కాంగ్రెస్ హస్తరేఖల్లో జగన్ జాతకం!

  తన బెయిలాశలన్నీ ఒకటొకటిగా అడియాసలవుతుంటే, క్రమంగా చంచల్ గూడా జైల్లో స్థిరపడిపోయిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు నవ్వాలో బాధపడాలో తెలియని పరిస్తితి నెలకొంది. ఒక వైపు జైలునుండి బయటపడలేని దీనస్థితి. మరోవైపు తనపార్టీలోకి జేరెందుకు జైల్లోకి బారులు తీరి వస్తున్న రాజకీయనాయకులూ! తానూ జైల్లోఉన్నపటికీ అంతగా ప్రభావం చూపగలుగుతున్నందుకు సంతోషించాలా? లేక జైలే తన కార్యాలయం అయిపొయినందుకు బాధపడాలా అతను? మొత్తంమీద అతనిప్పుడు ఒక త్రిశంకు స్వర్గంలో వ్రేలాడుతున్నాడు.   ఇక, ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ కీలకతరుణంలో, ఈ విధంగా నిస్సహాయంగా జైలుగోడల మద్యన ఇర్రుకుపోవడం మరో దురదృష్టమేనని చెప్పాలి. ఎప్పటికయినా, తను బయటకి వస్తాడా? లేక కలకాలం సి.బి.ఐ. కేసులతో నలిగిపోతూ చంచల్ గూడా జైలులోనే భారంగా బ్రతకలా?రేపు ఎన్నికలు వచ్చేనాటికయినా తానూ బయట పడకపోతే పార్టీకి దిక్కెవరు?పార్టీలోకి వస్తున్న లేదా ఇప్పటికే వచ్చినవారిని నిలుపుకోనేదేలా?తానూ జైల్లో ఉంటే తనపార్టీ ఇంతే పటిష్టంగా ఉంటూ రేపు ఎన్నికలని దైర్యంగా ఎదుర్కొనగలదా? లేక ఒకప్పుడు ప్రజారాజ్యం లాగానే కుప్పకూలిపోయి చివరకి ఆ కాంగ్రెసులోనే కలిసిపోక తప్పదా? జైల్లో ఉండి తానూ పార్టీని గెలిపించుకొని ఆ పార్టీ అండతోనే జైల్లోంచి బయట పడతాడా? లేక తన తల్లీ చెల్లీ ప్రజలకి చెపుతున్న విదంగా తానూ నిర్దోషిగా జైలునుండి విముక్తుడయి హుందాగా ఎన్నికలలో పాల్గొని రాజ్యదికారం హస్తగతం చేసుకొంటాడా? కాంగ్రెస్ అతనిని మళ్ళీ పార్టీలోకి స్వాగతించి కేసులనీ రద్దు చేసేసి, ముఖ్యమంత్రిగా అతనికి పట్టంకడుతుందా లేక అతనిపై మరిన్ని కేసులు నడిపించి శేషజీవితం జైల్లోనే గడిపేలా చేస్తుందా? సమాధానం దొరకని ఇటువంటి బేతాళ ప్రశ్నలు ఎన్నెనో జగన్ మనసుని దోలిచేస్తూ ఉండవచ్చును. బహుశః ఇటువంటి జీవితాన్ని కలలో కూడా అతను ఊహించి ఉండడు.   అతని జాతకం అతని బవిష్యత్ గురించి  ఏమి చెపుతోందో తెలుసుకోవాలంటే చూడవలసింది అతని హస్త రేఖలు మాత్రం కాదు. కాంగ్రెస్ ‘హస్తరేఖలు’ అతని జాతకం వివరించబోతున్నాయి. సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే బలహీనంగా ఉన్న కాంగ్రేసు పార్టీ మున్ముందు మరింత బలహీన పడితే తప్ప అతనికి స్వేచ్చ లబించే అవకాశం లేకపోవచ్చు. ఒక వేళ, కాంగ్రెస్ మరింత బలహీనపడినప్పుడు, అది సహజంగా జగన్ వంటి ఆకర్షణగల నాయకుడికోసం తన ద్వారాలు తెరవకతప్పదు. రానున్న ఎన్నికలలో బలంగా ఉన్న తె.రా.స.ను డ్డీ కొనడం, మంచి కార్యకర్తల బలం కలిగి రాబోయే ఎన్నికలలో చావో రేవో తెల్చుకోబోయే తే.దే.ప.ఇచ్చే గట్టి పోటీని తట్టుకోవడం, పార్టీలో అంతర్గతకుమ్ములాటలకు ముక్కుతాడు వేయడం వంటి క్లిష్టమయిన సవాళ్లు ముందున్న కాంగ్రెస్ పార్టీ, వాటిని దైర్యంగా అదిగమించగలనని భావిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డికి విముక్తి ఉండకపోవచ్చును. ఒకవేళ, కాంగ్రేసు పార్టీ బలంగా ఉంటే ఆ తరుణంలో జగన్ వంటిబలవంతుడయిన, ప్రభావంతుడయిన విరోదిని కోరుండి అది జైలు నుంచి బయటకి రానిచ్చి కొరివితో తల ఎందుకు గోక్కోవాలని ఎందుకు ఆలోచిస్తుంది? గనుక, వీలయితే అతనిని మరిన్ని కేసులలో ఇరికించి కనీసం ఎన్నికలయ్యేవరకయినా, తన విజయానికి అడ్డుగోడగా నిలువగల అతనిని జైలుగోడలకే పరిమితం చేయవచ్చును. అందువల్ల, కాంగ్రెస్ మరింత బలహీనపడితే తప్ప జగన్కి జైలు విముక్తి లంబించకపోవచ్చును. కాంగ్రేసుకి కష్టం అనుకొంటే మాత్రం అతను రేపు ‘తల్లి కాంగ్రేసు’ ఒడిలో ఒదిగిపోయి మనకి కనిపించినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. అంటే, జగన్ ఇప్పుడు కోర్టుతీర్పులకన్నా కాంగ్రెస్ బలహీన పడటం కోసమే చకోర పక్షిలా ఎదురు చూపులు చూస్తూ చంచల్ గూడా జైల్లో వేచి ఉండక తప్పదు.

The story behind NTR’s statue

  Media these days was bitten by the controversy on installing the statue of late NT. Ramarao at parliament. It is updating the latest counters given by either side of the people or tries to rope-in some one from the family or from the TDP to its table to debate on this hot topic, thus sincerely contributing from its end. People from both sides were not shown any intention of discontinuing this ugly battle that hurts late NTR fans living across the globe.   While, minister D.Purandeswari is trying to prove her honesty in this regard, TDP leaders including Balakrishna were seen sharply criticizing her and her Congress party. Nandamuri brothers Harikrishna and Balakrishna were also drawn into this controversy. However, what would be their actual intention in taking such a simple matter to roads, while they can resolve this problem by simply calling for a family meeting? Why Nandamuri daughter Purandeswari did also goes to media to counter Chandrababu, instead of calling a family meeting? Why Chandrababu did allows his party leaders to go heavy against his own family members, even though knowing it damages his own family reputation?   As far as D.Purandeswari is concerned she appears to be honestly trying to install her father late NTR’s statue at the parliament. But, she might be obliged to join this dirty fight to save herself from the TDP attacks and to safeguard her political career in Congress party. If, she didn’t responds to TDP’s attack it not only leaves an impression in the public that she is the sinner in the whole issue, but also may damage her political career in her party. Her silence in this regard will make her party suspect of her sincerity and loyalty towards it. So, she might be obliged to retard to every remark that made against her by TDP and the concerned people. Otherwise, she is not a person who loves to rub the media on wrong side.   If we look from TDP end, we can see it badly trapped in a very serious issue recently. Its 3 MPs absence to FDI voting in Rajya Sabha brings the party to its knees. It becomes a concern for Chandrababu, who very well knew that unless he put an end to it at the earliest it is going to damage the party reputation at a crucial moment where the general elections are in the vicinity.   Any political party finds itself trapped in such problems normally adopt the well practiced tradition of diverting the issues with some other hot topics of media and public interest. The most experienced politician of the state Chandrababu Naidu also tried the same trick to overcome his problems. If we could recall his public letter shot to D.Purandeswari soon after her announcement of installing NTR statue at Parliament, it gives us the clue that Chandrababu has intentionally stirred the storm-in-the-tea cup guessing it would be appropriate topic to divert the people and media attention.   Obviously it worked well better than his expectations. Both the media and the people and even his rivals in YSRC have been grasped into it without their knowledge, with which the 3 MPs absence to FDI voting faded away in no time. That may be the exact reason for Chandrababu letting his party leaders spit fire against his own family members. He may put an end to this topic as soon as he confirms that the ‘3 MPs absence to FDI voting’ matter was completely vanished from the public discussions.

గుజరాత్ ఎన్నికలు ఎవరి భవితవ్యం తెల్చబోతున్నాయి? మోడీ, రాహుల్ గాంధీ ?

