another case on vallabhaneni vamshi

వల్లభనేని వంశీ... అయ్యో పాపం అనే నాథుడే లేడు!

  చేసిన తప్పులు దండంతో సరి అన్నది ఎక్కడైనా చెల్లుతుందేమో కానీ రాజకీయాలలో మాత్రం కాదు. అందులోనూ నిలువెల్లా అహంకారంతో విర్రవీగి.. స్థాయి మరిచి చేసిన వ్యాఖ్యలతో చెలరేగిపోయిన వల్లభనేని వంశీ వంటి వారి విషయంలో అసలు కాదు అని అనక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు వంశీ గత 95 రోజులుగా రిమాండ్ ఖైదీగగా జైలులో ఉన్నారు. ఆరోగ్యం క్షీణించిందంటూ మధ్యలో ఒకటి రెండు సార్లు జైలు నుంచి ఆస్పత్రికి కూడా వెళ్లి వచ్చారు. తాజాగా గురువారం (మే 16) కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడటంతో వంశీని జైలు అధికారులు హుటాహుటిన జైలుకు తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మళ్లీ జైలుకు తరలించారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యర్థన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడ తరలించారు. అప్పటి నుంచీ ఆయన జైలులోనే ఉన్నారు. ఒక కేసు తరువాత ఒక కేసు వంశీ మెడకు చుట్టుకుంటూనే ఉన్నాయి. మొత్తం ఐదు కేసులలో నాని నిందితుడు. టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన వంశీ.. తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీపైనే విషం కక్కారు. పార్టీ అధినేతపైనే కాకుండా ఆయన కుటుంబీకులపై కూడా అనుచిత, అసభ్య వ్యాఖ్యలు చేశారు. వాటికి తోడు అక్రమాలు, దౌర్జన్యాలు. ఇప్పుడా పాపాలన్నీ ఒకే సారి పండుతున్నాయా అన్నట్లుగా ఆయనపై కేసులు నమోదౌతున్నాయి. చివరికి ఆయన సొంత పార్టీ వైసీపీ శ్రేణులు సైతం వంశీ పరిస్థితి పట్ల ఇసుమంతైనా సానుభూతి చూపుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఏదో కొద్ది మంది అనుచరులు వినా ఆయనకు మద్దతుగా మాట్లాడే వారే కరవయ్యారు. ఇదంతా వంశీ స్వయంకృతాపరాధమే అన్న అభిప్రాయమే సాధారణ జనం నుంచి వైసీపీ క్యాడర్ వరకూ వ్యక్త అవుతోంది.  రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ నుంచి ఆ పార్టీ కష్ట కాలంలో ఉండగా కాడె వదిలేసి అధికారపార్టీ పంచన చేరిన వంశీ.. అలా చేరి ఊరుకోకుండా గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేయడమే లక్ష్యం అన్నట్లుగా రెచ్చిపోయారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు  తెలుగుదేశం అధినేతపైనే కాకుండా ఆయన కుటుంబ సభ్యులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యవహార శైలి కారణంగానే గన్నవరంలో 2024 ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. అసలు ఎన్నికల కంటే ముందే వంశీ తన ఓటమిని అంగీకరించేయాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. అంటే 2024 ఎన్నికల నాటికే ఆయన జనం మద్దతును సానుభూతినీ కోల్పోయారు. ఇక ఓటమి తరువాత నియోజకవర్గానికి ముఖం చూపిన పాపాన పోలేదు. అసలు దాదాపు అజ్ణాతంలోకి వెళ్లిపోయారా అన్నట్లుగా ఆయన కనిపించలేదు. వినిపించలేదు. అయితే గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసు నుంచి తప్పించుకోవడానికి ఆయన మళ్లీ రంగంలోకి దూకారు. ఆ కేసులో ఫిర్యాదుదారుడిని కిడ్నాప్ చేసి, బెదరించి కేసు ఉపసంహరించుకునేలా చేశారు. అక్కడే అడ్డంగా బుక్కై అరెస్టయ్యారు. ఇక అప్పటి నుంచీ ఆయన కటకటాల వెనుకే ఉన్నారు.  అయితే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిలు వచ్చింది. అయినా కూడా బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఆయనపై ఉమ్మడి కృష్ణాజిల్లా లోని ఓ వ్య‌క్తికి సంబంధించిన ఇంటి వ్య‌వ‌హారంలో జోక్యం చేసుకుని న‌కిలీ ప‌త్రాలు సృష్టించి.. వాటితో స‌ద‌రు ఇంటి కబ్జాకు సహకరించారన్న కేసు, అలాగే 2019 ఎన్నికల సమయంలో వంశీ ఓ పోలింగ్ బూత్ వద్ద చేసిన హంగామాకు సంబంధించిన కేసు వంశీ స‌హ‌క‌రించారని కేసు న‌మోదైంది. ఇలా వంశీపై మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. వీటిలో ఐదు కేసుల్లో వంశీకి బెయిలో, ముందస్తు బెయిలో లభించింది. ఇక ఆరో కేసులో అంటే గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఆయన బెయిలు పిటిషన్ పై శనివారం ( మే 17)న కోర్టు తీర్పు వెలువరించనుంది. ఆ కేసులో కూడా వంశీకి బెయిలు వస్తే ఇక ఆయన విడుదలే అని అంతా భావించారు. ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులూ వంశీ విడుదల ఖాయమన్న ఆశాభావంతో ఉన్నారు. అంతలోనే ఆయనపై మరో కేసు నమోదైంది. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంపై వంశీపై నమోదైన కేసులో పోలీసులు పీటీ వారంట్ దాఖలు చేశారు. దానికి నూజివీడు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో వల్లభనేని వంశీకి గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో సపోజ్, ఫర్ సపోజ్ బెయిలు వచ్చినా విడుదలయ్యే అవకాశాలు లేకుండా పోయాయి.   నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీని ఈ నెల 19లోగా కోర్టులో హాజరు పరచాలని కోర్టు ఆదేశిం చింది. అయితే వంశీని ఈ కేసులో శనివారమే పోలీసులు కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉందని అంటున్నారు.  వంశీ వరుస కేసులతో జైళ్లోనే ఉంటున్నా, ఆనారోగ్యంతో బాధపడుతున్నారన్న వార్తలు వినవస్తున్నా అయ్యో పాపం అనే నాథుడే కనిపించడం లేదు. 

