ఆరోగ్యంగా ఉండాలంటే ఎండ కావాలి...

మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎండ కావాలి. కాస్త ఎండలో ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు నిపుణులు.
ఎండ మనకు చెడుపు చేయదు. ----
మీరు ఎండ ను గురించి ఆలోచించినప్పుడు మీకు మొట్ట మొదటగా వచ్చేది ఎండ మనకు చేసే నష్టం గురించి. అతిగా ఏది చేసినా సమస్యే. అన్న మాట ఎంత సత్యమో అంటే సూర్యోదయ వేళ పొద్దు పొడవగానే వచ్చే లేలేత భానుని లేత కిరణాలు  మంచిదే అంటున్నారు నిపుణులు.

అసలు మనకు ఎంత ఎండ అవసరం------

ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కోరికి ఒక్కోవిధంగా ఉంటుంది. అది మీశరీరం వయస్సు రంగు పై ఆధార పడి ఉంటుంది. మీ ఆరోగ్య చరిత్ర, ఆహారం, మీరు సహజంగా మీరు నివసించే ప్రదేశాలు 5నుండి 15నిమిషాలు లేదా3౦ నిమిషాలు డార్క్ స్కిన్ ఉన్నప్పటికీ అనారోగ్య సమస్యలు లేకుండా ఎండ బాగా పని చేస్తుంది.అలా అయితేనే మీరు ఎక్కువ జీవితకాలం జీవిస్తారు. సన్ స్క్రీన్ వాడకుండా నే మీరు బాగుంటారు. మీ డాక్టర్ తో మీరు ఇప్పుడే మాట్లాడండి.

ఎండ ద్వారా విటమిన్ డి ----

సూర్య కాంతి ద్వారా వచ్చే ఆల్ట్రా వైలెట్ కిరణాలు మీ శరీరానికి న్యూట్రీయంట్ గా పని చేస్తుంది. అది మీ ఎముకల కి చాలా అవసరం. రక్త కణాలకి రోగ నిరోధక శక్తిఅవసరం కొన్ని మినరల్స్ కూడా తీసుకునేందుకు దోహదం చేస్తుంది. సూర్య రస్మి ద్వారా కాల్షియం, ప్రోస్పరస్, విటమిన్ డి ఆహారం ద్వారా పొందవచ్చు.ఎవరికైతే శిశువులు కళ్ళు అప్పుడప్పుడే తెరుస్తారో వారి చర్మం ఎముకలు మృదువుగా ఉంటాయో వారి ఎముకల పటుత్వానికి సూర్యరస్మిదోహదం చేస్తుంది.

కొన్ని ప్రత్యేక సందార్భాలలో మనకు రక్షణకల్పిస్తుంది-----

ఎండలో ఎక్కువ సేపు ఉన్నారంటే మీ చర్మానికి క్యాన్సర్ వస్తుంది. ఎక్కడైతే ఎండ తక్కువగా ఉండే ప్రాంతాలలో జీవిస్తున్నారో చర్మానికి సంబందించిన ఇతర సమస్యలు వాస్తాయి. వక్షోజాల క్యాన్సర్ , కాలాన్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, వంటి సమస్యలు, లేదా మల్టిపుల్ స్క్లిరోసిస్, హైబిపి, డయాబెటిస్,గుండె సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశంఉందని దీనికి కారణం సూర్య రస్మి తక్కువగా ఉండడమే నని శాస్త్రజ్ఞ్యులు తేల్చారు.

మంచి నిద్ర కావాలి -----

సరిగా నిద్రపోవడం మంచి నిద్ర పోవడం చాలా మంచిది. మీ కళ్ళకు సూర్య రస్మి తగలాలి . అది మీ శరీరం లోని అది మీశరీరం లోని ఇతర అవయవాలను సరి చేస్తుంది. ప్రతి రోజూ వచ్చే సూర్య కిరణాలు లేలేత ఉదయ భానుడి కిరణాలు తెల్లారిందని రాత్రి కాలం ముగిసిందని రాత్రి సరిగా నిద్ర పోయారాలేదా అనడానికి సంకేతం.అయితే మీ వయస్సు రీత్యా మీ కళ్ళు చూడ లేకపోవడం గమనించవచ్చు. దీనివల్ల రాత్రి వేళ మీరు సరిగా నిద్ర లేవకపోవడానికి కారణం గా పేర్కొన్నారు.

