భారత ఉపరాష్ట్రపతి రాజీనామా

  భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా చేశారు.  ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు తన రాజీనామా లేఖను పంపారు. అనారోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తన పదవీ కాలంలో మద్దతుగా నిలిచిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీకి ధన్యవాదలు తెలిపారు. కాగా 2022 ఆగస్టు11న ఆయన ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అంతకు ముందుకు 1990-91 మధ్య కేంద్రమంత్రిగా 2019-22 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సేవలందించారు . కిసాన్ పుత్రగా ఆయన దేశ రాజకీయాల్లో గుర్తింపు పొందారు. జనతాదళ్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన గతంలో శాసనసభ, లోక్‌సభ సభ్యుడుగా కూడా పనిచేశారు.  

హరిహర వీరమల్లు సినిమాకు టికెట్ ధరలు పెంపు

  తెలంగాణలో హరిహర వీరమల్లు మూవీ టికెట్ రెట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జులై 23న  ప్రీమియర్ షోకు  టికెట్ ధర రూ.600  గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. ఈ నెల 24 నుంచి 27 వరకు మల్టీప్లెక్స్‌లలో టికెట్‌పై రూ.200.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ.150 వరకు పెంచుతు జీవో జారీ చేసింది. హరిహర వీరమల్లు’ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఇది ఫిక్షనల్ కథతో రూపొందించిన హిస్టారికల్ మూవీ. ఇందులో పవన్ కళ్యాణ్ ఒక యోధుడి పాత్రలో కనిపించనున్నారు.  నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చారు.  ఏపీ లో టికెట్‌ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం స్పెషల్ జీవో జారీ చేసింది. మూవీ రిలీజైన తర్వాత మొదటి రెండు వారాలపాటు ధరలు పెంచుకోడానికి అనుమతి ఇవ్వాలని చిత్ర నిర్మాత గవర్నమెంట్ ని కోరారు. కానీ మొదటి 10 రోజులు మాత్రమే రేట్లు పెంచడానికి కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఆగస్టు 10 లోపు రోజా జైలుకెళ్లక తప్పదు..శాప్ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు

  ఏపీ శాప్ ఛైర్మన్ రవినాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగస్టు 10 లోపు జైలుకెళ్లక తప్పదని రవినాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. గత వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్రా పేరుతో కోట్ల అవినీతికి పాల్పడిన రోజా జైలుకెళ్లడం ఖయామని  శాప్ ఛైర్మన్ తెలిపారు. గతంలో క్రీడా మంత్రిగా పని చేసిన ఆమె అవినీతి, అక్రమాలపై విచారణ జరుగుతోందని వెల్లడించారు.  రోజా రోజులు లెక్కబెట్టుకోవాలని ఆయన అన్నారు. క్రీడా శాఖ మంత్రిగా ఒక్క స్టేడియం అయినా రోజా నిర్మించారా..? ఆయన ప్రశ్నించారు. రోజా నగరికి టూరిస్ట్ మాత్రమేన్నారు. నిత్యం ఆమె తమిళనాడులోనే ఉంటున్నారని రవినాయుడు అన్నారు. ఎమ్మెల్యే గాలిభానుప్రకాష్ పై రోజా వ్యాఖ్యలు క్షమించరానిదన్నారు. రోజమ్మా నీకు దమ్ముంటే గాలిభాను సవాల్ ను స్వీకరించాలని సవాల్ విసిరారు. రోజా వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయిని తెలిపారు.  సీఎం చంద్రబాబును ఏకవచనంతో రోజా మాట్లాడడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. పరిశ్రమలు వస్తున్నాయి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావడాన్ని వైసిపి నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని తెలిపారు.గత మూడునెలలుగా జగన్ వికృత చేష్టలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని వైసీపీ నేతలు రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారని  శాప్ ఛైర్మన్ మండిపడ్డారు.  

కమల దళంలో.. కుమ్ములాటలు.. క్యాడర్ బజార్ !!

