ఏంజిల్ మాట వినకుండా వెళ్ళిన రిషి.. ఫణీంద్ర వేసిన శిక్ష అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -873 లో.. ఫణింద్ర దగ్గరికి జగతి మహేంద్ర ఇద్దరు వస్తారు. అన్నయ్య భోజనానికి రావడం లేదని అనగానే.. నేను రాను ఇక్కడే తింటానని ఫణింద్ర కోపంగా అంటాడు. మేం ఏం తప్పు చేశామని అంత కోపంగా ఉన్నారని ఫణీంద్రని మహేంద్ర అడుగుతాడు. నాకు రిషి గురించి చెప్పకుండా ఎందుకు దాచారు. అంత పరాయివాన్నయ్యానా? ఇది కోపం కాదు బాధ మాత్రమేనని ఫణింద్ర అంటాడు. జగతి మహేంద్రలను అక్కడ నుండి వెళ్ళమని చెప్తాడు ఫణింద్ర. ఆ తర్వాత జగతి, మహేంద్ర ఇద్దరు ఫణింద్ర దగ్గర నుండి రావడం చుసిన దేవయాని.. మా ప్లాన్ సక్సెస్ అయింది అన్నటుగా.. ఇక ఇప్పుడే మెల్లి మెల్లిగా DBST కాలేజీని మా సొంతం చేసుకుంటానని అంటుంది. మరొక వైపు వసుధార దగ్గరికి ఏంజిల్ వస్తుంది. రిషి ఇంకా ఇంటికి రాలేదు. నీకు ఏమైనా తెలుసేమోనని వచ్చాను. అయిన ఆ కాలేజీకీ ప్రాబ్లమ్ వస్తే రిషి ఎందుకు వెళ్ళాడు. నువ్వు ఎందుకు వెళ్ళావని ఏంజిల్ అడుగుతుంది. కాలేజీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా అని ఏంజిల్ అనగానే .. సాల్వ్ చేశారు అని వసుధార చెప్తుంది. రిషి తన భార్య గురించి పదిహేను రోజుల్లో చెప్తానన్నాడు కదా తన భార్య ఎవరో నువ్వు గెస్ చేయగలవా? రిషి భార్య గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటి ఉందని  ఏంజిల్ అంటుంది.  ఆ తర్వాత వసుధారని ఏంజెల్ తన ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం వసుధార, ఏంజిల్ ఇద్దరు హాల్లో పడుకొని ఉంటారు. రిషి తన గదిలో నుండి బ్యాగ్ తో వస్తుంటే వసుధార చూసి ఏంజిల్ కి చెప్తుంది. రిషి ఎక్కడికీ వెళ్తున్నావని ఏంజిల్ అడుగుతుంది. నేను ఇక ఈ ఇంట్లో ఉండాలనుకోవడం లేదని రిషి చెప్పగానే.. వద్దు నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలని ఏంజిల్ రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు నాకు ఫ్రెండ్ వి.. నీ దృష్టిలో నన్ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రావడం తప్పని రిషి అంటాడు. నువ్వు నా ఫ్రెండ్ వి కాదని అనట్లేదు పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ నీకు పెళ్లి అయిందన్నావ్. పదిహేను రోజులు గడువు ఇచ్చాను. నువ్వు వెళ్ళకు రిషి. నీ ముందు ఆ టాపిక్ తియ్యనని రిషిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంజిల్‌. అలా చెప్పిన రిషి వినకుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

మురారిని ఆటపట్టించిన కృష్ణ.. అది చూసి ముకుందకి కాలిందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -267 లో.. ముకుంద, మురారి ఇద్దరు మాట్లాడుకుంటారు. నిన్ను తప్ప ఎవరిని ప్రేమించనంటూ తనలోని ఎమోషన్ నీ బయటపెడుతుంది ముకుంద. కానీ మురారి మాత్రం దానికి అంగీకరించకుండా.. నువ్వు నా స్నేహితుడి భార్యవి మాత్రమే ఒకప్పుడు ప్రేమించిన మాట నిజమే కానీ ఎప్పుడు అయితే ఆదర్శ్ నిన్ను పెళ్లి చేసుకున్నాడో అప్పుడే నా ప్రేమని మర్చిపోయానని మురారి అంటాడు.  ఆ తర్వాత ప్లీజ్ ముకుంద ఇప్పటికే నీకు చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను నిన్ను ఆ దృష్టితో నేను చూడలేనని, తనపై ఏ ఫీలింగ్ లేదని క్లారిటీగా చెప్పేస్తాడు మురారి. ముకుంద మాత్రం తన ధోరణి మాత్రం మార్చుకోదు. అయితే మురారి, ముకుంద మాట్లాడుకునే మాటలన్ని కృష్ణ వింటుంది. నేను ఇన్ని రోజులు ఏసీపీ సర్ ని అపార్థం చేసుకున్నానా? ఈ ముకుందకి నేనే సమాధానం చెప్పాలని కృష్ణ అనుకుంటుంది. ఆ తర్వాత మరుసటి రోజు నిద్రపోతున్న మురారి దగ్గరికి కృష్ణ వెళ్లి.. ముకుంద ప్రేమ గతం, ఇప్పుడు నువ్వు  తప్ప నా మనసులో ఎవరు లేరని ఒక చిన్న మాట చెప్తే అయిపోయే దానికి ఇంత చెయ్యేలా అని కృష్ణ అనుకుంటుంది. ఆ తర్వాత మురారి ని ఆటపట్టించాలనుకొని పెన్ తో మురారి మొహంపై చిన్న పిల్లాడిలా బొట్టు పెడుతుంది.  ఆ తర్వాత అందరికి కాఫీ ఇస్తుంది. ఆ తర్వాత ముకుంద భవానికి కాఫీ తీసుకొచ్చేలోపే కృష్ణ ఇస్తుంది. ముకుంద కంటే ముందే లేచి వర్క్ చేశాను. నేను టైమ్ నీ ఫాలో అవుతానంటూ ముకుందకి కౌంటర్ వేస్తుంది కృష్ణ. ఆ తర్వాత పై నుండి వస్తున్న మురారిని చూసి అందరు నవ్వుతుంటారు. అదేంటి అందరు నన్ను చూసి నవ్వుతున్నారని అద్దంలో చూసుకుంటాడు. తన మొహం పై ఉన్న ఆ బొట్టుని చూసి ఇదంతా కృష్ణ పనే అని తనని పట్టుకొవాలని ప్రయత్నిస్తాడు కానీ కృష్ణ  అటు ఇటు తిరుగుతుంటుంది. ఆ తర్వాత కృష్ణ, మురారి అలా సరదాగా ఉండడం చూసిన రేవతి.. ముకుందని చూసి కనుబొమ్మలు ఎగురవేస్తుంది. దాంతో ముకుందకి కోపం వచ్చి కాఫీ కప్పుని కింద పడేస్తుంది. ఆ తర్వాత ఏమైందని భవాని అడిగితే.. కాలినట్టుందని రేవతి అంటుంది. అదే కాఫీ కాలినట్టుందని రేవతి కవర్ చేస్తుంది. ఆ తర్వాత మధు, రేవతి ఇద్దరు కృష్ణ, మురారి ఇప్పుడు హ్యాపీగానే ఉంటున్నారని అనుకుంటారు. కానీ ముకుంద గురించే భయంగా ఉంది. మళ్ళీ ఏం చేస్తుందోనని రేవతి అంటుంది. మరొక వైపు అందరు నన్ను చూసి నవ్వారు. నీ సంగతి చెప్తానంటు కృష్ణని పట్టుకుంటాడు మురారి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

IVF ద్వారా నైనా పిల్లల్ని కనాలి అంటున్న సదా!