బరువు తగ్గడానికి-- అంటే మీరు మీ శరీరం లో కొవ్వు తగ్గాలంటే----

మీరు తీవ్రంగా ఒబెస్ తో బాధ పడుతున్నారా అయితే ఖర్చులేని చిట్కా ఒకటి చెప్పనా సూర్య రస్మి అంటే సూర్యోదయ కిరణాలు మీ శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. ఇలా 2౦ -3౦ నిమిషాలు ఉదయం8 గం -నుంచి మాధ్యాహ్నాం చేస్తే ఆవ్యత్యాసం కనిపిస్తుంది. అదీ మీరు సూర్యోదయం వేళ తీసుకుంటే అది పని చేస్తుంది. శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం సూర్యకిరణాలు కొవ్వు పదార్దాలాను తగ్గిస్తాయి. ఎక్కువ ఎండగా ఉంటె ఎక్కువసేపు సేపు వ్యాయామం చేస్తారు. దీని వల్ల ఎక్కువ బరువు తగ్గుతారు..

సూర్య నమస్కారం- మానవులలో ఉద్వేగాలు తగ్గిస్తుంది---

సూర్య రాస్మి మీ మెదడులో సెరో టానిక్ అనే రసాయనాన్ని అందిస్తోంది. దీని వల్ల మీకు ఎక్కువ శక్తి నిచ్చేందుకు సహకరిస్తుంది. మీరు చాలా ప్రశాంతంగా పోజిటివ్ గా ఉండడం వల్లే అద్భుత మైన సమస్యలను పరిష్కరించే సమార్ధ్యాన్ని దూర దృష్టిని మీకు కలిగించేది సూర్య రస్మి.

సూర్య రస్మి కంటి ఆరోగ్యం-----

ఆధునిక పరిస్థితులలో జీవితం అంతా అంటే ప్రత్యేకంగా బాల్యం , కౌమారం , యవ్వనం, వివిధ దసలలో మీకు కంటి చూపు సమస్యలువచ్చి ఉండక పోవచ్చు దగ్గరి చూపు సమస్యలు లేదా దూరపు చూపు సమస్యలు రావడానికి కారణం నేరుగా సూర్యుడిని చూడడం కంటి చూపు దెబ్బ తినే ప్రమాదం ఉందని,చూపు మసక  మసక గా ఉండడం అలాగే క్యాట రాక్ట్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెపుతున్నారు.

మీ చర్మం పై మీశ్రద్ధ -----

కొంత మంది శాస్త్రజ్ఞులు ప్రధామిక స్థాయిలో చేసిన పరిశోదనలో వివిధ రకాల క్యాన్సర్లు వచ్చినట్లు గుర్తించారు. క్యాన్సర్ లలో మేలనోమా, బాసెల్ సెల్ కార్సినోమా వంటి క్యాన్సర్ లు వచ్చె అవకాశం ఉందని తేల్చారు. దీనికి కారణం ఎక్కువ సేపు ఎండలో గడపడమే అని తేల్చారు. 15 నిమిషాలకు పైగా ఎండలో ఉంటె మాత్రం సన్స్క్రీన్ లేదా కవర్ దీనివల్ల ఆల్ట్రా వైలట్ కిరణాల ప్రభావం తగ్గుతుంది . ఆల్ట్రా వైలెట్ కిరణాలు తక్కువ స్థాయిలో తీసుకుంటే ఎక్సిమా, సోరియాసిస్, బొల్లి,విటిలిగో, వంటి చర్మ వ్యాధులకు ఎండ పనిచేస్తుంది.

సూర్య కిరణాలాతో చికిత్స ----

కొన్ని చర్మ సమస్యలకు  జాండిస్ అంటే పచ్చ కామెర్లు వంటి అనారోగ్య సమస్యలకు సూర్య రస్మితో చికిత్స చేయవచ్చు. జాండీస్ వచ్చిన జాండీస్ వచ్చినప్పుడే పుట్టిన బిడ్డ శిశువుకు అది ఉపయోగ పడుతుంది. మీ రక్తంలో బిల్ రూబిన్ వంటి రసాయనం ఎక్కువగా ఉంటె శిశువు చర్మం పసుపు పచ్చగా మారుతుంది. కిటికీకి వెనుక వైపు వచ్చే సూర్య కిరణాలు పిల్లలకు హాని చేయ వచ్చు. బిల్ రూబిన్ ను తగ్గించేందుకు పిల్లలను ముఖ్యంగా అప్పుడే పుట్టిన శిశువును బయట ఎండలో నేరుగా ఉంచవద్దు.