indias Homeland defense capability threataning americ

ట్రంప్ ను భయపెడుతున్న భారత్ స్వదేశీ రక్షణ సామర్ధ్యం

భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ తమ ఘనతేనని, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  ఒకటికి పదిసార్లు చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటున్నారు అనే కంటే ట్రంప్  సొంత డబ్బా వాయించుకుంటున్నారు అనడమే కరెక్ట్.  ట్రంప్ చెప్పుకుంటున్న గొప్పల్లో నిజముందో లేదో వేరే చెప్పవలసిన అవసరం లేదు.అగ్రరాజ్యం అధ్యక్షుడు అంతటివాడు చెప్పిన విషయాన్నే ఒకటికి పదిసార్లు చెప్పుకుంటున్నారు అంటేనే, అందులో నిజం లేదని అర్థమౌతోందని దౌత్య రంగ నిపుణులు అంటున్నారు.  నిజానికి  ట్రంప్ మధ్యవర్తిత్వంతోనే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందే నిజం అయితే..  అందుకు సంబంధించి ఉభయ దేశాలు సంయుక్త ప్రకటన చేయాలి.  కానీ అలాంటిదేమీ జరగలేదు. పోనీ అమెరికా ప్రభుత్వం అయినా ఒక అధికారిక ప్రకటన చేసిందా అంటే అదీ లేదు.  ట్రంప్  స్వయంగా ట్వీట్ చేశారు. ఆ వెంటనే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో అదే స్వరం ఎత్తుకున్నారు. మరో వంక కాల్పుల విరమణకు భారత్  పాకిస్థాన్ దేశాలు రెండూ అంగీకరించినా, అమెరికా  పాత్రను ఒక్క పాక్ మాత్రమే ప్రస్తావించింది.  భారత దేశం ఆ ప్రస్తావన చేయలేదని  అమెరికా పత్రికలే పెద్ద అక్షరాల్లో రాశాయి. అవును. ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన చేసిన వెంటనే అమెరికా పత్రిక న్యూయార్క్ టైమ్స్, అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ద్వారా కాల్పుల విరమణ ప్రకటన చేశారు. దీనికి అమెరికా మధ్యవర్తిత్వం వహించిందన్నారు. భారత్-పాకిస్థాన్ అధికారులు కాల్పుల విరమణను ధ్రువీకరించారు. అయితే.. పాకిస్తాన్ మాత్రమే ఇందులో అమెరికా పాత్రను ప్రస్తావించింది  అని న్యూయార్క్ టైమ్స్ రాసింది. అంటే  ట్రంప్  క్లెయిమ్’ ను భారత దేశం అంగీకరించలేదనే నిజాన్ని అమెరికా పత్రిక స్పష్టం చేసింది. అయినా.. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం నవ్వి  పోదురు గాక నాకేటి సిగ్గు అన్నచందంగా పదే పదే కాల్పుల విరమణ తన ఘనతేనని చాటుకుంటున్నారు. చాటింపు వేస్తున్నారు. నిజానికి అప్పుడే కాదు, ఇప్పటికీ భారత దేశం అమెరికా మధ్యవర్తిత్వం వాదనను  ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవడమే కాదు, భారత్, పాకిస్థాన్ దేశాల డీజీఎంవోల మధ్య కుదిరిన ఒప్పందం మేరకే కాల్పుల విరమణ నిర్ణయం జరిగిందని భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది.  అలాగే.. భారత విదేశాంగ శాఖ అధికారికంగానే జమ్మూ కశ్మీర్  విషయంలో మూడో దేశం ప్రమేయాన్ని అంగీకరించేది లేదని ప్రకటించింది. నిజానికి  భారత విదేశాంగ  మంత్రి జై శంకర్  పాకిస్థాన్ తో ద్వైపాక్షిక సంబంధాలే ఉంటాయని స్పష్టం చేశారు. కుండ బద్దలు కొట్టేశారు. మరోవంక  భారత దేశం తాత్కాలిక కాల్పుల విరమణకు మాత్రమే అంగీకరించింది. అందుకే.. ఇప్పుడు తాజాగా  కాల్పుల విరమణను మరికొంత కాలం పొడిగించాలని, ఉభయ దేశాల సైనిక అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఈ పొడిగింపు క్రెడిట్  కూడా అగ్ర రాజ్య అధినేత ట్రంప్   తమ ఖాతాలో వేసుకుంటే వేసుకోవచ్చును కానీ..  కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు  వ్యవహారం గానీ, సింధు జలాల ఒప్పందం రద్దు చేస్తూ భారత  దేశం తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించాలని పాక్  కాళ్ళ బేరానికి వచ్చిన తీరును గానీ, గమనిస్తే ట్రంప్ సార్  గప్పాల ఘన కీర్తి ప్రపంచానికి తేట తెల్లంగా తెలిసి పోయింది.   అయినా..  భారత దేశం మాటల ద్వారా, చేతల ద్వారా ఎంతగా స్పష్టం చేసినా..  అమెరికా అధ్యక్షుడు  ట్రంప్ మాత్రం అదే పాట పాడుతున్నారు. అమెరికా మధ్యవర్తిత్వం ద్వారానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని  పదే పదే చెప్పుకుంటున్నారు. ఒకే అబద్ధాన్ని పది సార్లు చెపితే నిజం అవుతుందని అనుకుంటున్నారో ఏమో కానీ.. ట్రంప్ నిరాధార ప్రకటనలతో ప్రయోజనం పొందాలని అనుకుంటున్నారు. అయితే..  అగ్ర రాజ్యాధినేత  ట్రంప్ ఎందుకు ఒకే అబద్ధాన్ని పదే పదే వల్లే వేస్తున్నారు? ఎందుకు,  ఆ క్రెడిట్ కోసం అంతలా ఆరాట పడుతున్నారు?  అంటే..  అందుకు  ట్రంప్ వ్యహార సరళి, అగ్ర రాజ్య అహంకారంతో పాటుగా వచ్చిన వ్యక్తిగత దురహంకారం  సహా  ఇతర కారణాలు కూడా ఉంటే ఉండవచ్చును.  కానీ, మూడు రోజుల మినీ వార్’ ద్వారా భారత దేశం సైనిక సామర్ధ్యాన్ని ప్రపంచం ముందుంచింది. ఆర్థిక ప్రగతితో పాటుగా భారత దేశం సైనిక శక్తిగా ఎదుగుతున్న తీరు ప్రపంచం  కళ్లారా చూసింది. స్వదేశీ సాంకేతిక, సాయుధ శక్తిని ప్రపంచాని తెలిసింది. భారత దేశం సైనిక శక్తి రోజురోజుకీ పెరుగుతోంది. అ త్యాధునిక ఆయుధ సంపత్తితో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో, రూపుదిద్దుకున్న ఈ గగనతల రక్షణ వ్యవస్థ, శక్తి సామర్ధ్యాలు ప్రపంచం కళ్లకు సాక్షాత్కరించింది.  నిజానికి, భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరగలేదు. కానీ.. ఆపరేషన్ సిందూర్,  మూడు రోజుల మినీ వార్ ప్రపంచానికి  భారత దేశ శక్తి సామర్ధ్యాలను చాటి చెప్పింది. ఒక విధంగా అగ్ర రాజ్యం అమెరికా వెన్నులో వణుకు పుట్టించింది. అందుకే..  ట్రంప్  భారత దేశం అజేయ శక్తిగా ఎదుగుతున్న నిజాన్ని జీర్ణించుకోలేక, అసలు విషయాన్ని పక్క దారి పట్టించేందుకే భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ముఖ్యంగా భారత రాజకీయాల్లో వివాదాన్ని రాజేసి..  తద్వారా  భారత్ శక్తి సామర్ధ్యాలను తక్కువ చేసే ప్రయత్నం చేశారు. దురదృష్టవశాత్తు  ప్రతిపక్ష పార్టీలు ట్రంప్ కు వంత పాడుతున్నాయి. భారత్‌, పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తానే కుదిర్చానన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.?  అలాగే ఆపరేషన్‌ సిందూర్‌ ఎందుకు నిలిపివేశారో జవాబు చెప్పాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా జైహింద్  ర్యాలీలు నిర్వహిస్తోంది. అయితే..  నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్లుగా..  మెల్ల మెల్లగా అసలు నిజం ప్రపంచానికి తెలుస్తోంది. భారత స్వదేశీ రక్షణ, సాయుధ సామర్ధ్యం, ఆధునిక సాంకేతిక సామర్ద్యాలతో  భారత్ అజేయ శక్తిగా ఎదుగుతోందనే నిజం ప్రపంచం గుర్తిస్తోంది. ఆ నిజమే అగ్రరాజ్య అధినేతను భయపెడుతోంది. అందుకే ట్రంప్  బడాయి మాటలకు ఇది కూడా ఒక ప్రధాన కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