  భారతీయ జనతా పార్టీ  (బీజేపీ) లో ఏమి జరుగుతోంది ? రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ బీజేపీలో ఏదో జరుగుతోంది,అనేది ఇప్పడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా సంస్థాగత వ్యవహరాల్లో పార్టీకి, పార్టీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( ఆర్ఎస్ఎస్)కు మధ్య ఒక పెద్ద అగాధమే ఏర్పడిందనేది, ప్రముఖగ్మ వినవస్తోంది.  సంస్థాగత వ్యవహారాలకు సంబంధించి, బీజేపీ, ఆర్ఎస్ఎస్’ అధినాయకుల మధ్య విభేదాల  కారణంగానే, పార్టీ జాతీయ అధ్యక్షుని ఎంపిక ఎంతకీ ముడి పడడం లేదని ఇటు బీజేపీ ముఖ్యనాయకులు, సంఘ్ పరివార్ సంస్థల కీలక నేతలు, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అంగీకరిస్తున్నారు. అదలా ఉంటే, మరో వంక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ముఖ్య నేతల మధ్య ఎంతో కాలంగా ఎంతో కొంత గుంభనంగా సాగుతున్న అంతర్గత కుమ్ములాటలు, విభేదాలు ఇప్పడు బహిరంగంగా బయటకు తన్ను కొచ్చాయి.  పతాక స్థాయికి చేరాయి. ముఖ్యంగా, కేంద్ర మంత్రి బండి సంజయ్,మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య సాగుతున్న మాటల యుద్ధం,పార్టీని ఒక కుదుపు కుదిపింది. దీంతో, పార్టీ అధ్యక్షునిగా రామచంద్ర రావు ఎంపిక విషయంలో తలెత్తిన విభేదాలు, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా వంటి సంఘటనలతో,  అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితిని మరింతగా దిగజారుస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.  నిజానికి, రాజకీయ పార్టీలలో అంతర్గత విభేదాలు కొత్త కాదు. అందుకు బీజేపీ మినహాయింపు కాదు.  కానీ, క్రమశిక్షణకు మారు పేరుగా ముద్ర వేసుకున్న బీజేపీలో అంతర్గత విభేదాలు చాలా వరకు అంతర్గంగానే ఉంటాయే, కానీ,  బజారుకు ఎక్కడం అంతగా ఉండదు. అందుకే, బండి వర్సెస్ ఈటల మాటాల యుద్ధం మేదో దృష్టిని గట్టిగా ఆకర్షిస్తోంది. అయితే, ప్రస్తుత బీజేపీ నేతలంతా సంఘ్ పరివార్’ సంస్కృతీ నుంచి వచ్చినవారు కాదు. ఈటల విషయాన్నే తీసుకుంటే. ఆయన వామపక్ష భావజాలం నుంచి వచ్చిన నాయకుడు. అంతే కాకుండా, ఆయన బీజేపీలోకి వచ్చే నాటికే, ఏడు సార్లు ఎమ్మెల్యేగా, కేసీఆర్ మంత్రి వర్గంలో రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ముఖ్యమంత్రి రేసులో ఉన్న నాయకుడు. సో.. సహజంగానే’ ఆయన ఆశించిన అధ్యక్ష పదవి రాకుండా పోవడంతో నిరాశకు గురయ్యారని, దానికి బండి సంజయ్’తో ఉన్న చిరకాల వైరం తోడవడంతో ఈటల భగ్గుమన్నా రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  నిజానికి అధికార కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి మధ్య జరుగుతున్న మాటల యుద్ధానికి, ఈటల వర్సెస్ బండి వార్’కు  పెద్దగా తేడాలేదు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ,రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై, రాజగోపాల రెడ్డి, అది కాంగ్రెస్ పార్టీ విధాలకు విరుద్దమంటూ  తీవ్రంగా తప్పు పట్టారు. నిజానికి, అధికార కాంగ్రెస్ పార్టీలో ఒక్క కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి మాత్రమే కాదు, అసంతృప్తి ఉడికి పోతున్న నాయకులు ఇంకా ఉంటారు.  ఇక బీఆర్ఎస్ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. అయితే, ఇతర పార్టీల కథ ఎలా ఉన్నా, బీజేపీలో అంతర్గత విభేదాలు.. మీడియా దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. అందుకే, ఈట ల వర్సెస్ బండి మాటల యుద్ధం రాష్ర్ం రాజకీయాల్లో సంచలనంగా మారిందని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే.  బండి వర్సెస్ ఈటల ‘వార్’ ఎలా ఎండ్’ అవుతుంది? అనేది ఆశక్తికరంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు.  

