బీజేపీ, వైసేపీలది సహజీవనం బంధం!

ఒక్కప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  రాజకీయాలలో కమ్యూనిస్ట్ పార్టీలు కీలక భూమికను పోషించాయి. అయితే, అంతతా గతించిన చరిత్ర. ఈరోజు, ఏపీలోనే కాదు,దేశంలో (ఒక్క కేరళలో మినహా) కమ్యూనిస్ట్ పార్టీలు పూర్వ వైభాన్ని పూర్తిగా కోల్పోయాయి. ఒకప్పుడు వామపక్ష కూటమికి కంచు కోటలుగా నిలిచిన, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలలోనూ లెఫ్ట్ ఫ్రంట్ అధికారం కోల్పోయింది. ఒక్క కేరళలో మాత్రమే కమ్యూనిస్టులు ఇంకా అధికారంలో ఉన్నారు.  ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, లెఫ్ట్ పార్టీలు పూర్వ వైభవాన్ని ఎప్పుడో  కోల్పోయాయి. అయినా, ఇటు  ఏపీలో అటు తెలంగాణాలో లెఫ్ట్ పార్టీ నేతలు, చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లుగా, టీవీ చర్చల్లో, ఇతరత్రా  సంచలన వ్యాఖ్యలు చేస్తూ, వార్తల్లో ప్రముఖంగా కనిపిస్తారు. ఇప్పుడు ఏపీలో వైసీపీ-బీజేపీ స్నేహం మరోసారి చర్చనీయాంశమైన నేపధ్యంలో సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి, రామకృష్ణ ఆ రెండు పార్టీల రిలేషన్ షిప్ పై కొంచెం చాలా ఘాటుగా స్పందించారు, సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజమే, బీజేపీ, వైసీపీల మధ్య రాజకీయ సంబంధాలు ఎలా ఉన్నప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు మాత్రం మూడు ముద్దులు, ఆరు హగ్గులు లెక్కన సీక్రెట్ లవ్ స్టొరీలా సాగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులతోనే ఏపీ సీఎం జగన్ రెడ్డిని సిబిఐ, ఈడీలు  దత్తపుత్రునిగా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషించడమే కాదు, జనబాహుల్యం సైతం అనుకుంటున్నారు.  అదలా ఉంటే, తాజాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సంయుక్తంగా భీమవరంలో ఏర్పాటు చేసిన  అల్లూరి జయంతి వేడుకల్లో అదే విషయం మరోమారు స్పష్టమైంది. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటుగా, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, కేంద్ర  మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కేఆర్ రోజా పాల్గొన్న ఈ కార్యక్రమం విప్లవ వీరుని జయంతి వేడుకలా కాకుండా, రెండు పార్టీల మ్యారేజ్ రిసెప్షన్ లా ఉందనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే, ఈ విమర్శలకు సిపిఐ రామకృష్ణ మరింత మసాల కలిపి చేసిన విమర్శ, కొంత వివాదస్పదం అయింది. నిజమే, వైసీపీ-బీజేపీ బంధంపై వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ అందులో దాపరికమేమీ లేదని చేసిన వ్యాఖ్యల ఆధారంగా, సీపీఐ రామకృష్ణ ఘాటుగా స్పందించారు. వైసీపీ-బీజేపీ బంధం పెళ్లి కాకుండా సహజీవనం చేస్తున్నట్లుగా ఉందన్నారు. అలా అని వదిలేస్తే ఎలా ఉండేదో కానీ, ఆయన వైసీపీ-బీజేపీ పొత్తుపై మరో ఆసక్తికర, అనుచిత పోలిక కూడా తెచ్చారు. వైసీపీ-బీజేపీ బంధం నరేష్-పవిత్ర మాదిరిగా పెళ్లి కాకుండా సహజీవనం చేస్తున్నట్లుగా ఉందన్నారు. మూడు సంవత్సరలుగా బీజేపీ, వైసీపీ రంకు రాజకీయం నడుపుతున్నారని రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో, బీజేపీ, వైసీపీల బంధం గురిచి, రామకృష్ణ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా, ఓకే కానీ, రాజకీయాలతో సంబంధం లేని, నరేష్-పవిత్రలను రాజకీయ రొంపిలోకి లాగడం ఏమిటని, సోషల్ మీడియాలో  నెటిజనులు ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఫోర్బ్స్ జాబితాలో అమరరాజా బ్యాటరీస్.. బెస్ట్ ఎంప్లాయిర్ గా సత్తా చాటిన కంపెనీ

అమరరాజా బ్యాటరీస్ కంపెనీ ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన బెస్ట్ ఎంప్లాయిర్స్ జాబితాలో ఫోర్బ్స్ కంపెనీకి చోటు లభించింది. అమరరాజా బ్యాటరీస్  గుంటూరు ఎంపీ, తెలుగుదేశం నాయకుడు గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన కంపెనీ అన్న సంగతి విదితమే. ఫోర్బ్స్ విడుదల చేసిన టాప్ 500 బెస్ట్ ఎంప్లాయిర్స్ జాబితాలో తమ సంస్థ నిలిచిన విషయాన్ని అమరరాజా గ్రూప్ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం చేసిన ట్వీట్ లో తమ సంస్థకు ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ బెస్ట్ ఎంప్లాయర్ జాబితాలో స్థానం లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. ప్రజల విశ్వాసం, నమ్మకం చూరగొన్నందు వల్లే తమ సంస్థకీ గుర్తింపు వచ్చిందని పేర్కొంది. ఫోర్బ్స్ సంస్థ జాబితాలో స్థానం పొందడం తమ సంస్థకు దక్కిన గౌరవంగా అభివర్ణించిన అమరరాజా గ్రూప్ ఈ స్ఫూర్తితో మరింత ఉత్తమంగా ముందుకు సాగుతామని ట్వీట్ లో పేర్కొంది. త్వరలో లడఖ్ లో దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్ ను నెలకొల్పబోతున్నట్లు అమరరాజా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఆ ట్వీట్లో తెలపారు.

ఇక షిండే, ఫ‌డ్న‌వీస్ ల యాత్ర‌

ముఖ్య‌మంత్రి షిండే, ఉప ముఖ్య‌మంత్రి ఫ‌డ్న‌వీస్ వంటి దిగ్గ‌జాలు వుండ‌డంతో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గ‌గ‌లిగింది. వారికి వున్న భారీ మ‌ద్ద‌తు ప‌ట్ల ప్ర‌తిప‌క్ష శివ‌సేన‌, ఎన్‌సిపి, కాంగ్రెస్ ల‌కు ఎలాంటి సందేహం వుండ‌న‌క్క‌ర్లేదు. స్పీక‌ర్ ప‌ద‌వికి  గ‌త వారం జ‌రిగిన ఎన్నిక  మ‌హా ప్ర‌భుత్వం సుమారు ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రాలుగా ప‌న్నుతున్న వ్యూహాన్ని తెలియ‌జేసింది. మ‌హా వికాస్ అఘాడీ (ఎంవీఎ) ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త కొత్త స్పీక‌ర్ ఎన్నిక విష‌యంలో స్ప‌ష్ట‌మ‌యింది. షిండే,  ఫ‌డ్న‌వీస్‌ల ప్ర‌యాణం మున్ముందు అంత సుల‌భ‌సాధ్యంగా సాగ‌కాపోవ‌చ్చు.  షిండే ఈ ఎన్నిక‌ను మామూలుగా జ‌ర‌గాల‌నే ఆకాంక్షించిన‌ప్ప‌టికీ, గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోష్యారీ అందుకు ఎలాంటి అభ్యంత‌ర‌మూ చెప్పలేదు. రాజ్యాంగ‌బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించాల్సిన‌వారు  ప్ర‌భుత్వం మాట‌కు త‌ల వూపి అంగీక‌రించ‌డ‌మే చిత్రం. శివ‌సేన ఎమ్మెల్యేల‌ను పెద్ద సంఖ్య‌లో ఆక‌ట్టుకోవ‌డంలో షిండే  ఘ‌న విజ‌యం సాధించింది. మాజీ ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక్రే  ఇప్ప‌టికైనా త‌న ఎమ్మెల్యేలు త‌న‌ను  ఎందుకు మోస‌గించార‌నేది తెలుసు కోవాలి.   అధికార దాహంతో తాను చేసిన లోపాల‌వ‌ల్ల‌నే వారంతా షిండే పంచ‌న చేరార‌న్న బిజెపి అన డాన్ని థాక్రే ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేదు. బ‌ల‌ప‌రీక్ష‌లో విప‌క్షాల ఓట్లు త‌గ్గ‌డం ఎంవిఏ నాయ‌కుల‌ను ఇబ్బందిపెట్టే అంశ‌మే. అస‌లు ఆ స‌మ‌యానికి చాలామంది స‌భ‌కు రావ‌డంలో జాప్య‌మ‌యింది. వ‌చ్చినా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగానే ఓటు వేశారు. ఏమైన‌ప్ప‌టికీ కొద్ది రోజుల్లో అన్నీ ప‌రిష్క‌రింప‌బ‌డ‌తాయి. అయితే,  షిండే ప్ర‌భుత్వం అసెంబ్లీ మిగిలిన కాలం ఎలాంటి ఇబ్బందిలేకుండా గ‌డిపేయ‌గ‌ల‌ద‌న్న‌ది ఖాయం. థాక్రే గ్రూప్‌కి ప్ర‌స్తుతం ఇది గ‌డ్డు కాలం.  ఇక ఇపుడు షిండేకు త‌న మంత్రిమండ‌లి ఎంపిక కీల‌కంగా మారింది. పూర్తిస్థాయి మంత్రిమండ‌లిని అన్ని వ‌ర్గాలకు ప్రాతినిధ్యం క‌ల్పించేలా చేప‌ట్టాలి. రాష్ట్రంలో ఊహించ‌ని ప‌రిణామాల స‌మ‌యానికి షిండేకు ప‌లు వ‌ర్గాల ఎమ్మెల్యేలు మ‌ద్ద‌తునిచ్చారు గ‌నుక ఇపుడు మంత్రిమండ‌లి ఎంపిక విష‌యం షిండే వ్యూహాలు ఏమాత్రం మంచి ఫ‌లితాన్నిస్తుంద‌నేది తెలియ‌జేస్తుంది. ప్ర‌స్తుతం థాక్రేకు మ‌ద్ద‌తుగా వున్న శివ‌సేన ఎమ్మెల్యేల‌ను మ‌ద్ద‌తు కూడా షిండే త‌న వేపు తిప్పుకోవాల్సిన అవ‌స‌రం వుంది. దీనికి మ‌రి షిండే అనుస‌రించే వ్యూహ‌మేమిట‌న్న‌ది తెలియాలి. ఈ ప‌రిస్థితుల్లో,  తానే అస‌లుసిస‌లు శివ‌సేన అధినేత ను అని ప్ర‌క‌టించుకోవ‌చ్చు. అధికార‌గ‌ణం మ‌ద్ద‌తుతో, బాల్‌థాక్రేకి అస‌ల‌యిన రాజ‌కీయ వార‌సుడ‌ను తానే అని ప్ర‌క‌టించుకోవ‌చ్చు. అలా ధైర్యం చేస్తేనే త్వ‌ర‌లో జ‌రిగే ముంబై మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో విజ‌యానికి అవ‌కాశాలు మెరుగుప‌డ‌తాయి. బిజెపితో క‌లిసి ఈ ఎన్నిక‌లు గెలిస్తే, థాక్రే గ్రూప్ మ‌రింత ఇబ్బందుల్లో ప‌డ‌డం ఖాయం. గ‌తంలో ఎంవిఏ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్పుడు, ఎన్‌సిపిగాని కాంగ్రె స్ గాని తాను ముఖ్య‌మంత్రి కావ‌డంలో ఎలాంటి అభ్యంత‌రాలు పెట్ట‌క‌పోవ‌చ్చ‌నే షిండే అన్నారు. వాస్త వానికి షిండే  స్వీయ బ‌లంతోనే సీఎం ప‌ద‌వి చేరుకోవ‌డంతో  ఆ ప‌ద‌వి చేప‌ట్ట‌డానికి అర్హ‌త‌ను రుజువు చేసుకున్నారు.  ఎంవిఏ పార్టీలోనివార‌యినా, బ‌య‌ట నుంచి మ‌ద్ద‌తునిస్తున్న‌వారిలోనైనా  ఎవ్వ‌రినీ ఏదో ఒక సిద్ధాంతం అడ్డుపెట్టుకుని చ‌ట్టాన్ని త‌మ చేతుల్లోకి తీసుకోను వీలు లేకుండా జాగ్ర‌త్త‌ప‌డ‌డం థాక్రే ప్ర‌భుత్వం సాధిం చిన విజ‌యంగా చెప్పాలి. రాష్ట్రంలో శాంతి, ప్ర‌జాభిప్రాయాలే ఏ సిద్ధాంతాల‌కంటే అతీత‌మ‌ని  థాక్రే  ప్ర‌భుత్వం భావించింది. అయితే ప్ర‌జ‌లు త‌న నుంచి ఏమి ఆశిస్తున్నార‌న్న‌ది షిండే కి ఎవ‌రూ ప్ర‌త్యేకించి తెలియ‌జేయాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగి సీఎం ప‌ద‌వికి చేరుకున్నా రు. మ‌రింత మంది ఎమ్మెల్యేల‌ను త‌న వేపు లాక్కోనేందుకు సీఎం ప‌ద‌వి వుప‌యోగించుకు నేట్ల‌యితే, పాల‌నా వ్య‌వ‌హారాలు స‌ర‌యిన మార్గాల్లోకి తీసుకురావ‌డం పెద్ద స‌వాలుగా మారుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఏదో ఒక కార‌ణంతో ప్ర‌భుత్వం అంత గొప్ప‌గా న‌డ‌వ‌లేదు. అంతెందుకు మాజీ ఆర్ధిక మంత్రి ఇత‌ర పార్టీ ఎమ్మెల్యేల ప‌ట్ల దురుసుగా వ్య‌వ‌హ‌రించేవార‌ని షిండేనే గ‌తంలో ఫిర్యాదు చేశారు. థాక్రే పై షిండే ధ్వ‌జ మెత్తిన ప్ప‌టి నుంచీ  పాల‌నా వ్య‌వ‌హారాలు నిలిచిపోయాయ‌నాలి. పోలీసు వ్య‌వ‌స్థ నిర్వీర్య‌మైంది. అవినీతి త‌గ్గుముఖం ప‌ట్ట‌లేదు. ఈ ప‌రిస్థిత్తులో మ‌ళ్లీ మ‌హారాష్ట్ర పూర్వ వైభ‌వాన్ని తీసుకురావ‌డానికి షిండే త‌ల‌నెరిసేలా ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది. ఎందుకంటే అభివృద్ధి ప‌థంలో మ‌హా రాష్ట్ర కంటే గుజ‌రాత్‌, త‌మిళ‌నాడు ఎంతో ముందంజ‌లో వున్నాయి.  వేగిర‌మే అభివృద్ధి ప‌నులు చేప‌ట్ట కుంటే రాష్ట్రంలో నిరుద్యోగ స‌మ‌స్య త‌గ్గుముఖం ప‌ట్టే అవ‌కాశాలే వుండ‌వు. ఈ ప‌రిస్థితుల కార‌ణంగా షిండే, ఫ‌డ్న‌వీస్ ల‌కు మున్ముందు సుఖంగా ప్ర‌యాణించే వీలు వుండ‌దు. అడుగ‌డుగునా స‌మ‌స్య‌లు, ప్ర‌శ్న‌లు, అనుమానాల‌తోనే అంద‌రూ ఆహ్వానాలు ప‌లుకుతారు.