  మరొక మూడు రోజుల్లో గుజరాత్ శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఒక వైపు గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్రమోడీ ఒక్కడే ‘వన్ మ్యాన్ షో’ తో ఎన్నికలలో అవలీలగా దూసుకుపోతుండగా, మరో వైపు కాబోయే ‘భావి భారత ప్రధాని’ రాహుల్ గాంధీ నాయకత్వంలో యావత్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ప్రచారానికి నడుం బిగించాల్సి వచ్చింది.   రాహుల్ గాందీయే స్వయంగా ఏర్చికూర్చిన అభ్యర్ధుల కోసం ప్రధాని మన్మోహన్ సింగు మొదలుకొని గుజరాత్ లో గల్లీస్తాయి నాయకులవరకూ అందరూ చమటోడుస్తున్నారు. ఆ అభ్యరుల విజయం అంటే రాహుల్ గాంధీ విజయమే అనంతగా కష్ట పడుతున్నారు. త్వరలో జరుగబోయే సాధారణ ఎన్నికలకి నేతృత్వం వహించనున్న రాహుల్ గాంధీకి ఇవి ‘సెమి ఫైనల్స్’ వంటివని రాజకీయ విశ్లేషకులు కూడా తీర్మానిన్చేయడంతో ఈ ఎన్నికలు అతనికి, అతని పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.   ఇప్పటికే ఉత్తరాన్న రెండు ఎదురు దెబ్బలుతినోచ్చిన రాహుల్ గాంధీకి, మళ్ళీ ఇక్కడ ఎదురు దెబ్బ తగిలితే తేరుకోవడం చాల కష్టమే. గనుకనే, కాంగ్రేసు తన యావద్ శక్తియుక్తులను దార పోసి మరీ విజయం కోసం తీవ్ర ప్రయత్నిస్తోంది. ఇక్కడ గనుక ఓడిపోతే, అది రాహుల్ గాంధీ నేతృత్వం మీద నమ్మకం సడలిం జేయడమే గాక, ‘వరుస అపజయాల సారధి’ అనే ఒక ముద్ర కూడా అతని పై పడక మానదు. ఆ ముద్ర అతని భావి కాలాలకు అడ్డంకిగా మారినా ఆశ్చర్య పోనక్కరలేదు. వరుసగా మూడోసారి కూడా విజయం తన ఖాతాలో వేసుకోగలిగితే నరేంద్రమోడీ రేపు డిల్లీ వరకు కూడా వచ్చి అక్కడా అతనికి పోటీగా తయారవుతాడు. మోడీకి జాతీయ స్తాయి నేతగా ఎదిగేందుకు బిజెపి అంగీకరిస్తుందా లేదా అనేది వేరే విషయం. ఒక వేళ ఒప్పుకొన్న దేశ వ్యాప్తంగా అతను తన ఇదే ప్రభావంచూపగలడా లేదా అనేది కూడా అప్రస్తుతం. గాని, ప్రస్తుత పరిస్తితుల్లో అతనే బిజెపికి పెద్ద దిక్కుగా కనిపిస్తున్న ఈ తరుణంలో వరుసగా మూడోసారిగానీ గెలిస్తే గనుక, మోడిని తన ప్రధాని అభ్యర్దిగా బిజెపి ప్రకటించిన ఆశ్చర్య పోనక్కరలేదు. ఇప్పటికే ‘భావి భారత్ ప్రధాని’గా అభివర్ణింపబడుతున్న రాహుల్ గాంధీకి ఇప్పుడు గుజరాత్ లో మోడీ చేతిలో ఓడిపోయి, మళ్ళీ రేపు అతనితోనే ప్రధానమంత్రి పదవికోసం పోటీ పడవలసి వస్తే అంతకంటే ఇబ్బందికరమయిన విషయం మరొకటి ఉండదు. అందువల్ల, కాంగ్రేసు ఈ ఎన్నికలలో ఎలాగయినా గెలిచి తీరాలి.   కానీ, గుజరాత్ లో పరిస్తితులు గమనిస్తే, కాంగ్రేసుకు సానుకూలంగా ఒక్కటీ కనిపించట్లేదు. ఇప్పటికే నరేంద్ర మోడీ విజయం దాదాపు ఖాయం చేసేస్తూ వెలువడుతున్న సర్వే రిపోర్టులు, మోడీ ప్రభంజనం అంటూ హోరెత్తుతున్న మీడియా వార్తలు, గుజరాత్ వంటి అభివృద్ధి దేశంలో మరెక్కడా మేము చూడ లేదంటూ పారిశ్రామిక వేత్తలు ఇచ్చే శభాషీలు, అన్నీనరేంద్ర మోడికి అనుకూలంగానే ఉన్నాయి. చివరాకరిగా వచ్చిన బాలివుడ్ అందాలభామ ఐస్వర్య బచ్చన్ ‘గుజరాత్ కి నా సల్యుట్’ అంటూ ఆకాశానికి ఎత్తేయడం ఆమె అభిమానులను మోడీ వైపు మరల్చక మానదు.   ఈ నేపధ్యంలో ఎన్నికలను మోడీ పూర్తీ ఆత్మా విశ్వాసంతో అవలీలగా ఎదుర్కొంటుండగా, కాంగ్రేసు కేవలం అతని వైఫల్యాల పైనే ఆధార పడి అతనిని డ్డీ కొనవలసిరావడం నిజంగా యెంత దురదృష్టం. తానూ ఏమి సాదిమ్చిందో చెప్పుకోవలసిన ఈతరుణంలో, అతను ఏమి సాధించలేక పోయాడో చెప్పుకొంటూ అతనినిని డ్డీ కొనవలసి రావడం మరో దురదృష్టం. ఒక విధంగా అక్కడ కూడా మోడీ విజయం సాధించినట్లే. తన విజయాల గురించి తన ప్రత్యర్డులు పదేపదే చెప్పుకోవలసి వచ్చేలాగ చేయడంలోనే అతను సగం విజయం సాధించేడు. ఇక మిగిలినది కేవలం ఒక సాంకేతిక విజయ ప్రకటన మాత్రమె.   మరప్పుడు కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో కూడా ఇప్పుడే ఉహించవచ్చు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకి వీరవిదేయులయిన కాంగ్రేసు వాదులందరూ, వారి మీద ఈగ కూడా వాలనీయకుండా వారికంటే ముందే పత్రికలకి ఎక్కి ‘మోడీ అనైతిక విజయం’ గురించి, ‘బిజెపి నాయకత్వం’ గురించీ మాట్లాడుతూ, ఆత్మ విమర్శకు బదులుగా ఎదురుదాడికి దిగి తమ ఓటమిని కప్పి పుచ్చుకొనే ప్రయత్నం చేయవచ్చు. అయితే, ఆ ప్రయత్నాలు మరో అగ్ని పరీక్షకి ఎంత మాత్రం పనికొచ్చేవి అయ్యిఉండవు.

ఇక తీహార్ జైలుకు జగన్ ?

     వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్ మోహన్ రెడ్డిని అతి త్వరలో తీహార్ జైలుకు తరలించనున్నారా ? ఈ విషయానికి అవుననే సమాధానమే కనిపిస్తోంది. ఈ నెలాఖరులో ఆయనను ఈ జైలుకు తరలించనున్నారని సమాచారం. ఈ డి అధికారులు ఇందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.   గాలి జనార్ధన్ రెడ్డి ఆస్తులను పెద్ద ఎత్తున అటాచ్ చేసిన ఈ డి అధికారులు ఇక జగన్ ఫై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే, జగన్ అక్రమాస్తుల విషయంలో తగిన పురోగతి సాధించినప్పటికీ, ఇంకా మరికొన్ని విషయాల్లో వెనుక బడినట్లు అధికారులు భావిస్తున్నారు. ఆయనను తీహర్లో ఉంచితే, తమ విచారణ వేగవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. వాస్తవానికి జగన్ ను తీహార్ జైలులో ఉంచాలని అధికారులు ఎప్పుడో భావించారు. అయితే, కొన్ని కారణాల వల్ల అప్పట్లో అది సాధ్యం కాలేదు.   ఈ విషయం జగన్ కు తెలియడంతో, పార్టీలోని కొంతమంది కీలక నేతలకు ఈ విషయాన్ని తెలియచేసి, వారిని అందుకు మానసికంగా సిద్దం చేసినట్లు సమాచారం. షర్మిలా పాద యాత్ర ముగిసిన తర్వాత, ప్రజల్లో ఉండేందుకు గాను చేపట్టాల్సిన కార్యక్రమాలను జగన్ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. షర్మిలా యాత్రకు సహకారం చేసిన వారికి ఆర్ధిక సహాయం చేయాలని కూడా జగన్ సూచించినట్లు సమాచారం.     ‘సాక్షి’ సిబ్బందితో పాటు, ఇతర జర్నలిస్టుల సహాయంతో పార్టీకి ప్రజల్లో ఉన్న స్పందనను తెలుసుకుని తగు కార్యక్రమాలను చేపట్టాలని జగన్ పార్టీ నేతలకు సూచించారు. ఒకవేళ జగన్ ను తీహార్ జైలుకు తరలిస్తే, ఇక పార్టీ నేతలు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఆయనను ఇప్పటిలా కలవడం సాధ్యపడదు. అందుకే, జగన్ పార్టీ విషయంలో చెప్పాల్సిన వన్నీ చెప్పారని భావిస్తున్నారు.

జగన్, కాంగ్రేసు-ఎవరిని ఎవరు కోల్పోయారు?