తెలంగాణలో ఈ నెల 25 నుంచి రేషన్ కార్డుల పంపిణీ

  తెలంగాణలో జులై 25 నుంచి ఆగస్టు 10 వరకు రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశంలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రల్లో పంపీణి చేయాలని  ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు కలెక్టర్ల పాల్గొనాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రేషన్‌ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ.. ఆందోళన అవసరం లేదు’’ అని సీఎం అన్నారు. సన్నం బియ్య ఇస్తుండటంతో రేషన్ కార్డులకు డిమాండ్ పెరిగిందని సీఎం తెలిపారు. జిల్లాల పరిధిలోని ఐఏఎస్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, రోజూ కలెక్టర్లు ఏ పనిచేశారో తనకు తెలియజేయాలని సీఎం  ఆదేశించారు. వర్షాలు, వానాకాలం పంటసాగు, సీజనల్‌ వ్యాధులు, రేషన్‌కార్డుల పంపిణీ తదితర అంశాలపై చర్చించారు. ‘‘రాష్ట్రంలో సరిపడినంత ఎరువులు ఉన్నాయి. ఆందోళన అవసరం లేదని తెలిపారు. ఎరువుల దుకాణాల్లో ఎంత స్టాక్‌ ఉందో బయట నోటీస్‌ బోర్డు పెట్టాలి. రాయితీ ఎరువులను ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి తెలిపారు. కలెక్టర్లు వాటర్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాలి. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టర్లు ఖర్చు చేసేందుకు ఒక్కొక్కరికి రూ.కోటి కేటాయించామని తెలిపారు.  

రాహుల్ వ్యాఖ్యలపై లెఫ్ట్ పార్టీల .. ఆగ్రహం !

  కాంగ్రెస్ అధినాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( ఆర్ఎస్ఎస్), భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్సిష్స్ట్ ) లను ఒకే గాటన కట్టేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇండియా కూటమిలో చిచ్చు పెట్టాయి. నిజానికి, రాహుల్ గాంధీ ఒక్క ఆర్ఎస్ఎస్,  సీపిఐ(ఎం)లను మాత్రమే కాదు, మొత్తంగా రాజకీయ వ్యవస్థనే, టార్గెట్ చేస్తూ, రాజకీయ నాయకులు ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం లేదనే అర్థం వచ్చేలా విమర్శలు గుప్పించారు.  రాహుల్ గాంధీ వ్యాఖ్యల పట్ల కూటమి భాగస్వామయ పార్టీలు, ముఖ్యంగా, వామపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. కొట్టాయం (కేరళ)లో జరిగిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమెన్ చాందీ ద్వితీయ వర్ధంతి సభలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ, ఆర్ఎస్ఎస్,సిపిఐ( ఎం)లనిఉ ఒకే గాటన కట్టి విమర్శలు గుప్పించారు. ఆర్ఎస్ఎస్’ తోపాటుగా, సిపిఎం(ఎం)ను తమ సైద్ధాంతిక శత్రువుగా పెర్కొన్నారు. అటు ఆర్ఎస్ఎస్ ఇటు సిపిఐ (ఎం)తో  తాను సైద్ధాంతిక పోరాటం చేస్తున్నానని, చెప్పుకొచ్చారు. ఆర్ఎస్ఎస్, సిపిఐ(ఎం) లకు మానవీయ విలువలు తెలియవని, ప్రజాసమస్యలు పట్టవని,విమర్శించారు. నిజానికి, ఆర్ఎస్ఎస్, సిపిఐ(ఎం)లను మాత్రమే కాదు, రాహుల్ గాంధీ, ఇడియా కూటమి భాగస్వామ్య పార్టీలు సహా  మొత్తం రాజకీయ వ్యవస్థనే టార్గెట్ చేస్తూ, ‘సమకాలీన రాజకీయ నాయకులలో కొద్ది మంది మాత్రమే ఇతరుల మనోభావాలను పంచుకుంటున్నారు” అంటూ, రాజకీయాలలో ఉండాలంటే ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని,పార్టీ నాయకులకు హితబోధ చేశారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను, ఇండియా కూటమి నాయకులు తప్పు పట్టారు. ముఖ్యంగా వామపక్ష భావజాలం గురించి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, సిపిఐ జాతీయ నాయకుడు,డి. రాజా,  ఇలాంటి వ్యాఖ్యలు, విమర్శలు మంచిది కాదని హితవు పలికారు. కూటమిని బలహీన పరుస్తాయని హెచ్చరించారు.  మరోవంక సిపిఐ(ఎం) పొలిట్’ బ్యూరో సభ్యుడు, ఎంఎస్ బేబీ, ఎక్స్’ వేదికగా  రాహుల్ గాంధీ వ్యాఖ్యలు దురదృష్టకరం అంటూ, రాహుల్ గాంధీకి కేరళ రాజకీయాలు అర్థం కాలేదని చురక అంటించారు. అలాగే, 2004లో వామపక్షాల మద్దతుతోనే కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేసియన్ విషయాన్ని గుర్తు చేశారు. అయితే, “ బీజీఎపీ హటావో .. దేశ్ కో  బచావో’ నినాదంతో ఏర్పడిన కూటమి లక్షయం నేరవేరే వరకు, ఇండియా కూటమిలో కొనసాగుతామని లెఫ్ట్ నేతలు. చెప్పడం కొసమెరుపు.

ఏపీలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు పథకంలో జీరో ఫేర్ టిక్కెట్

  ఆగస్టు 15 నుంచి మహిళలకు అమలు చేయనున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు ‘జీరో ఫేరో టిక్కెట్‘ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఎక్కడ నుంచి ఎక్కడకు ప్రయాణం చేస్తున్నారు... ఉచిత ప్రయాణంతో ఎంతమేర వారికి డబ్బులు ఆదా అయ్యాయి... 100 శాతం ప్రభుత్వం ఇస్తున్న రాయితీ... వంటి వివరాలు ఆ టిక్కెట్‌లో పొందుపరచాలని చెప్పారు. జీరో ఫేర్ టిక్కెట్‌ ఇవ్వడం ద్వారా ఎంత లబ్దిపొందారనే విషయం రాష్ట్రంలోని మహిళా ప్రయాణికులు అందరికీ సులభంగా తెలుస్తుందని ముఖ్యమత్రి అన్నారు.  ఇందుకు సంబంధించి సాఫ్ట్‌వేర్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఏ ఏ రాష్ట్రాలకు ఆర్ధికంగా ఎంత భారం పడింది... మన రాష్ట్రంలో ఎంత వ్యయం కానుందనే అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఎట్టిపరిస్థితుల్లో పథకాన్ని ఆగస్ట్ 15 నుంచి సమర్ధవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.    ఆర్టీసీని లాభాల బాట పట్టించండి :  మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం త్వరలో అమలు చేస్తున్నందున ఆర్టీసీకి భారం కాకుండా... ఇతర ఆదాయ మార్గాలు పెంపొందించుకోవడం, నిర్వహణా వ్యయం తగ్గించుకోవడం ద్వారా సంస్థను లాభాల బాట పట్టించాలని ముఖ్యమంత్రి సూచించారు. లాభాల ఆర్జనకు ఎలాంటి మార్గాలున్నాయి.. ఎటువంటి విధానాలు తీసుకురావాలి... అనే దానిపై ఒక కార్యాచరణ రూపొందించాలన్నారు.  మరోవైపు రాష్ట్రంలో ఇకపై ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రస్తుతం ఉన్నవాటిని ఎలక్ట్రికల్ బస్సులుగా మారిస్తే నిర్వహణా వ్యయం తగ్గుతుందని... అలాగే ఇందుకు అవసరమయ్యే విద్యుత్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లోనూ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే అంశంపైనా అధ్యయనం చేయాలని సీఎం స్పష్టం చేశారు.  