అతిగా సూర్య రస్మినితీసుకో కూడదు----

ఎటువంటి సంరక్షణలేకుండా మీరు ఎక్కువ సేపు ఎండలో ఎక్కువసేపు గడిపితే చర్మం క్యాన్సర్ కు దారి తీయ వచ్చు. మీ చర్మం వయస్సు పై బడ్డ ట్టు, ముడతలు పడటం చర్మం  వదులుగా ఉండడం మీ చర్మాన్ని సంరక్షించే రోగ నిరోధక  శక్తి తగ్గించే రక్త కణాలు తగ్గి శరీరం ఇతర వ్యాధుల ను ఎదుర్కునే శక్తిని తగ్గిస్తుంది.  తద్వారా మీఅరోగ్యంప్రమాదంలో పడుతుంది.

మీ కంటిని మీరు సంరక్షించు కొండి -------

మీ కంటిని సంరక్షించుకోడానికి కంటి పై ఆల్ట్రా వైలెట్ కిరణాలు పడకుండా సన్ గ్లాస్ ను వాడండి. లేదా పెద్ద పెద్ద టోపీలు కొద్ది సేపు మీరు ఎండలో ఉన్న సూర్య రశ్మి మీ కళ్ళను ఎప్పుడైనా నాశనం చేస్తాయి  కేవలం వేసవి కాలం లోనే కాదు మేఘాలు ఉన్నప్పటికీ కిరణాలు ప్రసరిస్తాయి.మీరు చిన్న పిల్లల విషయం లో ను ఇలాంటి సంరక్షణ తీసుకోడం మర్చి పోవద్దు. 

సన్ స్క్రీన్ వాడతారా----

మీరు సన్స్క్రీన్ విషయం లో ను జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ సలహా లేకుండా రకరకాల సన్స్క్రీన్ లోషన్లు వాడితే స్కిన్  క్యాన్సర్ కు గురి అయ్యే అవకాశం ఉందని నిపుణులు తేల్చారు. మీరు ఎక్కువ సేపు అంటే15 నిమి షాల నుంచి3౦ నిమిషాల పాటు ఎండలో ఉండాలంటే 3౦ నిమిషాల ముందుగా సన్స్క్రీన్ వేసుకుంటే ఆల్ట్రా వైలెట్ కిరణాల నుండి  మిమ్మల్ని కాపాడు తాయి. మీకు పెదాలు చెవులు మెడ పై ఎక్కువ సన్ స్క్రీన్ వేయండి. మీరు ఒక వేళ ఈతకు వెళ్ళినా ఉదయం 1oగంటల నుండి సాయంత్రం 4గం వరకు దూరంగా ఉండండి. ఈ సమయం లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అది మీ శరీరం పై తీవ్ర ప్రభావం  చూపుతుంది.

టన్నింగ్ పడకలు వద్దు----

మీ చర్మం మొత్తం టోన్నింగ్ అయి నట్లైతే కొన్ని లోషన్స్ వాడడం శ్రేయస్కరం. పడకలు సరిగ్గా పడనట్లై తే స్కిన్ క్యాన్సర్ కు దారి తీసే అవకాశం ఉంది. మీకు 3౦ సంవత్సరాల ముందు వస్తే 6౦% మలినోమా కు గురిఅయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యకు కొన్ని లోషన్స్ సన్ స్క్రీన్స్ వాడచ్చు. 