సబితకు చుక్కెదురు.. ఉద్వాసన తప్పదా ?

కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి, తెరాసలో చేరి, ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నవిద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చిక్కుల్లో చిక్కుకున్నారా? ఓ వంక శాఖపరమైన సమస్యలు, మరోవంక రాజకీయ సవాళ్ళు ఒకేసారి దండయాత్ర చేయడంతో ఆమె ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా, అంటే, అవును, ఆమె ఒక్కసారిగా ముప్పేట దాడిని ఎదుర్కుంటున్నారు.  ఇంటా బయటా విమర్శలు ఎదుర్కుంటున్నారని, అంటున్నారు.   బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళనను పరిష్కరించే క్రమమలో విద్యార్ధుల డిమాండ్లు సిల్లీగా ఉన్నాయని ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆమెనే సిల్లీ మంత్రిని చేశాయి. రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో ఒకటిగా పేరొందిన, బాసర ట్రిపుల్ ఐటీలో కనీస మౌలిక వసతులు లేవని విద్యార్ధులు ఆందోళనకు దిగితే, మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, విధ్యార్దుల డిమాండ్లు సిల్లీగా ఉన్నాయని అన్నారు. ఆమె చేసిన ఆ వ్యాఖ్య పెద్ద దుమారమే రేపింది. ఒక విధంగా విధ్యర్ధులను రెచ్చ గొట్టి, ఉద్యమం ఉధృతం కావడానికి కూడా ఆమె వ్యాఖ్యలే కారణ మయ్యాయి. మరోవంక  విద్యార్ధుల నుంచే కాకుండా సామాన్య ప్రజల నుంచి కూడా ఆమె, విమర్శలు ఎదుర్కున్నారు. అలాగే, గురుకుల పాఠశాలలలో, పిల్లలకు సన్న బియ్యంతో, పౌష్టిక ఆహారం అందిస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా, వాస్తవంలో బియ్యంలో పురుగులు వస్తున్న ఉదంతాలు, వెలుగు చూస్తున్నాయి. పిల్లలు పురుగుల అన్న తినలేక పస్తులుంటున్నారు. ఆకలితో  రోదిస్తున్నారు. అస్వస్థకు గురవుతున్నారు. ఇదంతా కూడా ఎక్కడో కాదు, మంత్రి సబితా ఇంద్ర రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గం పరిధిలోని, పాఠశాలలలోనే ఈ పరిస్థితులు ఉన్నాయని, మీడియాలో సచిత్ర కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఇక పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల, ఉపాధ్యాయుల కొరత ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనే విమర్శలు ఉండనే ఉన్నాయి. ఇంటర్ పరీక్షా ఫలితాల విడుద ఎన్నిసార్లు సార్లు వాయిదా పడిందో  విద్యాశాఖ  అధికారులకు అయినా తెలుసో లేదో అనుమానమే. నిజానికి లోపం, ఎక్కడుందో కానీ, ఇప్పటికే కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య వాగ్దానం గాలికి వదిలేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం, ఇప్పుడు, సబితా ఇంద్రా రెడ్డి   అవగాహన రాహిత్యం కారణంగా మరింత అభాసు పాలవుతోందని, అంటున్నారు.  అదొకటి అలా ఉంటే, ముందూ వెనకా చూసుకోకుండా ప్రభుత్వ  పాఠశాలలలో  పని చేసే టీచర్లు అందరూ తమ వార్షిక ఆదాయాన్ని ప్రకటించాలంటూ పాఠశాల విద్యా శాఖ జారీ చేసిన జీవో పెద్ద దుమారమే రేపింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు.. ప్రతిపక్షాలు కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి.. తప్పుపట్టాయి.  ఉపాధ్యాయులను టార్గెట్‌ చేసి ఉద్దేశ్ పూర్వకంగా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందనే విమర్శలు వచ్చాయి. దీంతో,వెంటనే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఇలా అడుసు తొక్కడం, కాలు కడగడం విద్యాశాఖకు, విద్యాశాఖ మంత్రికి అలవాటుగా మారి పోయిందని వస్తున్న విమర్శలు ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చి వేస్తున్నాయని తెరాస శ్రేణులే అంటున్నాయి.    ఇవన్నీఒకెత్తు అయితే, సొంత పార్టీ నుంచే మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. మంత్రి భూకబ్జాలు ప్రోత్సహిస్తున్నారని, మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు తీగల కృష్ణా రెడ్డి గత కొద్ది రోజులుగా ఆమెపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అంతే కాకుండా ఆమె భూకబ్జాల చిట్టా మొత్తం బయట పెడతానని బహిరంగంగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. తగ్గేదేలే’ అంటూ సవాలు విసురుతున్నారు. మరో వంక సబితా సబితా ఇంద్రారెడ్డి, అలాంటిదేమీ లేదంటూనే, ఉన్నా,  ముఖ్యమంత్రి చూసుకుంటారని, సీఎం చాటున రక్షణ పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇరువురు నేతల మధ్య బాహాటంగా జరుగుతున్న రగడ పార్టీలో చర్చకు కారణంగా మారింది. పబ్లిక్ లో పార్టీ ప్రతిష్టను దిగజార్చింది.  కాగా, మంత్రి పై తీవ్ర విమర్శలు చేసిన తీగల, కబ్జాకు కాదేదీ అనర్హం అన్నట్లుగా చెరువులు, పాఠశాలల స్థలాలను కూడా సబితా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. అలాగే, ఆమె రాజకీయ చరిత్రను వదలకుడా తీగల రాజకీయ విమర్శలు చేశారు. రాజకీయ అస్త్రాలు సంధించారు.ను  ఆమె తెరాస టికెట్ మీద గెలలేదని, గుర్తు చేసిన ఆయన, మంత్రి సబితా ఇంద్రారెడ్డి వైఖరిపై సీఎం కేసీఆర్ తో కూడా తాను చర్చిస్తానని పేర్కొన్నారు. అయితే, రేపో మాపో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్న తీగల ఆరోపణలను ముఖ్యమంత్రి ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటారనేది,చూడవలసి ఉందని అంటున్నారు. అయితే, విద్యా శాఖ పనితీరు పై వస్తున్న విమర్శలు, రాజకీయంగా వస్తున్న విమర్శల నేపధ్యంలో ముఖ్యమంత్రి, ఆమెకు ఉద్వాసన పలికే అవకాశం లేక పోలేదని పరిశీలకులు అంటున్నారు. అలాగే, ఇంతాకాలం ప్రత్యర్ధులు టార్గెట్ గా ఎన్నికల వ్యూహ రచన చేస్తున్న ముఖ్యమంత్రి, అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ దూకుడు పెంచిన నేపధ్యంలో ఇక పార్టీ, ప్రభుత్వ పక్షాళనపై దృష్టి పెట్టే అవకాశం లేక పోలేదని అంటున్నారు.అదే జరిగితే, కొందరు ఫిరాయింపు మంత్రులకు ఉద్వాసన తప్పక పోవచ్చని, ఆ జాబితాలో సబితా ఇంద్రా రెడ్డి పేరు ఖాయంగా ఉంటుందని అంటున్నారు.

సామాన్యుడి నెత్తిన గ్యాస్ ధరల బండ!

