Read more!

ఆడక ముందే ఓడిన భారత ఒలింపిక్స్ సంఘం

 

 

అవినీతి, రాజకీయాలలో ఒలింపిక్ పోటీలు పెడితే అవలీలగా బోలెడు స్వర్ణ పతకాలు కైవసం చేసుకోగల సత్తా ఉన్న మనదేశం, అసలయిన ఒలింపిక్స్ పోటీలలో పెద్దగా రాణించింది మాత్రం ఎప్పుడూలేదు. అందుకు మన రాజకీయ వ్యస్తని, ఆ రాజకీయ వ్యవస్తని భారత ఒలింపిక్స్ సంఘంలో సమర్ధంగా చ్చోపించిన మన ప్రభుత్వాన్నే తప్పు పట్టక తప్పదు అని మనకు తెలుసు. ఇప్పుడు అదే పని అంతర్ జాతీయ ఒలింపిక్స్ సంఘం చేసి చూపింది.

 


నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో భారత ఒలింపిక్స్ సంఘాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు అంతర్ జాతీయ ఒలింపిక్స్ సంఘం ప్రతినిధులు తెలియజేసారు. అంటే, త్వరలో జరుగనున్న ఒలింపిక్స్ పోటీలలో మన దేశం నిషేదించబడినట్లు లెక్క. అంతే గాక, సస్పెన్షన్ ఎత్తివేసే వరకూ ఇక మన భారత ఒలింపిక్స్ సంఘానికి అంతర్ జాతీయ ఒలింపిక్స్ సంఘం నుండి నిధులు కూడా రాబోవు. అసలే నిదులలేమితో కటకటలాడుతున్న మన భారత క్రీడాకారులకు ఇదో పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చును. మన క్రీడాకారులు ఒలింపిక్స్ పోటీలలో వ్యక్తిగత హోదాలో పాల్గొనవచ్చు గాని మన దేశానికి ప్రతినిధులుగా పాల్గొనలేరు. అంతే గాక, ఒలింపిక్స్ పోటీలలో మన జాతీయ జెండాని కూడా చేత బట్టుకోవడానికి కూడా వారికీ అనుమతి ఉండదు. ఇంత కంటే ఘోర అవమానం మరేముంటుంది మనకి?



భారత ఒలింపిక్స్ సంఘంలో ప్రభుత్వ మరియు రాజకీయ ప్రమేయం ఉండకూడదని ఎన్నాళగానో హెచ్చరిస్తున్నాఆ హెచ్చరికలని పెడచెవిన బెట్టి, ‘స్కామ్ముల లలిత భానో’ని భారత ఒలింపిక్స్ సంఘానికి కార్యదర్శికగా ఏకగ్రీవంగా ఎంపిక చేయిన్చేసి చేతులు దులుపుకోంది మన ప్రభుత్వం.  అంతే గాకుండా, రాజకీయ పార్టీలతో నిత్యం భుజాలు రాసుకు తిరిగే అభయ్ సింగ్ చౌతాలా వారిని కూడా అదే చేత్తో బోర్డ్ సభుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేయిన్చేసి తన ఘనత చాటుకోంది మన భారత ప్రభుత్వం. అసలయిన గమ్మతేమిటంటే, మన భారత ఒలింపిక్స్ సంఘం బోర్డ్ ఎన్నికలు ఇంకా జరుగలేదు కూడా. ఈ రోజో రేపో అవి జరగవచ్చు.



ప్రస్తుత భారత ఒలింపిక్స్ సంఘం తాత్కాలిక అధ్యక్షుడు వి.కె.మల్హోత్రా కూడా మన ఒలింపిక్ బోర్డులో రాజకీయాలు చొప్పించవద్దని గత రెండు సంవత్సరాలుగా యెంత మొత్తుకొన్న వినకుండా మన భారత ప్రభుత్వం చేసిన ఘన కార్యానికి ఫలితం ఇప్పుడు ఇలాగ అందరూ అనుభవించాల్సి వస్తోంది.



మరో విషాదకరమయిన విషయమేమిటంటే ఈ సంగతి తెలిసి మీడియా వాళ్ళు సదరు మంత్రి వర్యులని మీ ప్రతిస్పందన ఏమిటని అడిగితె ‘దురదృష్టకరం’ అని ఒక్కమాటతో తేల్చి పారేసాడు. సంఘం సభ్యులని కూడా అడిగినప్పుడు వాళ్ళు కూడా అదే నిర్లక్ష్యంతో ‘ఆ సంగతి మాదాక ఇంకా రాలేదు, వచ్చినప్పుడు చూద్దాము,” అని నిర్లజ్జగా జవాబుఇచ్చి ఈవిషయంలో తీవ్రకలత చెందుతున్న కోట్లాది భారతీయులని మరనేకమంది క్రీకారులని కూడా ఆశ్చర్యపరిచేరు.