పార్టీలో హద్దు దాటితే చర్యలు తప్పవు...టీ బీజేపీ చీఫ్ హెచ్చరిక

  భారతీయ జనతా పార్టీలో అంతర్గత పోరుపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పందించారు. తమ అంతర్గత వ్యవహారాలు తామే పరిష్కరించుకుంటామని తెలిపారు. టీ బీజేపీ చీఫ్  ఢిల్లీలో పర్యటిస్తున్నారు. బీఆర్‌ఎస్‌లో కేటీఆర్-కవిత కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌రెడ్డి- కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య కుడా అంతర్గత విభేదాలు ఉన్నాయని గుర్తు చేశారు. పార్టీలో హద్దు దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు.  ఈ నేపథ్యంలో రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలవనున్నారు. తెలంగాణలో రాజకీయ వ్యూహాలు, స్థానిక ఎన్నికల సన్నాహాలు, పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. మతపరమైన రిజర్వేషన్లను భారతీయ జనతా పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తుందని మరోసారి స్పష్టం చేసారు.  బీసీలకు 42% రిజర్వేషన్లను సమర్థిస్తుందని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ బిల్లులో ముస్లిం రిజర్వేషన్లను చేర్చి ఓబీసీ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.  బీజేపీ మాత్రమే బీసీలకు న్యాయం చేయగలదని, మతపరమైన రిజర్వేషన్లు లేకుండా రిజర్వేషన్లు కల్పించాలని టీ బీజేపీ ఛీప్ తెలిపారు .ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ హైకమాండ్ సానుకూలంగా స్పందిస్తాయని ధీమా వ్యక్తం చేసారు. తెలంగాణలో బీసీలకు న్యాయం చేయడానికి  బీజేపీ కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.   

కేరళ మాజీ సీఎం కన్నుమూత

  కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్చుతానందన్ కన్నుమూశారు.  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు ఆయన కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఆయన 2006 నుంచి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పని చేశారు. 2019 లో స్ట్రోక్ తో మంచం పట్టిన అచ్యుతానందన్ కు ఇటీవల గుండెపోటు వచ్చి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది.  ఆయనను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేర్చారు.1964లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) నుండి బయటకు వెళ్లి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)ను స్థాపించారు. 32 మందిలో అచ్యుతానందన్ మాత్రమే జీవించి ఉన్న నాయకుడు. ఆయన కేరళ అసెంబ్లీలో మూడుసార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. చాలా సంవత్సరాలు సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఆయన 2021 వరకు కేరళ అసెంబ్లీలో క్రియాశీల సభ్యుడిగా ఉన్నారు.ఆయన వయసు 101 సంవత్సరాలు. గతేడాది అక్టోబర్‌ 20న ఆయన 101లోకి అడుగుపెట్టారు. 

లోక్‌సభలో కొనసాగుతున్న వాయిదాల పర్వం..విపక్షాల నిరసన

  భారత పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం అయ్యాయి. ఆపరేషన్ సింధూర్ నిలిపివేత, ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం వివరణ ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే రెండు సార్లు సభను వాయిదా వేసిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్ల, తాజాగా సాయంత్రం 4 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. మరో పక్క రాజ్య సభలోను ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుండటంతో ఇప్పటికే రెండు సార్లు రాజ్యసభ వాయిదా పడింది.  లోక్ సభ, రాజ్య సభ రెండింటిలోను పహల్గాం ఉగ్రదాడి, పహల్గాం టెర్రర్ ఎటాక్ విషయంలో చర్చకు విపక్షాల డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ట్రంప్ మధ్యవర్తిత్వం వివాదంపై చర్చకు కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది.గత నెల గుజరాత్ అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాద ఘటనపై కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు లోక్ సభలో కీలక ప్రకటన చేశారు. ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక వచ్చిందని, దాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.  తుది నివేదిక వచ్చాకే ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. అయితే, ఈ ఘటనపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై నిబంధనల ప్రకారమే దర్యాప్తు చేపట్టాం. అంతర్జాతీయ ప్రొటోకాల్‌ ప్రకారమే దర్యాప్తు కొనసాగుతోంది. ప్ర‌మాదంపై ఏఏఐబీ (ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్విస్టిగేష‌న్ బ్యూరో) పార‌ద‌ర్శ‌కంగా ద‌ర్యాప్తు జ‌రుపుతోందని పేర్కొన్నారు.  కానీ, ఈ ఘటనపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోంది. ఇప్పటికే ప్రాథమిక నివేదిక వచ్చింది. తుది నివేదికలో మరిన్ని వివరాలు తెలుస్తాయి. బ్లాక్‌బాక్స్‌ దెబ్బతిన్నా డేటాను రిట్రీవ్‌ చేశాం. బ్లాక్‌బాక్స్‌ను తొలిసారి డీకోడ్‌ చేయగలిగాం. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరకుండా చర్యలు తీసుకుంటున్నాం. విమానాశ్రయాల అభివృద్ధి, విస్తరణకు చర్యలు చేపట్టాం" అని రామ్మోహన్‌ నాయుడు వెల్లడించారు.