కొంచం విరామం అంతే మళ్లీ చమురు సంస్థలు తమ బాదుడు మొదలెట్టేశాయి. తాజాగా గృహావసరాలను వినియోగించే గ్యాస్ సిలెండర్ ధరపై ఏకంగా 50 రూపాయలు వడ్డించాయి. ఈ వడ్డింపు బుధవారం నుంచే అమలులోకి వస్తుంది. ఇటీవలే అంటే ఈ నెల 1వ తేదీన వాణిజ్యావసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరను 183.50 రూపాయలు తగ్గించిన చమురు సంస్థలు గృహావసరాలకు వినియోగించే బండపై 7వ తేదీ నుంచి 50 రూపాయలు వడ్డించడం విశేషం. ఇప్పటికే వెయ్యి రూపాయలు దాటేసిన గ్యాస్ సిలెండర్ ధర ఈ పెంపుతో 1100 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్ లో 14.2 కేజీల ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధర 1105 రూపాయలకు చేరుకుంది. కేంద్రంలో మోడీ సర్కార్ ధరల పెంపు విషయంలో తగ్గేదే లే అన్న తీరుతో వ్యవహరిస్తున్నది. ఏదైనా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉంటే.. ఆ సమయంలో మాత్రం ధరల పెంపును ఆపి ఎన్నికలు పూర్తయిన తరువాత అదీ ఇదీ కలిపి వడ్డించడం కేంద్రానికి ఒక అలవాటుగా మారిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలన్నీ అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్నా వాటి నియంత్రణ విషయంలో మాత్రం ప్రభుత్వం నిష్క్రియాపరత్వం ప్రదర్శిస్తూ, ధరల పెంపు విషయానికి వచ్చే సరికి ఎక్కడ లేని తొందరపాటు, ఉత్సాహం ప్రదర్శిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వాలంటీర్లకు వైసీపీ ఎసరు!

ప్రజలలో వ్యతిరేకత వైసీపీపై కాదు.. వైసీపీ ఎమ్మెల్యేలపై కాదు వ్యతిరేకత అంతా వాలంటీర్లపైనే.. ఇదీ వైసీపీ నేతలు ఇప్పుడు ముక్తకంఠంతో చెబుతున్న మాట. మనం నియమించిన వాళ్లు వాలంటీర్లు ఇప్పుడు వారి వల్లే మనకు ఇబ్బంది ఎదురౌతోందనుకుంటే వాళ్లని తొలగించేద్దాం అదెంత సేపు అన్నదే ఇప్పుడు వైసీపీ నేతలు చెబుతున్న మాట. పార్టీ ప్లీనరీలకు ముందు నిర్వహించిన జిల్లాల ప్లీనరీలలో నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఇదే విషయం చెప్పారు. పార్టీ బలోపేతం, పార్టీ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఇలా వేటి గురించీ జిల్లా ప్లీనరీలలో చర్చించలేదు. అందరూ వాలంటీర్లను ఆడిపోసుకోవడానికే పరిమితమయ్యారు. తానేటి వనిత, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు ఇలా మంత్రులందరిదీ దాదాపు ఒకటే మాట.. వాలంటీర్ల వల్ల మనం ప్రజలలో చులకన అవుతున్నాం. వారిని తొలగించేద్దాం అనే. ఎమ్మెల్యేలు, నాయకులూ కూడా వారికి వంత పాడారు. అదే సమయంలో వాలంటీర్లు అందరూ వైసీపీవారే అని కూడా అంటున్నారు. ఇదేం తిరకాసో అర్ధం కాక రాజకీయ పండితులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ అసలు విషయమేమిటంటే...పథకాల లబ్ధిదారుల ఎంపిక నుంచి ప్రతి విషయాన్నీ వాలంటీర్లకు అప్పగించిన జగన్ నియోజకవర్గాలలో, గ్రామాలలో, వార్డులలో వారిదే పెత్తనంగా మార్చేశారు. దీంతో ఎమ్మెల్యేలు, ఆఖరికి మంత్రులు కూడా వారి వారి ఇలాకాలలో డమ్మీలుగా మారిపోయారు. ప్రజలకు దూరమయ్యారు. ఏ పనీ చేయలేక నిస్సహాయులుగా మిగిలిపోయారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వారిలో ఆందోళన, అలజడి ఆరంభమైంది. తమ వారి వద్ద తమ  పలుకుబడి చూపించుకోవాలంటే నెపం వాలంటీర్లపై నెట్టేయడమే మార్గమని భావిస్తున్నారు. వాలంటీర్లు వారికి ఇచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేసుకుని వ్యవస్థలో జొరబడి అస్తవ్యస్తం చేసేశారని నిందిస్తున్నారు. వారిని తొలగించేద్దామనీ, ఆ తరువాత మనదే రాజ్యమని కింది స్థాయి క్యాడర్ కు నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు ప్రజాప్రతినిధులకు వారధిగా ఉంటారన్న ఉద్దేశంతో జగన్ ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ ప్రజా ప్రతినిథులను డమ్మీలను చేసేలా మారిపోయిందన్న అసంతృప్తి వైసీపీ ఎమ్మెల్యేలలో చాల కాలంగా ఉంది. ఇంత కాలం లోపల్లోపల దాచుకున్న ఈ అసంతృప్తినీ, ఆగ్రహాన్నీ జిల్లా ప్లీనరీలలో ఒక్క సారిగా వెల్లగక్కేశారు. అసలే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తరువాత పార్టీలో అసంతృప్తులతోనే సమస్యలు ఎదుర్కొంటున్న పార్టీ అగ్ర నేతలకు ఇప్పుడు వాలంటీర్లపై ప్రజా ప్రతినిథుల ఆగ్రహం కొత్త తలనొప్పులను తీసుకువస్తోంది. వెరసి ఇది వాలంటీర్ల ఉద్యోగాలకు ఎసరు తీసుకువచ్చే వరకూ వెళ్లింది. ఇప్పటికే రెగ్యులరైజేషన్ విషయంలో అసంతృప్తితో ఉన్న వాలంటీర్లు ఇప్పుడు తొలగింపు అంటూ పార్టీ కొత్త పల్లవి ఎత్తుకోవడంతో రగిలిపోతున్నారు. మొత్తం మీద ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి కుటుంబం వైసీపీ వైపే ఉండేందుకు జగన్ వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు మొదటికే మోసం అన్నట్లుగా తయారైంది. ఇటు పార్టీ క్యాడర్ లోనూ.. అటు ప్రజలలోనూ వాలంటీర్లపై ఆగ్రహం పెల్లుబుకుతుండటం.. ఆ వ్యవస్థ వల్లే పార్టీ కేడర్ కు ప్రజలకు మధ్య సంబంధాలు తెగిపోవడం.. ఇప్పుడు వారిని తొలగిస్తే మిగిలిన స్వల్ప వ్యవధిలో మళ్లీ నియోజకవర్గాల వారీగా, వార్డుల వారీగా, గ్రామాల వారీగా పథకాల లబ్ధిదారుల వద్దకు నేరుగా ప్రజా ప్రతినిథులను పంపి పథకాల ప్రచారంతో ఊదరగొట్టే సమయం లేకపోవడంతో వైసీపీలో ఆందోళన పెరుగుతోంది. ఏం చేయాలో తెలియక సభల్లో, సమావేశాల్లో వాలంటీర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారిని తొలగించేద్దామంటూ కేడర్ కు చెబుతూ పరిస్థితి మరింత దిగజారకుండా జాగ్రత్త పడుతున్నారు. 

ఔను.. బీజేపీతో క్విడ్ ప్రోకో నిజమే.. బట్టబయలు చేసిన వైసీపీ ఎంపి

నీకిది.. నాకిది అన్న ఒప్పందం.. సంబంధం కేంద్రంలోని బీజేపీ సర్కార్ తో తమకు ఉందని వైసీపీ ఎంపీ ఒకరు కుండ బద్దలు కొట్టేశారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ గత మూడేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వైసీసీ మద్దతు ఇస్తున్నదని అంగీకరించారు. అందుకు ప్రతిగా కేంద్రం అన్ని విధాలుగా రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తోందని చెప్పేశారు. దీంతో ఇప్పటి దాకా గుట్టుగా ఉన్న బీజేపీ- వైసీపీ క్విడ్ ప్రోకో సంబంధం లేదా అనుబంధం ఇప్పుడు బట్టబయలైపోయింది.  కోటగిరి శ్రీధర్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మాకు మీరు మద్దతు ఇవ్వండి మీకు మేం సహరకిస్తాం అంటూ బీజేపీ- వైసీపీల మధ్య రహస్య ఒప్పందం ఉందని గత మూడేళ్లుగా విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నాయి. అయితే అలాంటిదేమీ లేదని బీజేపీ, వైపీపీలు రెండూ రాజకీయ డ్రామాలతో రక్తి కట్టిస్తూ వచ్చాయి.  తలుపు చెక్కతో నువ్వొకటను.. తమలపాకుతో నేను రెండంటా అన్న చందంలో రాష్ట్రంలో బీజేపీ, వైసీపీలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ వచ్చారు. కానీ సాలూరు ఎంపీ వ్యాఖ్యలతో ఆ పార్టీల రహస్య మైత్రి ఇప్పుడు బట్టబయలైపోయింది. కేంద్రంలోని మోడీ సర్కార్ కు జగన్ ప్రభుత్వం అన్ని అంశాలలోనూ మద్దతుగా నిలవడంలో రహస్యం ఏమీ లేదని కోటగిరి శ్రీధర్ వస్పష్టంగా చెప్పేశారు.  గత మూడేళ్లుగా తమ ప్రభుత్వం అన్ని అంశాలలోనూ మోడీ సర్కార్ కు మద్దతు ఇస్తూనే ఉందని పలు సందర్భాలలో ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించామనీ ఆయన అన్నారు. ఆ కారణంగానే కేంద్రం అన్ని విధాలుగా రాష్ట్రానికి అండగా నిలుస్తూ సహాయ సహకారాలు అదిస్తోందని చెప్పారు. ఇంత కాలంగా అవే ఆరోపణలు చేస్తున్న విపక్షాలకు కోటగిరి శ్రీధర్ వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చడమే కాకుండా.. జగన్ తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణను తప్పించుకోవడానికే కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారనీ, రాష్ట్రానికి మొండి చేయి చూపినా పన్నెత్తు మాట కూడా అనడం లేదనీ మరింత పదునైన విమర్శలు సంధించేందుకు అవసరమైన ముడి సరుకుని కోటగిరి శ్రీధర్ వ్యాఖ్యలు విపక్షాలకు అందించాయి. ఇక్కడితో ఆగకుండా కోటగిరి శ్రీధర్ 2024 ఎన్నికలకు బీజేపీ, వైసీపీల వ్యూహాన్ని కూడా వెల్లడించేశారు. 2024 ఎన్నికలలో వైసీపీ విజయానికి సహకరిస్తే కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవడమే కాకుండా.. కేంద్ర ప్రభుత్వంలో వైసీపీ భాగస్వామి కూడా అవుతుందని కోటగిరి చెప్పారు. ఏపీకి కేంద్రం నిధుల విషయంలో ఉదారంగా సహకారం అందించడానికి జగన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి అన్ని విషయాలలోనూ మద్దతుగా నిలవడమే కారణమని అన్నారు. 2024 ఎన్నికలలో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా సాధిస్తామని కోటగిరి విశ్వాసం వ్యక్తం చేశారు.