jagan purchase iphone

ఐ బాబోయ్ జగన్.. బినామీ పేరుతో సిమ్ కార్డు.. సిగ్నల్ యాప్ లో సీక్రెట్ చాట్!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తాను ఫోన్ వాడనని సమయం వచ్చినా లేకున్నా, సందర్భం ఉన్నా లేకున్నా పదేపదే చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి ఆయన హఠాత్తుగా ఫోన్ కొనేశారు. అది ఐఫోన్. ఇక ఫోన్ వాడకం కూడా మొదలెట్టేశారు. ఎందుకంటారా? అక్కడికే వస్తున్నాం.  జగన్ ఫోన్లు, యాప్ లు, గాడ్జెట్ల వాడకం తనకు ఇష్టం ఉండదని ఇంత కాలం చెప్పుకుంటూ వచ్చారు. తాను ఫోన్ ఉపయోగించననీ, తేనకు అసలు ఫోనే లేదనీ, ఇక నంబర్ ఎక్కడ నుంచి వస్తుందనీ పలు సందర్భాలలో చెప్పుకున్నారు. సీఏంగా ఉన్న ఐదేళ్లూ, పరాజయం తరువాత పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయిన తరువాత చాలా రోజుల వరకూ ఫోన్ జోలికి వెళ్లని జగన్ ఇప్పుడు ఏకంగా ఐఫోన్ కొనుక్కుని దానితో ఏం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అన్న అనుమానాలు సహజంగానే అందరిలోనూ వ్యక్తం అవుతాయి. అలాగే వ్యక్తం అవుతున్నాయి కూడా. ఇంతకీ ఇంత హఠాత్తుగా తన సొంతానికి ఫోన్ అత్యవసర వస్తువుగా జగన్ కు ఎందుకు మారిపోయింది అంటే.. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఒకరి తరువాత ఒకరుగా జగన్ కు అత్యంత సన్నిహితులైన వారు అరెస్టౌతున్నారు. ఇప్పటికే రాజ్ కేశిరెడ్డి, ఆయన సహాయకుడు దిలీప్ అరెస్టయ్యారు. వీరిలో రాజ్ కేశిరెడ్డి అప్రూవర్ గా మారే అవకాశం ఉందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా భారతీ సిమెంట్స్ జీవిత కాల డైరెక్టర్ గోవిందప్ప అరెస్టయ్యారు. దీంతో  మద్యం కుంభకోణం తీగలు కదిలాయి.. ఇక తాడేపల్లి ప్యాలెస్ డొంక కదలడమే తరువాయి అన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.  జగన్ హయాంలో సీఎంవోలో చేసిన ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా నోటీసులు అందుకుని విచారణకు హాజరౌతున్నారు. వారు కూడా ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో విచారణలో నిందితులు ఏం చెబుతున్నారు? అన్న అంశంపై పలు కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏం జరుగుతోంది? ఎవరేం చెబుతున్నారు? ఎవరేం మాట్లాడుతున్నారు అన్న విషయాలపై ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెలుసుకోవాలంటే సొంతంగా తన వద్ద ఫోన్ ఉండటం అవసరం అని జగన్ భావించారు. అందుకే ఇన్నాళ్లూ లేనిది హఠాత్తుగా ఇప్పుడు ఓ ఐఫోన్ కొనుగోలు చేశారని పరిశీలకులు చెబుతున్నారు. మద్యం కుంభకోణం కేసులో మినిట్ టు మినిట్ అప్ డేట్స్ ను తన సన్నిహితుల ద్వారా, న్యాయవాదుల ద్వారా తెలుసుకునేందుకే జగన్ ఫోన్ వాడకం మొదలెట్టారంటున్నారు.   భద్రతా పరంగా ఐఫోన్ మిన్న అంటారు. అందుకే జగన్ ఐఫోన్ కొనుగోలు చేశారనీ, ఆయన సిగ్నల్ యాప్ ను ఉపయోగిస్తున్నారనీ తెలిసింది. ఈ సిగ్నల్ యాప్ కు పెద్దగా ప్రాచుర్యం లేదు. ఈ యాప్ ద్వారా చేసిన ఛాట్ నిర్దుష్ట సమయం తరువాత ఆటోమేటిగ్గా డిలీట్ అవుతుంది. పూర్తిగా ఎరైజ్ అయిపోతుంది. ఎంత సమయంలో చాటింగ్ డేటా ఎరైజ్ అయిపోవాలన్నది యూజర్ తన ఐఫోన్ లో సెట్ చేసుకోవచ్చు. ఎ రకంగా చూసినా ఇది  సేఫ్ అని భావించడం వల్లనే జగన్ ఐఫోన్ కొనుగోలు చేసి అందులో సిగ్నల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తనకు అవసరమై సమయంలో అవసరమైన మేరకు చాటింగ్ చేసి.. ఆ వెంటనే ఎరేజ్ చేసుకునే సౌకర్యం ఉండటంతో జగన్ సిగ్నల్ యాప్ ను వినియోగిస్తున్నారంటున్నారు.  సిగ్నల్ యాప్ ద్వారా చేసిన చాటింగ్ ట్రేస్ చేయడానికి సాధ్యం కాదనీ, ఎక్కడా సేవ్ కాదనీ చెబుతున్నారు.  అందుకే జగన్ దీన్ని సహచరులు, కేసులో నిందితులు, వ్యక్తిగత సిబ్బంది, లాయర్లతో సంప్రదింపులకు వాడుతున్నట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని మద్యం కుంభకోణం దర్యాప్తు అధికారులు కూడా ధృవీకరించారు. కేవలం సిగ్నల్ యాప్ మాత్రమే కాకుండా ఫేస్ టైం యాప్ ద్వారా కూడా జగన్ మాట్లాడుతున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.  మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా జగన్ ఐఫోన్ వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు.  మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు, నిందితుల విచారణ తదితర వివరాలను మినిట్ టు మినిట్ తెలుసుకుంటున్నారని అధికారులు అంటున్నారు.  ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే జగన్ వాడుతున్న ఐఫోన్ సిమ్ కార్డు ఆయన  పేరు మీద కాకుండా ఆయనకు అత్యంత విశ్వాసపాత్రుడైన బినామీ పేరు మీద తీసుకున్నారనీ దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.  

india shock to turkey

టర్కీకి భారత్ ఝలక్.. సెలిబి యేవిషేషన్ భద్రతా అనుమతులు రద్దు

నమ్మక ద్రోహానికీ, విశ్వాస ఘాతుకానికీ పాల్పడిన టర్కీకి భారత్ బిగ్ షాక్ ఇచ్చింది.  ఆ దేశ సంస్థ సెలిబి ఏవియేషన్ కు భద్రత అనుమతిని రద్దు చేసింది. ఆపరేషన్ సిందూర్, తదననంతర పరిణామాలలో భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ టర్కీ పాకిస్థాన్ కు పూర్తి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. గతంలో భారీ భూకంపంలో టర్కీ దయనీయ స్థితిలో ఉన్న సమయంలో భారత్ దోస్త్ అంటూ ఆ దేశానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించింది. అపత్సమయంలో ఆపన్న హస్తం అందించిన భారత్ విషయంలో టర్కీ వ్యవహరించిన తీరుకు దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇండియాలో అయితే టర్కీ ఉత్పత్తులు, కంపెనీలను బ్యాన్ చేయాలన్న డిమాండ్ జోరుగా వినిపిస్తోంది.  ఇప్పుడు తాజాగా పాలు పోసిన చేతినే పాములా కాటేసిన టర్కీకి ఇండియా గట్టి గుణపాఠం చెప్పింది.  టర్కీ సంస్థ సెలెబి ఏవియేషన్‌కు భద్రతా అనుమతిని భారత్ రద్దు చేసింది. టర్కీకి చెందిన సెలిబి ఏవియేషన్ సంస్థ భారత్ లోని తొమ్మిది   విమానాశ్రయాలలో  హై సెక్యూరిటీ పనులను  నిర్వహిస్తుంది. అయితే ఇందుకు సంబంధించిన భద్రతా అనుమతిని భారత ప్రభుత్వం రద్దు చేసింది.  ఉగ్రవాదానికి దన్నుగా నిలిచిన పాకిస్థాన్ కు టర్కీ మద్దతు ఇవ్వడాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ ఈ చర్య తీసుకుంది. అంతే కాదు ఆ దేశంతో భారత్ వాణిజ్య సంబంధాలను తెంచుకోబోతోందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. తొట్టతొలిగా  జాతీయ భద్రత దృష్ట్యా టర్కీ సంస్థ సెలిబీ ఏవియేషన్ భద్రతా అనుమతిని రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.   1958లో స్థాపించబడిన సెలెబి కంపెనీ... టర్కీలో మొట్టమొదటి ప్రైవేట్ యాజమాన్యంలోని గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థ.  ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 70 విమానాశ్రయాలలో తన సేవలను అందిస్తున్నది. భారత్ పాకిస్థాన్ మథ్య యుద్ధవాతావరణం నెలకొన్న సమయంలో టర్కీ పాకిస్థాన్ కు మద్దతుగా నిలిచిన నేపథ్యంలో  దేశవ్యాప్తంగా    బాయ్‌కాట్ టర్కీ  అన్న నినాదం జోరందుకుంది. ఈ తరుణంలో ఆ దేశానికి చెందిన సెలిబి యేవియేషన్ సంస్థ భద్రతా అనుమతిని కేంద్రం రద్దు చేయడం అంటే ముందు ముందు ఆ దేశంతో అన్ని రకాల వ్యాపార, వాణిజ్య సంబంధాలనూ రద్దు చేసేకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నదనడానికి సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

supreme court serious om mp minister vijaysha

మధ్యప్రదేశ్ మంత్రికి సుప్రీం చీవాట్లు !