  రాష్ట్రంలో నేడు రెండు ప్రధాన అంశాలు చర్చలో ఉన్నాయి. మొదటిది తెలంగాణా కాగా, రెండోది రాష్ట్ర రాజకీయాలపై జగన్ పార్టీ ప్రభావం. తెలంగాణా అంశంతో అన్నిరాజకీయ పార్టీలు బంతాట ఆడుకొంటుండగా, జగన్ విషయంలో మాత్రం చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అనేక కేసులలో సతమతమవుతు ఇప్పట్లో బెయిలు కూడా దొరకని పరిస్తితిల్లో అతను జైల్లో ఉన్నపటికీ అనేక మంది ఇతర పార్టీల సభ్యులను, తన పార్టీలోకి ఆకర్షించగలుగుతున్నాడంటే రాష్ట్ర రాజకీయాలపై అతని ప్రభావం ఎంతగా ఉందో అర్ధమవుతోంది. ఎవరు ఒప్పుకొన్నా, ఒప్పుకోకపోయినా కాదనలేని నిజం ఇది. అందుకనే, కాంగ్రెస్ అధిష్టానం సైతం మొన్న పంపిన పరిశీలకులతో జగన్ని మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుందని రాష్ట్ర నేతలను అడిగింది. వారు కూడా అతని ప్రభావం బాగానే ఉందని చెప్పినట్లు తెలిసింది.   మరి అంతటి ప్రభావశీలి అయిన ఒక యువ నాయకుడిని, కేవలం కొందరు సీనియర్ నాయకుల సలహాల మేరకు దూరం చేసుకొన్న కాంగ్రేసు నష్టపోయిందా? లేక, తన తొందర పాటుతో తన రాజకీయ భవిష్యత్తుని తానే గందరగోళంలో పడేసుకొన్నాడా? ఏమతేనేమి, ఇటు కాంగ్రెస్, అటు జగన్ ఇద్దరు నష్టబోవడమే గాక, ఇప్పుడు అందుకు తీరికగా విచారించ వలసివస్తోంది వాళ్ళకి. రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు, కొందరి అనాలోచిత సలహాల వల్ల తొందరపడి ముఖ్యమంత్రి పీఠం తన సొత్తుగా భావించి కాంగ్రేసు అధిష్టానానికి ఎదురు తిరగడం అతను చేసిన పోరాపటయితే, 120 సంవత్సరాల అనుభవంఉన్న కాంగ్రేసు, అతనికి నచ్చజెప్పి దారికి తెచ్చుకొని అతనిని తన ఆయుధంగా మలుచుకోలేకపోవడం ఒక చారిత్రాత్మక తప్పిదం అనిచెప్పవచ్చు.   కాంగ్రేసు అధిష్టానంతో సయోధ్య కుదుర్చుకోవడంలో విఫలం అవడంలో కేవలం అతని పాత్రే లేదు. అతని వెంట ఉండి అతనికి ఆవిదంగా వెళ్ళమని రాజకీయ సలహాలు ఇచ్చిన వారిని సైతం ఇందుకు తప్పు పట్టక తప్పదు. అదే సమయంలో అతని విషయంలో కాంగ్రెస్ అధిష్టానానికి శల్యసారద్యం చేసి అతనిని తెలివిగా పార్టీకి దూరం చేసిన వారూ ఉన్నారు. కాంగ్రేసులో తమ అనుభవమంత వయసుకూడా లేని ఒక కుర్రకుంక కేవలం తన తండ్రి కీర్తి ప్రతిష్టలను ఆసరాగా చేసుకొని తమని మించిపోవడం సహించలేని నేతలే అతనిని పార్టీ అధిష్టానానికి విరోధిగాచేసి బయటకి వెళ్ళే పరిస్తితులు సృష్టిమ్చేరని చెప్పవచ్చు.   అయితే, అప్పటికయినా మళ్లీ పరిస్తితులు చక్కదిద్దుకొనే అవకాశం అతనికి ఉంది. గానీ, జగన్మోహన్ రెడ్డికి సరయిన రాజకీయ సలహాలిచ్చేవారు కరువయ్యారు. ఒక వేళ ఉండి ఉంటే, వెంటనే వారు రంగంలోకి దిగి పరిస్తితులు చక్క దిద్ది అతను కాంగ్రెసులోనే కొనసాగేలాగ చేసేవారు. కాని, జగన్మోహన్ రెడ్డి కి తగిన రాజకీయ సలహాదారులు కరువయ్యారు. ఉన్నకొద్ది మందిని తన అభిజ్యాతంతో తనే దూరం చేసుకొన్నాడు. ఒక వేళ, అతను కొంచెం తగ్గి పార్టీలోనే కొనసాగి ఉంటె నేడు అతని పరిస్తితి, హోదా తప్పక వేరేలా ఉండేవి. అయితే, జగన్ తన తొందరపాటు నిర్ణయంతో కాంగ్రెసును వీడి బయటకి వచ్చి తన ప్రమేయం లేకుండానే ఇంటా,బయటాకూడా శత్రువులను పోగేసుకొన్నాడు.   తన తండ్రి మరణంతో ఏర్పడిన సానుబూతిని ప్రజలు మరువకమునుపే వారి ‘ఓదార్పు’తో తానూ రాజకీయ ప్రయోజనం పొందాలనే ఆలోచనతో అతను ‘ఓదార్పు యాత్ర’ మొదలు పెట్టి, తనకి మద్దత్తు కూడగట్టుకొనే ప్రయత్నం చేసాడు. అది కాంగ్రేసుకి యెంత మాత్రం నచ్చలేదు. ఆ సంగతి అతనే స్వయంగా చెప్పడమే గాక, తదనంతర పరిణామాలలో అది స్పష్టంగా కనిపించింది కూడా. అయితే, ఆటను చేపట్టిన ఓదార్పు యాత్ర రాజకీయంగా అతనికి చాల లబ్దినిచ్చిందని ఇప్పుడు రుజువవుతోంది. తన ఓదార్పు ద్వారా పార్టీని ఎర్పరచకముందే తగిన బలం కూడా గట్టుకోవడమే గాకుండా, ప్రజలకి చేరువయ్యాడని చెప్పవచ్చు.   అయితే, అదే సమయంలో ప్రధాన పార్టీలయినా కాంగ్రెస్, తే.దే.పా.లకి అతను, అతని పార్టీ బద్ద శత్రువులుగా మారేరు. చివరికి అదే అతనిని జైలు పాలు చేసింది కూడా. తమ బలమయిన ఆయుధంగా మలుచుకోవలసిన అతనిపై కాంగ్రెస్ సిబిఐ అనే ఆయుధం ప్రయోగించింది. అది ప్రయోగించి వదిలేసినప్పటికీ, అది అతని వెంట పడి అతని మూలాలు పట్టుకొని ప్రజల ముందు అవినీతిపరుడిగా ఒక ముద్ర పడేందుకు దోహదపడింది. అంటే, అతను కాంగ్రెసులోనే ఉండి ఉంటే అతనికి ఈకష్టాలు ఉండేవి కావు, అతనిపై ఈ ముద్ర ఎన్నటికీ పడేది కాదన్నమాట. ఏమయినప్పటికీ, ఇప్పుడు అతని అక్రమ ఆస్తుల వ్యవహారాలు బయటకి పొక్కడంతో కోర్టులు కూడా అతని మీద జాలి చూపించడం మానేసాయి.   అయినప్పటికీ, అతని మానస పుత్రిక సాక్షి పత్రిక, మరియు సాక్షి టీవీ కలిసికట్టుగా అతనిని బాగానే ప్రజలోకి తీసుకు వేల్లగలిగేయని చెప్పవచ్చు. దానికితోడూ, అతని తల్లి విజయమ్మ, సోదరి షర్మిల కలిసి ‘జగన్ని అన్యాయంగా జైలు పాలు చేసారనే’ ప్రచారం కూడా అతనికి కొండంత సానుబూతి తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా నిరక్షరాస్యులు అదికంగాఉన్న మనరాష్ట్రంలో ఆపని మరింత సులువు అయిందని చెప్పవచ్చును. అందుకే, గ్రామీణ ప్రజలు విజయమ్మ షర్మిలాల వెంట నడుస్తోన్నారు. ప్రజలలో ఈ ఆదరణని చూసే వివిధ పార్టీలలో నేతలు చంచలగూడ జైలు వైపు అడుగులేస్తున్నారిప్పుడు.   కాంగ్రేసులో నెలకొన్న ప్రస్తుత అయోమయస్తితి, పరిపాలన స్తంబించిపోయిందని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం, ప్రధాన ప్రతిపక్షమయిన తే.దే.ప. నేతలలో తెలంగాణా సమస్య వల్ల ఏర్పడిన అంతులేని నిర్లిప్తత, నానాటికి పెరుగుతున్న ధరలు,షాకిచ్చే కరెంటు బిల్లులతో తల్లడిల్లుతున్న ప్రజల అసహనం అన్నీ కలిసి, ప్రజలు మరోసరికొత్త నేతకోసం తలుపులు తెరిచి మరీఎదురు చూస్తున్నారని గ్రహించిన మన రాజకీయ నేతలకి సహజంగానే జైల్లో ఉన్న జగన్ జగన్మోహనాకారుడిగా కనిపించడంలో వింతేమి లేదు.   అయితే, దేశాన్నిఎక్కడికో తీసుకుపోగల యువనేత మా రాహుల్ బాబు అని పార్టీ నేతలతో పొగడబడుతున్న రాహుల్ గాంధీ కూడా చంచల్గూడా జైలు వైపే చూడడం రాష్ట్ర రాజకీయాలపై జగన్ ప్రభావం యెంత బలంగా ఉన్నదో తెలియజేస్తోంది. ఇక, అతనే స్వయంగా కాంగ్రేసులో కలుస్తాడా లేక కాంగ్రేసే అతనితో జత కడుతుందా అనేది కాలమే చెపుతుంది.