కేసీఆర్ తప్పటడుగులు..టీఆర్ఎస్ లో అంతర్మథనం !

తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావు, దటీజ్ కేసీఆర్, మహా మేథావి. చాలా తెలివైన రాజకీయ నాయకుడు. అంతకంటే గొప్ప రాజకీయ వ్యూహకర్త. ఎంతటి రాజకీయ ఉద్దండులనైనా ఆయన ఇట్టే బుట్టలో వేసుకోగలరు. అంతేకాదు, ఎంతటివారినైనా అంతే తేలిగ్గా తీసి కరివేపాకులో కలిపేయనూ గలరు. ఇన్నెందుకు ఆయన ఘటనా ఘటన సమర్ధుడు. ఆయన రాజకీయ, విజ్ఞత, వివేచన మీద ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర లేదు.  ఆయన ఎప్పుడు, ఎందుకు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆయనతో సహా ఎవరికీ తెలియదు, కానీ, ఆయన నోటి నంచి వచ్చిన మాట రాజకీయ తుపాను సృష్టిస్తుంది. అలాగే, రాష్ట్ర రాజకీయాలలో ఆయనకు సమ ఉజ్జీగా నిలిచే నాయకుడు మరొకరు లేరు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన కంటే సీనియర్ నాయకులు ఉన్నా, ఉద్యమ నేతగా జనం ఆయన్ని ఎత్తు కుర్చీ ఎక్కించారు. సో.. ఆయనే టాలెస్ట్ లీడర్’గా చలామణి అవుతున్నారు. కానీ, అన్ని రోజులలో ఒకలా ఉండవు.నిజమే.నిన్నమొన్నటిదాకా, ఆయన తిరుగలేని నాయకుడే, అందులో  అనుమానం లేదు, అతిశయోక్తి అసలే లేదు. ఒక సంవత్సరం  క్రితం వరకు కేసీఆర్ గురించి చాలా మందికి ఉన్న అభిప్రాయం ఇదే. స్వపక్షీయులే కాదు, ప్రత్యర్ధులు కూడా అదే అనుకున్నారు. ఆయనను ఢీ’ కొనడం అయ్యే పని కాదనే నిర్ణయానికి వచ్చారు.అయితే అది నిన్నటి మాట.ఈరోజు పరిస్థితి అది కాదు. ఒక విధంగా ప్రస్తుతం అయన పరిస్థితి ఇంటా బయట ఒకేలా ఉందని అంటున్నారు. అంతేకాదు, ఆయనకు అడుగడుగునా అవరోధాలు, అవమానలే ఎదురవు తున్నాయని వాళ్ళు వీళ్ళు కాదు తెరాస నాయకులే అంటున్నారు. చెవులు కొరుక్కుంటున్నారు.  అవును. ఒక్క తప్పటడుగు, ఒకే ఒక్క తప్పటడుగు, అయన వ్యక్తిగత ఇమేజ్’నే కాదు, పార్టీ ఇమేజ్’ని ప్రభుత్వం ఇమేజ్’ని చివరకు రాష్ట్ర ఇమేజ్’ని కూడా డ్యామేజి చేసింది. ఒక తప్పు చేస్తే, ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు తప్పు వెంట తప్పు, తప్పు మీద తప్పు చేయక తప్పని అనివార్య పరిస్థితిని ఎదుర్కొనక తప్పుదు. కేసీఆర్ విషయంలో అదే జరిగింది. అదే జరుగుతోందని అంటున్నారు.   నిజానికి, తెరాస పతనానికి 2014 లోనే తొలి బీజం  పడింది. అసెంబ్లీ ఫలితాలు వచ్చిన కొద్ది గంటల్లోనే కేసీఆర్, చాలా స్పష్టమైన విధాన ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి.... తెరాస ఇక ఎంత మాత్రం ఉద్యమ పార్టీ కాదని ప్రకటించారు.అంటే తెరాస జీవనాడిని చిదిమేశారు.  అయన తమ తప్పు లేకుండా ఇంకో చక్కని మాట కూడా సెలవిచ్చారు. ఇక పై తెరాస ఫక్తు పదహారణాల రాజకీయ పార్టీ అని, ఎలాంటి అనుమానాలకు ఆస్కారంలేని విధంగా ‘క్లియర్ కట్’గా కుండ బద్దలు కొట్టారు. ఇక ఆ తర్వాత ఏమి జరిగిందనేది, చరిత్ర. రాజకీయ పునరేకీకరణ పేరిట, ఒక్క బీజేపీ మినహా మిగిలిన పార్టీల ఎమ్మెల్యేలను ఎగరేసుకు పోయారు. దీంతో, రాష్ట్రంలో ఇక తెరాసకు తిరుగేలేదనే అభిప్రాయం బలపcrపోయింది.  ఎనిమిదేళ్ళలో పదహారణాల రాజకీయ పార్టీ, ఇంచక్కా ఫోర్ ప్లస్ వన్ ఫ్యామిలీ పార్టీగా మారిపోయింది. ఇక ఆ తర్వాత సహజంగానే కుటుంబ పార్టీలకు అనివార్యంగా ఉండే, కుటుంబ, వారసత్వ కలహాలు, అవినీతి ఇత్యాదులన్నీ వచ్చి చేరాయి. అయినా, తెలంగాణ ప్రజలు 2018లో తెరాసకు మరో అవకాశం ఇచ్చారు. చంద్రబాబును బూచిగా చూపించి సెంటిమెంట్’ను రెచ్చగొట్టి ఆ ఎన్నికలలో విజయం సాధించారు.  అదొక అధ్యాయం అనుకుంటే, 2018లో జరిగిన ముందస్తు ఎన్నికలలో కేసీఆర్ నాయకత్వంలోనే తెరాస గెలిచినా గడచిన మూడున్నర నాలుగు సంవత్సరాలలో ఇటు పార్టీ పైన అటు ప్రభుత్వం పైనా ఆయన పట్టు తప్పింది. ఇందుకు ప్రధానంగా కుటుంబ, వారసత్వ వివాదాలే కారణంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కుటుంబంలో ‘కేటీఆర్’ను తక్షణం ముఖ్యమంత్రిని చేయాలనే వత్తిడి పెరుగుతోందని, అందుకే ముఖ్యమంత్రి తీవ్ర వత్తిడికి గురవుతున్నారాణి, కల్వకుట్ల ఫ్యామిలీ క్లోజ్ సర్కిల్స్ మీడియా సాక్షిగా బయట పెడుతున్నారు.ఈ వత్తిడి నేపధ్యంగానే ముఖ్యమంత్రి అనూహ్యంగా తప్పదు నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు.   అలాగే, 2014లో ఉద్యమ పార్టీ కాదని  ప్రకటించడం వ్యూహాత్మక తప్పిదం అయితే, ఇప్పడు అందుకు కొనసాగింపుగా కుటుంబ పాలనను ఎస్టాబ్లిష్ చేసేందుకు, ఈటల రాజేదంర్’ పై వేటు వేయడంతో మొదలైన తప్పటడుగులు,ఇంకా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కేసీఆర్ జాతీయ ఆకాంక్షలు మెగ్గలోనే తుంచేయడానికి కమలం వ్యూహాలు

తెలంగాణలో బీజేపీ రాజకీయ బల ప్రయోగానికి సిద్ధపడింది. తెలంగాణలో అధికారం చేపట్టడమొక్కటే లక్ష్యం కాదు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పై చేయి సాధించి ఊరుకోవడం కాదు. ఆ పార్టీ అధినేత జాతీయ ఆశలకు చెక్ పెట్టడం. ఇంకో మాటలో చెప్పాలంటే.. కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఆకాంక్షకు సమాధి కట్టేయడం. జాతీయ స్థాయిలో బీజేపీయేతర శక్తులను ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు కేసీఆర్ తోనే మొదలు కాలేదు. కేసీఆర్ తోనే అంతం కావు. అయినా బీజేపీ కేసీఆర్ నే ఎందుకు టార్గెట్ చేసింది. జాతీయ స్థాయిలో బీజేపీయేతర శక్తుల ఏకీకరణ విషయంలో కేసీఆర్ కంటే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఒకింత శక్తిమంతంగా ముందుకు సాగుతున్నారు. ఆమె వెనుక జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయగలిన శరద్ పవార్ వంటి నేతలూ ఉన్నారు. అయినా బీజేపీ కేసీఆర్ నే ఎందుకు టార్గెట్ చేసింది. ఈ ప్రశ్నలకు రాజకీయ పరిశీలకులు చెబుతున్న జవాబు దక్షిణాదిన పార్టీ పునాదులు బలంగా పడాలంటే కర్నాటక ఒక్కటే చాలదు.. తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకుంటే..   ఏపీలో వేళ్లూనుకోవడానికి ఆ పార్టీకి ఒక బేస్ దొరుకుతుంది. ఏపీలో అధికార వైసీపీ ఇప్పటికే కమలం చెప్పు చేతల్లో నడుస్తోంది. ఇక తెలంగాణలో కేసీఆర్ ను నిలువరిస్తే చాలు. ఇప్పటికే ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మరో సారి రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి అభివృద్ధి అజెండాను బలంగా ప్రచారం చేసుకుంటోంది. అదే సమయంలో కేంద్రంలో కూడా గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పై కూడా అసంతృప్తి జ్వాలలు ఎగసి పడుతున్నాయి. అయినా మరో సారి కేంద్రంలో జెండా ఎగురవేయగలమన్న ధీమా కమలనాధుల్లో వ్యక్తం కావడానికి  విపక్షాల అనైక్యతే అధికారాన్ని పువ్వుల్లో పెట్టి అందిస్తుందన్న విశ్వాసమే. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఆ సంగతి మరోసారి ప్రస్ఫుటమైంది. అయితే ఇక్కడే కేసీఆర్ తన వ్యూహాలతో కేంద్రంలో మూడో సారి అధికారం అన్న కమలనాథుల కలలకు చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలహీనంగా ఉందనడంలో సందేహం లేదు. ఇక విపక్షాల ఐక్యత ఎండమావే.. కానీ ప్రాంతీయ పార్టీలను ఐక్యం చేసే వ్యూహంతో కేసీఆర్ కదుపుతున్న పావులు తమ కాళ్లకు అడ్డం వస్తాయని కమలనాథులు భావిస్తున్నారు. కేసీఆర్ వ్యూహాత్మకంగా మోడీ టార్గెట్ గా విమర్శలు గుప్పించడం.. మోడీ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో అసువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేయడం వంటి చర్యలతో జాతీయ స్థాయి మీడియాను అట్రాక్ట్ చేశారు.  గుజరాత్ సీఎంగా మోడీ ఏరకంగా అయితే జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యారో... ఇప్పుడు అదే దారిలో కేసీఆర్ పాపులర్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ చేసింది.. దేశం అనుసరిస్తోంది అన్న అర్ధం వచ్చేలా జాతీయ మీడియాలో ప్రకటనలు గుప్పించి తన జాతీయ రాజకీయ ప్రవేశానికి ఒక వాతావరణాన్ని కల్పించుకునే ప్రయత్నం బలంగా చేశారు. సరే జాతీయ స్థాయిలో పార్టీలు కలసిరాకపోవడం వేరే సంగతి అయితే బీఆర్ఎస్ అంటూ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి బలంగా మోడీని ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేశ రాజకీయాలలో బీజేపీ వినా మరో జాతీయ పార్టీ బలంగా కనిపించని పరిస్థితి. అయితే దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ఆయా పార్టీల సిద్ధాంతాలూ, ఆకాంక్షలు వేటికవి భిన్నమే అయినా.. కేసీఆర్ ఆ పార్టీల మధ్య సయోధ్య సాధించి 2024 ఎన్నికల నాటికి ఒక బలమైన పోటీదారుగా వచ్చే అవకాశాలున్నాయన్నది కమలనాథుల అంచనా. అందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించే అవకాశం లేకుండా చేయడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందుకు వ్యూహరచన నుంచి కార్యాచరణ వరకూ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ మోడీషా ద్వయమే. ఒక నిర్దుష్ట సిద్ధాంతం పునాదిగా ఆవిర్భవించినట్లు చెప్పుకునే బీజేపీ ఇప్పుడు తెలంగాణలో చేరికలను ప్రోత్సహించడానికి సిద్ధపడిపోయింది. ఈ చేరికల సమన్వయ బాధ్యతలను టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తమ గూటికి చేరిన ఈటలకు అప్పగించింది. అంటే అర్ధమేమిటి? ఈటల టీఆర్ఎస్ లో తన పరిచయాలనూ, పలుకుబడినీ ఉపయోగించి ఆ పార్టీ నుంచి కమలం పార్టీలోని వలసలను ప్రోత్సహించడం.  తెలంగాణలో టీఆర్ఎస్ విజయానికి అవకాశాలు సన్నిగిల్లుతున్నాయన్న వాతావరణాన్ని కల్పిస్తే కేసీఆర్ ఇక జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టే అవకాశం ఉండదు. ఆయన పూర్తిగా తెలంగాణకే పరిమితమవ్వాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. బీజేపీ చేసింది, చేస్తున్నది అదే. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి కారణంగా కేసీఆర్ పూర్తిగా తెలంగాణపైనే దృష్టి సారించినా ఇక్కడ మరో సారి అధికారం చేజిక్కించుకునేందుకు చెమటోడ్చక తప్పని పరిస్థితి. ఇప్పటికే తెలంగాణలో అటువంటి వాతావరణం ఏర్పడింది. దానిని కొనసాగించడమే బీజేపీ లక్ష్యంగా చెబుతున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న సామెతలా కేసీఆర్ ఇటు తెలంగాణలో అధికారానికి దూరం చేయడం, అటు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించే అవకాశం లేకుండా చేయడం లక్ష్యంగా బీజేపీ వ్యూహాలను అమలు చేస్తున్నది. మరో వైపు రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతమై కేసీఆర్ కు సవాల్ విసురుతుండటం కూడా కమలానికి కలిసి వస్తున్నది.