సెలబ్రిటీలు ఏది చేసిన, ఏం చెప్పినా ట్రెండే అవుతుంది. తాజాగా మ్యారేజ్ సిస్టమ్ గురించి హీరోయిన్ సదా సెన్సేషనల్ కామెంట్లు చేసింది. పెద్దలు కుదుర్చిన పెళ్ళంటేనే భయమేస్తుందంట సదాకి. కారణం పెళ్ళయ్యాక ఆ భర్త అనే అతను ఏం చెప్పినా చేయాలి? మనకంటూ సొంతంగా నిర్ణయం తీసుకునే రైట్ ఉండదు. మనకి ఆలోచన స్వేచ్ఛనివ్వరు.‌ ఏదీ మనకి నచ్చినట్డు ఉండదంటూ తన ఫేస్ బుక్ లో షేర్ చేసింది. మ్యారేజ్ సిస్టం గురించి సదా మాట్లాడుతూ.. పెళ్ళయ్యాక మనకి ఇష్టం ఉన్నా లేకున్నా పిల్లల్ని కనాలి. మనకి పిల్లలు పుట్టకుంటే IVF ద్వారా అయినా కనాలి. కానీ వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి. అసలు బయట నేచర్ మనకి సపోర్ట్ గా లేదు. నేను పెళ్ళి చేసుకోను. ఎందుకంటే ఇప్పటికే ఉన్న మనుషులకి సరిపడే వనరులు లేవు. అదేకాక బయట మనం తీసుకునే ఫుడ్ లో కూడా అంత నాణ్యత లేదు. పిల్లల్ని కని వాళ్ళని పోషించడం కూడా కష్టమే. అందుకే ఈ పెద్దలు కుదిర్చిన పెళ్ళంటే నాకు భయం. 'మేల్ స్టిగ్మ ఈజ్ ది రీజన్ ఫర్ కాంప్లికేటెడ్ మ్యారేజెస్' అని వీడియోని షేర్ చేసింది సదా. సదా అని పిలవబడే సదాఫ్ మొహమ్మద్ సయీద్.. తెలుగు సీనీ పరిశ్రమలో 'జయం' మూవీతో అరంగేట్రం చేసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అల్లరి నరేష్ తో కలిసి 'ప్రాణం' సినిమాలో నటించింది. జయం, నాగ, లీలా మహల్ సెంటర్, దొంగ-దొంగది, ఔనన్న కాదన్నా, చుక్కల్లో చంద్రుడు, వీరభద్ర, క్లాస్ మేట్స్, శంకర్ దాదా జిందాబాద్, టక్కరి, అపరిచితుడు, యమలీల 2 మొదలగు సినిమాలలో నటించిన సదా కెరీర్ లో 'జయం' మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సదా ముంబై లో ఒక రెస్టారెంట్ ని ఓపెన్ చేసి అక్కడే తన జ్ఞాపకాలు ఉన్నాయంటూ ఈ మధ్యకాలంలో ఎమోషనల్ అవుతూ ఒక వ్లాగ్ ని చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం అందరికి తెలిసిందే. సినిమాలలో కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న సదా.. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. పలు టీవీ షోస్ లో జడ్జ్ గా చేస్తూ ఆకట్టుకుంటుంది. 'ఢీ' డాన్స్ షోకి శేఖర్ మాస్టర్ తో కలిసి జడ్జ్ గా వ్యవహరించగా వీళ్ళిద్దరి జడ్జిమెంట్ అంటే ఎంటర్‌టైన్మెంట్ కి కేరాఫ్ గా ఉంటుంది. బిబి జోడికి జడ్జిగా చేసి ఆ షోకి మరింత క్రేజ్ వచ్చేలా చేసింది సదా. అయితే సదాకి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. అంతే కాకుండా సదా సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి తన అప్డేట్స్ ని ఫ్యాన్స్ కి తెలిసేలా చేస్తోంది. ఫోటోషూట్స్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేస్తుంది. కాగా ఫేస్ బుక్ లో తాజాగా మ్యారేజ్ పై చేసిన వీడియో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.

నటి జయలలిత అలా కావడానికి కారణం ఏంటో తెలుసా?

సీనియర్ యాక్ట్రెస్ జయలలిత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే  క్లాసికల్ డాన్సర్‌ను అయిన ఆమె తనకు ఇష్టం లేకపోయినా  కేవలం తన తండి వల్లే సినిమా ఇండస్ట్రీలోకి వాంప్ క్యారెక్టర్లు చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఒక ఇంటర్వ్యూలో తన గురించి ఇలా చెప్పారు. "నేను పుట్టింది గుడివాడ బేతవోలు. పెరిగింది గుంటూరులో. నాన్న గారికి సినిమాలతో సంబంధాలున్నాయి.   నేను మా అక్క చల్లా సిస్టర్స్..మేము  డాన్సర్స్ కూడా ... అక్కతో పాటు  చింతా రాధాకృష్ణ మూర్తి గారి దగ్గర  కూచిపూడి నేర్చుకున్నాను. ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చాను. కొన్ని పరిస్థితుల వల్ల ఈ  ఫీల్డ్ కి రావాల్సి వచ్చింది.. 1983లో డిగ్రీ పూర్తిచేసి 1984 లో  హైదరాబాద్ వచ్చాను.  నటరాజ్ రామకృష్ణ గారి దగ్గర ఆంధ్ర నాట్యం నేర్చుకుందామని వచ్చాను. ఐతే నాన్న ఒకరోజు అకస్మాత్తుగా గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చారు. నా ఫ్రెండ్స్ మూవీ తీస్తున్నారు.. హీరోయిన్‌గా క్లాసికల్ డాన్సర్ కావాలట.. నువ్వు చేయాలి అని నన్ను అడిగారు. నాకు మూవీస్ అంటే ఇష్టం లేక ఏడుస్తూ కూర్చున్నాను అప్పుడు నటరాజ్ రామకృష్ణ గారు, కళాకృష్ణ గారు సర్ది చెప్పారు. చివరికి  నన్ను ఒప్పించారు.  ఆ మూవీ టాకీ పార్టీ మొత్తం  రేపల్లెలో అయ్యాక  సాంగ్స్ కోసం చెన్నై విజయ గార్డెన్స్ కి వెళ్లాం . అక్కడ షూటింగ్ జరిగేటప్పుడు నిర్మాత ధనుంజయ రెడ్డి నన్ను చూశారు. అమ్మాయి బాగుంది ‘ఖైదీ’ మూవీలో డాక్టర్  క్యారెక్టర్ ఉందని  నాన్నను అడిగారు. వెనకా ముందూ ఆలోచించకుండా ఫ్యామిలీ మొత్తాన్ని చెన్నై షిఫ్ట్ చేసేశారు నాన్న. ఆ టైంలోనే మలయాళం మ్యాగజైన్ ‘నానా’కు ఇంటర్వ్యూ ఇచ్చాను.  ఇంటర్వ్యూని చూసిన డైరెక్టర్ పవిత్రన్ ఉప్పు అనే మూవీలో ఛాన్స్ ఇచ్చారు. తర్వాత  ఐవీ శశి చూసారు.  కమల్ హాసన్‌, గీత, శోభనతో కలిసి తాను తీసే మూవీలో  చేయమని అడిగారు. అందులో నేను  వ్యాంప్ క్యారెక్టర్ చేసాను.  ఫ్యామిలీ మొత్తం చెన్నై వచ్చేసి నా మీదే  ఆధారపడ్డారు.. ఇక  వ్యాంప్ క్యారెక్టర్లు చేయక తప్పలేదు.  సొంతూరుకి తిరిగి వెళ్లలేక, కుటుంబం కోసం  వ్యాంప్ క్యారెక్టర్లు ఒప్పుకోవాల్సి వచ్చింది..అలా నా జర్నీ కంటిన్యూ అయ్యింది" అన్నారు జయలలిత.    

మళ్ళీ చెప్తున్నా...ఆ వీడియోస్ పెట్టి నా హార్ట్ బ్రేక్ చేయొద్దు

దేశవ్యాప్తంగా గణేష్‌ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్న తరుణంలో ప్రముఖ యాంకర్‌ రష్మీ  వినాయక చవితి వేడుకలకు సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో  షేర్‌ చేసి తీవ్రంగా విమర్శించింది.  ఐతే ఇందులో కొంతమంది  భక్తులు ఏనుగును టార్చర్‌ చేస్తూ విన్యాసాలు చేయించారు. అసలే యానిమల్‌ లవర్‌ అయిన యాంకర్‌ రష్మీకి కోపం పీక్స్ కి వెళ్ళిపోయింది.  ఈ వీడియోపై స్పందిస్తూ మూగజీవాలను ఇలా ఇబ్బంది పెట్టవద్దంటూ కోరింది. ‘ఇది చాలా బాధాకరం. ఊరేగింపుల్లో జంతువులను అసలు తీసుకురాకూడదు. ఏనుగు చెవులను బుల్‌ హక్‌తో పొడిచి టార్చర్‌ చేస్తూ.. ఇలా విన్యాసాలు చేయిస్తున్నారు. హిందువులు,  సనాతన ధర్మాన్ని అనుసరించే వారు పండగలు, పర్వదినాల్లో ఇలా మూగజీవాలకు హాని జరగకుండా చూసుకోవాలి ఇది పాత వీడియోనే ఐనా సరే మీ అందరికీ మళ్ళీ చెబుతున్నా.   ఈ పరిస్థితులు మారుతాయని ఆశిస్తున్నాను’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చింది రష్మీ. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది రష్మీకి అనుకూలంగా కామెంట్లు చేస్తుంటే కొంతమంది  ఎప్పటిలాగే నెగెటివ్‌ కామెంట్స్ చేస్తున్నారు.  ఎక్కడ ఏ మూగజీవికి సమస్య వచ్చినా తన ప్రేమను చాటుకుంటుంది రష్మీ.  కరోనా సమయంలో వీధి కుక్కలకు ఆహారం పెట్టింది. యానిమల్ లవర్ గా రష్మీ షేర్‌ చేసే పోస్టులు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో  మిస్‌ ఫైర్‌ అవుతుంటాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో పిల్లలపై కుక్కల దాడి విషయంలో విమర్శలు ఎదుర్కొంది రష్మీ. అలాగే బక్రీద్‌  సందర్భంలో ఆమె చేసిన ట్వీట్‌పై కూడా ట్విట్టర్ లో మాటల యుద్ధమే ఎదుర్కొంది. ఇక కొన్ని రోజుల క్రితం సనాతన ధర్మంపై కూడా కామెంట్స్‌ చేసి వార్తల్లో నిలిచింది.  స్టార్‌ యాంకర్‌గా బుల్లితెరపై హవా సాగిస్తోన్న రష్మీ అప్పుడప్పుడు సిల్వర్‌ స్క్రీన్‌పై కూడా మెరుస్తోంది. ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి నటించిన భోళాశంకర్‌ లో మెరిసిందీ రష్మీ.  

