు నా కొడుకు అంటూ.. కొడుకుతో అమ్మ అని పిలిపించుకోని దూరద్రుష్టవంతురాలు అని మహేంద్ర చెప్తూ ఎమోషనల్ అవుతాడు. వసుధార కూడా మేడమ్ ని దూరం పెట్టిందని చాలా బాధపడింది. తను ఎం చేసిన మీ కోసమే తన ప్రపంచమే మీరు అని అంటూ వసుధారతో మహేంద్ర తన ఆవేదనని బయటపెడతాడు. ఆ తర్వాత హాస్పిటల్ కి చక్రపాణి వస్తాడు. అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి.. సిచువేషన్ చాలా క్రిటికల్ గా ఉంది ముప్పై ఆరు గంటలు అయితే గాని ఏం చెప్పలేనని డాక్టర్ అనగానే..  రిషి డాక్టర్ ని రిక్వెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత రిషి దేవుని దగ్గరకు వెళ్లి జగతి గురించి మొక్కుకుంటాడు. అక్కడ మహేంద్ర అన్న మాటలనే రిషి గుర్తు చేసుకుంటాడు. అప్పుడే రిషి దగ్గరికి వసుధార వస్తుంది. గతంలో నేను మేడమ్ విషయంలో తప్పు చేశాను. ఒక తల్లిని అనకూడని మాటలు అన్నానని రిషి బాధపడుతాడు. కేవలం నావైపు నుండి అలోచించి బాధపెట్టాను. నా చుట్టు ఏం జరుగుతుంది. మేడమ్ కి నాకు ఈ ఏడబాటు ఏంటి నా ప్రాణాల కోసం మేడమ్ ప్రాణాలు అడ్డుపెట్టారు. మా అమ్మ కోలుకోవాలని వసుధారతో రిషి అనగానే.. వసుధార ఎమోషనల్ గా చూస్తుంది. నాకు చిన్నప్పటి నుండి తల్లి ప్రేమ తెలియదు. ఆ తల్లి ప్రేమ పొందాలని అనుకుంటున్నాను. నా తల్లికి ఏం కాదు కదా అని రిషి అంటాడు. మీరు పిలిచిన ఈ పదం గురించి అయిన మేడమ్ బాగుంటారని రిషికి వసుధార దైర్యం చెప్తుంది. మరొకవైపు జగతి గురించి మహేంద్ర బాధపడుతుంటాడు. నా ప్రాణాలు తియ్యాలని అనుకున్న వాళ్ళు ఎవరని వసుధారని రిషి అడుగుతాడు. వసుధార చెప్పబోతుండగా అక్కడికి ఫణింద్ర, శైలేంద్ర, ధరణి, దేవయాని వస్తారు. అసలు ఇలా ఎలా జరిగిందంటూ ఫణింద్ర అడుగుతాడు. ఇదంతా చేసింది మా అయన అని ఎలా చెప్పాలని ధరణి తన మనసులో అనుకుంటుంది. మరొక వైపు వసుధార దగ్గరికి శైలేంద్ర వచ్చి.. రిషి ఉండాల్సిన ప్లేస్ లో జగతి మేడమ్ ఉన్నారంటూ వసుధారకి కోపం వచ్చేలా శైలేంద్ర మాట్లాడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బుల్లెట్  భాస్కర్ స్కిట్ ....అమ్మాయిలు కుక్కల్లా మీద పడతారంటూ డైలాగ్

ఒకప్పుడు జబర్దస్త్ అంటే చాలు హెల్తీ కామెడీతో ఫామిలీ మొత్తం చూసే పరిస్థితి ఉండేది. కానీ తర్వాత్తర్వాత ఆ వ్యవహారం మొత్తం మారిపోయింది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువైపోయి స్కిట్స్ , నవ్వులు తక్కువైపోయి కుళ్ళు కామెడీ పుట్టుకొచ్చింది. రాను రాను జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లో కూడా లేడీస్ ని కించపరచడం, అవమానించడం, బాధ పడేలా ఉండే కామెంట్స్ చేయడం అది చూసిన జడ్జెస్ నవ్వేసరికి అదే కామెడీ అనుకునేలా క్రియేట్ చేయడం వంటివి జరుగుతున్నాయి. రీసెంట్ గా ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో బులెట్ భాస్కర్ - గడ్డం నవీన్ స్కిట్ కొంచెం ఎక్స్ట్రా గా ఉంది. ఈ స్కిట్ లో భాస్కర్ హీరోగా చేసాడు. బాడీ స్ప్రే యాడ్ లో నటించాడు. "ఒకప్పుడు నేను రోడ్డు మీద వెళ్తుంటే ఒక్క అమ్మాయి కూడా తిరిగి చూసేది కాదు. ఒక్కసారి ఈ స్ప్రే కొట్టా...కుక్కలు మీద పడినట్టు పడిపోయారు. భాస్కర్ స్ప్రే..నేను వాడాను..మరి మీరు" అని చెప్పిన డైలాగ్ మరీ టూమచ్ గా లేడీస్ ని కుక్కలతో పోల్చడం ఎబ్బెట్టుగా ఉంది. అంతే కాదు దీనికి కంటిన్యుయేషన్ గా మరో కమెడియన్ వచ్చి "నువ్వు వాడిన స్ప్రే వాడితే అమ్మాయిలు కుక్కల్లా మీద పడతారని అన్నావ్ కదా" అనేసరికి "అమ్మాయిలు కరిచారా" అంటూ భాస్కర్ రివర్స్ లో అడిగాడు. "లేదు కుక్కలు సర్ కుక్కలు కరిచాయి" అనేసరికి జడ్జెస్ తో పాటు యాంకర్ రష్మీ కూడా నవ్వేసింది. ఇక స్టార్టింగ్ లో పటాస్ ప్రవీణ్ స్కిట్ మరీ ఫన్నీగా ఉంది.."జిన్నాబాయ్" గెటప్ లో అదే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ తో స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చాడు. "వచ్చేటప్పుడు ఆ ఎంట్రీలో ఆ ఫ్లెక్సీ చూసా..అక్కడేంటి అన్ని కుక్కలు ఉన్నాయి" అని ప్రవీణ్ అడిగేసరికి "నీకు అభిషేకం జరుగుతుంది" అని రష్మీ చెప్పిన మాటకు అందరూ నవ్వేశారు.  