కాంగ్రెస్ వైపు మాజీ మేయర్ చూపు!

కారు దిగి చేయి అందుకునే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. తాజాగా హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కూడా  కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. టీడీపి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన తీగల కృష్ణారెడ్డి ఇప్పుడు ఆ పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. గత ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డిపై  కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో విజయం సాధించిన సబితా ఇంద్రారెడ్డి ఆ తరువాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని మంత్రి అయ్యారు.  రానున్న ఎన్నికలలో  మహేశ్వరం నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఆమెకే దక్కడం ఖాయంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే తీగల కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  అంతే కాకుండా సబితా ఇంద్రారెడ్డికి వ్యతిరేకంగా గొంతెత్తుతున్నారు. సబితా ఇంద్రారెడ్డితో విభేదాల కారణంగా ఆయన కాంగ్రెస్ గూటికి చేరనున్నారని తెరాస శ్రేణులే చెబుతున్నాయి. సబితా ఇంద్రారెడ్డిపై తీగల కృష్ణారెడ్డి ఆరోపణలు చేయడాన్ని వారు ఇందుకు తార్కానంగా చెబుతున్నారు. ఇఫ్పటికే మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెరాసలో అసంతృప్తులతో టచ్ లో ఉంటున్నారని చెబుతున్నారు. ఒక ప్రణాళిక మేరకు ఆయన తెరాస అసంతృప్తులను కాంగ్రెస్ లోనికి ఆహ్వానిస్తున్నారని అంటున్నారు.  ఇప్పటి వరకూ టీఆర్ఎస్, బీజేపీల మధ్యే పోటాపోటీ రాజకీయం నడుస్తోందని అంతా భావించారు. అయితే ఆ రెండు పార్టీలనూ మించి కాంగ్రెస్ లోకి వలసలు పోటెత్తుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ రోజురోజుకూ బలోపేతం అవుతోందని ఆ పార్టీ నేతలే కాదు పరిశీలకులు సైతం చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ ఈ జోరు కొనసాగించేందుకు నిర్ణయించుకుంది.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన ఖరారు

ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు చెందిన ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు.  ఈ పర్యటనలో భాగంగా మదనపల్లెలో బుధవారం జరిగే మినీ మహానాడులో పాల్గొంటారు. ఆ మరుసటి రోజు అంటే గురువారం (జూలై7) పీలేరులో అన్నమయ్య జిల్లా   సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. శుక్రవారం (జూలై8న)   గంగాధర నెల్లూరు, నగరి నియోజకవర్గాల్లో రోడ్‌ షో ద్వారా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.  ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ ముందస్తు ఎన్నికలకు సన్నద్ధమ వుతున్న నేపథ్యంలో ఈ నెల 6,7,8 తేదీలలో నిర్వహించతలపెట్టిన చంద్రబాబు పర్యటన రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.   మదనపల్లె, పీలేరుల్లో జరిపే పర్యటనలో చంద్రబాబు పార్టీ వర్గాలకు దిశానిర్దేశం చేయడంతో పాటు కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా ముందస్తుగా అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసే అవకాశం కూడా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఛీ .. ఛీ సిగ్గేస్తోంది మంత్రి రోజా తీరుపై మహిళల ఆగ్రహం

ఆమె స్వతహాగా సినిమానటి ... ఒకప్పటి హీరోయిన్... నటన ఆమె వృత్తి ... అందువలన ఆమె ప్రవర్తన అలా ఉందని కాదు. అలాగే, నటీనటులు, హీరోలు, హీరొయిన్’లు అంతా ఒకేలా , సభ్యత, సంస్కారం మరిచి  అంతే అసభ్యంగా ప్రవర్తిస్తారని అసలే కాదు. కానీ, ఇటు సినిమా రంగంలో, అటు రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న, మాజీ నటీ, ప్రస్తుతం మంత్రి రోజా కాస్త చాలా బోల్డ్ టైపు లేడీ, ఎవరినీ లెక్కచేసే రకం కాదు. అది ఎవరో ఆమెకు ఇచ్చిన సర్టిఫికేట్ కాదు. ఆమె స్వయంగా తనకు తాను ఇచ్చి పుచ్చుకున్న  కితాబు . ఆపైన సుదీర్గ కాలం ‘జబరస్త్’ టీవీ షో లో జడ్జిగా,పగలబడి నవ్వడం (కొంత మంది గిట్టని వాళ్ళు వెకిలిగా, అసభ్యంగా,అసహ్యంగా నవ్వడం అని కూడా అంటారు) బాగా ప్రాక్టీసు చేశారు. సరే, ఆ షో ‘ఎలా ఉంటుంది .. ఎంత అసహ్యంగా, ఎంత అసభ్యంగా ఉంటుంది అనేది వేరే  విషయం వేరే చర్చ. కొంత మంది  అయితే బూతు కామెడి షో లన్నిట్లోకి ‘జబర్దస్త్’ ఖతర్నాక్ నెంబర్ వన్, షో అని అంటారు.అలాగే,  బూతు కామెడి షోలకు  ‘జబర్దస్త్’ పెట్టింది పేరని అంటారు. సరే, ఎవరు ఏమనుకున్నా, ఆ షోను జనం విరగబడి చూస్తున్నారు అనుకోండి అది వేరే విషయం. లోకో భిన్న రుచి హి.. ఎవరి ఎవరి టేస్ట్ వారిది. కొంత మందికి అలాంటి కామెడీనే బాగుంతుంది. అందులో రోజా ఒకరు.  అయితే ఆమె, మరో సెలబ్రిటీ అయితే అదోరకం.. కానీ, ఆమె ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి  పైగా ‘గౌరవ’ మంత్రి... సో ఆమె  గౌరవం. ఆమెకు మాత్రమే సొంతం కాదు. శ్రీ శ్రీ అన్నట్లుగా, ‘మీమీ వ్యక్తిగత జీవితాలు, మీమీ సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం’ అన్నట్ల్గు ఆమెను ప్రవర్తనను ప్రశ్నించ వలసి వస్తోందని అంటున్నారు.  ఆమె నటిగా ఉన్నత కాలం, జబర్దస్త్ షో .. జడ్జిగా ఉన్నంతకాలం పూర్వాశ్రయంలో ఆమె ఏమి  చేశారు అనేది, ప్రస్తుతానికి అప్రస్తుతం. కానీ, ఇప్పడు ఆమె కేవలం ఒక నటి, జబర్దస్త్ షో .. జడ్జి మాత్రమే కాదు, ఒక గౌరవప్రదమైన స్థానలో ఉన్న మహిళా. ఒక మంత్రి. సో.. ఆమె కొంత హుందాగా, గౌరవ ప్రదంగా వ్యవహరిస్తే బాగుంటుందని ఆశించడంలో తప్పులేదని సంన్యులు బావిస్తున్నారు. అయితే,  అదేమీ దురదుష్టమో. పాత వాసనలు ఆమెను వదలడం లేదులా  వుంది. వెనకటి వేషాలే వేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజమే, గతంలో జబర్దస్త్ వేషాల గురించి విమర్శలు వచ్చినప్పుడు, ఆమె, నటన తమ వృత్తని. దర్శకులు చెప్పిన విధంగా నటించడమే తమ కర్తవ్యమని, నట జీవితం వేరు, నిజ జీవితం వేరు .. రెంటిని ముడి పెట్టి చూడరాదని, తమ ప్రవర్తనను సమర్ధించుకున్నారు. అయితే. రోజా మంత్రి అయినా, ఆమె ప్రవర్తనలో, మాట తీరులో మార్పు రాలేదనేది, ఇప్పడు ఆమె పై వస్తున్న ప్రధాన విమర్శ. నిజానికి, ఆమె మంత్రిగా చేసేది, చేయగలిగింది ఏదీ లేదు. ఆమాట కొస్తే  జగన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులకు ఉన్న విలువ ఏ పాటిదో వేరే చెప్ప నక్కర లేదు, అందుకే, హేమాహేమీలకే దిక్కులేదు, రోజా అనగా ఎంత, అని ఆమె అనుచరులే, ఆమె ముఖం మీద కాకున్నా, చాటుగా నవ్వుకుంటున్నారు.  అయితే ఇప్పడు ఇంతలా ఆమె గురించి మాట్లాడుకోవడానికి, భీమవరంలో జరిగిన మన్యం వీరుడు, అల్లూరి సీతారామరాజు శత జయంతి వేడుకల వేదిక పై ఆమె ప్రవర్తించిన తీరే కారణమని అంటున్నారు. ఈ సందర్భంగా ప్రధనమంత్రి, ముఖ్యంత్రి సమక్షంలో ఆమె ప్రవర్తన  మంత్రి పదవికి హుందా తెచ్చేలా లేదని విమర్శకులు అంటున్నారు. నిజం ఎవరో విమర్శించారని కాదు, ప్రధానమంత్రితో సెల్ఫి తీసుకోవాలనే కోరిక సహజంగా ఎవరికైనా ఉంటుంది. అయితే, అందుకు సమయం, సందర్భం ఉంటుందనే స్పృహ లేకుండా, ఆమె మంత్రి అనే విషయం  మరిచి పోయినట్లు ఆమె ప్రవర్తన ఉందని విమర్శకులు తప్పు పడుతున్నారు. చివరకు ముఖ్యమంత్రి  చికాకు పడే వరకు,ఆమె సెల్ఫి ‘గోల’ ఆపక పోవడం విమర్శలకు తావిచ్చేలా ఉందని అంటున్నారు.   అదొకటి అలా ఉంటే, మంత్రి అయిన తర్వాత, ఇటీవల కాలంలో ఆమె చేసిన వ్యాఖ్యలు,  ఆమెను ఉద్దేశించి ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఆమె ఇమేజ్ ని మరింతగా దిగజారుస్తున్నాయని, సిగ్గుతో తలవంచు కుంటున్నామని సామాన్య మహిళలు కూడా అంటున్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది, రేపులు పెరిగిపోతున్నాయని, అంటే, ఏంటి, ఒకటి రెండు రేపులకే అంత ఇదై పోవాల, గోల చెయాల అంటూ ఆమె ఇచ్చిన సమాధానం, మహిళలు తల వచుకునేలా ఉందని మహిళలే ఆవేదన, ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు. చివరకు, అల్లూరి జయింతి ఉత్సావాలను ఆమె తమ ప్రవర్తనతో  అపవిత్రం చేశారని.. కార్యక్రమం స్పూర్తిని అగౌరవ పరిచే విధంగా మంత్రి రోజా ప్రవర్తన ఉందని, ప్రతిపక్షాలు కాదు ప్రజలు,ముఖ్యంగా మహిళలు ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు. ఇక ముందైనా, రోజా, పాత వాసనలు వదిలిచుకోవడం మంచిదని లేదంటి మంత్రి పదవి పోయినా మరకలు మాత్రం అలాగే ఉంటాయని, ఆమె మంచికోరేవారే అంటున్నారు. ఆమె వింటారా?