కాంగ్రేసుకి అఖిలంతోనే సఖలం

  దేశానికి సమర్ధమయిన పరిపాలన అందించని కాంగ్రేసు పార్టీని ఎంతయినా తప్పుపట్టవచ్చును కాని, మిగిలిన విషయాలలో దానికున్న నైపుణ్యాలని ఎవరు వేలెత్తి చూపలేరు. ఎంత పెద్ద కుంభకోణాలలో దొరికిపోయినా టీవిగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, ప్రజలని మభ్యపెట్టి మరిపించేయగలదు. అందుకు తగ్గట్టుగానే, ప్రజలూ కూడా ఎంత పెద్ద కుంభకోణమయినా ఇదివరకులాగ అంతగా పట్టించుకోవడం మానేసిన సంగతి గుర్తించిన కాంగ్రెస్ నిర్భయంగా తనపని తానూచేసుకుపోతోంది.   ఇక, విషయాని కొస్తే హటాత్తుగా తన అమ్ముల పొదిలోంచి ‘అఖిల పక్షం’ అనే సమ్మోహనాస్త్రాన్ని తీసి సమయోచితంగా సందించి తెలంగాణా యమ్పీలను తన దారికి తెచ్చుకోవడమే గాకుండా, తెలంగాణాలో తనకున్నకాస్త పరువునీ కొల్లగొడుతున్న చంద్రబాబు, వైయ్యసార్ పార్టీలను ఒకేసారి కంగు తినిపించగలిగింది. ఒక దెబ్బకి రెండు...కాదు...కాదు...మూడు పిట్టల్ని కూల్చేసింది. ఒకేఒక దెబ్బకి తన తెలంగాణా యమ్పీలను దారికి తెచ్చు కోవడమే గాక తే.దే.పా., వైయ్యసార్ పార్టీలకూ అగ్ని పరీక్ష పెట్టి ఆలోచించుకోవడానికి సమయం లేకుండా ఈ నెల 28నే అఖిల పక్షం అని ముహూర్తం కూడా పెట్టేసింది. తన చాణక్యనీతి ఎంత గొప్పదో ఈ దెబ్బతో అందరికీ తెలియజేసింది.   ఆదెబ్బకి మొదట విలవిలలాడుతున్నది తే.దే.పా. అని వేరే చెప్పనవసరం లేదు. ఇంత వరకు తన ‘రెండు కళ్ళ సిద్దాంతము’తో ఎలాగో మెల్లగా నెట్టుకొచ్చేస్తున్న తే.దే.పా.ఇప్పుడు తప్పని సరిగా తన మనసులో మాట చెప్పవలసిన పరిస్తితి ఏర్పడింది. గత కొన్ని రోజులుగా తెలంగాణాలో పర్యటిస్తున్న చంద్రబాబు ఇంతవరకు రోజు అక్కడి ప్రజలతో తానూ తెలంగాణా వ్యతిరేఖిని కానని నొక్కి జెప్పుతూ, ఒక వేళ కాంగ్రేసు గాని తెలంగాణా ఇచ్చేమాటయితే తానూ అడ్డు చెప్పబోనని కూడా పదే పదే ప్రజలకి వాగ్దానం చేస్తూ వచ్చేడు. అంతే గాక, తానూ ఈ విషయమై కాంగ్రేసుకి లేఖ వ్రాసినప్పటికీ తన దగ్గిరనుండి ఇంత వరకు ఎటువంటి సమాధానం రాలేదని, తెలంగాణా పట్ల తనకున్న చిత్తశుద్ధి కాంగ్రెస్కు లేక పోవడం వల్లే అలాగ సాగాదీస్తోందనీ తెలంగాణా ప్రజలకి సవివరంగా చెపుతూ తనదయిన పద్దతిలో ముందుకు సాగిపోతున్నప్పుడు, కాంగ్రెస్, తన హట్టాత్ ప్రకటనతో చంద్రబాబుని తెలంగాణాలో ఉండగానే అతని మాటలతోనే అతనిని బంధించింది.   తెలంగాణా విషయంలో కాంగ్రెస్ ఏమి చేస్తుందనేది అప్రస్తుతం. గాని ఆ విషయంలో చంద్రబాబు ఏమి చెప్పబోతున్నడనేదదే ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది. ఒకవేళ తెలంగాణాకి వ్యతిరేఖంగా మాట్లాడితే, ఇప్పటికే తే.రా.సా., తల్లీ పిల్ల కాంగ్రేసులు ప్రచారం చేస్తున్న ‘చంద్రబాబు నమ్మ దాగిన వ్యక్తీ కాడు” అనే మాటలు నిజం చేసిన వాడవుతాడు. తద్వారా కేవలం తెలంగాణాలోనే గాకుండా, రాష్ట్రం మొత్తం ఆ సంగతి ప్రచారం చేసుకొనేందుకు తే.రా.సా., తల్లీ పిల్ల కాంగ్రేసులకు చేతులారా అవకాశం ఇచ్చినట్లవుతుంది. అంతేగాక, ఆదెబ్బతో తెలంగాణాలో తే.దే.పా. తుడుచుపెట్టుకు పోయినా ఆశ్చర్య పోనక్కరలేదు. ఎందుకంటే, పార్టీలో ఇంతకాలం ఇబ్బందిగా కొనసాగుతున్న తెలంగాణా నేతలు, తమ రాజకీయ భవిష్యత్తు కోసమయినా పార్టీని విడువక మానరు. అప్పుడు, తే.దే.పా.కు తెలంగాణాలో పార్టీని మళ్ళీ పునర్ నిర్మించుకోవడం సాధ్యం కాని పని. గనుక, ‘అఖిలంలో’ చంద్రబాబు ‘జై తెలంగాణా’ అనక తప్పదు.   అప్పుడు, పార్టీలో రెండోవర్గాన్ని ఎలాగ సముదాయిన్చగలడు? అనే ప్రశ్నవస్తుంది. కానీ, తెలంగాణా సమస్యతో రాజకీయ అస్తిరత ఎలాగ ఉంటుందో, అది తమ రాజకీయ జీవితాలని ఎంతగా ఇబ్బంది పెడుతోందో అనుభవపూర్వకం గ్రహించిన సీమంద్ర నేతలను ఇప్పుడు మాత్రమె ఒప్పించడము సులువు అని చంద్రబాబుకి తెలిసే ఉంటుంది. చంద్రబాబు ‘జై తెలంగాణా’ అన్నపుడు మిగిలిన పార్టీలకి అంతకన్నా మరో దారి, అవకాశం, అవసరము లేదు, ఉండదు. అందువల్ల ‘అఖిలంలో’ తే.దే.పా. సై అన్నప్పుడు, తరువాత సహజంగా కాంగ్రేసు వంతువస్తుంది. ప్రస్తుత పరిస్తితుల్లో వెంటనే తెలంగాణా గాని ఇచ్చేసే అవకాశం ఎటూ లేదు గనుక, కోడి గుడ్లు పొదిగినట్లు కాంగ్రెస్ తెలంగాణా అంశాన్ని కూడా 2014 ఎన్నికలవరకూ వరకు పొదుగుతూ కూర్చొని, అప్పుడు ఎన్నికలముందు ఏదో ఒకసానుకూల ప్రకటన చేసేసి తెలంగాణా ఓట్లు తన ఖాతాలో జమ చేసుకొనే ప్రయత్నం చేయవచ్చు.   పనిలో పనిగా, ఇప్పటికీ సిద్దంగా ఉన్న తే.రా.సా.ను, తన పిల్ల కంగ్రేసునీ కూడా తనలో కలిపెసుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అప్పుడు, మళ్లీ ఒక దెబ్బకి ఎన్ని పిట్టలో లెక్కబెట్టడం ఎవరితరమూ కాదు. కాకి లెక్కలు కట్టుకొన్నా, రాష్ట్రంలో తిరిగి అధికారం చేజిక్కించుకోవడం, తలనొప్పిగా మారిన తే.రా.సా. పిల్ల కాంగ్రేసులను లొంగదీసుని తన స్వంత ఆయుధాలుగా మార్చుకొని తే.దే.పా.ను తుడిచి పెట్టేసి రాష్ట్రాన్ని ఏక చత్రదిపత్యంగా పరిపాలిన్చేసుకోవడం, ‘తెలంగాణా ఇచ్చేది తెచ్చేది మేమే’ అన్న మాట నిలబెట్టుకొన్నఘనకీర్తీ, రాష్ట్రంలో మళ్లీ ప్రశాంతత తెచ్చమనే గొప్పలు చెప్పుకొనే అవకాశం పొందడం, ఆనక తాపిగా కావలిసినన్ని కుంభకోణాలు చేసుకొనే అవకాశం...ఇలాగ చెప్పుకుపోతే వాటికి అంతే ఉండదు.   ఇక, విభజనలో పీటముడి పడిన ఒకేఒక అంశం ‘హైదరాబాద్ ఎవరి సొంతం?” అనేది. ఒక పదేళ్ళో పదిహేనేళ్లో ‘కామన్ క్యాపిటల్’ చేసిపడేస్తే అప్పటి సంగతి అప్పుడు చూసు కోవచ్చుననే ఒక ‘ఆప్షన్’ ఎలాగు ఉంటుంది గనుక, ఆ సమస్యా ఇక తీరిపోయినట్లే! అయినా, అటు తెలంగాణాలోనూ ఇటు ఆంధ్రా ప్రాంతంలోనూ కాంగ్రేసే వడ్డిస్తున్నపుడు ఎవరికి మాత్రం సమస్యలుంటాయి? ‘వడ్డించేవాడు ‘మనోడయితే’ ఎక్కడ కూర్చున్నా అందవలసినవి అందుతూనే ఉంటాయని పెద్దలు ఊరికే చెప్పలేదు కదా!

ఆడక ముందే ఓడిన భారత ఒలింపిక్స్ సంఘం

    అవినీతి, రాజకీయాలలో ఒలింపిక్ పోటీలు పెడితే అవలీలగా బోలెడు స్వర్ణ పతకాలు కైవసం చేసుకోగల సత్తా ఉన్న మనదేశం, అసలయిన ఒలింపిక్స్ పోటీలలో పెద్దగా రాణించింది మాత్రం ఎప్పుడూలేదు. అందుకు మన రాజకీయ వ్యస్తని, ఆ రాజకీయ వ్యవస్తని భారత ఒలింపిక్స్ సంఘంలో సమర్ధంగా చ్చోపించిన మన ప్రభుత్వాన్నే తప్పు పట్టక తప్పదు అని మనకు తెలుసు. ఇప్పుడు అదే పని అంతర్ జాతీయ ఒలింపిక్స్ సంఘం చేసి చూపింది.   నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో భారత ఒలింపిక్స్ సంఘాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు అంతర్ జాతీయ ఒలింపిక్స్ సంఘం ప్రతినిధులు తెలియజేసారు. అంటే, త్వరలో జరుగనున్న ఒలింపిక్స్ పోటీలలో మన దేశం నిషేదించబడినట్లు లెక్క. అంతే గాక, సస్పెన్షన్ ఎత్తివేసే వరకూ ఇక మన భారత ఒలింపిక్స్ సంఘానికి అంతర్ జాతీయ ఒలింపిక్స్ సంఘం నుండి నిధులు కూడా రాబోవు. అసలే నిదులలేమితో కటకటలాడుతున్న మన భారత క్రీడాకారులకు ఇదో పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చును. మన క్రీడాకారులు ఒలింపిక్స్ పోటీలలో వ్యక్తిగత హోదాలో పాల్గొనవచ్చు గాని మన దేశానికి ప్రతినిధులుగా పాల్గొనలేరు. అంతే గాక, ఒలింపిక్స్ పోటీలలో మన జాతీయ జెండాని కూడా చేత బట్టుకోవడానికి కూడా వారికీ అనుమతి ఉండదు. ఇంత కంటే ఘోర అవమానం మరేముంటుంది మనకి? భారత ఒలింపిక్స్ సంఘంలో ప్రభుత్వ మరియు రాజకీయ ప్రమేయం ఉండకూడదని ఎన్నాళగానో హెచ్చరిస్తున్నాఆ హెచ్చరికలని పెడచెవిన బెట్టి, ‘స్కామ్ముల లలిత భానో’ని భారత ఒలింపిక్స్ సంఘానికి కార్యదర్శికగా ఏకగ్రీవంగా ఎంపిక చేయిన్చేసి చేతులు దులుపుకోంది మన ప్రభుత్వం.  అంతే గాకుండా, రాజకీయ పార్టీలతో నిత్యం భుజాలు రాసుకు తిరిగే అభయ్ సింగ్ చౌతాలా వారిని కూడా అదే చేత్తో బోర్డ్ సభుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేయిన్చేసి తన ఘనత చాటుకోంది మన భారత ప్రభుత్వం. అసలయిన గమ్మతేమిటంటే, మన భారత ఒలింపిక్స్ సంఘం బోర్డ్ ఎన్నికలు ఇంకా జరుగలేదు కూడా. ఈ రోజో రేపో అవి జరగవచ్చు. ప్రస్తుత భారత ఒలింపిక్స్ సంఘం తాత్కాలిక అధ్యక్షుడు వి.కె.మల్హోత్రా కూడా మన ఒలింపిక్ బోర్డులో రాజకీయాలు చొప్పించవద్దని గత రెండు సంవత్సరాలుగా యెంత మొత్తుకొన్న వినకుండా మన భారత ప్రభుత్వం చేసిన ఘన కార్యానికి ఫలితం ఇప్పుడు ఇలాగ అందరూ అనుభవించాల్సి వస్తోంది. మరో విషాదకరమయిన విషయమేమిటంటే ఈ సంగతి తెలిసి మీడియా వాళ్ళు సదరు మంత్రి వర్యులని మీ ప్రతిస్పందన ఏమిటని అడిగితె ‘దురదృష్టకరం’ అని ఒక్కమాటతో తేల్చి పారేసాడు. సంఘం సభ్యులని కూడా అడిగినప్పుడు వాళ్ళు కూడా అదే నిర్లక్ష్యంతో ‘ఆ సంగతి మాదాక ఇంకా రాలేదు, వచ్చినప్పుడు చూద్దాము,” అని నిర్లజ్జగా జవాబుఇచ్చి ఈవిషయంలో తీవ్రకలత చెందుతున్న కోట్లాది భారతీయులని మరనేకమంది క్రీకారులని కూడా ఆశ్చర్యపరిచేరు.