రాజకీయాలలో విజయ్ సినిమా ఫ్లాపేనా?.. తాజా సర్వేలో టీవీకే పార్టీకి వచ్చే సీట్లెన్నంటే?

తమిళ తళపతి విజయ్ పొలిటికల్ మూవ్ పెద్ద డిసాస్టర్ గా మారనుందా? రాజకీయ పార్టీ స్థాపించి ఆయన సాధించేదేమీ లేదా? అంటే తాజాగా ఒక ప్రముఖ చానల్ నిర్వహించిన సర్వేలో అదే తేలింది. 2026 అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ పార్టీ టీవీకే అధికార డీఎంకే పార్టీకి గట్టి పోటీదారుగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే తాజా సర్వేలో ఎన్నికలలో టీవీకే నామమాత్రపు ప్రభావాన్ని మాత్రమే చూపుతుందని తేలింది. వచ్చే ఎన్నికలలో అధికార డీఎంకే 105 స్థానాలతో సునాయాసంగా మెజారిటీ సాధించి మరో సారి అధికార పగ్గాలు చేపడుతుందని సర్వే పేర్కొంది. ఇక ఏఐడీఎంకే 90 స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా నిలుస్తుందనీ సర్వే ఫలితం తేల్చింది. అయితే ఎన్నో అంచనాలున్న విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం మాత్రం కనీసం ఒక్క స్థానంలో కూడా విజయం సాధించే అవకాశం లేదని సర్వే పేర్కొంది. తమిళనాడులోని 234  అసెంబ్లీ స్థానాలలో టీవీకే ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా విజయం సాధించే అవకాశం లేదని సర్వే పేర్కొనడంతో విజయ్ ను తమిళ జనం ఇప్పటికీ విజయ్ ను మాస్ హీరోగానే తప్ప   రాజకీయనాయకుడిగా గుర్తించడం లేదని అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్.. హీరో ఇమేజ్ నుంచి పొలిటికల్ లీడర్ గా తన ఇమేజ్ ను మేకోవర్ చేసుకోవడానికి ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారన్నది ఆసక్తిగా మారింది.  

మద్యం కుంభకోణంలో చట్టం తన పని తాను చేసుకుంటుంది : మంత్రి గొట్టిపాటి

  గత వైసీపీ ప్రభుత్వానికి ఉన్నంత ప్రచార పిచ్చి కూటమి ప్రభుత్వాన్నికి లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యార్థులకు కావాల్సిన వస్తువులన్నీ మంచి నాణ్యతతో ఇచ్చాం. రాజకీయ నాయకుల ఫొటోలు వేయకుండా విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశాం. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది.’’ అని గొట్టిపాటి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తల్లికి వందనం కింద రూ. 10 వేల కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశామన్నారు.  జగన్ హయాంలో నాసిరకం మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన అందరికీ శిక్ష పడుతుందని అన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో చట్టం తన పని తాను చేస్తోందని చెప్పారు. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించడం లేదని మంత్రి స్పష్టం చేశారు.‘‘రైతుల వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించబోమని గతంలో చెప్పాం. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించడం లేదు. ఎక్కువ విద్యుత్ బిల్లులు వస్తున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారు. వైసీపీ హయాంలో 9 సార్లు విద్యుత్ బిల్లులు పెంచారని ఆయన తెలిపారు.  

పాఠశాలపై కూలిన విమానం..19 మంది మృతి

  బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని మైల్‌స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ క్యాంపస్‌లో బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్ శిక్షణ విమానం  కుప్పకూలింది. దీంతో క్యాంపస్‌లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. వెంటనే అక్కడి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కూలిన విమానం F-7 BGI గా బంగ్లా సైన్యం పేర్కొన్నాది. విమానం కూలడంతో ఘటనా స్థలంలో పొగలు ఎగసిపడుతున్నాయి. రెస్క్యూ టీములు సహాయక చర్యలు చేపట్టాయి. విమానం బంగ్లాదేశ్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందినదిగా ఆర్మీ అధికారికంగా ధృవీకరించింది.  ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.  