విజయ్‌ షా, బీజేపీ నాయకుడు. బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి. అంతే, అయితే ఆయన గురించి చెప్పుకోవలసిన అవసరం వచ్చేది కాదు.కానీ.. ఆపరేషన్‌ సిందూర్‌ వివరాలను మీడియాకు వెల్లడించిన కల్నల్‌ సోఫియా ఖురేషీని ఉద్దేశించి ఉగ్రవాదుల సోదరి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దేశం ముందు ఆయన్ని దోషిగా నిలబెట్టాయి. దేశానికి తలవంపులు తెచ్చాయి. అవును.. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు  దేశం ముందు ఆయన్ని దోషిగా నిలబెట్టటమే కాదు, మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపే సీనియర్ నాయకురాలు ఉమా భారతి అన్నట్లుగా దేశం మొత్తానికి తలవంపులు తెచ్చాయి.  రెండు రోజుల కిందట ఇండోర్‌లో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఆపరేషన్‌ సిందూర్‌ విషయంలో ప్రధాని మోదీపై  మంత్రి విజయ్ షా పొగడ్తల వర్షం కురిపించారు. అంతటితో ఆగకుండా.. అదే క్రమంలో   పహల్గాంలో ఉగ్రవాదులు మన సోదరీమణుల నుదుట సిందూరాన్ని తుడిపి వారిని వితంతువులను చేస్తే.. ప్రధాని మోదీ వాళ్ల(ఉగ్రవాదుల)మతానికే చెందిన సోదరిని విమానంలో పంపి ఉగ్రవాదులను మట్టుబెట్టించారు  అని అన్నారు.  విజయ్‌ షా చేసిన ఈ వ్యాఖ్యలు సహజంగానే రాజకీయంగానూ దుమారం సృష్టించాయి. కాంగ్రెస్ తో పాటు జాతీయ మహిళా కమిషన్‌, మధ్యప్రదేశ్‌ హైకోర్టు కూడా ఈ అంశంపై స్పందించాయి. విజయ్‌షా వ్యాఖ్యలను క్యాన్సర్‌తో పోల్చిన హైకోర్టు, ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో మధ్య ప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్  నమోదు చేశారు. దీంతో అరెస్ట్‌ నుంచి రక్షణ కోరుతూ సదరు మంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా.. అరెస్ట్‌ నుంచి రక్షణ కోరుతూ మంత్రి విజయ్ షా దాఖలు చేసిన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవాయ్‌  గురువారం (మే 15) విచారణ జరిపారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మంత్రిని తీవ్రంగా మందలించారు. ఆయన వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావన్నారు. కర్నల్‌పై మంత్రి చేసిన వ్యాఖ్యలు అనుచితమైనవిగా అభివర్ణించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రసంగాలు చేసేటప్పుడు సంయమనం పాటించాలన్నారు.  మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు?  మీరు కొంత సున్నితత్వాన్ని ప్రదర్శించాలి. వెళ్లి హైకోర్టులో క్షమాపణ చెప్పండి అంటూ మందలించారు. ఆయనపై క్రిమినల్‌ చర్యలు ప్రారంభించాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. అదలా ఉంటే బీజేపీ అధిష్టానం ఆయనపై ఎలాంటి చర్యా తీసుకోకపోవడం, కనీసం సంజాయిషీ అయినా అడగక పోవడం  మరింత వివాదంగా మారింది. అంతే కాదు, ఒక్క ఉమాభారతి మినహా  మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సహా రాష్ట్ర, కేంద్ర బీజేపీ నాయకులు ఎవరూ కూడా విజయ్‌షా వ్యాఖ్యలను ఖండించలేదు. అయితే  సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టిన నేపధ్యంలో  విషయం తీవ్ర వివాదాస్పదంగా మారడంతో విజయ్‌ షా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. సోఫియా ఖురేషీని కలలో కూడా అవమానించననీ, తన సొంత సోదరి కంటే ఎక్కువుగా ఆమెను గౌరవిస్తున్నానని పేర్కొన్నారు. సోఫియా ఖురేషీ దేశానికి చేసిన సేవలకు ఆమె సెల్యూట్‌ చేస్తున్నానన్నారు. తన మాటలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే పది సార్లు క్షమాపణ చెప్పడానికైనా తాను సిద్ధమని వివరణ ఇచ్చారు. మరోవంక కర్నల్‌ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి విజయ్‌ షాను ఎందుకు బర్తరఫ్‌ చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ప్రశ్నించారు. మంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్‌ తీవ్రంగా ఖండించింది. ఇప్పటికైనా బీజేపీ అధిష్టానం విజయ్ షా పై చర్యలు తీసుకుంటుందా?  లేదా అనేది చూడవలసి ఉందని అంటున్నారు. అయితే దెశ వ్యాప్తంగా మఖ్యంగా  బీజేపీ సాధారణ కార్యకర్తలు మొదలు సీనియర్ నాయకులు వరకు ప్రతి ఒక్కరు, విజయ్ షా పై పార్టీ, ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

congress in confusion

కన్ఫూజన్ లో కాంగ్రెస్.. తప్పులో కాలేసిందా?