మహా ప్రస్తానానికి రాళ్ళేసిన కుర్రాళ్ళేవ్వరు ?

    ముందే అనుకోనట్లుగానే తెలంగాణాలో షర్మిల పాదయాత్ర ఇబ్బందుల్లో పడింది. అసలే తన ‘గద్వాల్ సవాల్’ తో కాకమీదున్న తే.రా.స.కి మరింత పొగబెడుతున్నట్లు రోజా చేసిన కామెంట్స్ కొత్త తల నొప్పులు తెచ్చి పెట్టాయి. పిల్లిని చంకన పెట్టుకు పెళ్లికి వెళ్ళినట్లు, కాస్త నోటితీట ఉన్న రోజాని వెంటబెట్టుకువెళ్ళిన జగన్ సోదరి షర్మిలకి, మొన్న ఆమె మెహబూబ్ నగర్ లో చేసిన ఉపన్యాసంతో ముందు  నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు తయారయింది షర్మిలాకి ఇప్పుడు. మొన్న షర్మిలమ్మ పాదయాత్రలో కాలుకలిపిన యాంకరమ్మ రోజా తమకు నిరసనలు తెలియ జేస్తున్న ప్రజలని ఉద్దేశించి మాట్లాడుతూ “ప్రజలకి నచ్చినవాడు, మెచ్చినవాడే అసలయిన నాయకుడు అవుతాడు తప్ప ఏవో మాయమాటలు చెప్పినవాడు కాలేడు. నిజం చెప్పాలంటే, మన షర్మిల పాదయాత్రలకి తెలంగాణా ప్రజలు నీరాజనంపట్టడం చూస్తున్న తే.రా.స. నాయకులకి అప్పుడే బెంగ పట్టుకొంది. అందుకే ఇలాగ అమాయకులయిన ప్రజలని రెచ్చగొట్టి మమల్ని అడ్డుకోవాలని చూస్తునారు. గాని, తెలంగాణా ప్రజలు వై.యస్.ఆర్. కాంగ్రేసుకి బ్రహ్మరధం పడుతున్నారు,” అని చెప్పుకొచ్చింది అందాల యాంకరమ్మ మన రోజమ్మ. శల్య సారద్యం చేస్తున్న ఆమెని వారించలేక సమర్దించను లేక షర్మిలమ్మ పాపం ఎంత బాధ పడిందో ఎవరికీ తెలీదు. ఈ రోజు పాలమూరు వద్ద కొందరు తెలంగాణా విద్యార్దులు ఆమెపైకి రాళ్ళు విసిరి ఆమె మహాప్రస్తానానికి గండికొట్టాలని చూసారు. గాని, సమయానికి పోలీసులు అడ్డు పడటంతో  అప్పటికి గడ్డం గట్టెకింది. ‘ఇన్ ఫ్రంట్ దేరీస్ క్రోకడైల్ ఫెస్టివల్ సుమీ!’ అని షర్మిల మనసులో  గొణుకొంటూ మళ్లీ జర్మనీ బూట్లతో నడక మొదలు పెట్టింది.  

చంద్రబాబు 63 ఏళ్లు 63 రోజులు 1000 కిలోమీటర్లు

    చంద్రబాబు నాయుడు "వస్తున్నా మీ కోసం" యాత్రలో రికార్డ్ సృష్టించారు. 63 ఏళ్లలో 63 రోజుల్లో1000 కిలోమీటర్లు పూర్తి చేయడం విశేషం. అక్టోబర్ 2న ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాదయాత్ర నేటికి 63వ రోజుకు చేరుతుంది. ఆరు, మూడు కలిపితే 9 సంఖ్య వస్తుంది. అదే విధంగా సోమవారంనాటి తేదీ 3.12.12. ఈ మూడింటిని కూడితే కూడా 9 వస్తోంది. పైగా, చంద్రబాబు వయస్సు 63 ఏళ్లు. ఇదీ 9 సంఖ్యను తెచ్చిపెడుతోంది. చంద్రబాబు పాదయాత్ర చేపట్టిన వేయి కిలోమీటర్లు పూర్తన్న సమయంలో 9 అదృష్ట సంఖ్య కలిసి వచ్చిందని, ఇది శుభసూచకమని అంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర 1000 కిలోమీటర్లు దాటనున్నారు. 62 రోజుల్లో ఐదు జిల్లాల్లో యాత్రను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ . బోధన్ మండలం పెంటాఖుర్దులో చంద్రబాబు 1000 కిలోమీటర్ల మైలురాయి దాటనున్నారు.  ఈ విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకొని టీడీపీ శ్రేణులు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. 1982 డిసెంబర్ 2న జాడి జమాల్‌పూర్‌లో ఎన్టీఆర్ బస చేసిన సందర్భాన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు బాబు కూడా డిసెంబర్ 3న అదే గ్రామంలో బస చేయనున్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలో స్తూపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జాడి, పెంటాఖర్దుల్లో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాలను బాబు ఆవిష్కరిస్తారు. అలాగే వెయ్యి మంది మహిళలతో పాదయాత్ర నిర్వహించనున్నారు. మరోవైపు బాబు పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తిచేసుకుంటున్న సందర్భాన్ని రాష్ట్రమంతటా కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు. చంద్రబాబు పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్బంగా విశాఖపట్నం జగదాంబ కూడలి వద్ద విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇంచార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ మోకాళ్ల యాత్ర చేశారు. ఈ యాత్రకు నియోజకవర్గం కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

చుక్కలనంటిన చుక్కధర

    మందు బాబులకు దిమ్మ తిరిగేలా ప్రభుత్వం మద్యం ధరలను పెంచేసింది. ప్రీమియం, మీడియం బ్రాండ్ల మద్యం ధరలను పెంచుతూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి అసుతోష్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్ డ్యూటీ, ట్రేడ్ మార్జిన్ పెంచడంతో, సర్కారుకు దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. ఈ మార్పులు శనివారం నుండి అమల్లోకి వస్తాయి. ఎక్సైజ్ డ్యూటీ లో పెద్దగా మార్పులు లేవు. అయితే, బేసిక్ ధర రూ.400 నుండి రూ. 450 వరకూ రేంజ్ ను సృష్టించి ప్రూఫ్ లీటర్ కు రూ. 75 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ ని విధించింది. ఈ నిర్ణయం వల్ల క్వార్టర్ బాటిల్ ధర రూ.4 నుండి రూ.  5 వరకూ పెరగనుంది. మధ్య తరగతి ప్రజలే ఎక్కువగా ఇలాంటి మద్యాన్ని తాగుతుంటారు. అయితే, ఇప్పటికే వ్యాపారుస్తుల వద్ద ఉన్న మద్యాన్ని పాత ధరలకే విక్రయించాల్సి ఉంటుంది. రేపటి నుండి ఏపిబిసిఎల్ డిపోల నుండి తీసుకువెళ్ళే మద్యానికి మాత్రం కొత్త ధరలు వర్తిస్తాయి. పాత సరుకును మారిన ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దేవేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో వినియోగదారులు 040-24612756, 9966222271 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని అయన అన్నారు. హైదరాబాద్ సిటిలో సుమారు 130 మద్యం దుకాణాలు ఉంటే, నగరం నుండి దాదాపు 700 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. కొత్త సంవత్సర వేడుకలకు సిద్దమవుతన్న మందు బాబులు ధరలు పెరగడంతో ఒక్కసారిగా ఖంగు తిన్నారు. మద్యం వ్యాపారుల వత్తిడులకు తలొగ్గే ఈ ధరలను పెంచారని తెలుగు దేశం నేత దాడి వీర భద్ర రావు విమర్శించారు. ధరలు పెరగడం వల్ల వీటికి అలవాటు అయిన పేదలు నాటు సారాను తాగి ప్రాణాలు పోగొట్టుకొనే అవకాశం ఉందని ఆయన అన్నారు.