గౌతమ్ కృష్ణకి సపోర్ట్ చేస్తున్న షకీల!

బిగ్ బాస్ సీజన్-7 లో కంటెస్టెంట్స్ మధ్య జరిగే  గొడవలు కామన్. హౌజ్ లో వారం మొత్తం ఎలా ఉన్న సోమవారం జరిగే నామినేషన్లో హీటెడ్ ఆర్గుమెంట్స్ జరుగుతుంటాయి. ఆదివారం ఎలిమినేషన్ ఉంటుంది. ఇప్పటికే హౌజ్ లో‌ కిరణ్ రాథోడ్, షకీల ఎలిమినేట్ అయ్యారు. షకీ అమ్మగా బిగ్ బాస్ హౌజ్ లోకి షకీల అడుగుపెట్టింది. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో షకీలకి ఒక పవర్ ఫుల్ AV ని తీర్చిదిద్దారు మేకర్స్. ‌అయితే రెగ్యులర్ కంటెస్టెంట్స్ కి కాస్త భిన్నంగా కొత్త కంటెంట్  కోసం షకీలాని తీసుకున్నట్టుగా తెలిసింది. షకీలాని పాజిటివ్ గా చూపించడానికి, ఫ్యామిలీ ఆడియన్స్ కి తనని దగ్గర చేయడానికి తను ఎదుర్కున్న పరిస్థితులని, అవమానాలని చూపించారు మేకర్స్. తను ఎన్నో బీ గ్రేడ్ సినిమాల్లో చేసాక తనకి చాలా అవమానాలు ఎదురయ్యాయని చెప్పింది షకీల. డబ్బుల కోసం వాళ్ళ అమ్మ మొదటిసారి షకీలాని అక్కడికి పంపించందంట. అయితే తను అప్పుడు ప్లే గర్ల్స్ అనే పిక్చర్ ఓకే అయిందంట. అదే టైమ్ లో డబ్బులకి ఇబ్బంది అవుతుందని వాళ్ళ అమ్మ పంపించిందంట. వాళ్ళ అక్కతోనే షకీలా వెళ్ళిందని ఒక ఇంటర్వూలో చెప్పింది‌. కాగా ఇలా తను ఇలా అవడానికి కారణమేంటి? ఎందుకిలా జరిగిందని షకీలా చాలాసార్లు చెప్పుకొని బాధపడింది. అయితే తన గురించి ఎవరికి తెలియని కొన్ని నిజాలని చూపిస్తూ, తన ఆఫ్ స్క్రీన్ లైఫ్ ఎలా ఉందని AV లో చూపించారు బిగ్ బాస్ మేకర్స్.  షకీల తన గతాన్ని చెప్పుకుంటూ ఎమోషనల్ అయింది. వాళ్ళ అక్క తనని ఎదగనివ్వకుండా చేసిందని, తను సినిమాల్లో చేస్తే వచ్చిన డబ్బులతో ఒక్క ల్యాండ్ కూడా తీసుకోకుండా చేసిందంట. ఎందుకంటే తను(షకీల) రెక్కలొచ్చిన పక్షిలా ఎగిరిపోతుందేమోనని వాళ్ళ అక్క కావాలనే డబ్బులని ఖర్చు చేసిందంట. ఇలా తన గురించి చెప్పుకొచ్చింది షకీల. ఒక అమ్మగా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది షకీల. అయితే‌ షకీల ఎలిమినేట్ అయ్యాక చెన్నైకి వెళ్ళిపోయింది. హౌజ్ లో ఉన్న పన్నెండు మంది కంటెస్టెంట్స్ లో గౌతమ్ కృష్ణకి తన సపోర్ట్ ఉందంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది షకీల. నిజంగా గౌతమ్ కృష్ణని కన్న తల్లిదండ్రులు గ్రేట్ అని షకీల అంది. గౌతమ్ కృష్ణ డీసెంట్ అని, ఫేర్ గేమ్ ఆడుతున్నాడని, సపోర్ట్ అండ్ ఓట్ హిమ్ అంటూ తన పోస్ట్ లు చెప్పింది షకీల. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కి షకీల బాగా కనెక్ట్ అయ్యిన విషయం తెలిసిందే.   

శివాజీ పవరస్త్రని దొంగిలించిన అమర్ దీప్.. మాములుగా ఉండదంటూ ఫైర్!

  బిగ్ బాస్ హౌజ్ లో పదహారవ రోజు శివాజీ ఫైర్ అయ్యాడు. హీటెక్కించే మాటలతో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు సాగాయి.  బిగ్ బాస్ సీజన్-7 ఉల్టా పల్టాతో యమ క్రేజ్ తెచ్చుకుంటుంది. ఇప్పటికే ఈ షో అత్యధిక టీఆర్పీతో దూసుకెళ్తుంది.  వినాయకచవితి సందర్భంగా హౌజ్ లోని కంటెస్టెంట్స్ సంప్రదాయబద్ధంగా రెడీ అయి పిండితో వినాయకుడిని చేశారు. సింగర్ దామిణి అందరి కోసం సేమియా చేసింది. కాసేపటికి ఒక్కో కంటెస్టెంట్స్ మధ్య ఇంట్రస్టింగ్ టాపిక్స్ నడిచాయి. ముందుగా రతిక ఒంటరిగా కూర్చొని తన మాజీ లవర్ గురించి బాధపడుతుంటే శివాజీ వెళ్ళి ఓదారుస్తాడు. నీ గేమ్ నువ్వు ఆడు. నీ పర్సనల్ విషయాలు ఎవరికీ చెప్పొద్దు, ఎవరికి అవకాశం ఇవ్వొద్దంటూ ఓదార్చాడు. మరొకవైపు ఆట సందీప్, టేస్టీ తేజ కలిసి నామినేషన్ల గురించి మాట్లాడుకున్నారు. అందరు శుభశ్రీ, యావర్ , ప్రియాంక జైన్ ని నామినేట్ చేసి పల్లవి ప్రశాంత్ ని వదిలేసారేంటని టేస్టీ తేజ అనగా.. కావాలని వదిలేసారని ఆట సందీప్ చెప్పాడు. అసలు నాకు నామినేషన్ వేసే అవకాశం ఇస్తే పల్లవి ప్రశాంత్ ని కచ్చితంగా నామినేట్ చేసేవాడిని అని ఆట సందీప్ అన్నాడు. మరొకవైపు రతిక, పల్లవి ప్రశాంత్ ల‌ మధ్య చిల్లర గొడవ జరిగింది. వాళ్ళిద్దరి మధ్య గొడవని శుభశ్రీ ఆపే ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళు ఆపలేదు. శివాజీ ఆపాలని ప్రయత్నిస్తుండగా అతడి పవరస్త్రని అమర్ దీప్ దొంగిలించి ఒకచోట దాచిపెట్టాడు. కాసేపటికి తన పవరస్త్రని ఎవరో దొంగిలించారని తెలుసుకున్న శివాజీ గార్డెన్ ఏరియాలో కూర్చొని ఫీల్ అయ్యాడు‌. నా పవరస్త్రని ఎవరు తీశారో వాళ్లకి మాములుగా ఉండదు‌ తొక్క తీస్తా అంటూ శివాజీ అన్నాడు. అయితే శివాజీ పక్కన అమర్ దీప్, రతిక ఉన్నారు. అమ్మ నాన్న ఇదే నేర్పించారా అంటూ తన పవరస్త్రని దొంగిలించిన వారిపై శివాజీ ఫైర్ అయ్యాడు. మరొకవైపు మూడవ హౌజ్ మేట్ కోసం యావర్, అమర్ దీప్, శోభా శెట్టిలని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని ఎంపిక చేస్తాడు. అయితే హౌజ్ లో తను లేనని బిగ్ బాస్ అనుకున్నాడా? నేను ఓడిపోయాను అంటూ పల్లవి ప్రశాంత్ ఒంటరిగా కూర్చొని ఏడ్చేసాడు. కాసేపటికి బిగ్ బాస్ ప్రశాంత్ ని పిలిచి ఆ ముగ్గురు ఎందుకు అనర్హులని భావిస్తున్నారో చెప్పమని చెప్పాడు. అయితే శోభా శెట్టి కంటే తను బెటర్ అని పల్లవి ప్రశాంత్ చెప్తాడు. ఇక హౌజ్ లో ఒక్కో కంటెస్టెంట్ ని సీక్రెట్ రూమ్ కి పిలిచి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటాడు బిగ్ బాస్. అయితే అమర్ దీప్ అనర్హుడని కొందరు, మరికొందరు యావర్ అనర్హుడని చెప్తారు. ఆయితే కాసేపటికి సీక్రెట్ రూమ్ లో యావర్ హౌజ్ మేట్ గా అనర్హుడని ఎవరెవరు చెప్పారో బిగ్ స్క్రీన్ మీద చూపించాడు బిగ్ బాస్. దాంతో యావర్ చాలా ఎమోషనల్ అవుతాడు. 'తేజ చేశాడంటే ఐ ఆక్సెప్ట్, కానీ నువ్వు నన్ను అనర్హుడని చెప్పావ్ చూడు. అది బాధేస్తుంది' అంటూ యావర్ ఎమోషనల్ అయ్యాడు. ఇక తర్వాతి ఎపిసోడ్‌లో యావర్, రతికల మధ్య లవ్ ట్రాక్ మొదలైందన్నట్టుగా రేపటి ప్రోమోలో చూపించాడు బిగ్ బాస్. 