పహల్గాం ఉగ్రదాడి మొదలు కాంగ్రెస్ పార్టీ  ఆచారానికి భిన్నంగా ఆచి చూచి అడుగులు వేస్తూ వచ్చింది. వ్యూహతంకంగా పావులు కదిపింది. అక్కడ ఇక్కడ ఒకటి రెండు అపశ్రుతులు వినిచ్పించినా.. అందరిదీ ఒకటే మాట అన్నట్లుగా ప్రభుత్వానికి అండగా, ఒకే మాటపై  నిలిచింది. ఆపరేషన్ సిందూర్ విషయంలోనూ, అనంతర పరిణామాల విషయంలో ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించింది. ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యకైనా కాంగ్రెస్ మద్డతు ఉంటుందని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనాయకుడు,లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఇతర నాయకులు ప్రకటించారు.  నిజానికి పహల్గాం ఉగ్రదాడి జరిగిన వెంటనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) పహల్గామ్   దాడిని ఖండిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతుగా నిలిచిన పాకిస్తాన్‌కు తగిన గుణ పాఠం  చెప్పవలసిన సమయం ఆసన్నమైందని తీర్మానంలో పేర్కొంది. అలాగే..  ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తీర్మానంలో పేర్కొంది. కేవలం తీర్మానం చేయడం మాత్రమే కాదు, ఆచరణలోనూ నిబద్దత చూపింది. 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న  పహల్గాం దాడి  సంఘటనలో  భద్రతా లోపాలు వంటి వైఫల్యాల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉన్నా, కాంగ్రెస్ పార్టీ విజ్ఞత చూపింది. సమన్వయంతో వ్యవహరించింది. ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీని అనుసరించాయి. అంతవరకు అంతా బాగుంది.  అయితే.. ఎప్పుడైతే కాల్పుల విరమణ అంశం తెరపైకి వచ్చిందో, అక్కడి నుంచి కథ అడ్డ తిరిగింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  అతి ఉత్సాహంతో చేసిన ప్రేలాపనలు  కాంగ్రెస్ పార్టీకి  ప్రభుత్వం పై విరుచుకు పడేందుకు అస్త్రాన్ని అందిచాయి. ఇక అక్కడి నుంచి కథ మారింది. కాంగ్రెస్ గొంతు సవరించుకుని  ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రారంభించింది. ఇండియా కూటమి పార్టీలు అదే దారిలోకి వచ్చాయి. కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా    పాత్ర ఏమిటని నిలదీశాయి. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో, భారత్-పాకిస్థాన్ దేశాలు తటస్థ ప్రదేశంలో విభిన్న అంశాలపై విస్తృత స్థాయి చర్చలకు అంగీకరించాయని చేసిన ప్రకటనపై కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వివరణ కోరారు. అలాగే.. కాల్పుల విరమణకు పాకిస్థాన్ ఇచ్చిన హామీ, ఏమిటి, పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలను కూల్చివేసేందుకు పాక్ అగీకరించిందా, అని ప్రశ్నించారు. ఒక విధంగా చూస్తే  ప్రభుతాన్ని గట్టిగానే కార్నర్  చేశారు. ఇరకాటంలోకి నెట్టారు. అయితే..  ఓ వంక పార్టీలోని ఒక వర్గం, మోదీ ప్రభుత్వం పై ప్రశ్నలతో విరుచుకు పడుతున్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీలోని మరో వర్గం మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తుతోంది. అలాగే  మరోవంక ముఖ్యనాయకులు కొందరు కాంగ్రెస్ పార్టీ తప్పులో కాలేసిందని ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా కాల్పుల విరమణ అనంతరం మోదీ  ప్రభుత్వం ఒక దాని వెంట  ఒకటిగా తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్నచర్యలు కాంగ్రెస్ పార్టీని కలవరపాటుకు గురిచేస్తున్నాయని అంటున్నారు. అలాగే..  కాల్పుల విరమణ విషయంలో మోదీ ప్రభుత్వం అమెరికా మధ్యవర్తిత్వాన్ని తప్పు పట్టడం కూడా,తప్పే అవుతుందని కాంగ్రెస్ లోని ఒక వర్గం నాయకులు పార్టీలోని కొందరు ముఖ్యనాయకులు పార్టీ స్టాండ్ ను తప్పు పడుతున్నారు. ఉభయ దేశాలూ అణ్వాయుధ దేశాలు అయినప్పుడు పట్టువిడుపులు అనివార్యమవుతాయని, అందుకే మోదీ ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని సీనియర్ నాయకులు అంటున్నారు.   అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంగళవారం(మే12) ఆపరేషన్ సిందూర్  పై  జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ద్వారా  పాక్   ప్రేరేపిత ఉగ్రవాదానికి, ఆపరేషన్ సిందూర్  ద్వారా కొత్త లక్ష్మణ గీతను గీయడంతో పాటుగా, ఆ వెంటనే బుధవారం ( మే 13) అదంపూర్ ఎయిర్ ఫోర్సు బేస్ సందర్శన ద్వారా    కొత్త సాధారణ స్థితి ని అండర్లైన్ చేయడం జరిగింది.  మరోవంక ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి  ఉన్నత స్థాయి సైనిక అధికారులు, వివిధ దేశాల సైనిక అధికారులకు వివరించడం, బీజేపీ దేశ వ్యాప్తంగా చేపట్టిన తిరంగా యాత్ర, ఇప్పడు తాజాగా  మే 24 న ముఖ్యమంత్రులు అందరూ పాల్గొనే  జాతీయ భద్రతా మండలి సమావేశం, ఆవెంటనే మే 25 న ఎన్డీఎ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం.. ఇలా ఒకదాని వెంట ఒకటిగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ చేపడుతున్న కార్యక్రమాల ద్వారా ప్రధాని మోదీ, దేశంలో రాజకీయ చర్చను చాకచక్యంగా  జాతీయ వాదం వైపుకు తీసుకు పోతున్నారని కాంగ్రెస్ నాయకులు అనుమానిస్తున్నారు. ఆందోళన చెందుతున్నారు. అలాగే  ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణలో అమెరికా పాత్ర తదితర   అంశాలను చర్చించేందుకు అఖిల పక్ష సమావేశం, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు  చేయాలని  కాంగెస్ పార్టీ చేస్తున్న  డిమాండ్ లో హేతుబద్దత ఉన్నా, మోదీ వాక్ ధాటికి తట్టుకోవడం కష్టమవుతుందనీ.. ఒక విధంగా కాంగ్రెస్ డిమాండ్ బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు.   ఈ అన్నిటినీ మించి కాంగ్రెస్  పార్టీలో ఆపరేషన్ సిందూర్ విషయంలోనే కాదు..  అందుకు సంబందించిన ఏ ఒక్క వివిషయంలోనూ ఏకాభిప్రాయం లేదు. మల్లికార్జున ఖర్గే మొదలు శశి  థరూర్ వరకు ఎవరికి తోచిన దారిలో వారు వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్నారు.  దీంతో కాంగ్రెస్ పార్టీ మరో మారు తప్పులో కాలేసిందనే అనుమానాలు పార్టీ వర్గాల్లోనే వ్యక్త మవుతున్నాయి.

India

కాల్పుల విరమణపై భారత్-పాక్ మరో కీలక నిర్ణయం

  భారత్-పాక్ ఉద్రిక్తతలను తగ్గించడానికి తదుపరి చర్చలు కొనసాగించాలని  డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్‌ల సమావేశంలో నిర్ణయించినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. మే 10వ తేదీన ఇరు దేశాల డీజీఎంఓల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు సరిహద్దుల్లో కాల్పుల విరమణ అమలవుతోంది. తాజాగా, ఈ ఒప్పందాన్ని మరింత కాలం కొనసాగించాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాల మధ్య విశ్వాసం పెంపొందించే చర్యలను కొనసాగించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక బెల్లెట్ కూడా పేల్చకూడదని బోర్డర్ల నుంచి సైన్యాన్ని వెనక్కి మళ్లించాలని తీర్మానం చేసినట్లు పేర్కొంది. అయితే సింధూ జలాల ఒప్పందంపై ఎలాంటి చర్చలు జరగబోవని తేల్చి చెప్పింది. పరిస్థితులు మరింత మెరుగుపడిన కొద్దీ, తదుపరి సమాచారం మీకు తెలియజేస్తాం అని అధికారులు పేర్కొన్నారు.  

CM Revanth Reddy

కాళేశ్వరం ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి

  కాళేశ్వరం ఆలయాన్ని గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆలయ సమగ్రాభివృద్ధికి అవసరమైతే రూ.200 కోట్ల వరకు నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సరస్వతీ పుష్కరాలకు విచ్చేస్తున్న భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగాన్ని అభినందించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం మొట్టమొదటిసారిగా టెంట్ సిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే గోదావరి, కృష్ణా పుష్కరాలు రానున్నాయని తెలిపారు. రాబోయే గోదావరి పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. గోదావరి, కృష్ణా పుష్కరాలు కూడా ఘనంగా నిర్వహించే అదృష్టం తనకు కలగనుందని అన్నారు. కాళేశ్వరం క్షేత్ర వైభవాన్ని మరింత ఇనుమడింపజేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖతో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.  

President

రాష్ట్రపతి గవర్నర్‌కు గడువు ఎలా విధిస్తారు.. సర్వోన్నత న్యాయస్థానంకు ద్రౌపది ముర్ము ప్రశ్న

  దేశంలో ఏదైనా బిల్లును రాష్ట్రపతి  ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే గవర్నర్ తీసుకోవాల్సిన అత్యధిక గడువు నెలరోజులు మాత్రమేనని 415 పేజీలతో కూడిన తీర్పును అత్యున్నత ధర్మాసనం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు. రాజ్యాంగం లో అలాంటి నిబంధనలేవీ లేనప్పుడు కోర్టు అలా ఎలా తీర్పు ఇచ్చిందని ముర్ము ప్రశ్నించినట్లు గా సమాచారం. దీంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు తీర్పుపై 14 రాజ్యాంగ సంబంధిత ప్రశ్నలపై సలహా కోరారు. ఈ ప్రశ్నల్లో రాజ్యాంగ అధికారాలు, పరిమితులు, శాసన ప్రక్రియలకు సంబంధించినవి ఉన్నాయి. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నరు రవి ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడం సరికాదని ఈ ఏడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.  దీనికి సంబంధించి 415 పేజీల తీర్పు వెలువరించింది. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి/గవర్నర్‌ గరిష్ఠంగా మూడు నెలల్లోగా ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలని నిర్దేశించింది. బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుకు గల కారణాలనూ జత చేయాలని తెలిపింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సుప్రీంకోర్టు  నేరుగా ఆశ్రయించవచ్చని, గవర్నర్ల నిష్క్రియాపరత్వం న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుందని స్పష్టంచేసింది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని జస్టిస్‌ పార్దీవాలా, జస్టిస్‌ మహాదేవన్‌ ధర్మాసనం తేల్చి చెప్పింది. భారత రాష్ట్రపతి ముర్ము అత్యున్నత ధర్మాసనంకు రాసిన లేఖపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె  స్టాలిన్ స్పందించారు. రాష్ట్రపతి ముర్ము కు మరో మూడు కీలక ప్రశ్నలు స్టాలిన్ సంధించారు.  