ఆర్మీకి నైనా వంద‌నం!

తండ్రితో వున్న అనుబంధాన్ని పిల్ల‌లు బాగా గుర్తుంచుకుంటారు.. మ‌న‌నం చేసుకుంటూంటారు. ఫ‌లానా స్కూలు ఫంక్ష‌న్‌కి ఎత్తుకు తీసికెళ్లాడ‌నో, ఆట‌ల్లో ఫ‌స్ట్ వ‌స్తే కేక్ తినిపించాడ‌నో.. ఇలా ఏవేవో చిన్న‌వే. అయినా వారికి ఎంతో పెద్ద విష‌యాలు. కానీ నైనా మాత్రం వాళ్ల నాన్న ఆర్మీ గురించి చెప్పిన నాలుగు మాట‌ల్ని ఎప్పుడూ మ‌న‌నం చేసుకుంటూంటుంది.   స్వాతంత్య్ర‌దినోత్స‌వం నాడు, గాంధీ జ‌యంతినాడో మ‌న‌కు దేశ భ‌క్తి పెల్ల‌బికివ‌స్తుంది. అన్ని ప‌ట్ట‌ణాలు, ప‌ల్లెలూ దేశ‌భ‌క్తి పాట‌ల‌తో ఊద‌ర‌గొట్టేస్తుంటారు. అప్పుడే ఆర్మీ గురించి మాట్లాడుకోవ‌డం ఎక్కువ‌గా వుం టుంది. వారి బాగోగుల గురించ చ‌ర్చా జ‌రుగుతుంటూంది. ఆ త‌ర్వాత వెంట‌నే అన్నీ మ‌ర్చిపోయి, పాట సంగ‌తి వ‌దిలేసి  ఎవ‌రి ప‌నుల్లో వాళ్లుంటాం. కానీ చిన్నారి నైనాకి అదంత సుల‌భం కాదు.  ఈ చిన్నారికి అంత త్వ‌ర‌గా మ‌ర్చిపోలేదు. కార‌ణం ఆమె తండ్రి 2018లో ఉగ్ర‌దాడుల్లో ప్రాణాలు విడిచా రు.  కానీ నైనా ఏడ‌వ‌డం లేదు. త‌న తండ్రి ఆర్మీ గురించి క‌బుర్ల‌ను, ఆర్మీ ప్రాధాన్య‌త గురించి చెప్పిన నాలుగు మాట‌ల్ని మ‌న‌సంతా నింపేసుకుని వాటినే మ‌న‌నం చేసుకుంటోంది. నైనా తండ్రి మేజ‌ర్ అక్ష‌య్ గిరీష్ కుమార్ 51వ రెజిమెంట్ ఇంజ‌నీర్‌. ఆయ‌న 2018లో జ‌మ్ము స‌మీపంలోని న‌గ్రోటాలో జ‌రిగిన ఉగ్రదాడుల్లో మ‌ర‌ణించారు.  అక్ష‌య్ ఎప్పుడూ త‌న కుటుంబానికి పెద్ద‌గానేకాదు, దేశ ర‌క్ష‌ణ బాధ్య‌త‌లు మ‌న‌స్ఫూర్తిగా చేప‌ట్డడంలో ఉండే ఆనందం కూడా అంద‌రికీ చెబుతూండే   దేశ‌భ‌క్తుడు. దేశం ప‌ట్ల ఎంత నిబద్ధ‌త‌తో వుండాలి,  ఇత రుల‌తో ఎలా వుండాలి, పెద్ద‌ల ప‌ట్ల గౌర‌వ మ‌ర్యాద‌లు పాటించ‌డం వంటి అనేకానేక అంశాలు పిల్ల‌దా నికి బోధిస్తుండేవాడ‌ట‌. ఎప్పుడూ చివ‌ర‌గా ఆర్మీ ప్ర‌త్యేక‌త గురించి మాట్లాడ‌టం మాత్రం మ‌రిచే వాడు కాదని ఆయ‌న త‌ల్లి, భార్యా అన్నారు. అదుగో ఆయ‌న అలా చెప్పిన మాట‌లే పిల్ల‌ది విని  మ‌న‌సుకు ఎక్కించు కుని మ‌న‌నం చేసుకుంటోంది.. తండ్రిని ద‌గ్గ‌ర‌గా చూస్తున్న భావ‌న‌తో.  అంద‌రం అంద‌రినీ గౌర‌విస్తామో లేదో గాని ఆర్మీవారు మాత్రం అంద‌రినీ జై హింద్ అనే గౌర‌వ వంద‌నం తోనే ప‌ల‌క‌రించ‌డం  నైనాను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అది అంద‌రూ ఎందుకు పాటించ‌రో  ఆ  చిన్నారి మ‌న‌సుకు తెలియ‌దు. కానీ నైనా త‌న తండ్రిని ఈ విష‌యంలో అమితంగా గౌర‌విస్తుంది. మ‌రి తండ్రి బాట‌లో  భావీత‌రంలో ఆర్మీ ఆఫీస‌ర్ అయినా పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌ప‌డ‌క్క‌ర్లేదేమో!

కాంగ్రెస్ లోకి వలసల జోరు.. ఆగస్టులో రాహుల్ తెలంగాణ పర్యటన!

తెలంగాణలో వలసల రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటి వరకూ టీఆర్ఎస్, బీజేపీల మధ్యే పోటాపోటీ రాజకీయం నడుస్తోందని అంతా భావించారు. అయితే ఆ రెండు పార్టీలనూ మించి కాంగ్రెస్ లోకి వలసలు పోటెత్తుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ రోజురోజుకూ బలోపేతం అవుతోందని ఆ పార్టీ నేతలే కాదు పరిశీలకులు సైతం చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ ఈ జోరు కొనసాగించేందుకు నిర్ణయించుకుంది. అందులో భాగంగానే పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ వచ్చే నెలలో అంటే ఆగస్టులో మరో సారి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎం కేసీఆర్ కుమారుడు అయిన కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్ లో రాహుల్ పర్యటన విజయవంతమైన సంగతి తెలిసిందే. వరంగల్ రైతు డిక్లరేషన్ కు భారీ స్పందన రావడంతో ఈ సారి సిరిసిల్ల సభలో నిరుద్యోగ డిక్లరేషన్ ప్రవేశపెట్టాలన్ని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తోంది. సిరిసిల్ల బహిరంగ సభ పై ఏఐసీసీ పెద్దలతో పీసీసీ చీఫ్ రేవంత్ చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సిరిసిల్ల సభను బీజేపీ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన విజయ సంకల్ప సభను మించి విజయవంతం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పట్టుదలగా ఉంది.  ఇలా ఉండగా నేడో రేపో తెరాస సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. అలాగే బీజేపీ వరంగల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కొడేటి శ్రీధర్ కూడా కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. వీరిరువురూ  కాంగ్రెస్ కీలక నేత, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ  సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే పటోళ్ల శశిధర్ రెడ్డి, పాలమూరు మాజీ ఎమ్మెల్యే ఏర్రశేఖర్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిలు కూడా రాహుల్ సమక్షంలో  కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.  

సైకిల్ పై ఆఫీస్‌కి వెళితే కి.మీ. కి 15 డాల‌ర్లు!