పల్లవి ప్రశాంత్ కి ’బేబి‘ సినిమా చూపిస్తున్న రతిక!

బిగ్ బాస్ హౌజ్ లో బేబీ సినిమా.. అవును నిజమే. రోజు రోజుకి బిగ్ బాస్ హౌజ్ లోని కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ పీక్స్ స్టేజ్ కి వెళ్తున్నాయి. హౌజ్ లోని కంటెస్టెంట్స్ మీద సినిమాల ప్రభావం గట్టిగానే ఉంది. తాజాగా విడుదలైన బేబీ సినిమాని పల్లవి ప్రశాంత్, రతిక, ప్రిన్స్ యావర్ రిక్రీయేట్ చేస్తున్నారు. అదే లవ్ ట్రాక్ తో ప్రేక్షకులకి మంచి కిక్కు ఇస్తున్నారు. సోమవారం నామినేషన్లలో కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు తిట్టుకొని, హీటెడ్ ఆర్గుమెంట్ చేసుకొని మంగళవారం నుండి శుక్రవారం వరకు గేమ్, టాస్క్, మధ్య మధ్యలో కబుర్లతో టైమ్ పాస్ చేస్తుంటారు. అయితే రతిక కంటెంట్ కోసం ఎంతదూరమైన వెళ్తానంటుంది. మొదటి వారం రతికకి పల్లవి ప్రశాంత్ లక్కీ ఛామ్ అనే ఫ్రెండ్ షిప్ బ్యాండ్ ఇచ్చాడో అప్పటి నుండి మొదలైంది ఈ కథ. బేబీ సినిమాలో వైష్ణవిని ఆనంద్ ఇష్టపడడ్డుగా.. సరిగ్గా అదే రిపీట్ అవుతుంది. మొదటి నుండి పల్లవి ప్రశాంత్ తో లవ్ ట్రాక్ నడిపిన రతిక.. మొన్న జరిగిన నామినేషన్లో నీతో నాకేంటి, అసలు ఎవరు నువ్వు అనే డైలాగ్ లతో రెచ్చిపోయింది. ఇక ప్రిన్స్ యావర్ కి మూడవ వారం సపోర్ట్ చేస్తున్నట్టు నటించింది రతిక. అతను టాస్క్ లో తప్పుకున్నాడని తనకి సపోర్ట్ చేస్తున్నట్టు నటించగా, రతికని యావర్ నమ్మాడు.  అయితే నమ్మిన కొన్ని గంటల్లోనే సీక్రెట్ రూమ్ లో ఎవరు అనర్హుడని బిగ్ బాస్ చెప్పమంటే యావర్ అని చెప్పింది. ఇక అది బిగ్ బాస్ అందరి ముందు చూపించే సరికి యావర్ మనసు ముక్కలైనంత పని అయింది.  రతికని నమ్మిన ప్రిన్స్ యావర్ ని మోసం చేసింది. ఒకవైపు పల్లవి ప్రశాంత్‌తో, మరోవైపు ప్రిన్స్ యావర్‌తో ప్రేక్షకుల దృష్టి తనవైపు తిప్పుకోవడానికి ‌ట్రయాంగిల్ లవ్ స్టోరీని క్రియేట్ చేసింది రతిక. నాల్గవ వారం జరిగిన నామినేషన్లో గౌతమ్ కృష్ణని పల్లవి ప్రశాంత్  నామినేట్ చేసి .. షర్ట్ విప్పి బాడీ చూపించావని అని అన్నాడు. ఇక గౌతమ్ కృష్ణ తనదేమీ తప్పు కాదన్నట్టుగా రతికని ఇన్వాల్వ్ చేశాడు. నన్ను అలా ఎలా అంటావ్? నీకేం రైట్ ఉందని రతిక పల్లవి ప్రశాంత్ తో గొడవకి దిగింది. గొడవ ముగిసే సమయంలో ఇంకోసారి నిన్ను రతిక అంటే నన్ను చెప్పు తీసుకొని కొట్టు అని పల్లవి ప్రశాంత్ అన్నాడు. ఇలా పల్లవి ప్రశాంత్ ని ఆడుకున్న రతిక.. ప్రిన్స్ యావర్ ని ఏం చేస్తుందో చూడాలి మరి.