Metro fares increase

ఎల్లుండి నుంచి హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెంపు

    హైదరాబాద్ మెట్రో చార్జీలు ఎల్లుండి నుంచి ఛార్జీలు పెరగనున్నాయి. కనిష్ఠ ధర రూ.10 నుంచి రూ.12కు, గరిష్ఠ ధర రూ.60 నుంచి రూ.75కు పెంచున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. సవరించిన నూతన ఛార్జీలు ఈ నెల 17వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతం కనీస ఛార్జీ రూ.10 ఉండగా, దానిని రూ.12కి పెంచారు. అదేవిధంగా, గరిష్ఠ ప్రయాణ ఛార్జీ రూ.60 నుంచి రూ.75కి పెరగనుంది. ప్రయాణించే స్టేషన్ల సంఖ్య ఆధారంగా ఛార్జీల శ్లాబులను సవరించారు. హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, పెరిగిన ఛార్జీలు ఈ విధంగా ఉన్నాయి. నగరంలో ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ ఛార్జీలు త్వరలో పెరగనున్నాయి.  పెరిగిన ఛార్జీల వివరాలు     మొదటి రెండు స్టాప్‌లకు రూ.12     రెండు నుంచి 4 స్టాప్‌ల వరకు రూ.18     4 నుంచి 6 స్టాప్‌ల వరకు రూ.30     6 నుంచి 9 స్టాప్‌ల వరకు రూ.40     9 నుంచి 12 స్టాప్‌ల వరకు రూ.50     12 నుంచి 15 స్టాప్‌ల వరకు రూ.55     15 నుంచి 18 స్టాప్‌ల వరకు రూ.60     18 నుంచి 21 స్టాప్‌ల వరకు రూ.66     21 నుంచి 24 స్టాప్‌ల వరకు రూ.70     24 స్టాప్‌లు.. ఆపైన రూ.75  

tdp cadre demand pramotion to lokesh in government also

పార్టీలోనే కాదు.. ప్రభుత్వంలోనూ లోకేష్ కు ప్రమోషన్?

కడపలో తెలుగుదేశం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న పసుపు పండుగ మహానాడులో కీలక నిర్ణయాలు వెలువడుతాయన్న సంకేతాలు వినవస్తున్నాయి. వాటిలో ప్రధానంగా పార్టీలో లోకేష్ కు అత్యంత కీలక పదవిని కట్టబెట్టనున్నారని గట్టిగా వినవస్తున్నది. లోకేష్ కు ప్రమోషన్ కోసం పార్టీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అనే కొత్త పదవిని సృష్టించి ఆ పదవిని లోకేష్ కు కట్టబెట్టనున్నట్లు పార్టీ వర్గాల ద్వారానే తెలుస్తోంది. పార్టీలో అత్యంత నిర్మాణాత్మకమైన, నిర్ణయాత్మకమైన బాధ్యతలను లోకేష్ కు అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నారని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే లోకేష్ ను పార్టీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా ప్రమోట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లోకేష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.   ఇక లోకేష్ ను పార్టీ ఎగ్జిక్యూటీవ్ ప్రెసిడెంట్ గా నియమించడంపై కడప మహానాడు వేదికగా ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు. అంత వరకూ బానే ఉంది. పార్టీలో లోకేష్ ప్రమోషన్ సరే.. అయితే అటువంటి ప్రమోషనే లోకేష్ కు ప్రభుత్వంలో కూడా దక్కాల్సి ఉందని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. గతంలోనే లోకేష్ ను ఉపముఖ్యమంత్రిని చేయాలన్న డిమాండ్ పార్టీలో గట్టిగా వినిపించింది. అయితే సంకీర్ణ ధర్మాన్ని, కూటమి పరిమితులను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులు అటువంటి డిమాండ్ లు చేయవద్దంటూ చంద్రబాబు గట్టిగా మందలించడంతో ఆ డిమాండ్ సద్దుమణిగింది. అయితే ఇప్పుడు లోకేష్ కు పార్టీలో ప్రమోషన్ ఖాయమైన నేపథ్యంలో పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలో కూడా అత్యంత కీలకంగా, క్రియాశీలంగా వ్యవహరిస్తున్న లోకేష్ కు ప్రభుత్వంలో కూడా ప్రమోషన్ ఇవ్వాలన్న డిమాండ్ పార్టీలో జోరందుకుంటోంది.   మిత్రధర్మం పేరిట లోకేష్ కు ప్రభుత్వంలో  మూడో స్థానంలో ఉంచడం సరికాదన్నది పార్టీ శ్రేణుల అభిప్రాయంగా కనిపిస్తున్నది. వాస్తవానికి లోకేష్ కు ఇప్పుడు పార్టీలో ప్రమోషన్ ఇవ్వకున్నా ఆయన స్థాయికి కానీ, హోదాకు కానీ వచ్చిన నష్టమేదీ లేదు. వాస్తవానికి పార్టీ మొత్తం చంద్రబాబుకు సక్ససర్ లోకేషే అని మక్తకంఠంతో చెబుతోంది. అదే పరిస్థితి ప్రభుత్వంలోనూ ఉండాలనీ, దానిని అధికారికంగా ప్రకటించాలనీ క్యాడర్ కోరుతోంది.  

Apple company

భారత్‌కు ట్రంప్ యాపిల్ స్ట్రోక్

  భారత్‌కు ట్రంప్ యాపిల్‌తో స్ట్రోక్‌లు ఇచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. యాపిల్‌ తయారీ ప్లాంట్లు తరలివస్తాయని ఆశలు పెట్టుకొన్న భారత్‌కు నిరాశే మిగిలేట్లు ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా టిమ్‌కుక్‌తో మాట్లాడి.. భారత్‌కు ప్లాంట్లను తరలించొద్దని కోరారట. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడే స్వయంగా వెల్లడించారు. టిమ్‌ కుక్‌ భారత్‌లో తయారీ కర్మాగారాల నిర్మాణాలు చేపట్టారని,  అలా చేయడం నాకు ఇష్టం లేదని చెప్పానని,  ఫలితంగా అమెరికాలో ఉత్పత్తి పెంచేందుకు యాపిల్‌ అంగీకరించిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.  ఖతార్‌లో జరిగిన ఓ సమావేశం సందర్భంగా యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌తో ట్రంప్‌ భేటీ అయ్యారు. అమెరికా ఉత్పత్తులపై అత్యధిక టారిఫ్‌లు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్‌ ఒకటని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే చైనాపై భారీగా టారిఫ్‌లు విధించడం.. అమెరికాతో దానికి మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు ఉండటంతో యాపిల్‌ అప్రమత్తమైంది. అగ్రరాజ్యానికి అవసరమైన ఐఫోన్లు మొత్తాన్ని భారత్‌లో తయారు చేయించి ఎగుమతి చేయించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. మన దేశంలో ఫాక్స్‌కాన్‌, టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థలు ఐఫోన్ అసెంబ్లింగ్‌ చేస్తున్నాయి. ఇటీవల కంపెనీ సీఈవో టిమ్‌ కుక్‌ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు.  అమెరికా మార్కెట్లో జూన్‌ త్రైమాసికంలో విక్రయించే ఐఫోన్లలో అత్యధికంగా భారత్‌లో తయారైనవే ఉంటాయని.. అదే ఐపాడ్స్‌, మ్యాక్‌బుక్‌, యాపిల్‌ వాచ్‌లు, ఎయిర్‌పాడ్స్‌ వంటివి మాత్రం వియత్నాం నుంచి దిగుమతి చేసుకొంటామన్నారు. తమ దేశం నుంచి దిగుమతి చేసేకొనే చాలా రకాల వస్తువులపై భారత్‌ జీరో టారిఫ్‌లను ఆఫర్‌ చేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన ప్రకటన చేశారు.  అమెరికాకు భారత్‌ ఓ డీల్‌ను ఆఫర్‌ చేసింది. ఇది ప్రాథమికంగా జీరో టారిఫ్‌లదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే భారత్‌-అమెరికా దేశాలు వాణిజ్య ఒప్పందంపై  జోరుగా చర్చలు జరుపుతున్నాయి. వీటి పురోగతి గొప్పగా ఉందని ఏప్రిల్‌ 30వ తేదీ ట్రంప్ స్వయంగా వెల్లడించారు. త్వరలోనే ఒప్పందానికి వస్తామని నాడు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాంటిదిప్పుడు యాపిల్‌ మన దేశం నోటి దగ్గర నుంచి లాగేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Union Minister Rammohan Naidu