రుద్రాణి ప్లాన్ మిస్.. కావ్య అనుకున్నది జరుగుతుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -205 లో.. తన వల్లే ఇంట్లో గొడవలు అవుతున్నాయని కావ్య భావిస్తుంది. ఈ సమస్యకి తనే సొల్యుషన్ ఇవ్వాలనుకోని అపర్ణ దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది కావ్య. అపర్ణ మాట్లాడడానికి ఇష్టపడకపోయిన వినండి అని కావ్య చెప్తుంది. అయిన వినకుండా వెళ్తున్న అపర్ణని కావ్య ఆగమని చెప్తుంది. మీరు వేరుగా ఉండి ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా ఉంటే, మీరు ఇంట్లో అందరికి దూరమవుతారు.. అప్పుడే ఇంట్లో అందరికి నాపై సింపతీ పెరిగి నేను వాళ్ళకి మరింత దగ్గర అవుతాను. ఇప్పుడిప్పుడే మీ అబ్బాయి నాకు దగ్గర అవుతున్నారు. ఇక మీరు దూరంగా ఉంటే పూర్తిగా నాకు దగ్గర అవుతాడు. ఇన్ని రోజులు మీరు దేనికైతే భయపడ్డారో అదే జరుగుతుంది అని అపర్ణతో కావ్య చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అపర్ణ ఆలోచనలో పడుతుంది. మరొక వైపు ఇంట్లో నన్ను అవమానిస్తావా? నీకు నీ అత్తకు మధ్య గొడవ పెట్టానని రుద్రాణి మందు తాగుతూ హ్యాపీగా ఉంటుంది. మరుసటి రోజు ఉదయం అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. అపర్ణ వచ్చి సోఫాలో కూర్చొని.. కావ్య అని గట్టిగా అరుస్తుంది. మళ్ళీ ఏం గొడవ అవుతుందోనని అందరూ టెన్షన్ పడుతుంటారు. కానీ కాఫీ తీసుకొని రా? టిఫిన్ ఏం చేసావ్? నన్ను అడిగే చెయ్యాలి కదా అని కావ్య మీద అపర్ణ పెత్తనం చెలాయిస్తుంది. అపర్ణ మాట్లాడినందుకు కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే అత్తయ్య మీకు నచ్చిందే, మిమ్మల్ని అడిగే చేస్తానని కావ్య అంటుంది. మరొకవైపు ఇదంతా చూస్తున్న రుద్రాణి.. కావ్యపై కోపంగా ఉంటుందనుకుంటే ఇలా చేసిందేంటని అనుకుంటుంది. మరొకవైపు రాజ్ తో అపర్ణ మాట్లాడుతుంది. దాంతో రాజ్ సంతోషపడుతు అందరికి చెప్తాడు. మీ అమ్మ నీతో మాట్లాడటానికి కారణం కావ్య అని రాజ్ తో ధాన్యలక్ష్మి చెప్పగానే.. కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి తనని ఎత్తుకొని తిప్పుతాడు.చాలా థాంక్స్ అని కావ్యకి రాజ్ చెప్తాడు. మరొక వైపు ఇంట్లో పనిమనిషిని రావొద్దని చెప్పాను. ఇక నుండి కావ్యనే అంత పని చెయ్యాలి. పెద్దల మాటకు గౌరవం ఇవ్వకుంటే ఎలా ఉంటుందో చూపిస్తానని రుద్రాణికి చెప్తుంది అపర్ణ. మరొక వైపు కృష్ణమూర్తి వాళ్ళ ఇంటి గుమ్మం దగ్గర కావ్య ఇంకా రాలేదని తనకోసం ఎదురుచూస్తుంటాడు. తను అలా  ఎదురుచూస్తుండటం గమనించిన అప్పు.. అక్క వస్తుంది. నువ్వు టెన్షన్ పడకని  చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.   

ముకుందకి తేల్చి చెప్పేసిన మురారి.. అసలు నిజం తెలియనుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -266 లో.. ముకుంద ఇంటి బాధ్యతలు తీసుకొని వంట చేస్తుంది. అందరూ భోజనం చెయ్యడానికి వస్తారు. ఏం వంటలు చేశావని ప్రసాద్ ముకుందని అడుగుతాడు. నేను చెప్తానంటూ కృష్ణ చూసి చెప్తుంటే.. వద్దు చూడకుండా స్మెల్ చూసి చెప్పమని ముకుంద అనగానే.. కృష్ణ వాసన చూసి కరెక్ట్ గా చెప్పేస్తుంది. ఆ తర్వాత మురారికి ముకుంద దగ్గర ఉండి భోజనం వడ్డీస్తుంది. ఏంటి అన్ని మురారికి ఇష్టమైనవి చేశావా? నీకేమీ ఇష్టమో తెలుసా అని కృష్ణ అనగానే... ఇష్టమైన వాళ్ళ గురించి అన్ని ఇష్టంగా తెలుసుకోవాలి అనగానే అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ముకుంద కవర్ చేస్తూ.. నా భర్త ప్రాణ స్నేహితుడు కదా అంటూ కవర్ చేస్తుంది. ఇంకా ఏం ఇష్టమని కృష్ణ అనగానే.. ముకుంద వరుసగా చెప్తుంటుంది. ఒక్కసారిగా మురారికి దగ్గు వస్తుంది.  ముకుంద, మురారీ ఇద్దరు ఒకేసారి మురారికి వాటర్ ఇస్తారు.  అది చూసిన రేవతి.. ఏంటి ముకుంద, కృష్ణ అక్కడే ఉంది కదా చూసుకుంటుంది కదా? నువ్వు ఎందుకు ఇస్తున్నావంటూ కోప్పడుతుంది. నేనే వడ్డీస్తున్న కదా అందుకే ఇచ్చానని ముకుంద అంటుంది.. ఆ తర్వాత మురారి దగ్గర నుండి ముకుందని పంపించాలని కృష్ణ ట్రై చేసినా కూడా ముకుంద వెళ్లకుండా మురారి పక్కనే ఉంటుంది. ఆ తర్వాత కృష్ణ తన గదిలోకీ వెళ్లి.. తను నా భర్తకి వడ్డీస్తుంటే నేనెందుకు ఉన్నాను అసలు.. ఈ ఇంట్లో నా స్థానమేంటి అని కృష్ణ అనుకొని బాధపడుతుంది. అప్పుడే అటుగా వెళ్తున్న మధు.. కృష్ణ దగ్గరికి వచ్చి వీడియో చేద్దామా అని అడుగుతాడు. నాకు ఇంట్రెస్ట్ లేదని కృష్ణ చెప్తుంది. అయిన మధు అలాగే అడిగేసరికి కృష్ణకి కోపం వచ్చి మధుపై అరుస్తుంది. ఏంటి ముకుంద ఏమైన వార్నింగ్ ఇచ్చిందా అని మధు అడుగుతాడు. కృష్ణ ఆశ్చర్యంగా చూడడంతో నాకు అంత తెలుసు. నీక్కూడా చెప్తానని మధు అంటాడు.  మరొక వైపు మధుపై కృష్ణ అరవడం చూసిన మురారి అసలు కృష్ణకి ఏమైందని అనుకుంటాడు. అప్పుడే మురారికి ముకుంద ఫోన్ చేస్తుంది. మురారి చిరాకుపడుతు.. నాకు ఈ టార్చర్ ఏంటి? నీ సంగతి చెప్తాను అనుకొని వస్తూన్నా నీతో మాట్లాడాలని ముకుందకి మురారి చెప్తాడు. మరొక వైపు కృష్ణకి మురారి, ముకుందల ప్రేమ గురించి, ముకుంద చేసే పనుల గురించి మధు చెప్తాడు. అత్తయ్య లాగే నేను బాధపడకూడదని మధు అలా చెప్తున్నాడెమో అని కృష్ణ అనుకొని.. ఏదైనా నా కళ్లతో చూడనిదే నేను నమ్మనని కృష్ణ మనసులో అనుకుంటుంది. మరొక వైపు ముకుందపై మురారి కోప్పడతాడు. వాళ్ళు మాట్లాడుకునేది కృష్ణ చాటుగా వింటుంది.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.    