పాటింగ్ నిష్క్రమణం

    ఆస్ట్రేలియా కు రెండు సార్లు ప్రపంచ కప్ అందించిన రికీ పాంటింగ్ అంతర్జాతీయ క్రికెట్ నుండి నిష్క్రమించాడు. ఆ దేశానికి అత్యంత విజయవంత మైన కెప్టెన్ గా గుర్తింపు పొందిన పాంటింగ్ తన 17 సంవత్సరాల కెరీర్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించాడు. త్వరలో పెర్త్ లో జరిగే టెస్ట్ మ్యాచ్ పాంటింగ్ కు చివరి మ్యాచ్ కానుంది. ప్రస్తుతం తన అట తీరు సరిగా లేదని, ఇక జట్టుకు భారం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాంటింగ్ వెల్లడించారు. దీనితో, ఆస్ట్రేలియా క్రికెట్ లో ఓ శకం ముగిసినట్లయింది. 167 టెస్టులు ఆడిన పాంటింగ్  13366 పరుగులు చేసాడు. ఇందులో 41 సెంచరీలు ఉన్నాయి.  257 అతని అత్త్యుత్తమ స్కోరు. అలాగే, 375 వన్డే లు ఆడి 13704 పరుగులు చేసాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. 17 టి 20మ్యాచ్ లు కూడా ఆడి,  401 పరుగులు చేసాడు. పాంటింగ్ 77 టెస్ట్ మ్యాచ్ ల్లో తన దేశానికీ నాయకత్వం అందించాడు.అందులో 48 మ్యాచ్ ల్లో ఆసీస్ విజయం సాధించింది. 228 వన్డే ల్లో ఆసీస్ కు నాయకత్వం అందించిన పాంటింగ్ 164 మ్యాచ్ ల్లో జట్టుకు విజయాన్ని అందించాడు. మూడు ప్రపంచ కప్ లు గెలిచిన జట్టులో పాంటింగ్ సభ్యుడు. 38 సంవత్సరాల పాంటింగ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో, ఇక అందరి కళ్ళు సచిన్ టెండూల్కర్ ఫై ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సచిన్ రిటైర్మెంట్ కు సంబంధించి ఇక ఒత్తిడి అధికం అయ్యే అవకాశాలు ఉన్నాయి.  

ప్రాణం తీసిన అమీర్ ఖాన్ షో

    సత్యమేవ జయతే.. ప్రస్తుతానికి మీడియాలో బాగా నలుగుతున్న మీడియా గేమ్ షో.. దీంట్లో పాల్గొన్నవాళ్లు తమ అనుభవాల్ని అభిప్రాయాల్ని చెబుతుంటే జనం చెవులు రిక్కించుకుని వింటున్నారు. రేటింగ్స్ కూడా బాగా వస్తున్నాయ్.   కానీ.. ఈ షో.. కారణంగా ఓ మర్డర్ కూడా జరిగింది. ఇంట్లో వాళ్లకు ఇష్టంలేకుండా ప్రేమించిన పిల్లని పెళ్లిచేసుకున్న ఓ అబ్దుల్ అనే కుర్రాడి జీవితం ముగిసిపోయింది. షో లో అమీర్ వివరాలు అడుగుతుంటే భార్యాభర్తలిద్దరూ ఉద్వేగంగా సమాధానాలు చెప్పారు. శభాష్ అంటూ చప్పట్లు కొట్టిన అమీర్.. అన్ని రకాలుగానూ అండగా నిలుస్తామంటూ ప్రోత్సహమిచ్చాడు.   షో పూర్తయ్యాక.. ఒకవేళ తమ వాళ్లకి తమమీద కోపం తగ్గిపోయుంటుందేమో అన్న ఆశతో వాళ్లని చూసేందుకు ఇద్దరూ వరుడి పుట్టింటికెళ్లారు. ఏళ్ల తర్వాత కూడా పగని చల్లార్చుకోని వరుడి కుటుంబసభ్యులు పెద్దగా పోట్లాటకొచ్చారు. నేరుగా తుపాకీ తీసుకొచ్చి మొహబిన్ కళ్లముందే అబ్దుల్ ని కాల్చిపారేశారు. బాధితుడు స్పాట్ లో కుప్పకూలాడు.  

సా.....గుతున్న అక్రమాస్తుల కేసు

       జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జీడిపాకంలా సాగుతోంది. జగన్ మీద కొత్త కొత్త చార్జ్ ల్ని పెట్టేందుకు సిబిఐ తెగ శోధిస్తోంది. ఒకదాని తర్వాత ఒకటిగా మీదపడుతున్న కేసుల భారం జగన్ ని బాగా కుంగదీస్తున్నా.. ఇప్పటివరకూ గట్టిగానే ఉన్నట్టు లెక్క.    చంచల్ గూడ జైలునుంచే జగన్ తన కార్యకలాపాల్ని నడుపుతున్నారని టిడిపి నేతలు బాహాటంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికీ అన్నీ జగన్ కనుసన్నల్లోనే నడుస్తున్నాయంటున్నారు. జనంలో అన్నకి మద్దతుని కూడగట్టేందుకు తల్లీ, చెల్లీ కఠోరమైన శ్రమని ఎదుర్కోవాల్సొస్తోంది.   అక్రమాస్తుల కేసు విచారణ నత్తనడకన సాగుతోంది. అధికారులు విదేశాలనుంచి సమాచారాన్ని సేకరించే పనిలోపడ్డారు. జగన్ కేసు సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో నలుగుతోంది. తమపై ఎలాంటి ఒత్తిళ్లూ పనిచేయడం లేదని, పూర్తిగా పారదర్శకంగా విచారణ జరుపుతున్నామనీ సిబిఐ డైరెక్టర్ ఎ.పి.సింగ్ తెలిపారు.    టిడిపినేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చంచల్ గూడ జైలుకెళ్లి జగన్ ని కలిసి మాట్లాడారు. ఉమ్మారెడ్డి టిడిపిని విడిచిపెట్టి జగన్ పార్టీలోకి జంప్ చేస్తారన్న ప్రచారం ఎప్పట్నుంచో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ నేత వడ్డెపల్లి నర్సింగరావ్ కూడా జగన్ ని కలిశారు. ఎమర్జెన్సీ అలారం మోగడంతో అధికారులు సోమవారం ములాఖత్ లను నిలిపేశారు. 

తెలంగాణలో జగన్ బలమెంత?

    ఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చినా, ఎప్పటికొచ్చినా అన్ని విధాలా లాభం మా పార్టీకే తప్ప మరోపార్టీకి ఏమీ కలిసిరాదంటూ జగన్ పార్టీ వర్గాలు తెగ డబ్బా కొట్టుకుంటున్నాయ్. ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఆఖరికి తెలంగాణలోకూడా అరవై సీట్లు రావడం ఖాయమని కొండా సురేఖ అనడం దీనికి సరైన ఉదాహరణ.   షర్మిల పాదయాత్రలో పాల్గొన్న సురేఖ చేసిన వ్యాఖ్యలు కాస్తంత గట్టిగానే జనం గుండెల్లోకి నాటుకుపోవచ్చన్న భయం ప్రత్యర్దుల్లో కనపడుతూనే ఉందికూడా.. పనిలోపనిగా చంద్రబాబు పాదయాత్రమీద విరుచుకుపడ్డ సురేఖ,, వీలైనంతగా బాబు యాత్రని ఏకే ప్రయత్నం కూడా చేశారు. నిజానికి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు తెలంగాణ లో అరవై సీట్లు వస్తే రాష్ట్రంలో ఆ పార్టీకి అదికారం వచ్చినట్లే లెక్క. రెండువేల తొమ్మిదిలో కాంగ్రెస్ కు తెలంగాణలో ఏబై సీట్లు వస్తే తెలుగుదేశం పార్టీకి ముప్పై తొమ్మిది స్థానాలు దక్కాయి. టీఆర్ ఎస్ ఖాతాలో పడ్డవి మాత్రం కేవలం పది స్థానాలే.. రెండువేల నాలుగులో కాంగ్రెస్ టిఆర్ఎస్ లకు కలిపి సుమారు ఎనబై వరకు వచ్చాయి. అందులో టిఆర్ఎస్ కే ఇరవై ఆరొచ్చాయి. టిడిపికి అప్పట్లో కేవలం పదకొండు స్థానాలు మాత్రమే దక్కాయ్. 1999 లో కాంగ్రెస్,తెలుగుదేశం లు పోటాపోటీగా సీట్లు సంపాదించుకున్నట్టే లెక్క. అప్పట్లో.. కోస్తా, రాయలసీమలలో టిడిపి అత్యదికంగా సీట్లు సంపాదించుకుని అదికారంలోకొచ్చింది. 1994లో కాంగ్రెస్ కు తెలంగాణలో కేవలం ఆరు సీట్లు మాత్రమే వచ్చాయి. హైదరాబాద్ లో నాలుగు, నిజామాబాద్ జిల్లాలో ఒకటి, వరంగల్ జిల్లాలో మరొకటి. ఇండిపెండెంట్లు, మజ్లిస్ పార్టీకి చెందిన అరడజను మంది  అభ్యర్ధులు మినహా టిడిపి, వామపక్షాలు క్లీన్ స్వీప్ చేశాయి. తెలంగాణలో టిడిపికి 1983లో నలభైమూడు స్థానాలు మాత్రమే రాగా, 1985 లో మాత్రం ఏబై కి పైగా వచ్చాయి. 1989లో టిడిపికి కూడా గణనీయంగానే తెలంగాణ లో సీట్లు వచ్చినా, మెజార్టీ స్థానాలు మాత్రం కాంగ్రెస్ పరమయ్యాయి.  ఈ లెక్కల్నిబట్ట చూస్తే తెలంగాణలో యాభై సీట్లు తెచ్చుకుంటే మిగతా రెండు ప్రాంతాల్లో కచ్చితంగా వంద సీట్లొచ్చినట్టే లెక్క. కొండా సురేఖ చెప్పిన జోస్యం నిజమైతే.. వైకాపా పూర్తి మెజారిటీతో అధికార పీఠమెక్కినట్టే లెక్క.. సురేఖ చెబుతున్నవి కాకి లెక్కలో లేక, నిజమైన లెక్కలో తెలుసుకునే రోజు దగ్గర్లోనే ఉందని అటు అధికార పక్ష నేతలూ, ఇటు ప్రతిపక్షనేతలూ విమర్శిస్తున్నారు. జగన్ పార్టీ నేతలు పెద్దఎత్తున అంచనాలు పెంచుకుంటూ తమని తాము ఎక్కువగా ఊహించుకోవడం పరిపాటైపోయిందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జనం విలక్షణమైన తీర్పు చెబుతారన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.  

కసబ్ ఉరిశిక్ష పై ఎవరేమన్నారు..?