శ్రీనగర్ ఎయిర్ పోర్ట్‌‌ను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

  కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి  కింజారపు రామ్మోహన్ నాయుడు శ్రీనగర్ విమానాశ్రయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. ఇటీవల పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితులలో కూడా అప్రమత్తంగా సేవలందించిన విమానాశ్రయ సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రయాణీకుల భద్రతను ప్రాధాన్యతగా తీసుకుని, వారిలో భయం లేకుండా నిరంతరంగా సేవలందించిన తీరును మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు. భద్రతా దళాలు, జమ్మూ & కాశ్మీర్ పోలీసులు, అలాగే విమానాశ్రయ అధికారులు సమర్థవంతంగా సమన్వయం చేసుకోవడం వల్ల ప్రయాణీకులను సురక్షితంగా తరలించగలిగామని ఆయన పేర్కొన్నారు.  విమానాశ్రయంలో అందించిన సహాయక చర్యలు, భద్రతా ఏర్పాట్లు మరియు మౌలిక సదుపాయాల పట్ల మంత్రి అభినందనలు తెలియజేశారు. గత కొన్ని రోజులుగా నిలిపివేయబడిన విమాన సర్వీసులను నేడు శ్రీనగర్ నుండి మళ్లీ పునః ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.అలాగే, శ్రీనగర్‌లోని ప్రసిద్ధ లాల్ చౌక్ వద్ద ఉన్న పోలో వ్యూ మార్కెట్‌ను కూడా సందర్శించారు. మంత్రి రామ్మోహన్ నాయుడు నడుచుకుంటూ వెళ్లి స్థానిక దుకాణదారులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఈ ప్రాంతంలో సాధారణ పరిస్థితులను తీసుకురావడానికి మరియు పర్యాటకాన్ని మరల ఆకర్షించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ గురించి వారికి హామీ ఇచ్చారు.శ్రీనగర్ విమానాశ్రయం ద్వారా ప్రయాణించే ప్రయాణికులకు మరింత సురక్షితమైన, సౌకర్యవంతమైన అనుభవం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

where is kodali nani

కొడాలి నాని ఏరీ? ఎక్కడ? ఆరోగ్యం ఏలా ఉంది?

మాజీ మంత్రి అయిన కొడాలి నాని ఒకప్పుడు వైసీపీలో ఫైర్ బ్రాండ్. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో నాని ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా.. ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, జనసేన  అధినేత పవన్ కల్యాణ్‌పై బూతుల దండకం అందుకునే వారు. అసభ్య పదజాలంతో.. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తూ అదేదో గొప్ప విషయం అన్నట్లుగా భావించే వారు. ఒక దశలో కొడాలి నాని అంటే కన్నా బూతుల నాని అంటేనే ఎవరైనా గుర్తుపడతారు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అలా బూతుల నానిగా గుర్తింపు పొందిన కొడాలి నాని  వైసీపీ పరాజయం నుంచి నోరెత్తడానికే భయపడు తున్నారా అన్నట్లుగా మారిపోయారు. పరాజయం తరువాత ఆయన నియోజకవర్గం ముఖం చూసిన పాపాన పోలేదు. నియోజవర్గం అనేమిటి అసలు బహిరంగంగా బయటకు వచ్చిన సందర్భాలను వేళ్లపై లెక్కించవచ్చు. అయినా చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లుగా తాను మారలేదనీ, తనలో ఫైర్ అలాగే ఉందనీ బిల్డప్పులు ఇచ్చేందుకు శతధా ప్రయత్నించడం మాత్రం మానలేదు. అయితే ఎప్పుడైతే ఆయన మిత్రుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టయ్యారో.. అప్పటి నుంచీ కొడాలి నానిలో ఫైర్ పూర్తిగా ఆరిపోయింది. అరెస్టు భయం వెన్నాడుతోంది. ఆ నేపథ్యంలోనే  దాదాపుగా హైదరాబాద్ కే పరిమితమైపోయారు.   కొంత కాలం కిందట ఛాతి నొప్పితో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం అంటూ ముంబైకి వెళ్లారు. అక్కడ ఆయనకు ఆపరేషన్ జరిగిందని చెప్పారు. అయితే కొడాలి నాని హెల్త్ బులిటిన్ ను ఆ ముంబై ఆస్పత్రి విడుదల చేయలేదు కానీ, ఆపరేషన్ విజయవంతమైందనీ, కొడాలి నాని కొలుకుంటున్నారనీ  గుడివాడకు చెందిన వైసీపీ నాయకుడొకరు మీడియాకు   తెలిపారు. అంతే ఆ తరువాత నుంచి కొడాలి నానికి సంబంధించి ఏ వార్తా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి గురించి కానీ, ఆయన ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? వంటి విషయాలేవీ బయటకు తెలియడం లేదు. కొడాలి నాని సన్నిహిత వర్గాలు మాత్రం ఆయన ఇంకా ముంబైలోనే ఉన్నారని అంటున్నారు. కానీ ఆపరేషన్ విజయవంతమైన తరువాత నెలల తరబడి ఆయన ముంబైలో  ఏం చేస్తున్నారన్న ప్రశ్నకు మాత్రం బదులు లేదు. ఆయన మళ్లీ రాజకీయంగా క్రియాశీలం అవుతారా అంటే సమాధానం దొరకదు.  అయితే కొడాలి నాని మాత్రం తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తెలుగుదేశం తనను టార్గెట్ చేయదని భావిస్తున్నట్లుగా ఉందని, రెడ్ బుక్ నుంచి తన పేరు తొలగించేస్తారని ఆశిస్తున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ లు తనకు సేఫ్ కాదనీ, అందుకే ముంబైలోనే ఉండిపోయారనీ కూడా అంటున్నారు.  ఎందుకంటే కొడాలి నాని స్నేహితుడు వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్ లోని ఆయన నివాసంలోనే అరెస్టు చేసి బెజవాడకు తరలించుకుపోయారు. దాదాపు వంద రోజులుగా వంశీ కటకటాలు లెక్కిస్తూనే ఉన్నారు. తనకూ ఆ గతే పడుతుందన్న భయంతోనే కొడాలి నాని తెలుగు రాష్ట్రాలవైపు కన్నెత్తి చూడకుండా ముంబైని షెల్టర్ జోన్ గా భావించి అక్కడే ఉండిపోయారని అంటున్నారు. వైసీపీ అధినేత బెంగళూరు  షెల్టర్ జోన్ గా భావించి చుట్టపు  చూపుగా మాత్రమే తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి వెడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో జగన్ నే ఆదర్శంగా తీసుకున్న కొడాలి నాని.. కనీసం చుట్టపు చూపుగానైనా ఏపీవైపు రావడం లేదని అంటున్నారు.   

హైదరాబాద్‌‌లో రౌడీ షీటర్‌ దారుణ హత్య

  హైదరాబాద్‌ నగరంలోని నాంపల్లి ప్రాంతంలో ఒక దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో ఒక రౌడీ షీటర్‌ను దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, చాంద్రాయణగుట్టకు చెందిన అయాన్ ఖురేషీ అనే వ్యక్తిపై రౌడీ షీట్ ఉంది. ఇతను ఒక కేసు నిమిత్తం నాంపల్లి కోర్టుకు హాజరై తిరిగి వెళుతున్నాడు.ఈ క్రమంలో, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి వద్దకు రాగానే, అప్పటికే మాటు వేసి ఉన్న ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై ఒక్కసారిగా దాడి చేశారు. మొదట దుండగులు ఖురేషీని క్రికెట్ బ్యాట్‌తో తీవ్రంగా కొట్టారు.  అనంతరం కత్తులతో గొంతు కోసి, పొట్టలో విచక్షణారహితంగా పొడిచి హతమార్చారు. నిందితులు హత్యకు ఉపయోగించిన బ్యాట్, కత్తులను సంఘటనా స్థలంలోనే వదిలి పరారయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే నాంపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

టీడీపీలో కొత్త పదవి.. నారా లోకేష్‌కి ప్రమోషన్?