శైలేంద్రకి వార్నింగ్ ఇచ్చిన మహేంద్ర.. ఏంజిల్ కి రిషి నిజం చెప్తాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -872 లో.. మురుగన్ చేసిన హెల్ప్ కి రిషి ఫోన్ లో థాంక్స్ చెప్తాడు. ఆ తర్వాత రిషి వెళదామని కార్ లోకి ఎక్కుతాడు‌. లోపల వసుధారని షాక్ అవుతాడు. కార్ లో నుండి వసుధారని  దిగమంటాడు. అయిన నేను దిగానని వసుధార అనగానే.. చేసేదేమీ లేక రిషి బయల్దేర్తాడు. మరొక వైపు రిషి వసుధారలు వెళ్లడం చూసిన జగతి, మహేంద్ర లు హ్యాపీగా ఫీల్ అవుతారు. రిషికి వసుధారపై మెల్లిమెల్లిగా కోపం తగ్గుతుందని ఇద్దరు అనుకుంటారు. మిషన్ ఎడ్యుకేషన్ విషయంలో రిషి  కాలేజీకి రాకుండానే హెల్ప్ చేసాడు. ఇప్పుడు కాలేజీ గురించి కూడా కాలేజీకి రాకుండానే ప్రాబ్లమ్ క్లియర్ చేశాడని జగతి, మహేంద్ర  అనుకుంటారు. మరొక వైపు రిషి వసుధారలు కార్ లో వెళ్తూ మాట్లాడుకుంటారు. ఏంటి సర్ అలా ఉన్నారని వసుధార అడుగుతుంది. కాలేజీ ప్రాబ్లమ్ అయితే క్లియర్ అయింది కానీ ఇంకొక ప్రాబ్లమ్ ఉందని ఏంజెల్ తనకి ఇచ్చిన పదిహేను రోజుల గడువుని ఉద్దేశించి అంటాడు. మరి మీరు ఏంజెల్ కి మీకు పెళ్లి అయిందా లేదా అన్న విషయం గురించి ఏం చెప్పాలని అనుకుంటున్నారని వసుధార అడుగుతుంది. అప్పుడే రిషి కార్ కి అడ్డుగా శైలేంద్ర వస్తాడు. ఏంటి అన్నయ్య ఇలా వచ్చారని రిషి అడుగుతాడు. నిన్ను తీసుకొని వెళదామని వచ్చాను రా వెళదామని శైలేంద్ర అంటాడు. నేను రాలేను అని రిషి అనగానే.. నువ్వు మాకు కావాలి రిషి అని చెయ్యి పట్టుకొని వస్తుండగా జగతి, మహేంద్ర వస్తారు. ఎందుకు వచ్చారు రిషి రాకుండా ఆపడానికి వచ్చారా అని శైలేంద్ర అంటాడు. అదంతా రిషి దృష్టిలో వాళ్లని బ్యాడ్ చెయ్యడానికి అలా మాట్లాడతాడు. నేను రానంటూ రిషి కార్ లో వెళ్తాడు. వసు కూడా తనతో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శైలేంద్రకి మహేంద్ర వార్నింగ్ ఇస్తాడు. ఇక నీ గురించి అందరికి త్వరలోనే తెలుస్తుందని  మహేంద్ర అనగానే మీరు నా గురించి వాళ్ళతో చెప్పలేరని శైలేంద్ర అంటాడు. మరొక వైపు వసుధారని రిషి తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. లోపలికి వచ్చి టీ తాగి వెళ్ళండని వసుధార అడిగిన రిషి రానంటు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

శివాజీ టార్గెట్ అమర్ దీప్.. బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ అదుర్స్!!

బిగ్‌ బాస్‌ సీజన్‌-7 ఇప్పటికే రసవత్తరంగా సాగుతోంది. సోమవారం నాటి నామినేషన్లతో బిగ్‌బాస్‌ హౌజ్‌ హీటెక్కింది. ఇప్పటికె రెండు వారాలు పూర్తి చేసుకొని మూడవ వారంలోకి అడుగుపెట్టారు కంటెస్టెంట్స్‌. కాగా, అందులో ఆట సందీప్‌, శివాజీ ఇద్దరూ పవరస్త్రని సాధించి కన్‌ఫర్మ్‌ హౌజ్‌ మేట్స్‌గా నిలిచారు. ఇప్పటికే బిగ్‌బాస్‌ నుంచి మొదటివారం కిరణ్‌ రాథోడ్‌, రెండోవారం షకీలా ఎలిమినేట్‌ అయ్యారు.  కాగా, మూడవవారం హౌజ్‌ నుండి ఎవరు బయటకెళ్తారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. సీరియల్‌ బ్యాచ్‌ అంతా మళ్లీ ఒక్కటయ్యారు. అదే ప్రియాంక జైన్‌, అమర్‌ దీప్‌, శోభా శెట్టి ఒకరికొకరు నామినేట్‌ చేసుకోకుండా వేరే కంటెస్టెంట్స్‌ని నామినేట్‌ చేశారు. ప్రిన్స్‌ యావర్‌ని దామిని నామినేట్‌ చేసింది. సిల్లీ రీజన్‌ చెప్పడంతో యావర్‌ నామినేషన్‌ని యాక్సెప్ట్‌ చేయలేకపోయాడు. ‘ఆరోజు గౌతమ్‌కృష్ణకి, నీకు మధ్య జరిగిన గొడవలో నువ్వు అంత డ్రామా క్రియేట్‌ చేయనవసరం లేదు’ అంది దామిని. దాంతో యావర్‌ రెచ్చిపోయాడు. ‘అలా ఎలా మాట్లాడతావ్‌? నీ మాటలు వెనక్కి తీసుకో’ అని దామినిని అడిగాడు యావర్‌. ‘నేను తీసుకోను’ అంది దామిని. ఇలా ఇద్దరి మధ్య కాసేపు వాదన జరిగింది.  ఆ తర్వాత ప్రియాంక జైన్‌ని శుభశ్రీ నామినేట్‌ చేసింది. దాన్ని ప్రియాంక యాక్సెప్ట్‌ చెయ్యలేదు. కుకింగ్‌ విషయంలో వీళ్ళిద్దరి మధ్య మరింత మాటల యుద్ధం జరిగింది. ఇక నామినేషన్లు అందరూ చేశాక, బిగ్‌ బాస్‌ ఉల్టా పల్టా చేశాడు. నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ నుంచి ఒకరిని నామినేషన్‌లోకి తీసుకురావాలంటూ, నామినేషన్‌లో ఉన్న ఒకరిని సేవ్‌ చేయాలంటూ సేఫ్‌ జోన్‌లో ఉన్న ఆట సందీప్‌, శివాజీలకి బిగ్‌ బాస్‌ చెప్పాడు. ఇద్దరూ చాలాసేపు డిస్కస్‌ చేసుకొని అమర్‌దీప్‌ని నామినేట్‌ చేశారు. దాంతో అమర్‌దీప్‌ ఫుల్‌ ప్రస్ట్రేట్‌ అయ్యాడు. శివాజీ తనపట్ల పక్షపాతం చూపించాడంటూ అతనితో వాగ్వాదానికి దిగాడు అమర్‌దీప్‌. దీంతో అమర్‌దీప్‌కి నెగెటివ్‌ పెరిగింది. ఈసారి నామినేషన్‌లో జరిగే ఓటింగ్‌లో చివరి స్థానంలో అమర్‌దీప్‌ ఉంటాడని తెలుస్తోంది. 

హౌజ్ లో‌ మొదలైన నామినేషన్ల రచ్చ.. ప్రియాంక జైన్ కి ముదిరిన అటిట్యూడ్!

బిగ్ బాస్ సీజన్-7 లో‌ హీటెడ్ నామినేషన్స్ సోమవారం రోజున జరిగాయి‌. హౌజ్ లో పన్నెండు మంది కంటెస్టెంట్స్ ఉండగా అందులో ఏడుగురు నామినేషన్లో ఉన్నారు. శివాజీ, పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ, శోభా శెట్టి, ఆట సందీప్ సేవ్ అయ్యారు. మిగిలిన వాళ్ళంతా నామినేషన్లో ఉన్నారు. నామినేషన్లో ప్రియాంక జైన్ మొదటగా స్టార్ట్ చేసింది. ' ఆ రోజు జరిగిన గొడవలో.. మీ ఇద్దరికి వినండని చెప్పాను. కానీ మీరు మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు' అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నాని యావర్ ని ప్రియాంక జైన్ నామినేట్ చేసింది. ఇంటి పనులు తక్కువ చేస్తున్నావని గౌతమ్ కృష్ణని ప్రియాంక జైన్ నామినేట్ చేసింది.  టేస్టీ తేజని పల్లవి ప్రశాంత్  నామినేట్ చేశాడు. ఇక ప్రియాంక జైన్ , శుభశ్రీ  దామిణి అందరూ కలిసి పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేశారు.  దామిణిని పల్లవి ప్రశాంత్  నామినేట్ చేశాడు. శుభశ్రీని శోభా శెట్టి నామినేట్ చేసింది. టూ వీక్స్ నుండి నామినేషన్ కి రాలేదు. సేఫ్ గేమ్ ఆడుతున్నావని అనిపిస్తుందని అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నానని శుభశ్రీని శోభా శెట్టి నామినేట్ చేసింది. సెకండ్ నామినేషన్ గా రతికని శోభా శెట్టి తనని నామినేట్ చేసింది. గౌతమ్ కృష్ణని అమర్ దీప్ ని నామినేట్ చేశాడు. ఆ రోటీ, ఆమ్లెట్ కాకుండా ఇంకేమైనా పనులు చేస్తే బాగుంటుందని గౌతమ్ కృష్ణని అమర్ దీప్ నామినేట్ చేశాడు. సెకండ్ నామినేషన్ గా శుభశ్రీని నామినేట్ చేశాడు అమర్ దీప్. నువ్వు రోటీ చేస్తున్నావ్, అక్కడే ఉంటున్నావని బయటకు రమ్మని శుభశ్రీని నామినేట్ చేశాడు అమర్ దీప్. అన్నిపనులు చేస్తే బాగుండని శుభశ్రీని రతిక నామినేట్ చేసింది‌. ఆడియన్స్ పరంగా ఉన్నావా లేవా అని అనుకుంటారను శుభశ్రీని ఉద్దేశించి రతిక అంది. హౌజ్ లో ఇంక టైమ్ స్పెండ్ చేయాలనేది నా రీజన్ అని చెప్పి శుభశ్రీని నామినేట్ చేసింది రతిక. సెకండ్ నామినేషన్ గా గౌతమ్ కృష్ణని రతిక నామినేట్ చేసింది. ' ఫస్ట్ విను, నా అంతట నేను వచ్చి నాకు ఏదైనా కావాలా' అని గౌతమ్ కృష్ణతో రతిక అంది. ప్రిన్స్ యావర్ ని మొదట దామిణి నామినేట్ చేసింది. సెకండ్ నామినేషన్ గా శుభశ్రీని నామినేట్ చేసింది దామిణి.  రతికరోజ్ ని గౌతమ్ కృష్ణని నామినేట్ చేశాడు. ఎందుకంటే సగం ప్రాబ్లమ్స్ నీ వల్లే జరిగాయని గౌతమ్ కృష్ణ అన్నాడు. అయిదుగురం మాట్లాడుకొని ఒక డీల్ కి వచ్చినప్పుడు ‌మనం అని డిసైడ్ కావాలి కానీ నువ్వు పర్సనల్ గా నీ గురించి ఆలోచించావని రతికని గౌతమ్ కృష్ణ అన్నాడు. సెకండ్ నామినేషన్ గా అమర్ దీప్ ని గౌతమ్ కృష్ణ నామినేట్ చేశాడు. మీ టీమ్ వాళ్ళు చేసిన పనికి మేమ్ సంకనాకిపోయామని అమర్ దీప్ అన్నాడు. ప్రియాంక జైన్ ని శుభశ్రీ నామినేట్ చేసింది. టేస్టీ తేజని శుభశ్రీ నామినేట్ చేసింది.  