ఈ రోజుల్లో వాహ‌నాల రొద ఎక్కువైంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా మోటార్ వాహ‌నాలు తెగ వుప‌యో గిస్తున్నారు. ప‌ని వున్నా లేక‌పోయినా, బ‌డికి వెళ్లే వారూ చిన్న‌పాటి మోటార్‌సైకిల్ పైనే వెళుతున్నారు. వేగానికి  అతి ప్రాధాన్య‌త‌నిస్తున్నారేగాని దాని వ‌ల్ల వాతావ‌ర‌ణ కాలుష్యానికి అంతే కార‌కుల‌వుతున్నార‌న్న ధ్యాస మాత్రం వుండ‌డం లేదు. చాలాకాలం క్రితం మ‌న దేశంలో సైక్లింగ్ కీ ప్రాధాన్య‌త వుండేది.  కాల క్ర‌మంలో వేగానికి పెద్ద పీట వేయ‌డం జ‌రిగింది. అన్ని ప‌నులు స‌త్వ‌రం కావాలంటే మోటార్ వాహ నాల ప్ర‌యాణ‌మే సుఖం అన్న అభిప్రాయానికి వ‌చ్చేయ‌డంతో వాటినే ఎక్క‌డికి వెళ్లాల‌న్న వుప‌యోగిం చ‌డం అల‌వాటైపోయింది. ప్ర‌స్తుతం మ‌న దేశంలో సైక్లింగ్ కేవ‌లం ఆరోగ్య సూత్రాల్లో ఒక‌టిగా మిగిలి పోయింది. ఇది వూహించ‌ని మార్పు.  మ‌నం నెద‌ర్లాండ్స్ ప్ర‌భుత్వాన్ని చూసి ఎంతో నేర్చుకోవాలి.  అక్క‌డ ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు వెళ్లేవారు సైకిల్ మీద వెళితే కిలోమీట‌ర్‌కి 15 డాల‌ర్లు ప్ర‌భుత్వం ఇస్తోందిట‌!  దేశంలో సైక్లింగ్‌కు ప్రాధాన్య‌త‌నీయా లని అక్క‌డ ప్ర‌భుత్వం ఆలోచ‌న చేసింది. అంతేకాక‌,  ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు కాసింత వారివంతు తోడ్ప డ‌టంలో ఇదో మార్గం ఎంచుకుంది. అంటే సైక్లింగ్ ద్వారా అక్క‌డి వారు వారానికి మ‌న లెక్క‌ల్లో రూ.300 సంపాదించే అవ‌కాశం ప్ర‌భుత్వం క‌ల్పించింది. అది టాక్స్ ఫ్రీ!  సైకిలువాడ‌కం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వొత్తిడిని త‌గ్గిస్తుంది. న‌గ‌రాల్లో వాతావ‌రణ కాలుష్యాన్ని బాగా త‌గ్గిస్తుంది. ఈ కార‌ణాల‌వ‌ల్ల‌నే సైక్లింగ్‌ను ప్రమోట్ చేస్తున్నామ‌ని నెద‌ర్లాండ్స్ ప్ర‌భుత్వ మౌలిక స‌దుపాయాల మంత్రి వాల్దువెన్ అన్నారు. సైక్లింగ్‌ను ఉత్సాహ‌ప‌ర‌చ‌డం ద్వారా సంవ‌త్స‌రానికి వంద‌ల యూరోలు మిగులుతాయ‌న్నారు. ప్ర‌భుత్వానికి కూడా ఎంతో మేలు చేసిన‌ట్లేన‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌భుత్వం ఈ ప‌ర‌మైన గ‌ట్టి నిర్ణ‌యాల‌ను అమ‌లు చేయ‌డంలో ప్ర‌జ‌ల ఆరోగ్య సంర‌క్ష‌ణ ప‌ట్ల వారి వున్న ప్ర‌త్యేక దృష్టిని తెలియ‌జేస్తుంది.  ఇలాంటి ఆలోచ‌న‌లు మ‌న దేశంలో అమ‌లుచేయ‌డానికి ప్ర‌భుత్వాల‌కు ఎవ‌రుచెప్ప‌గ‌లుగుతారు. రోజు రోజుకూ పెరిగిపోతున్న కాలుష్యానికి ఫుల్‌స్టాప్ పెట్ట‌డానికి సైక్లింగ్ విధానాన్ని మ‌న ప్ర‌భుత్వాలూ చేప‌డితే మేలు. కాలుష్య నివార‌ణ‌, ప్ర‌మాదాల నివార‌ణ‌కూ సైక్లింగ్ని ఉత్సాహ‌ప‌ర‌చాలి. నెల‌లో క‌నీసం కొన్ని రోజులు కార్యాల‌యాలకు సైకిల్ మీద రావాల‌ని గ‌ట్టి నిబంధ‌న‌ను అమ‌లుచేయ‌డానికి పూనుకోవాలి. అపుడు నెద‌ర్లాండ్స్ వ‌లె మ‌న దేశంలోనూ ప్ర‌జారోగ్యం, ప‌ర్యావ‌ర‌ణ‌ప‌రిర‌క్ష‌ణ ప‌ట్ల  ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెరుగు తుంది. 

తెలంగాణలో కాంగ్రెస్ గాలి.. పార్టీలోకి వలసలపై హైకమాండ్ తో రేవంత్, భట్టి చర్చలు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలం పుంజుకుంటోంది. పార్టీలోకి అధికార తెరాస నుంచి వచ్చి చేరుతున్న నేతలే ఇందుకు నిదర్శనం. ముందు ముందు ఈ చేరికలు భారీగా ఉండే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్న నేపథ్యంలో వారి అంచనాలు వాస్తవమేననడానికి రుజువులు లభించాయి. చేరికల విషయమై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హస్తిన చేరుకున్నారు. వీరిరువురూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్వి కేసీ వేణుగోపాల్ తో బేటీ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ లోకి వలసలు వరదలా పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో బేటీ అయ్యారు. ఈ భేటీలో వీరి మధ్య తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, బీజేపీ, టీఆర్ఎస్ లోపాయికారీ మైత్రి అంశం సహా పలు అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా పార్టీలోకి చేరికలు పెరగడం, రాహుల్ వరంగల్ పర్యటన తరువాత పార్టీలో పెరిగిన జోష్,  విద్యార్థి, నిరుద్యోగ డిక్లరేషన్, దళిత, గిరిజన డిక్లరేషన్ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.  అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీలో చేరికలపై స్థానిక అంశాలు, వ్యూహాత్మక వ్యవహరాలు సహా అన్ని విషయాలనూ దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళతామని రేవంత్ చెప్పారు. పార్టీలోకి ఇంకా ఎవరెవరు రానున్నారు అన్న విషయాలను ముందుగా బయటకు చెప్పడం సరికాదని రేవంత్ అభిప్రాయపడ్డారు. తెరాస నుంచి కాంగ్రెస్ లోకి వలసలు వెల్లువెత్తుతాయని మాత్రం చెప్పగలనని రేవంత్ అన్నారు. అయితే ఎవరెవరు వస్తున్నారన్న వివరాలను ముందుగా వెల్లడించడం సరికాదన్న రేవంత్ అలా చేస్తే చేరే వారిపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఆపే అవకాశం ఉందన్నారు. పార్టీలోకి ముందు ముందు పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయన్న ఆయన ఆ విషయంలో అధిష్టానం నుంచి స్పష్టత తీసుకున్నామని చెప్పారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు, టికెట్ల విషయంపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందన్నారు. పార్టి టికెట్ల కేటాయింపు అన్నది ఎన్నికలు వచ్చినప్పుడు ఒక నిర్దుష్ట ప్రక్రియ ప్రకారం జరుగుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.  గెలుపు గుర్రాలు అన్న ఒక్క అంశమే కాకుండా.. పార్టీ పట్ల విశ్వసనీయత, నిబద్ధత కూడా టికెట్ల కేటాయింపు విషయంలో పరిగణనలోనికి తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ అన్నా, ఇప్పుడు జాతీయ పార్టీ అంటున్నా అంతా ప్రధాని మోడీకీ, బీజేపీకి ఉపయోగపడేందుకు మాత్రమేనని రేవంత్ అన్నారు. మోడీకి ప్రయోజనం చేకూరేలా విపక్షాలలో చీలిక తెచ్చేందుకే కేసీఆర్ ప్రయత్నమంతా అని ఆరోపించారు. అందుకే రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపిక కోసం నిర్వహించిన సమావేశానికి కేసీఆర్ హాజరు కాలేదని రేవంత్ ఆరోపించారు. మమతా బెనర్జీ ఆధ్వర్యంలో విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు సమావేశం జరిగిన రోజు బీజేపీ ఓడిపోయే పరిస్థితి ఉందని అందుకే కేసీఆర్ ఆ సమావేశానికి డుమ్మా కొట్టారని రేవంత్ చెప్పారు.  అయితే నవీన్ పట్నాయక్, ఇతర పార్టీలూ ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించిన అనంతరం, అంటే బీజేపీ విజయంపై స్పష్టత వచ్చాకే కేసీఆర్ విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. ఇక సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచీ కాంగ్రెస్ లోకి వలసలు ఉంటాయని చెప్పారు. చేరికల జాబితాపై హైకమాండ్ తో చర్చించామన్నారు. టీఆర్ఎస్ నుంచే కాకుండా ఇంకా పలు పార్టీల నుంచి కూడా చేరికలు ఉంటాయనీ, దశల వారీగా, విడతల వారీగా ఈ చేరికలుంటాయని వివరించారు. కేసీఆర్, మోడీల కపట నాటకాన్ని ప్రజలకు వివరిస్తామని అన్నారు. ఇక కాంగ్రెస్ లో గ్రూపు విభేదాల గురించి అడిగిన ప్రశ్నకు బిన్నాభిప్రాయాలను బేధాభిప్రాయాలుగా చూడటం తగదని భట్టి బదులిచ్చారు. 

రాహుల్ ఫేక్ వీడియో కేసు.. టీవీ యాంకర్ అరెస్ట్

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మాజీ  అధ్యక్షుడు. కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి ఎన్నికైనా పార్లమెంట్ సభుడు. అక్కడ ఆయనకో ఆఫీస్ వుంది.. ఆ ఆఫీస్ పై దాడి జరిగింది. ఆ దాడిచేసింది ఎవరు, ఏమిటి అనేది పస్తుతానికి అప్రస్తుతమే అయినా, అధికార సిపిఎం పార్టీ అనుబంధ విద్యార్ధి విభాగం, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు రాహుల్ గాంధీ కార్యాలయం పై దాడి చేసినట్లు సమాచారం. కేరళలోని అటవీ ప్రాంతాల్లో బఫర్‌ జోన్ల ఏర్పాటు విషయంలో స్థానిక ఎంపీ రాహుల్‌ జోక్యం చేసుకోవడం లేదని, అసలు యాన్ కనిపించడమే లేదని  నిరనసకు దిగిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆయన కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. 80-100 మంది కార్యకర్తలు రాహుల్‌ కార్యాలయంలో వీరంగం సృష్టించారు. అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు. ఆందోళనకారుల్లో 8 మందిని పోలీసులు అదుపులోకి తేసుకున్నారు. రాహుల్  గాంధీ కార్యాలయంపై దాడి ఘటనపై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీ కార్యాలయంపై దాడిని చేయించింది కేరళలోని అధికార పార్టీ సీపీఎంకు చెందిన విద్యార్థి విభాగం కార్యకర్తలే అని ఆరోపించారు. అందుకు బాధ్యులైన వారిని శిక్షించాలని కాంగ్రెస్ నాయకులు సిపిఎం ప్రభుత్వాని డిమాండ్ చేశారు.  అయితే, రాహుల్ ‘గాంధీ’ దాడిని ఖండిస్తూనే, “అయినా వారు చిన్న పిల్లలు. వారిని క్షమింపుడు” అంటూ, పోలీసులు అదుపులోకి తీసుకున ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను క్షమించి వ‌దిలి పెట్టాల‌ని పోలీసులను  కోరుతూ ఒక వీడియో విడుదల చేశారు .  అయితే ఈ వీడియోను జీ న్యూస్ త‌ప్పుగా ప్లే చేసింది. రోహిత్‌ రంజన్... జీ టీవీ ఛానెల్‌లో పేరుగాంచిన డీఎన్‌ఏ షోకి వ్యాఖ్యతగా చేస్తున్నాడు. రాహుల్‌ గాంధీ వయనాడ్ లో తన ఆఫీస్ పై జరిగిన దాడి గురించి వీడియో రిలీజ్ చేయగా..దాన్ని ఉదయ్ పూర్ లో కన్హయ్యలాల్ అనే టైలర్ ని ముస్లిం యువకులు హత్య చేసిన ఘటనకి లింక్ చేస్తూ వీడియోను టీవీలో ప్లే చేశారు. ఉద‌య్‌పూర్ నిందుతులని వ‌దిలిపెట్టాల‌ని రాహుల్ చెప్పినట్లు ఉద్దేశం వ‌చ్చేలా రాహుల్ వ్యాఖ్యలను వక్రీకరించి వీడియోను ప్లే చేశారు.దాని మీద రాహుల్ గాంధీని త్రోల్ చేస్తూ, వేల సంఖ్యలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో జీ టీవీ న్యూస్‌ యాంకర్‌ రోహిత్‌ రంజన్‌ పై చత్తీస్‌గఢ్‌, రాజస్తాన్ రాష్గ్రాల్లో కేసులు నమోదయ్యాయి. కాగా, మంగళవారం ఉదయం ఘజియాబాద్ పోలీసులు ఢిల్లీ శివార్లలోని రోహిత్ నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి చత్తీస్‌గఢ్‌ పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నిచగా ఘజియాబాద్‌ పోలీసులు రంగంలోకి దిగి రంజన్‌ని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే నాటకీయ పరిణామాల మధ్య అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. అదలా ఉంటే, ఇప్పడు నేరం చేసిన వారిని రాహుల్ గాంధీ వదిలేయమని ఎలా చెపుతారని, కొదరు ప్రశ్నిస్తున్నారు. నిజమే, కారణాలు ఏవైనా తప్పు చేసిన వారిని క్షమింఛి వదిలేయడం వలన వారు మళ్ళీ అదే తప్పు చేసే ప్రమాదం ఉందని..,సోచిన్నా పెద్ద అనే తేడాలేకుండా తప్పు చేసిన వారిని తగిన విధంగా శిక్షించ వలసిందే అంటున్నారు.