    కసబ్ ఉరిశిక్ష అమలుపై హిందూ, ముస్లిం, సిక్ అని తేడా లేకుండా అన్ని వర్గాల వారు ఆనందోత్సాహాలు ప్రదర్శిస్తున్నారు. ముంబై నగరంలో ఉండే డబ్బా వాలాలు కసబ్ ఫోటోలను దహనం చేశారు. కసబ్ ఉరిని కాంగ్రెసు, బిజెపి సహా అన్ని పార్టీలు స్వాగతించాయి. బహిరంగ ఉరి తీస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు. ఆలస్యమైనా సరైన శిక్ష విధించారని ఇంకొంతమంది అభిప్రాయపడ్డారు. కసబ్ ఉరిపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది ఉగ్రవాది కసబ్ ఉరితీతపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమైందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పేర్కొన్నారు. న్యాయస్థానం నిర్ణయం మేరకే కసబ్‌కు ఉరిశిక్ష అమలు చేశామని, చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే అని సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు. కసబ్ ఉరితీతను స్వాగతిస్తున్నాం టెర్రరిస్టు అజ్మల్ కసబ్ ఉరితీత ఆలస్యమైనా స్వాగతిస్తున్నామని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. పార్లమెంటు పై దాడి చేసిన అఫ్జల్‌గురును కూడా ఉరితీయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటన ఉగ్రవాదులకు ఓ హెచ్చరిక కసబ్ ఉరిశిక్షను స్వాగిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. రక్తపాతం సృష్టించిన కసబ్ కు ఉరిశిక్ష అమలు అందరూ ఆహ్వానించాలన్నారు. విదేశీ ఉగ్రవాదం కారణంగా అనేక మంది ప్రాణాలు విడిచారని, ఉగ్రవాదం పై ప్రభుత్వం ఉక్కు పడికిలి బిగించాలని కిషన్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదులకు కసబ్ ఉరితీత ఓ హెచ్చరిక అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు పార్లమెంటుపై దాడి చేసి అఫ్జల్‌గురుకు కూడా ఉరిశిక్ష అమలు చేయాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కసబ్ ఉరి.. భారతదేశ చట్టం శక్తిని తెలుపుతుంది... చట్టం ప్రకారం అజ్మల్ కసబ్ ఉరిశిక్ష అమలయిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యానించారు. ఎరవాడ జైలులో కసబ్ ను ఉరితీసి అతడి మృతదేహాన్ని పూడ్చిపెట్టడం జరిగిందన్నారు.   అప్జల్ గురు సంగతేంటి..? అతడిని ఎప్పుడు ఉరి తీస్తారు..?   గుజరాజ్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కసబ్ ఉరిశిక్ష అమలు విషయంపై ట్విట్టర్లో స్పందిస్తూ... కసబ్ ఉరి సరే... మరి అప్జల్‌గురు సంగతేంటని ప్రశ్నించారు. పార్లమెంటుపై దాడి చేయడమే కాకుండా పలువురు మరణానికి కారకుడయిన అప్జల్‌గురును వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు.

సత్యభామగా బతికిన సత్యనారాయణ

      భామనే.. సత్యభామనే.. భామనే పది ఆరు వేల గోపికాలందరీలోన.. భామనే.. సత్య భామనే.. వయ్యారి ముద్దుల భామనే.. సత్య భామనే.. అంటూ వేదాంతం సత్య నారాయణ వేదికమీద వయ్యారాలు ఒలకబోస్తుంటే చూడ్డానికొచ్చిన మగాళ్లంతా మనసుపారేసుకునేవాళ్లంటే నమ్మితీరాల్సిందే.   ఆ హొయలు, ఆ నడక, ఆ దర్పం.. సత్యభామ అచ్చం ఇలాగే ఉండేదా.. అని కళ్లకు కట్టినట్టు చూపించే ఆంగికం, వాచికం, నాట్యాభినయనం తీరు వేదాంతం సత్యనారాయణ శర్మకి ప్రపంచవ్యాప్తంగా ఎనలేని ఖ్యాతిని ఆర్జించిపెట్టాయి. సిద్ధేంద్రయోగి విరచితమైన కూచిపూడి నాట్యశాస్త్రంపై ప్రాణప్రదమైన మక్కువని చూపించిన వేదాంతం.. తన జీవనపర్యంతం ఆసాంతం ఆ కళకే అంకితమయ్యారు..   తుది శ్వాసవరకూ ఆయన కూచిపూడి నాట్యంకోసమే బతికారు. ముదిమి మీదపడి ఇక న్యాయం చేయలేను అనుకున్నప్పుడు ప్రదర్సనల్ని నిలిపేసి ముందుతరాలకు మెళకువల్ని అందించే ఆచార్యపదవికే పరిమితమయ్యారు తప్ప కీర్తికోసం పాకులాడలేదు.   అసలు చీర కట్టడం ఎలాగో వేదాంత సత్యనారాయణ శర్మదగ్గర నేర్చుకోవాలన్నంత ముచ్చటగా ఆయన కట్టూ బొట్టూ తీరు ఉండేదని, చూడగానే ఆడవాళ్లుకూడా అభిమానులుగా మారిపోయేవాళ్లని అంతా చెప్పుకునేవాళ్లు. చీర కుచ్చిళ్లని కాస్త పైకి లాగి పట్టుకుని కాలి మువ్వల్ని ఘల్లుఘల్లున మోగిస్తూ వయ్యారంగా నడుస్తుంటే మగమహారాజులు పడిచచ్చేవాళ్లంటే నమ్మితీరాల్సిందే.   సత్యభామ వేషం వేదాంతానికి అంతటి పేరుని తీసుకొచ్చిపెట్టింది. మగాళ్లు ఆడాళ్లనుంచి ఏ కోరుకుంటారో తెలుసుకనకే తను ఆ హొయల్ని ఒలకించి నాట్యాన్ని రక్తికట్టించేవాడినని ఆయన అనేక సందర్భాల్లో చెప్పారుకూడా.   విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చిన సందర్భాల్లో ఉషాకన్య రూపంలో వేదికమీద కనిపించిన వేదాంతం నిజంగా అమ్మాయే అనుకుని చాలామంది విదేశీయులు మేకప్ రూమ్ ముందు ఆయన అనుగ్రహం కోసం పడిగాపులుపడ్డ రోజుల్ని ఆయన ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉండేవారు.   సత్యనారాయణ శర్మ చిన్ననాటనే జావళీలు, రామదాసు, త్యాగరాజు కీర్తనలు, క్షేత్రయ్య పదాలు, నారాయణ తీర్థుల తరంగాలు, ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలను ఔపోసన పట్టారు. యక్షగానాల్లో చెలికత్తెగా అభినయించారు. వేదాంతం తన పెద్దన్న ప్రహ్లాదశర్మ, పినతండ్రి వేదాంతం లక్ష్మీనారాయణ శాస్ర్తీ, భరత కళాప్రపూర్ణ చింతా కృష్ణమూర్తి వద్ద కూచిపూడి నాట్యంలో శిక్షణ పొందారు.   కూచిపూడి నాట్యాన్ని రక్తికట్టించేందుకు వేదాంతం.. మచిలీపట్నానికి చెందిన వారణాసి బ్రహ్మయ్య వద్ద వయోలిన్ విద్యను, సంగీత కళానిధి ఏలేశ్వరపు సీతారామాంజనేయులు వద్ద సంగీతంలో శిక్షణ పొందారు. చిన్ననాటనే ప్రహ్లాదునిగా, లోహితాస్యునిగా, శ్రీరాముడిగా, ధర్మాంగజుడిగా, బాల నర్తకుడిగా వేషాలు వేసి అందరినీ  అలరింపచేశారు.   పార్వతీదేవిగా నటనను ప్రారంభించిన వేదాంతం ఉషాపరిణయంలో పార్వతి, ఉషాకన్య, భామాకలాపంలో సత్యభామ, మోహిని రుక్మాంగదలో మోహినిగా, క్షీరసాగరమథనంలో విశ్వమోహినిగా, విప్రనారాయణలో దేవదేవిగా వేలాది ప్రదర్శనలిచ్చారు. లవకుశ సినిమాలో బి సరోజాదేవితో కలిసి నటించారు.   కూచిపూడి నాట్యాన్ని భావితరాల వారికి అందించేందుకు నర్తనశాలను రూపొందించి పలువురికి శిక్షణ ఇచ్చారు. కూచిపూడి నాట్యక్షేత్రం స్థాపనకు దివంగత చింతా కృష్ణమూర్తి, బందా కనకలింగేశ్వరరావు, పద్మభూషణ్ వెంపటి చినసత్యంతో కలిసి కృషిచేసి ప్రధానాచార్యులుగా కొనసాగారు.   సత్యనారాయణశర్మ చిన్న వయస్సులోనే కేంద్ర సంగీత నాటక అవార్డును, పద్మశ్రీ అవార్డును అందుకుని పలువురు నాట్యాచార్యులకు ఆదర్శంగా నిలిచారు. కూచిపూడి నాట్యంలోని యక్ష నృత్యాంశాలలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారు. ఎప్పటికప్పుడు కొత్త రీతుల్ని పరిచయం చేస్తూ తనదైన శైలిలో కూచిపూడి నాట్యకళకి విస్తృత ప్రాచుర్యం కల్పించారు.   కూచిపూడి నాట్య ప్రదర్శనల ద్వారా వేదాంతం సత్యనారాయణ శర్మ మన తొలి రాష్టప్రతి బాబూరాజేంద్రప్రసాద్ నుండి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును, రాష్టప్రతులు వివి గిరి నుండి పద్మశ్రీ, నీలం సంజీవరెడ్డి, డా. శంకర్‌దయాళ్ శర్మ, డా. జకీర్ హెస్సేన్, డా. ఆర్‌కె నారాయణన్‌ల ద్వారా ప్రశంసలు, అభినందనలు పొందారు. తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ప్రధాన మంత్రులుగా ఇందిరాగాంధీ, పివి నరసింహారావు ఈయన నృత్య ప్రదర్శనను తిలకించి అభినందించారు.   ఉషాకన్యగా పేరుగాంచిన వేదాంతం సత్యనారాయణ శర్మ 1934 సెప్టెంబరు 9న కూచిపూడిలో వేదాంతం వెంకటరత్నం, సుబ్బమ్మలకు మూడో సంతానంగా జన్మించారు. వేదాంతం ప్రహ్లాదశర్మ, వీరరాఘవయ్య ఈయన సోదరులు.   సత్యనారాయణ శర్మకు 18వ ఏట 1952లో పసుమర్తి కొండలరాయుడు కనిష్ట పుత్రిక లక్ష్మీనరసమ్మతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వేదాంతం సత్యనారాయణ శర్మ ఇక లేరన్న నిజాన్ని కూచిపూడి గ్రామం జీర్ణించుకోలేకపోతోంది.  