కడప మహానాడులో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అందులో భాగంగా ఐటీ, విద్యాశాఖ మంత్రిగా తనదైన ముద్ర వేస్తున్న నారా లోకేష్ కు టీడీపీలో నిర్ణయాత్మక పదవి ఇచ్చేందుకు కడప మహానాడు వేదిక అవుతుందన్న  ప్రచారం జోరందుకుంది. లోకేష్‌కు ప్రమోషన్‌పై టీడీపీలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. ఆ ప్రమోషన్ ఎలా ఉండబోతుందనే ప్రశ్నలకు ఈ మహానాడు సమాధానం చెప్పనుందని అంటున్నారు. టీడీపీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా లోకేష్‌ను నియమించే ఛాన్స్‌ ఉందంటున్నారు. నారా లోకేష్‌ కోసం పార్టీలో కొత్తగా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పోస్ట్‌ క్రియేట్ చేయబోతున్నారంట.  ఇకపై ఒక నేతకు ఒకే పదవి రెండు సార్లు మాత్రమే ఇవ్వాలనుకుంటున్నారంట. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని వదులుకుంటానని లోకేష్‌ చెప్పినట్లుగా టాక్ నడుస్తోంది. అందుకే కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే టీడీపీ తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లోకేష్ బాధ్యతలు చేపట్టడం లాంఛనమే. నారా లోకేశ్ ఇప్పుడు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలకంగా ఉన్నారు. ఆయన తన ముద్రను అన్ని రకాలుగా చూపించుకుంటున్నారు. దీంతో పాటు కార్యకర్తలకు రెగ్యులర్ గా అందుబాటులో ఉంటున్నారు.  నారా లోకేశ్  యూత్‌కు కనెక్ట్ అవుతుండటంతో ఆయన ఇమేజ్ ను మరింత పార్టీ పరంగా పెంచాలన్న ఆలోచనలో పార్టీ సీనియర్లు ఉన్నారంట. పొలిట్ బ్యూరోతో పాటు పార్టీలోనూ యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి లోకేష్‌ను మరింత ఎలివేట్ చేయడానికే ఈ కొత్త పోస్ట్ అంటున్నారు. మొన్నటి వరకూ లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పార్టీలోనే డిమాండ్లు బాగా వినిపించాయి. అయితే ఆ టాపిక్ పై మాట్లాడొద్దని సీఎం చంద్రబాబు స్వయంగా పార్టీ నేతలను హెచ్చరించారు. అటు పార్టీలోని ఇతర కీలక నేతలు మాత్రం పార్టీ పరంగా లోకేశ్ కు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని అంటున్నారు. రెగ్యులర్ గా కార్యకర్తలకు అందుబాటులో ఉండే లోకేశ్ కు కీలక పదవి ఇస్తేనే పార్టీ మరింత బలోపేతమవుతుందని సూచిస్తున్నారు. అందుకే ఈ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పోస్ట్ క్రియేట్ చేస్తున్నారంట. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పీడ్ పెంచారు. వ్యూహాత్మకంగా ఆయ‌న అడుగులు వేస్తున్నట్టు ప‌నితీరే చెబుతోంది. ప్రధానంగా విద్యావంతుల్ని ఆక‌ర్షించ‌డం ద్వారా, వాళ్ల కుటుంబాల్ని రాజ‌కీయంగా త‌మ‌వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.  లోకేష్ నేతృత్వంలో ఇప్పటి వ‌ర‌కూ 91 ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటుకు ముందుకొచ్చాయి. 91వేల 839 కోట్ల పెట్టుబ‌డులు, ఒక లక్షా 41వేల 407 ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్దమయ్యాయి. రాబోయే ఐదేళ్లలో ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ రంగాల్లో 5 ల‌క్షల ఉద్యోగాల కల్పన దిశగా లోకేష్ కృషి చేస్తున్నారు. సో అటు పార్టీ, ఇటు ప్రభుత్వం రెండిట్లోనూ తనదైన ముద్ర వేసుకుంటున్న లోకేష్‌ను పార్టీపరంగా మరింత నిర్ణయాత్మక శక్తిగా మార్చడానికి ఈ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పోస్ట్ దోహద పడుతుందనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారంట. మరి చూడాలి కడప మహానాడులో ఎలాంటి కీలక నిర్ణయాలు ప్రకటిస్తారో?

విజయవాడలో రేపు తిరంగా ర్యాలీ.. చంద్రబాబు, పవన్‌కు బీజేపీ ఆహ్వానం

  ఆపరేషన్ సిందూర్ భారత జవాన్లకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా బీజేపీ తిరంగా ర్యాలీని ఈనెల మే 16న విజయవాడలో నిర్వ‌హించాల‌ని రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షురాలు దగ్గుబాటి పురందేశ్వ‌రి నిర్ణ‌యించారు. శుక్రవారం సాయంత్రం ఈ ర్యాలీ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజిస‌ర్కిల్ వ‌ర‌కు ర్యాలీ జ‌ర‌గ‌నుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పురందేశ్వ‌రి ఆహ్వానించారు. కూటమి నేతలంతా యాత్రలో పాల్గొంటారని ఆమె తెలిపారు. ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడం, భారత్‌తో కాల్పుల విరమణకు పాక్ దిగిరావడంతో భారతీయ జనతా పార్టీ  దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర నిర్వహించేందుకు నిర్ణయించింది. పాక్ ఉగ్రవాదంపై భారత సాయుధ బలగాలు సాధించిన విజయం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ ప్రతిభను హైలైట్ చేస్తూ 11 రోజుల పాటు ప్రచారం నిర్వహించనుంది. ఈనెల 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ బీజేపీ కార్యకర్తలు, నేతలు దేశవ్యాప్తంగా జాతీయ పతాకాలు ప్రదర్శిస్తూ ర్యాలీలు నిర్వహించనున్నారు.

సొంత జిల్లాలో జగన్‌కు భారీ షాక్.. మున్సిపల్ చైర్మన్ చంద్ర వైసీపీకి గుడ్‌బై

  వైసీపీ అధినేత జగన్‌కు సొంత జిల్లాలో  భారీ షాక్ తగిలింది. కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర వైసీపీకి రాజీనామా చేశారు. గతకొద్ది కాలంగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్న ఆయ‌న ఫ్యాన్ పార్టీకి గుడ్‌బై చెబుతున్నట్లు తెలిపారు. అధినేత జగన్‌తో మాట్లాడించాల‌ని గ‌త మూడు నెల‌లుగా మాజీ ఎమ్మెల్యేను కోరుతున్నా ప‌ట్టించుకోలేద‌ని ఆవేదన వ్యక్తం చేశారు. అనుచ‌రుల‌తో చ‌ర్చించిన త‌ర్వాత భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌పై నిర్ణ‌యం తీసుకుంటాన‌ని చంద్ర తెలిపారు. ఆయన తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వం నుంచి సైతం తప్పుకున్నారు. జగన్ సొంత ఇలాఖలో ఆ పార్టీకి నాయకుల ఆదరణ కరువు అవుతోంది.  గత ఎన్నికల్లో జగన్ కు సైతం మెజార్టీ తగ్గింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత కడప జిల్లాలో పార్టీ బలహీనం అయినట్లు జగన్‌కు ఇప్పటికే పార్టీ వర్గాలు తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహించారు. అయినా సొంత జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బిగ్ షాక్ తగలడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇక‌, నిన్న వైసీపీకి చెందిన సీనియర్ నేత, శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన‌ జకియా ఖానం తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. వైసీపీకి రాజీనామా చేసి వెంటనే బీజేపీలో చేరారు.  ఆమె రాజీనామాతో వైసీపీని వీడిన ఎమ్మెల్సీల సంఖ్య‌ ఆరుకు చేరింది.