సౌజన్యరావుకి మాస్ వార్నింగ్ ఇచ్చిన రిషి.. ఫణీంద్ర ఎమోషనల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -871 లో..‌సౌజన్య రావు, శైలేంద్రల ప్లాన్ తిప్పికొట్టేలా మురుగన్ కోటి రూపాయలు తీసుకొని వస్తాడు. అసలు మిమ్మల్ని ఎవరు పంపించారని శైలేంద్ర అనగానే.. ఆ విషయంతో మీకు సంబంధం లేదు, వసుధర మేడమ్ మీరు చెప్పండని మురుగన్ అనగానే.. నేను చూసుకుంటా మీరు వెళ్ళండని మురుగన్ కి వసుధార చెప్తుంది. ఆ తర్వాత మురుగన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అసలు విషయానికి వస్తే మురుగన్ దగ్గర డబ్బులు అడిగి రిషి తనని తీసుకొని వెళ్ళమని చెప్తేనే మురుగన్ DBST కాలేజీకి వస్తాడు‌. ఆ తర్వాత ఎవరతను? అతని వెనకాల ఎవరు ఉన్నారని సౌజన్య రావు అడుగుతాడు. సరే మీకు చూపిస్తానని వసుధార వీడియో కాల్ ఆన్ చేసి రిషిని చూపిస్తుంది. రిషిని చూసి శైలేంద్ర షాక్ అవుతాడు. రిషి ఎవరితో మాట్లాడకుండా కేవలం సౌజన్య రావుకి వార్నింగ్ ఇస్తాడు. ఇంకొకసారి నా కాలేజీ జోలికి రాకంటూ గట్టిగానే రిషి వార్నింగ్ ఇస్తాడు. ఇక ఆ తర్వాత సౌజన్య రావు వెళ్లిపోతుంటే.. మహేంద్ర పిలిచి మరి అగ్రిమెంట్ పేపర్ చింపివేస్తావ్ డబ్బులు తీసుకొని వెళ్ళమని మహేంద్ర చెప్పగానే సౌజన్య రావు అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత నాకు రిషితో మాట్లాడాలని ఉంది. రిషి ఎక్కడ అని వసుధారని మహేంద్ర అడుగుతాడు. సరే చూపిస్తా వెళదాం పదండని వసుధార అనగానే అందరూ రిషి దగ్గరికి బయల్దేరి వెళ్తారు. మరొక వైపు రిషి అందరిని ఆశ్చర్యంగా చూస్తాడు. వెంటనే ఫణింద్ర వెళ్లి‌‌.. రిషిని హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత దేవాయని కూడా వెళ్లి హగ్ చేసుకుంటుంది. రిషిని మళ్ళీ తిరిగి రమ్మని ఫణింద్ర అడుగుతాడు. ఆ తర్వాత ఇక నేను రాలేను.. నన్ను ఈ ఇద్దరు మోసగాడని నింద వేశారని రిషి అనగానే.. నువ్వు ఏం తప్పు చెయ్యలేదని  నిరూపించుకోవాలని ఫణింద్ర చెప్తాడు. నేను నిరూపించుకొని వాళ్ళని దోశులను చెయ్యలేనని రిషి అంటాడు. ఇప్పటికైన అసలు ఏం జరిగింది చెప్పమని జగతిని ఫణింద్ర అడుగుతాడు. చెప్తానని జగతి అనగానే.. శైలేంద్ర, దేవయాని ఇద్దరు టెన్షన్ పడుతారు. ఆ తర్వాత జగతి చెప్పబోతుంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రయోజనం లేదని రిషి అంటాడు. రిషి మమ్మల్ని వదిలి వెళ్ళవద్దని ఫణింద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

తన మనసులో ఎప్పటికి కృష్ణే ఉంటుందని చెప్పిన మురారి!

స్టార్ మా టీవీలో‌ ప్రసారమవుతున్న సీరియల్  'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్‌లో ముకుంద గదిలోకొ రేవతి వస్తుంది. నువ్వు చేసేది తప్పని నీకు అనిపించడం లేదా అని ముకుందని రేవతి అడుగుతుంది. అదేం లేదని నేను నా ప్రేమ కోసమే ఇదంతా చేస్తున్నానని, వాళ్ళిద్దరు అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి మనకి చెప్పకుండా ఇన్ని రోజులు మోసం చేశారు కదా వాళ్ళు చేసిందే తప్పని, ముకుంద వెడ్స్ మురారి ఇదే జరుగుతుందని,  రేవతితో ముకుంద అంటుంది. ఆ తర్వాత మురారి ఇంటికి రాగానే భవాని ఒక్కడివే వచ్చావేంటని అడుగుతుంది. చాలా సీరియస్ కేస్ అని అర్జెంట్ అని వెళ్ళిందని అంటాడు. పక్కనే ఉన్న మధు.. కృష్ణ ఇంట్లోనే ఉందని, అప్పడే వస్తున్న కృష్ణని చూపిస్తాడు‌ మధు.  ఆ తర్వాత మంచి లవ్ స్టోరీ రాశానని మధు అనగానే.. ఓకే కంగ్రాట్స్ అని కృష్ణ అంటుంది. ఆ తర్వాత ముకుంద వచ్చి.. భోజనం రెడీ అయింది, మురారి నువ్వు ఫ్రెష్ అయి వస్తే వడ్డిస్తానని ముకుంద అంటుంది. ఏంటి ముకుంద వంట చేసిందా అని కృష్ణ అనుకుంటుంది. కృష్ణకి ఏదో ఆపరేషన్ ఉందన్నావని భవాని అడుగుతుంది. ఏసీపీ సర్ కాల్ చేశారు. కానీ నేను ఆపరేషన్ తర్వాత ఒక బర్త్ డే పార్టీకి వెళ్ళాలనిపించలేదు‌. ఏసీపీ సర్ కి కాల్ చేసి చెప్పలేదని కృష్ణ అంటుంది. వీళ్ళిద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారని కృష్ణ అనుకుంటుంది.  ఏసీపీ సర్ ని ప్రేమించి, ఆదర్శద్ కోసం ఇవన్నీ ముకుంద చేస్తుందా అని కృష్ణ అనుకొని.. నిజమేనా ముకుంద అంటుంది. ఏసీపీ సర్ ఫ్రెష్ అవుదురు రండి అని తోసుకెళ్తుంది కృష్ణ. మరొకవైపు ముకుంద గదిలోకి అలేఖ్య వెళ్తుంది. నీ స్పీడ్ చూస్తుంటే భయమేస్తుందని అలేఖ్య అంటుంది. నీ విషయం బయటపడకుండా, సింపుల్ గా పెద్దత్తయ్య వాళ్ళు ఒప్పుకుంటే బాగుండు కదా, నాకు భయమేస్తుందని అలేఖ్య అంటుంది. నమ్మకం ఉన్న చోట భయం ఉండకూడదని ముకుంద అంటుంది. కృష్ణ, మురారి గదిలో మాట్లాడుకుంటారు. తను మౌనంగా బాధపడుతుంది. ఏంటని మురారి అడుగుతాడు. నేను అడిగే ప్రశ్నలకు మీరు సూటిగా నిజాలు చెప్పలేరని కృష్ణ అంటుంది. ఆ తర్వాత మధు, అలేఖ్య ఇద్దరు ఎప్పటిలాగే రీల్స్ చేస్తూ గొడవపడుతుంటారు. కాసేపటికి అందరూ భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. అప్పుడు ముకుంద యాక్టివ్ గా పనిచేయడం చూసిన భవాని.. ఇంటి బాధ్యతలు తీసుకున్నాక ముకుందలో చాలా మార్పు వచ్చింది కదా రేవతి అని భవాని అంటుంది. అవునక్క ఈ మధ్య కొంచెం స్పీడ్ పెంచిందని రేవతి అంటుంది. స్పీడ్ అంటే ఏంటని భవాని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