ఈ చట్టాలు మాకొద్దు..!

      ఐర్లాండ్ లో గర్భస్రావం చేయడం చట్టపరంగా నేరం. ఈ చట్టం మూలంగా ఓ భారతీయ మహిళ అన్యాయంగా ప్రాణాలు కోల్పోయింది. బెంగళూరుకు చెందిన 31 సంవత్సరాల సవితా హలప్పనావర్ కి 17వారాల గర్భం తర్వాత అనుకోకుండా ఇబ్బంది మొదలైంది. స్వతహాగా తనుకూడా ఓ డాక్టరే.. కాకపోతే ఆమె డెంటిస్ట్..   చనిపోవడానికి కొద్ది సేపటికి ముందు నేరుగా గాల్వే యూనివర్సిటీ ఆసుపత్రికెళ్లిన సవిత తన పరిస్థితిని వివరించి, కడుపులో నొప్పి భరించలేకపోతున్నాను వెంటనే అబార్షన్ చేయమని అడిగింది. సవిత ఎంత మొత్తుకున్నా అక్కడ డాక్టర్లు ఆమెకి అబార్షన్ చేయడానికి అంగీకరించలేదు.   ఐరిష్ చట్టాలప్రకారం అబార్షన్ చేయడం నేరమంటూ డాక్టర్లు కనికరం లేకుండా ప్రవర్తించారు. పరిస్థితి చేయిదాటిపోయింది. సవిత ప్రాణాలు పోగొట్టుకుంది. కళ్లముందే ఆమె చనిపోతున్నా భర్త, బంధువులు ఏమీ చేయలేని దయనీయమైన పరిస్థితి.   క్యాథలిక్ దేశంలో అబార్షన్లు చేయడం సరికాదన్న గుడ్డి నమ్మకంతో అక్కడి ప్రభుత్వం గర్భస్రావాల్ని నిషేధిస్తూ చట్టం చేసింది. ఇప్పుడు సవిత మరణంతో నైనా అక్కడి ప్రభుత్వం కళ్లు తెరవాలని, తల్లి ప్రాణాల్ని నిలబెట్టేందుకు అబార్షన్ చేయడం తప్పుకాదన్న విషయాన్ని తెలుసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.   సవిత ప్రాణాల్ని బలిగొన్న చట్టాల్ని నిరసిస్తూ ఐర్లండ్ ప్రజలు పెద్ద ఎత్తున పార్లమెంట్ ముందు ర్యాలీ నిర్వహించారు.  సవిత మృతికి నిరసనగా లండన్‌లోని ఐర్లాండ్ రాయబార కార్యాలయం ముందు ప్రజలు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో సవిత మృతి పట్ల విచారణ జరిపాలని ఐర్లాండ్ ఆరోగ్య శాఖా మంత్రి జేమ్స్ అధికారులకు ఆదేశించారు. దీనిపై ఐర్లాండ్ ప్రధాని మాట్లాడుతూ.. సవిత మరణం పట్ల నివేదిక అందిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  

చిరంజీవి కొత్త సినిమా

  చిరంజీవికి ఈ మధ్య కాలం బాగా కలిసొస్తోంది. 2014 మెగా నామ సంవత్సరంలా కనిపిస్తోంది. ప్రజారాజ్యం పూర్తిగా మునిగిపోయే స్థితిలో, అయినవాళ్లు, దగ్గరివాళ్లు అనుకున్నవాళ్లంతా హ్యాండిచ్చి ఓటి పడవ మునకేస్తుందనుకున్న స్థితిలో చిరు తెలివిగా కాంగ్రెస్ లోకి జంప్ చేశారు. తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి సోనియా గ్యాంగ్ తో డీల్ కుదుర్చుకున్నారు.   అప్పట్లో చిరంజీవి తిరిగి సరిదిద్దుకోలేనంత ఘోర తప్పిదం చేశాడని ఊరూవాడా కోడై కూసింది. తన మానాన తనని ఉండనీయకుండా రాజకీయంగా మటాష్ అయిపోయాడంటూ అంతా కాకుల్లా పొడుచుకు తిన్నారు. పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదనే సామెతని రుజువుచేస్తూ చిరంజీవి ఓపిగ్గా ఎదురుచూసి ఇప్పుడు సోనియా కోటలో పాగా వేశారు.   ప్రజారాజ్యం పార్టీని ముంచేసి కాంగ్రెస్ మహాసాగరంలో కేంద్రమంత్రిగా తేలిన చిరంజీవి భుజస్కంథాలమీద పార్టీ భారం అంతకంతకూ మోపవుతోందని గల్లీ లీడర్లనుంచి ఢిల్లీ పెద్దలదాకా అంతా నమ్ముతున్నారు. ఇప్పటికే ఆనం సోదరులు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కాబోయే ముఖ్యమంత్రి అంటూ చిరంజీవికి బాజా కొట్టడం మొదలుపెట్టారు.     రాజకీయాల్లో పీకల్లోతు మునిగిపోయారు కాబట్టి చిరంజీవి ఇక సినిమాల జోలికెళ్లరంటూ ఏపీలో ఇండస్ట్రీ వర్గాలుకూడా గట్టిగానే మాట్లాడుకున్నాయ్. పరుచూరి బ్రదర్స్ రాసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా త్వరలోనే తెరకెక్కబోతోందన్న వార్తల్లో పసలేదని తేలిపోయింది. చిరు 150వ చిత్రాన్ని తనే డైరెక్ట్ చేస్తానంటూ పూరీ జగన్నాధ్ ఇచ్చిన ఆఫర్ నచ్చలేదో మరేదైనా కారణమో తెలీదు కానీ..  ఆ ప్రసక్తే కనుమరుగైపోయింది.   కష్టాలన్నీ తీరిపోయి హాయిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు చిరంజీవికి సినిమాలగురించి ఆలోచించే ఓపికా తీరికా దొరికాయన్నది అభిమానుల కొత్త ఆలోచన. చిరు సినిమా ఛరిష్మా పార్టీకికూడా బాగా ఉపయోగపడుతుందన్న భావనతోఉన్న కాంగ్రెస్ వర్గాలుకూడా 2014 ఎన్నికలకల్లా చిరంజీవితో కొత్త సినిమా చేయిస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. రమేష్ చంద్ర మహర్షి రాసిన అధినేత నవల ఆధారంగా కొత్త సినిమా స్క్రిప్ట్ కూడా రెడీ అయ్యిందన్న వార్తలు వినిపిస్తున్నాయ్.   చిరంజీవి 150వ చిత్రాన్ని అటు రాజకీయ పరంగానూ, ఇటు దూరమైన ఓ వర్గం అభిమానుల్ని తిరిగి ఆకట్టుకోవడానిగ్గానూ ఉపయోగించుకుంటే బాగుంటుందని మెగాస్టార్ కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. తన లేటెస్ట్ సినిమాలో జనంలోకి చొచ్చుకుపోయే పొలిటికల్ క్యారెక్టర్ ని చేయడం ద్వారా చాలా తేలిగ్గా 2014 ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించుకోవచ్చని చిరు భావిస్తున్నారని ప్రచారం కూడా సాగుతోంది. అప్పటికి కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్ధి చిరంజీవే అన్న ప్రచారం గల్లీ నుంచి ఢిల్లీ దాకా బలంగా జరుగుతోంది.  

పోస్ట్ డేటెడ్ రాజీనామా పత్రం

  ఏ ముహూర్తాన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారోగానీ.. అన్నీ ఆయనకు ఎదురొస్తున్నాయ్. తన తప్పేలేకుండా ఎంత జాగ్రత్తగా మ్యానేజ్ చేయాలనుకున్నా చాలా విషయాలు, సంగతులు అస్సలు కంట్రోల్లోకి రావడం లేదు.   ప్రతిపక్షాలమాట ఎలా ఉన్నా అధికారపక్షంలోనే ఉన్న విపక్షాలనుంచి ఎదురౌతున్న ఒత్తిడి, తెలంగాణ అంశం కిరణ్ కి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయ్. ఇప్పుడు చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం ఎపిసోడ్ కారణంగా ఎంఐఎం ఏకంగా మద్దతుని ఉపసంహరించింది.   కిరణ్ కుమార్ రెడ్డిమీద రోజుకో ఫిర్యాదు, పూటకో కంప్లైంట్ చందంగా కాంగ్రెస్ అధిష్ఠానానికి నిమిష నిమిషానికీ చాడీలు చేరిపోతున్నాయ్. ఇప్పుడు ఎంఐఎం మద్దతు ఉపసంహరణ వ్యవహారంలో సోనియా కిరణ్ పై మండిపడుతున్నట్టు సమాచారం.   కిరణ్ కుమార్ ని కుర్చీలో కూర్చేబెట్టేరోజే ఎప్పుడు అడిగితే అప్పుడు రాజీనామా చేయాలన్న షరతునుకూడా అధిష్ఠానం విధించిందని వినికిడి. ఆ మేరకు కిందటిసారి సీఎం ఢిల్లీకెళ్లొచ్చినప్పుడు తారీఖు వేయకుండా తన రాజీనామాపత్రాన్ని సమర్పించొచ్చారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.   ఇప్పుడు ఎంఐఎం మద్దతు ఉపసంహరణ ఎపిసోడ్ పుణ్యమా అని కిరణ్ కుమార్ సమర్పించిన రాజీనామా పత్రంపై తారీఖుని వేసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ అధిష్ఠానానికొచ్చేసిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎప్పట్నుంచో ప్రచారంలోఉన్న సీఎం మార్పిడి కథనం ఇప్పుడు మళ్లీ తెరమీదికొచ్చింది.   నేడోరేపో కిరణ్ కుమార్ రెడ్డిని కుర్చీనుంచి దింపేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం జరుగుతున్న పోటీలో మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కుమారుడు శశిధర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీలో ఉన్నట్టు ఢిల్లీవర్గాల సమాచారం.