అస్సాం టీ తోట‌ల్లో పిల్ల‌ల ర‌క్ష‌కురాలు .. రాధ‌!

అస్సాం జ‌నాభాలో 20 శాతం మంది తేయాకు తోట‌ల్లో కూలీలే. వీరిలో చాలామంది ఇత‌రుల‌పై ఆధార‌ప‌డి న పిల్ల‌లూ వున్నారు. భార‌త‌దేశ టీ ఉత్ప‌త్తిలో 50 శాతం ఇక్క‌డి నుంచే ఉత్త‌త్తి అవుతుంది. అంత‌టి ఈ ప్రాంతంలో ఈ కూలీలంతా చారిత్ర‌కంగా వొత్తిడికి గుర‌వుతున్నావారే. అభివృద్ధి అంటే ఏమిటో తెలియ‌ని వారు కావ‌డం మ‌రీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. విద్య‌, ఆరోగ్యం, ప‌రిశుభ్ర‌త, నివాస ప‌రిస్థితులు, న్యూట్రిష‌న్‌, త‌ల‌స‌రి ఆదాయం వంటి అభివృద్ధి సూచిక‌ల కోణంలో చూస్తే ఈ కూలీలు క‌నీసం ద‌రిదాపుల్లో లేరు. సంవత్సరాల తరబడి ప్రణాళికాబద్ధంగా బహిష్కరించడంతోపాటు అర్హతలు , సామాజిక భద్రత అందు బాటులో లేకపోవడంతో టీ తోటల కార్మికులలో ఎక్కువ మంది తరతరాలుగా పేదరికానికి పరిమితమ య్యారు. ఈ ప్రాంతంలో పునరావృతమయ్యే వరదలు దుర్భరమైన పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. జూలై 2014 నుండి అస్సాంలోని సోనిత్‌పూర్, బిస్వనాథ్ , దిబ్రూగఢ్ జిల్లాల్లోని 35 పెద్ద తేయాకు తోటలలో పిల్లలు ,వారి కుటుంబాలతో సేవ్ ది చిల్డ్రన్ పని చేస్తున్నారు. టీ తోటల మధ్య జోక్యం చేసుకోవడంలో పిల్ల‌ల బృందాలు ఏర్పడ్డాయి. సంవత్సరాలుగా, వారు శిక్షణ పొందిన నాయకులుగా ఎదిగారు. పిల్లల హక్కులు, రక్షణ కీల‌క‌ సమస్యలు. అలాంటి బాల నాయకుడి కథ రాధా కుర్మీది. లేపేట్‌కట్ట టీ ఎస్టేట్ లోని జంగిల్‌లైన్‌లో నివాసం ఉంటున్న తొమ్మిదో తరగతి విద్యార్థిని రాధ (17) తన తల్లి, తండ్రి, ఇద్దరు అన్నలతో కలిసి నివసిస్తున్నారు. ఆమె తల్లి గంగు రజక్ (35) దినసరి కూలీ, ఆమె తండ్రి మంగళ్ రజక్ (43) టీ ఎస్టేట్ కార్మికుడు. రాధకు స్కూల్‌కి వెళ్లడం అంటే ఇష్టం. ఆమె తన టీ ఎస్టేట్‌లోని 20 మంది సభ్యుల బృందాల‌లో ఒక భాగం. 2019లో శిక్షణా సెషన్‌లో బాలల హక్కులకు సంబంధించిన వివిధ అంశాలను ఆమెకు పరిచయం చేశారు. అప్పటి నుంచి ఆమెను ఆపడం లేదు. ఆమె తన టీ గార్డెన్‌లోని పిల్లలతో పిల్లల రక్షణ సమస్యలపై అవగాహన కల్పించేందుకు విస్తృతంగా పని చేస్తోంది. ఆమె తన సంఘంలోని పిల్లల బృందానికి నాయకత్వం వహిస్తుంది. బాల నాయకురాలిగా గ్రామ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీతో సన్నిహితంగా పనిచేస్తుంది. గ్రూప్ లీడర్‌గా, ఆమె పిల్లల హక్కులకు సంబంధించిన వివిధ సమస్యలను చర్చించడానికి తరచుగా సమావేశాలను నిర్వహిస్తుంది.  అలాంటి ఒక సమావేశంలో, బృందం భిన్నమైన విధానాన్ని అవలంబించాలని నిర్ణయించుకుంది మరియు థియేటర్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ఈ మాధ్యమం ద్వారా బాలల హక్కులపై సంఘాల్లో అవగాహన కల్పించాలన్నారు. సేవ్ ది చిల్డ్రన్ స్ట్రీట్ థియేటర్‌ని స్క్రిప్ట్ చేయడానికి మరియు పిల్లలు మరియు టీ ఎస్టేట్ కమ్యూనిటీలో అవగాహన పెంపొందించడానికి సమూహాన్ని రూపొందించడానికి మద్దతు ఇచ్చింది. మహమ్మారి సమయంలో, పేలవమైన కనెక్టివిటీ, ఆర్థిక కారణాల వల్ల టీ కార్మికుల పిల్లలు వారి తరగతు లను చేరువ చేయడంలో ఇబ్బంది పడుతున్నప్పుడు, రాధ నేర్చుకోవడం కొనసాగింపును నిర్ధారించ డానికి తన బాధ్యతను స్వీకరించింది. ఈ విషయాన్ని ఆమె స్థానిక పంచాయతీకి తెలియజే సింది. వారి మద్దతుతో, ఆమె ఎనిమిది మంది బాలురు మరియు బాలికలను పాఠశాలకు చేర్చింది. స్థానిక ఉపాధ్యా యులు కోవిడ్‌ తగిన ప్రవర్తనను నిర్వహించడం ద్వారా గ్రామ కమ్యూనిటీ హాల్‌లో శారీరక తరగతులు తీసుకునేలా పంచాయతీని సమీకరించారు. రాధ, ఆమె బృందం గ్రామ బాలిక‌ల సంర‌క్ష‌ణ‌ కమిటీ సభ్యుల మద్దతుతో కనీసం ఐదు బాల్య వివాహాలను కూడా ముందస్తుగా నిరోధించింది.  ఆశా అనే బాలి కను ఆమె పొరుగువారు శారీరకంగా వేధిస్తున్నారని గుర్తించినప్పుడు ఆమె కూడా జోక్యం చేసుకుంది. ఆశా తన పట్ల ఎందుకు హీనంగా ప్రవర్తిస్తున్నారనేది అర్థం చేసుకోలేకపోయింది.  తన తల్లి ఎదుర్కొంటున్న వేధింపులకు తానే కారణమని చెప్పింది. ఆ అనుభవం ఆమెను తీవ్రంగా గాయపరిచింది.  ఆశా తన బాధాకరమైన అనుభవాన్ని పంచుకున్న ప్పుడు నేను చాలా కృంగిపోయాను. కానీ నేను ఏమి చేయాలో నాకు తెలుసు. ఆశాకు అవసరమైన రక్షణ కల్పించాలని నేను గ్రామ బాలిక‌ల సంర‌క్ష‌ణ‌ కమిటీని సంప్రదించాను. వ్యవస్థను మార్చడానికి సమయం పడుతుంది, కానీ అలా చేయకూడదు. వైద్యం ప్రక్రియను అరికట్టండి ,గాయంతో ఉన్న కుటుంబంతో సానుభూతి పొందండి  అని రాధ సమస్యను పరిష్కరించాలనే సంకల్పంతో స్పష్టం చేసింది. ఆమె, సేవ్ ది చిల్డ్రన్స్ కమ్యూనిటీ మొబిలైజర్, మను, ఆశా, ఆమె తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. జిల్లాలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీని కూడా ఆదుకోవాలని కోరారు.

రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఫేక్ వీడియో.. ఛత్తీస్ గఢ్ లోఇద్దరు బీజేపీ ఎంపీలపై ఎఫ్ఐఆర్

ఫేక్ వార్తల ప్రచారం, వీడియోల ప్రసార విషయాలలో బీజేపీ ఇంత కాలం తాను పవిత్రంగా ఉన్నానంటూ చేసుకుంటున్న ప్రచారంలో ఇసుమంతైనా వాస్తవం లేదని తేలిపోయింది.  విప‌క్షాల‌పై దుష్ప్రాచారానికి వీడియో టేప్‌ల‌ను విడుదల చేయడమనే దుష్ట సాంప్రదాయం అంటని సచ్ఛీలత మాది అంటున్న బీజేపీ బండారం బయటపడిపోయింది. పేక్ వార్తలు, వీడియోల విషయంలో బీజేపీకి మినహాయింపు ఏమీ లేదని తేటతెల్లమై పోయింది.   రాహుల్ గాంధీకి వ్య‌తి రేకంగా ఫేక్ వీడియో విడుదల చేసినందుకు ఇద్దరు బీజేపీ ఎంపీలపై ఛత్తీస్ గడ్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది.   ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో రాహుల్‌గాంధీకి సంబంధించి విడుద‌లైన వీడియో మ‌త‌ సామ‌ర‌స్యానికి భంగం క‌లిగించే దిలా వుంద‌ని దాఖ‌లైన ఫిర్యాదుపై బీజేపీ ఎంపీలు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, సుబ్రత్ పాఠక్‌లపై ఎఫ్ఐ ఆర్ నమోదు అయ్యింది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఎంపీలతో పాటు మరో ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదైందని ఆ పార్టీ మీడియా పబ్లిసిటీ టీమ్ చీఫ్ పవన్ ఖేరా తెలిపారు. ఢిల్లీ, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్ లో  కూడా కాంగ్రెస్ వారిపై ఫిర్యాదులు చేసిందని, ఖేరా, ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ సుప్రియా శ్రీనాటే విలేకరులతో అన్నారు.   రాహుల్ పై ఫేక్ వీడియోలు విడుదల చేసి  బీజేపీ ఎంపీలిద్దరూ దేశద్రోహానికి పాల్పడ్డారని ఆయన దేశంలో మత సామరస్యానికి భంగం కలిగించే ఉద్దేశంతో కేంద్ర మాజీ మంత్రి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే, అది దేశద్రోహమేనని ఆమె ఆరోపిం చారు.  అబ‌ద్ధ వార్త‌లు ప్ర‌చారంచేసేవారికి  బీజేపీలో ప్రమోషన్లు వస్తున్నాయన్నారు.    హైదరాబాద్‌లో ప్రధాని దాదాపు అరగంట సేపు మాట్లాడారని, అయితే శాంతి, మత సామరస్యం కోసం కోసం ఒక్క విజ్ఞప్తి కూడా చేయలేదని ఆమె అన్నారు.