కోనేరు హంపికి ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

  జార్జియాలో జరుగుతున్న ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్‌లో సెమీస్‌కు చేరిన తెలుగు తేజం, భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపికి సీఎం రేవంత్‌రెడ్డి  ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా హంపి నిలవడం తెలుగు ప్రజల గర్వకారణమని పేర్కొన్నారు. వరల్డ్ కప్‌లో ఆమె ఘన విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నాని ముఖ్యమంత్రి హంపికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.  ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా హంపి నిలవడం తెలుగు ప్రజలకు గర్వకారణమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్లో కోనేరు హంపి చైనాకు చెందిన యుక్సిన్ సాంగ్ పై 1.5-0.5 తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ఆమెకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.మరోవైపు ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్ ముఖ్ మధ్య జరిగిన క్వార్టర్స్ టైబ్రేకర్ కు వెళ్లింది. తొలి గేమ్ ను డ్రా చేసుకున్న వీరిద్దరూ... రెండో గేమ్ లోనూ పాయింట్స్ పంచుకున్నారు. ఈ క్రమంలో, వీరి టైబ్రేకర్ నేడు జరగనుంది.  

తమిళనాడు సీఎం స్టాలిన్ కు అస్వస్థత.. అపోలో ఆస్పత్రిలో చికిత్స

తమిళనాడు ముఖ్యమంత్రి  స్టాలిన్‌ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. సోమవారం (జులై 21) మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను   అపోలో హాస్పిటల్‌ కు తరలించారు. అక్కడ వైద్యుల బృందం ఆయనకు చికిత్స చేస్తున్నది. మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయన కళ్లు తిరుగుతున్నాయని చెపపడంతో ఆస్పత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో స్టాలిన్ ఉన్నారు.  సీఎం స్టాలిన్ కు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అపోలో వైద్యులు తెలిపారు. ఈ మేరకు హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. 

అజ్ఞాతంలోకి పేర్ని నాని.. హైకోర్టులో మాజీ మంత్రికి చుక్కెదురు

కృష్ణా జిల్లా పామర్రులో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని రప్పా రప్పా అంటూ కొట్టిన డైలాగులు ఆయన్ని మరో కేసుల ఉచ్చులో బిగుసుకునేలా చేశాయి. ఓ కల్యాణ మండపంలో  జులై 8న జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రప్పా రప్పా అని చెప్పడం కాదు.. కన్ను కొడితే రాత్రికి రాత్రి చేసేయాలంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. లోకేష్‌ రెడ్ బుక్ అంటున్నాడు.. మీరు కూడా రప్పా.. రప్పా అంటున్నారు.. ఏదైనా పని చేయాలంటే చీకట్లో కన్నుకొడితే పని అయిపోవాలని పేర్నినాని వ్యాఖ్యానించడం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. పని చేయాలంటే అనవసరమైన మాటలు...అల్లరి కాదని... పనిచేయడమే ముఖ్యమని హింసను ప్రేరేపించేలా వైసీపీ క్యాడర్‌ను ఉద్దేశించి పేర్ని నాని వ్యాఖ్యానించడం పొలిటికల్‌ హీట్‌ను పెంచేశాయి. ఆ క్రమంలో పేర్ని నానిపై మచిలీపట్నంలో కేసు నమోదైంది. ఆర్‌.పేట పీఎస్‌లో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు. పామర్రు మీటింగ్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో కేసు నమోదు చేశారు.  కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీస్ స్టేషన్‌లోనూ పేర్ని నానిపై కేసు నమోదైంది. పేర్ని నానిపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ రాష్ట్ర నేత కనపర్తి శ్రీనివాసరావు  అవనిగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  గుడివాడలో వైసీపీ నాయకుల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనడానికి ముఖ్యఅతిధిగా హాజరైన పేర్నినానికి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. వరుసగా రెండు రోజుల నుంచి పేర్ని నాని చేస్తున్న వివాదాస్పద కామెంట్స్‌పై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని వ్యాఖ్యలకు నిరసనగా వైసీసీ ఫ్లెక్సీలను చించి వేశారు. వైసీపీ అధ్యక్షుడు జగనే రప్పరప్ప డైలాగులో తప్పు లేదనడంతో.. మనం మాత్రం ఎందుకు తగ్గాలన్నట్టు పేర్ని నాని వంటి నేతలు తమ శ్రేణులను మరింత రెచ్చగెట్టేలా స్టేట్ మెంట్లు ఇస్తుండటంపై ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా వరుసగా నమోదవుతున్న కేసులతో హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పేర్నినాని ప్రయత్నించారు. అయితే, హైకోర్టు పేర్ని నాని విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. అరెస్టు నుంచి ముందస్తు రక్షణ దక్కకపోవడంతో కంగుతిన్న పేర్ని నాని సైలెంట్‌గా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.  పేర్ని నాని ఈనెల 22న హైకోర్టు విచారణ తరువాత బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 

ఈట‌ల కొత్త పార్టీ బీజేఎస్?