అపర్ణని కావ్య మార్చేయగలదా.. అప్పుని కళ్యాణ్ కలవగలడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -204 లో..  కళ్యాణ్ గురించి అనామిక అలోచిస్తుంటుంది. అప్పుడే అనామిక వాళ్ళ నాన్న వచ్చి నువ్వు ఎందుకో హ్యాపీగా ఉన్నట్టున్నావ్.. కళ్యాణ్ కీ ప్రపోజ్ చెయ్యబోతున్నావా అంటూ ఎంకరేజ్ చేస్తాడు. ఆ తర్వాత అనామిక వాళ్ళ అమ్మ వాళ్ళ మాటలు విని కూతురికి అలాగేన చెప్పేదని అనగానే.. అమ్మయి ప్రేమించేది ఎవరినో కాదు దుగ్గిరాల వారసుడిని, మన కూతురు ఆ ఇంట్లో సంతోషంగా ఉంటుందని చెప్పగానే.. అనామిక  వాళ్ళ అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక కళ్యాణ్ కి అనామిక ప్రపోజ్ చెయ్యలనుకుంటుంది. మరొకవైపు కళ్యాణ్ కి అప్పు ఫోన్ చేసి.. నాకు రేపు పని ఉంది. కలుస్తావా మళ్ళీ హ్యాండ్ ఇస్తావా అని అడుగుతుంది. లేదు వస్తానని కళ్యాణ్ అంటాడు. మరొకవైపు అనామిక రేపు కలవాలని మెసేజ్ చేస్తుంది. దానికి కూడా కళ్యాణ్ సరే అంటాడు.   మరొక వైపు ఇంట్లో అందరు భోజనానికి సిద్ధం అవుతారు. అపర్ణ ఇంకా రావడం లేదని వెయిట్ చేస్తుంటారు. వెళ్లి తీసుకొని రావచ్చు కదా అని దాన్యలక్ష్మి అంటుంది. అబ్బో నేను వెళ్ళలేను కూరగాయలు కట్ చేసేటప్పుడు చూసావా ఎంత కోపంగా ఉందోనని రుద్రాణి అనగానే.. ఏంటి అపర్ణ కూరగాయలు కట్ చేసిందా అని ఇందిరాదేవి అంటుంది. అవును తాను వేరే వంట చేసుకుందని రుద్రాణి చెప్తుంది. ఆ తర్వాత వేరుగా అపర్ణ వండుకున్నవి తీసుకొని వచ్చి హాల్లో కూర్చొని ఉంటుంది. ఇక్కడ అంత సిద్ధం చేస్తే అక్కడ ఎందుకు కూర్చొని ఉన్నావని ఇందిరాదేవి అడుగుతుంది. నా వంట నేను చేసుకున్న ఇక వేరుగా ఉంటానని అపర్ణ అనగానే.. ఇంట్లో కోడళ్ళకి నువ్వు నేర్పించేది ఇదేనా అంటూ ఇందిరాదేవి ఆస్తి పేపర్స్ తీసుకొని వస్తుంది. వంట విషయంలో వేరుగా ఎందుకు? ఆస్తులు కూడా పంచుకొని వేరుగా ఉండండని, ఏం నిర్ణయం తీసుకుంటావో తీసుకోమని  అపర్ణతో ఇందిరాదేవి చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంట్లో అందరూ తినకుండా వెళ్ళిపోతారు. మరొక వైపు ఇందిరాదేవి దగ్గరికి రాజ్ వెళ్తాడు. అమ్మను నువ్వే మర్చాలి. ఎవరి మాట వినేలా లేదు. కావ్య తప్పు లేదు కాబట్టి తనకి సపోర్ట్ చేసానని రాజ్ అంటాడు. ఆ మాటలు కావ్య వింటుంది. నేను చేసిన పనికి ఇంత గొడవ అయింది. నేనే సాల్వ్ చెయ్యాలని కావ్య అనుకొని అపర్ణ దగ్గరికి వెళ్లి మాట్లాతుంది. అయిన అపర్ణ మాట్లాడదు. మీరు నేను చెప్పేది వినండి చాలని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

తను చస్తే ఆ పద్నాలుగు మంది రావాలంట!

బిగ్ బాస్ సీజన్-7 రోజురోజుకి ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటికే హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరేంటని బిగ్ బాస్ ప్రేక్షకులకు అర్థమైంది. అయితే ఈ వారం ఒక్కొక్కరికి హోస్ట్ నాగార్జున చాలా గట్టిగానే క్లాస్ పీకాడు. అమర్ దీప్ కంటెస్టెంట్స్ ని రారా, పోరా, వినురా అంటూ మర్యాద లేకుండా మాట్లాడటాన్ని ఇప్పటికే ప్రేక్షకులు తీసుకులేకపోతున్నారు. దాని గురించి నాగార్జున ‌మాట్లాడకపోవడం అనుమానాలకు దారితీస్తుంది. సీజన్-7 మొదలైందే ఉల్టా పల్టా థీమ్ తో.. అంటే సాధారణంగా ప్రతీ సీజన్ లో లాగా ఓటింగ్ లో చివరన ఉండేవాళ్ళని కాకుండా ఈ సారి ఉల్టా పల్టా చేసి.. టాప్ లో ఉండేవారిని ఎలిమినేట్ చేస్తారేమో అని అనుకున్నారంతా, కానీ ఓటింగ్ ప్రకారం టాప్ లో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. శివాజీ సెకండ్ స్థానంలో ఉన్నాడు. చివరి స్థానంలో షకీల ఉంది. ఇక రతిక మైండ్ గేమ్ పనిచేయకపోగా, కంటెంట్ కోసం నటిస్తోందని ప్రేక్షకులకు ఇప్పటికే అర్థం అయింది. దాంతో తను అయిదవ స్థానానికి పడిపోయింది. ఇక టేస్టీ తేజ ఉన్నాడా లేదా అనిపిస్తుంది. టేస్టీ తేజ ఎలిమినేట్ అవుతాడని అనుకున్నారంతా కానీ షకీల ఎలిమిమేట్ అయింది. షకీల ఎలిమినేషన్ జరిగిన తర్వాత బిబి బజ్ ఎగ్జిట్ ఇంటర్వ్యూ గీతు రాయల్ తో జరిగింది. అయితే తాజాగా ఆ ప్రోమో విడుదలైంది. కాగా ఈ ప్రోమోలో షకీల కొన్ని ఆసక్తికరమైన విషయాలని షేర్ చేసింది. మీరు ఆశ్రమానికి వెళ్ళారనుకున్నారా? బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్ళారనుకున్నారా? అని గీతు రాయల్ అడుగగా.. ఎక్స్ క్యూజ్ మి అని షకీల అంది. హౌజ్ లో శివాజీ గారి బ్యాచా? లేక సీరియల్ బ్యాచా? అని గీతు రాయల్ అడుగగా.. నేను చెప్పానా అని షకీలా అంది. నేను అడుగుతున్నాని గీతు రాయల్ అనగా‌‌.. నువ్వెవరు నన్నడిగేదని షకీల అంది. ఒక్కో కంటెస్టెంట్ గురించి చెప్పమని గీతు రాయల్ అడుగగా.. ప్రిన్స్ యావర్ వెదవ, శోభా శెట్టి మాస్క్ వేసుకుంది. శివాజీ బిగ్ బ్రదర్ లాగా ఉన్నాడని షకీల అంది‌. రతికని బ్యూటిఫుల్ స్నేక్ అని, తను ఎవరికి ఐ కాంటాక్ట్ ఇవ్వదని, ఇస్తే దొరికిపోతుందని షకీల అంది. బిగ్ బాస్ హౌజ్ లో షకీల సేఫ్ గేమ్ ఆడుతుందా అని గీతు రాయల్ అడుగగా.. నేను చస్తే ఈ పద్నాలుగు మంది రావాలి. అది నాకు కావాలా అని షకీల అంది. ఇలా ఒక్కో కంటెస్టెంట్ గురించి తన పాయింటాఫ్ లో చెప్పింది షకీల‌.

ట్రెండింగ్ లో బిగ్ బాస్ నామినేషన్స్ ప్రోమో.. దామిణి వర్సెస్ యావర్!

