Read more!

షుగర్ వల్ల ఇన్ని సమస్యలొస్తాయని మీకు తెలుసా?

ఈమధ్య కాలంలో మధ్యవయసు కాదు కదా 30 ఏళ్ళు దాటకుండానే షుగర్ జబ్బు వచ్చేస్తోంది చాలామందికి. అయితే ఈ షుగర్ వల్ల కేవలం తీపి పదార్థాలు తినకుండా ఉండటమే కాకుండా వేరే ఇతర అనారోగ్య సమస్యలు కూడా పొంచి ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటే…

గ్లూకోజు పదార్థం సరిగా అందనపుడు, గుండె బలహీనమవుతుంది. అందువల్ల షుగర్ వ్యాధి క్రానిక్ అయిన వారికి గుండె జబ్బులకు దారితీసే అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఇతరులతో పోల్చిచూస్తే, మధుమేహ రోగులకు  2 నుండి 4 రెట్లు అధికంగా గుండె జబ్బులు వస్తున్నట్లు పరిశోధనల్లో వెళ్ళడయింది. నిర్ధారించుచున్నారు. షుగర్ వ్యాధి కారకమైన వారిలో చీముకణాల సంఖ్య (పసె సెల్సు) పెరుగుట వల్ల రక్తం కలుషితమవుతుంది. చిక్కబడిపోతుంది అందువల్ల గుండె స్పందన పెరిగి, గుండెఒత్తిడి పెరిగి గుండె జబ్బులొచ్చే ప్రమాదం ఉంది. . 

మనశరీరంలోని, అదనపు షుగరును, చీము కణాలను ఎప్పటి కప్పుడు మూత్రపిండములు వడకట్టి బయటకు పంపేస్తూ ఉంటాయి. అయితే షుగర్ ఎక్కువ ఉండటం వల్ల మూత్రపిండాలకు పని ఎక్కువ అవుతుంది. దానికి తోడు శుభ్రమైన  రక్తము లేక మూత్రపిండముల కండరములు బలహీనపడతాయి. అందువల్ల మూత్రపిండ వ్యాధులు సంక్రమిస్తాయి. ఇప్పుడు లెక్కల ప్రకారం కిడ్నీ వ్యాధులతో బాధపడే వారిలో, ప్రతిముగ్గురిలో ఒకరు సుగర్ వ్యాధి పీడితులేనని తెలుస్తోంది. 

దాదాపు 15-20 సంవత్సరాల నుండి షుగర్ వ్యాధితో బాధపడేవారికి డయాబిటీస్, రేటినో అనే పార వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాంటి వారిలో కంటిలోని రెటీనాకు సంబంధించిన, చిన్నచిన్న రక్తనాళములలో చీము కణాలు (పస్పెల్సు) చేరి పోయి ఆయానాళములు పాడైపోయి రెటీనాకు శుభ్రమైన రక్తము ప్రాణశక్తి అందక, అంధత్యము వస్తుంది.

క్రానిక్ షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలామందికి కాళ్ళకు పాదములకు  కాలివ్రేళ్ళు తిమ్మిరులెక్కి స్పర్శ తెలియకుండా పోతుంది. అలాంటి స్థితిలో కాలికి ఏమి తగిలినా తెలియదు. కాలిచెప్పులు ఊడిపోయింది గూడా కొందరికీ తెలియదు. కాళ్ళు మనదేహమునకు దిగువన ఉంటాయి కాబట్టి, షుగర్ వ్యాధిగ్రస్తులకు నిర్జీవరోగ పదార్దములు చీము కణాలు హెచ్చుగా ఉంటాయి. అవన్ని  కాళ్ళలో చేరి నిలిచిపోతాయి. అందువల్ల కొందరికి కాళ్ళువాపులు-నీరు కనిపిస్తాయి. గుండె బలహీనత వల్ల చివర్లకంటా రక్తప్రవాహములు సరిగా అందవు. అక్కడ చేరిన నిర్జీవ పదార్ధములు కుళ్ళిపోయి రణాలుగా తయారై కాలిని తినేస్తాయి. అలాంటి స్థితిలో డాక్టర్లు ఆపరేషన్ చేసి కొందరికి, కాలివ్రేళ్లను  మరికొందరికి పాదములను  కొందరికి మోకాలు క్రింద వరకు మరికొందరికి తొడలవరకు కూడా తీసేస్తారు. 

షుగర్ వ్యాధిగ్రస్తులలో కొందరికి నోటిపూతగాను, గొంతు సంబంధ సమస్యలు, చిన్నప్రేగులలో తరచుగా పూతలు ఏర్పడటం జరుగుతూ ఉంటుంది, అందువల్ల నోటిలోనూ,  ప్రేగులలోనూ కడుపులో మంటలు కనిపిస్తుంటాయి. ఇలాంటి వారు ఏమాత్రం పులుపు, ఉప్పు, కారములు మొదలైనవి తిన్నా విపరీతమైన మంటలు ఏర్పడతాయి. మరికొందరికైతే, పళ్ల చిగుళ్లు వాపులు వస్తాయి, అంతేకాకుండా చిగుళ్లు నొప్పులు, పళ్ళ వెంట చీము రక్తము కారడం. నోరు వాసన రావడం (పయోరియా లక్షణాలు) కొందరికైతే పళ్లు కదిలి ఊడిపోవడం వంటి సమస్యలు సంభవిస్తాయి. 

కాబట్టి షుగర్ వచ్చిందంటే దాంతోపాటు మరికొన్ని సమస్యలు వెనక వస్తున్నట్టు అని గుర్తుంచుకోండి.

                                   ◆నిశ్శబ్ద.