మాజీ మంత్రి, బీఆర్ఎస్ మాజీ నాయకుడు.. ప్ర‌స్తుత బీజేపీ నాయ‌కుడు ఈట‌ల రాజేంద‌ర్ కొత్త పార్టీ పెడుతున్న‌ట్టుగా  వార్త‌లు జోరుగా విన‌వ‌స్తున్నాయి. ఆ పార్టీ పేరు బహుజన జనతాసమితిగా   ప‌లువురు సోష‌ల్ మీడియాలో పోస్ట‌ర్లు వేసి మ‌రీ ప్ర‌చారం చేస్తున్నారు. ఈటల కొత్త పార్టీ పెట్టడం, దాని పేరు బహుజన జనతా సమితి (బీజెఎస్ గా పలువురుు ధృవీకరణలు కూడా చేసేస్తున్నారు. ఈటల ప్రస్తతం ఉన్న బీజేపీ,  గతంలో ఉన్న  బీఆర్ఎస్ రెంటినీ స్ఫురింప చేసేలా బీజెఎస్  అనే పేరును ఈటల ఫిక్స్ చేసినట్లుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.   రాష్ట్రంలో ఇప్ప‌టికే బీసీల ఓటు బ్యాంకు కోసం పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉంది.  ఒక ప‌క్క అధికార  కాంగ్రెస్ బీసీల రిజ‌ర్వేష‌న్ల కోసం ఆర్డినెన్స్ తీసుకువస్తుంటే.. ఈ ఆర్డినెన్స్ బ‌హు బాగున్న‌దంటూ బీఆర్ఎస్ తిరుగుబాటు నేత కల్వకుంట్ల క‌విత కాంప్లిమెంట్ ఇచ్చేశారు. అస‌లు బీసీల‌కూ నీకూ ఏం సంబంధం? నీకూ బీసీల‌కు కంచం పొత్తా- మంచం పొత్తా అంటూ మ‌ల్ల‌న్న స్ట్రాంగ్ కౌంట‌ర్లు ఇస్తుంటే.. ఈటల నేతృత్వంలో మ‌రో కొత్త బీసీల వేదిక త‌యారైందంటూస‌మాచారం.  అచ్చం వైసీపీలా స‌న్నిహితుల పేరిట ఈ బీజెఎస్ రిజిస్ట్రేష‌న్ ప్రాసెస్ పూర్తి చేసిన‌ట్టు తెలుస్తోంది. అందుకే ప్ర‌తి వార్డు మెంబ‌రూ మ‌న‌వాళ్లే అంటూ మెసేజ్ లు పంపుతున్న‌ట్టు చెబుతున్నారు. అయితే ఈట‌ల వ‌ర్గం మాత్రం అలాంటిదేం లేదని చెబుతున్నాయి.  అయితే ఈట‌ల అభిమానుల నుంచి అయితే కొత్త పార్టీ పెట్టాల్సిందే అన్న ఒత్తిడి వ‌స్తున్న‌ట్టు స్వ‌యానా ఈట‌ల వ‌ర్గ‌మే చెబుతోంది. ఒక వేళ  ఈట‌ల  పార్టీ పెడితే లాభ‌న‌ష్టాల బేరీజు ఎలాంటిది? కులాల ఈక్వేష‌న్ల‌ను క‌లుపుకుపోవ‌డం ఎలా? బ‌హుజ‌న శ‌బ్ధం తో పార్టీ పెడితే ఎలాంటి ఫ‌లితాల‌ను ఇస్తుంది? అన్న విషయంపై ఈటల టీమ్ సీరియస్ గా  పని చేస్తున్నట్లు తెలుస్తోంది.  మ‌రి చూడాలి ఈ పార్టీ పుట్టుక- మ‌నుగ‌డ- రాణింపు అనే  అనే అనుమానాలు, సందేహాలను ఈటల ఎలా నివృత్తి చేస్తారో.