బిగ్ బాస్ సీజన్-7 ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుంది. మొదటి వారం కిరణ్ రాథోడ్ ఎలిమినేషన్ అయింది. రెండవ వారం షకీల ఎలిమినేట్ అయింది. ‌కాగా  ఇప్పుడు హౌజ్ లో పన్నెండు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. సోమవారం రోజున జరిగే నామినేషన్లకి ఒక క్రేజ్ ఉంటుంది. ఈ ప్రోమో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. నామినేషన్లు ఒక పొలిటికల్ పార్టీకి మరొక పొలిటికల్ పార్టీకి మధ్య మాటల యుద్ధంలా జరుగుతుంటాయి. కాగా ఈ నామినేషన్లో ప్రియాంక జైన్ కొత్తగా జాయిన్ అయింది. గత రెండు వారాల్లో ఒక్కసారి కూడా నామినేషన్ కానీ శుభశ్రీ రాయగురు, ప్రియాంక జైన్ మూడవ వారం నామినేషన్లో ఉన్నారు‌.  ఇక ఆట సందీప్, శివాజీ ఇద్దరు పవరస్త్రని సాధించారు కాబట్టి వారు నామినేషన్లో ఉండరు. మిగిలిన పది మందిలో ఏడుగురు నామినేషన్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. యావర్ కి దామిణికి మధ్య మాటల యుద్ధం జరినట్టుగా ఉంది. ఇక శుభశ్రీని అమర్ దీప్ నామినేట్ చేసి.. అసలు ఏనాడైన హౌజ్ లో ఊడ్చావా అంటూ నిలదీశాడు. ఇక అందరు రతికని టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ప్రియాంక జైన్, శుభశ్రీ రాయగురు, దామిణి, అమర్ దీప్,‌ ప్రిన్స్ యావర్, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, రతిక నామినేషన్లో ఉన్నట్టుగా తాజాగా రిలీజైన ప్రోమోలో తెలుస్తోంది. మరి వీరిలో ఎవరు నామినేట్ అయ్యారు? ఎవరు కాలేదో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్‌ వరకు ఆగాల్సిందే. అయితే ఇప్పటికైతే టేస్టీ తేజ, శోభా శెట్టి, ప్రియాంక జైన్ వీక్ కంటెస్టెంట్ అని తెలుస్తుంది. కాగా ఈ సారి పల్లవి ప్రశాంత్ సేఫ్ లో ఉన్నాడు. అతడిని ఎవరు నామినేట్ చేయలేదని తెలుస్తుంది. అయితే అమర్ దీప్ కి నెగటివ్ కామెంట్స్, ట్రోల్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. మరి మూడవ వారం బిగ్ బాస్ హౌజ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంటుందనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఉల్టా పల్టాతో సాగుతున్న ఈ సీజన్ లో మూడవ వారం ఎలా ఉంటుందో చూడాలి మరి!

సీరియల్ బ్యాచ్ కి వార్నింగ్.. యావర్ పై నాగార్జున ఫైర్!

బిగ్ బాస్ సీజన్-7 ఆసక్తికరంగా సాగుతుంది. కాగా ఒక్కో వారం ఒక్కో కొత్త కంటెంట్ తో మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. కాగా ఈ సీజన్ లో కొత్త కంటెస్టెంట్ ఇచ్చే స్టఫ్ తో ఈ షో టీఆర్పీ అత్యధికంగా ఉంది. అయితే సోమవారం జరిగే నామినేషన్లు, శని ఆదివారాలలో నాగార్జున ఎపిసోడ్‌ల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. పాలిటిక్స్ తరాహాలో నామినేషన్లు సాగుతున్నాయి. బిగ్ బాస్ సీజన్-7 లో స్టార్ మా టీవీ సీరియల్స్ నటించిన ప్రియాంక జైన్, అమర్ దీప్, శోభా శెట్టి అంతా కలిసి ఒక బ్యాచ్ గా కూర్చోవడం, మాట్లాడుకోవడం కావాలని మిగిలిన కంటెస్టెంట్స్ ని టార్గెట్ చేయడం చేస్తున్నారు. గతవారం జరిగిన నామినేషన్లో ఈ ముగ్గురు కావాలని పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేశారు. ఇదే విషయం నాగార్జున కూడా అన్నాడు. అయితే అమర్ దీప్ నామినేషన్ల ముందు.. 'అందరం కలిసి నామినేట్ చేద్దాం, ఏం చేస్తాడో చూద్దాం' అంటూ పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడిన మాటలన్నీ బయటకొచ్చాయి. ఇప్పుడు అది హాట్ టాపిక్ గా మారింది.‌ కావాలని టార్గెట్ చేసి ఈ సీరియల్ బ్యాచ్ చేసే పనులకి నాగార్జున గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు.  అయితే ఈ సీరియల్ బ్యాచ్ కి సపోర్ట్ గా ఆట సందీప్ ఉన్నాడు. ఇతనికి పవరస్త్ర ఉంది కాబట్టి సేఫ్ జోన్ లో ఉన్నాడు. ఇక మొన్న జరిగిన టాస్క్ లో అమర్ దీప్ ని ఎందుకు సెలెక్ట్ చేశావని ఆట సందీప్ ని నాగార్జున అడుగగానే ఆట సందీప్ తడబడుతూ మాట్లాడాడు. దాంతో వాళ్ళు కావాలనే ఒక్కటై ఆడుతున్నారని అందరికి తెలిసిపోయింది. ఇక టేస్టీ తేజ ఎవరివైపు వెళ్ళకుండా తటస్థంగా ఉన్నాడు. రతిక కంటెంట్ కోసం చాలా కష్టపడుతుంది. కానీ పెద్దగా వర్కవుట్ అవడం లేదు. ఎందుకంటే అందరికి తను రతిక కాదు రాధిక అని అర్థమైంది. అయితే సండే ఎపిసోడ్‌లో ఎవరు బల్లాలదేవ, ఎవరు కట్టప్ప అంటూ ఒక్కో కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేసుకోమని నాగార్జున చెప్పగా.. ఒక్కొక్కరు వచ్చి వారికి ఎవరెలా అనిపించారో చెప్పారు. అయితే షకీల యావర్ ని బల్లాల దేవ అని, టేస్టీ తేజని కట్టప్ప అని వ్యాలిడ్ రీజన్ చెప్పింది. యావర్ ఒక్కడి వల్లే రణధీర టీమ్ గెలిచిందని ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మేమేం చేయలేదంట అని షకీల మాట్లాడుతుంటే .. యావర్ మద్యలో కలుగజేసుకొన్నాడు. నాగార్జున మాట్లాడుతున్న సరే యావర్ పట్టించుకోకుండా మాట్లాడుతునే ఉన్నాడు. దాంతో  "ఆగు యావర్.. మాట్లాడుతున్నాను కదా " అంటూ గట్టిగా ఫైర్ అయ్యాడు నాగార్జున. 

సండే ఆటలో పల్లవి ప్రశాంత్ విన్నర్.. అమర్ దీప్ లూజర్!

బిగ్ బాస్ సీజన్-7 లో ప్రతీ వారం ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు. అయితే సన్ డే ఫన్ డే అంటూ సాగే ఈ ఎపిసోడ్‌ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.‌ ఇప్పటికే రెండు వారాలు పూర్తిచేసుకుంది బిగ్ బాస్. కాగా ఇద్దరు ఎలిమినేషన్ అవగా పన్నెండు మంది కంటెస్టెంట్స్ మిగిలారు. బిగ్ బాస్ సీజన్-7 హోస్ట్ నాగార్జున సండే రోజు ట్రెండీ డ్రెస్ తో రాక్ స్టార్ లా వచ్చాడు. వినాయకచవితి సందర్భంగా మట్టి వినాయకుడిని తీసుకొచ్చి ఒక దగ్గర ఉంచి పూలు చల్లాడు. ఆ తర్వాత తనదైన స్టెప్పులతో డ్యాన్స్ అదరగొట్టాడు. కాగా ఇక సండే ఫంఢే రోజు గేమ్స్ తో అలా సందడి చేశాడు. అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ఇద్దరిని పిలిచి ఒక గేమ్ ఆడించాడు నాగార్జున. సినిమాలోని ఒక స్టిల్ వస్తుంది. అది ఏ సినిమాలోనిది చెప్పాలని నాగార్జున చెప్పాడు. అయితే అక్కడ ఒక బెల్ ఇచ్చి అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ లకి చెరొక సుత్తి ఇచ్చి ఎవరు మొదట బెల్ కొడతారో వారికే సమాధానం చెప్పే ఛాన్స్ వస్తుందని నాగార్జున చెప్పాడు. అయితే ఈ వారం జరిగిన రణధీర నుండి అమర్ దీప్, మహాబలి టీమ్ నుండి పల్లవి ప్రశాంత్ లు వచ్చారని నాగార్జున చెప్పి, ఈ గేమ్ గెలిచిన వారికి లగ్జరీ బడ్జెట్ అందుతుంది. స్పెషల్ పవర్స్ వస్తాయని నాగార్జున అన్నాడు.  ఇక పల్లవి ప్రశాంత్ తన దూకుడు ప్రదర్శించాడు. ఆటలో యాక్టివ్ గా ఉంటు తన మహాబలి టీమ్ ని గెలిపించి లగ్జరీ బడ్జెట్ వచ్చేలా చేశాడు. అయితే పల్లవి ప్రశాంత్ బెల్ కొట్టే ప్రతీ సారీ అమర్ దీప్ అతడిని అరేయ్, ఓరేయ్ అంటూ మర్యాద లేకుండా అన్నాడు. ఇక గేమ్ అని నాగార్జున కూడా ఏం అనలేకపోయాడు. కాగా ఈ గేమ్ లో అమర్ దీప్ ఓడిపోయాడు. పల్లవి ప్రశాంత్ గెలిచాడు. దీంతో హౌజ్ లో అందరికి పల్లవి ప్రశాంత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని తెలిసిపోయింది.