డెర్మటాల జిస్ట్ దగ్గరకి వెళ్తారా-----

ప్రతినెల ఒక్క సారి మీ చర్మాన్ని వీలైనంత వరకు పరీక్షించు కోవాలి. మీ శరీరం పై ఎక్కడెక్కడ ఎలాంటి దద్దుర్లు ఎర్రటి మచ్చలు ఉన్నాయో మీ కుటుంబ సభ్యులకు చూపించండి. అందుకు మీ ఇంట్లో వాళ్ళ సహాయం తీసుకోండి. లేదా మీ ఇంట్లో ఉండే డ్రెస్సింగ్ టేబుల్ పైన ఉండే పొడవైన అద్దం ఉంచుకుని పరిశీలించండి. లేదా చేతిలో అద్దం ఉంచుకుని మీ శరీరాన్ని పరిశీలించండి. ఎక్కడైనా కొత్తగా ఏమైనా మచ్చలు ఒస్తునాయేమో పూర్తిగా పరిశీలించండి.అసహజంగా ఉండే ఎలాంటి వైనాగుర్తిస్తే మీ చర్మ వ్యాధుల నిపుణులను చూడండి. చర్మ సమస్యలకు అడ్డు కట్ట వేయకుంటే సమస్యలే మీ చర్మాన్ని జాగ్రతగా సంరక్షించుకోండి.

ఆరోగ్యానికి మంచిది కదా అని పల్లీలు తెగ తినేస్తుంటారా? ఈ నష్టాలు తప్పవు..!

ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు, ప్రోటీన్ ఉంటాయి. వీటిని పేదవారి బాదం అని అంటారంటే వీటిలో ఎన్ని పోషకాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.  అయితే అతి సర్వత్ర వర్జయేత్ అనే మాటకు తగ్గట్టు పల్లీలు అయినా సరే.. ఎక్కువగా తినడం చాలా చెడ్డదని ఆహార నిపుణులు అంటున్నారు. రుచిగా ఉంటాయి కదా అని పల్లీలను అతిగా తింటే.. ఆరోగ్యానికి మేలు చేయకపోగా చేటు చేస్తాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా పల్లీలు అంటే తెగ ఇష్టపడేవారు ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి.  పల్లీలను ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుంటే.. బరువు.. పల్లీలు అతిగా తింటే బరువు కూడా అతిగా పెరుగుతారట.  పల్లీలలో కేలరీలు, కొవ్వులు అధికంగా ఉంటాయి.  100గ్రాముల పల్లీలలో దాదాపు 567కేలరీలు ఉంటాయట.  ఎక్కువగా పల్లీలు తింటూ ఉంటే కేలరీలు కూడా పెరిగి బరువు పెరగడం కూడా వేగంగా జరుగుతుందట. జీర్ణ సమస్యలు.. పల్లీలు వేడి కలిగించే గుణం కలిగి ఉంటాయి. వీటిలో ఫైటేట్ లు ఉంటాయి.  పల్లీలు ఎక్కువగా తింటే ఉబ్బరం,  గ్యాస్,  కడుపులో యాసిడ్ ఫీలింగ్,  గుండెల్లో మంట వంటివి పెరుగుతాయి. పోషకాలు.. వేరుశనగలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే పోషకాల శోషణకు ఆటంకం కూడా కలుగుతుంది. ముఖ్యంగా వీటిలో పైటిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది శరీరంలో ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది.  దీన వల్ల శరీరంలో ఐరన్,  జింక్ లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎన్ని తినాలి.. ఆరోగ్య నిపుణులు,  ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకు ఒక గుప్పెడు పల్లీలు తినడం మంచిది.  అంతకంటే ఎక్కువ తినడం వల్ల పైన చెప్పుకున్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఈ చిన్న అలవాట్లే మానసిక ఆరోగ్యానికి శ్రీరామ రక్ష..!

శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు.  మానసికంగా బలంగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే ఆఫీసు ఒత్తిడులు,  జీవిత సమస్యలు, లక్ష్యాలు చేరుకోవడంలో పడే సంఘర్షణ.. ఇలా ఒకటేమిటి.. చాలా విషయాలు మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి.  కానీ కొన్ని సాధారణ అలవాట్లు మానసిక ఆరోగ్యానికి శ్రీరామ రక్షలా పనిచేస్తాయి.  ఇంతకీ ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. కృతజ్ఞత.. కృతజ్ఞత భావం మనిషిని చాలా స్వచ్చంగా ఉంచుతుంది.  ప్రతి వ్యక్తి మొదటగా గడిచే ప్రతి రోజు పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి.  రోజు తన జీవితంలో జరిగిన మంచి విషయాలను గుర్తు చేసుకోవాలి.  ఇలా చేస్తే చాలా పాజిటివ్ మైండ్ సెట్ అలవాటు అవుతుంది. ఇది మానసికంగా బలంగా ఉండటానికి సహాయపడుతుంది. వ్యాయామం.. శరీరంలో ఒత్తిడి హార్మోన్ తగ్గడానికి వ్యాయామం మంచి మార్గం.  ప్రతి రోజూ 20 నుండి 30 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి.  ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. శ్వాస వ్యాయామం.. శారీరక వ్యాయామమే కాకుండా మానసికంగా దృఢంగా ఉండటానికి శ్వాస వ్యాయామాలు కూడా చాలా బాగా సహాయపడతాయి. రోజూ కొన్ని నిమిషాలు శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది.  ఒత్తిడి కూడా తగ్గుతుంది. శ్రద్ద.. ఏ పని మీద అయినా దృష్టి పెట్టడాన్నే మైండ్ ఫుల్ నెస్ అని అంటున్నారు.  ఇంటి పని చేసినా,  వ్యాయామం చేసినా, ఆహారం తీసుకున్నా, ఆఫీసు పని చేసినా.. ఇలా ప్రతి పని చేసినప్పుడు ఆ పని మీద పూర్తిగా మనసు లగ్నం చేయాలి. ఇందుకోసం ధ్యానం చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది. ఇలా చేయడం వల్ల మెయింటైన్ స్కిల్స్ మెరుగవుతాయి. ప్రకృతి.. మనిషిలో ఒత్తిడిని తగ్గించే సూపర్ మెడిసిన్ ఏదైనా ఉందంటే అది ప్రకృతి.  తాజా గాలిలో,  సూర్యరశ్మిలో సమయం గడపడం,  మొక్కలు,  చెట్లు,  పక్షులు,  జంతువుల సమక్షంలో సమయాన్ని గడపడం వల్ల ఒత్తిడి తగ్గి మానసికంగా దృఢంగా మారతారు. మనసు విప్పడం.. ఎలాంటి విషయాలు అయినా కొందరితోనే మనసు విప్పి మాట్లాడగలుగుతారు.  వారిలో స్నేహితులు,  బంధువులు,  ఆత్మీయులు ఇట్లా చాలా ఉంటారు. అయితే ఎవరి దగ్గర ఏదైనా చెప్పుకోగల చనువు ఉంటుందో వారితో ఓపెన్ గా మాట్లాడాలి. దీనివల్ల చాలా విషయాలలో మంచి సలహాలు దొరకడమే కాకుండా క్లిష్ట పరిస్థితులలో మంచి సపోర్ట్ కూడా దొరుకుతుంది. బంధాలు.. స్నేహం అయినా, ప్రేమ అయినా,  వైవాహిక బంధం అయినా, కొలీగ్స్ తో పరిచయం అయినా.. వారితో ఉండే రిలేషన్ పదే పదే తెగిపోతూ ఉంటే అది మానసిక సమస్యలకు దారి తీస్తుంది.  అందుకే బంధాలను కాపాడుకోవాలి.  ఎక్కువకాలం బంధాలు నిలిచి ఉండేలా చూసుకోవాలి. ఎమోషనల్ గా బంధాలతో కనెక్ట్ అయి ఉండాలి. నచ్చిన పని.. మానసికంగా బాగుండాలంటే అన్నింటి కంటే ముఖ్యమైనది నచ్చిన పని చేయడం. చాలా వరకు ఇతరుల సలహాలు,  ఇతరుల కమాండింగ్ మీద చాలా మంది పని చేస్తూ ఉంటారు. కానీ నచ్చిన పని చేయడంలో చాలా తృప్తి ఉంటుంది. ఇది మానసికంగా బలంగా ఉంచుతుంది. ఆత్మ విమర్శ.. ప్రతి రోజూ పడుకునే ముందు ఉదయం నుండి జరిగిన ప్రతి విషయాన్ని గుర్తు చేసుకోవాలి.  ముఖ్యంగా మంచి విషయాలను గుర్తు చేసుకోవడం వల్ల చాలా పాజిటివ్ మైండ్ అలవాటు అవుతుంది. పాజిటివ్ మైండ్ ఉంటే అది మానసిక ఆరోగ్యాన్ని కూడా బలంగా ఉంచుతుంది.                                  *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

డయాబెటిక్ ఫుడ్స్.. ఈ ఆహారాలు తింటే చాలా ఈజీగా షుగర్ వచ్చేస్తుంది..!

రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం.   కేవలం తీపి పదార్థాలు,  స్వీట్లు, పంచదార వంటివి తినడమే డయాబెటిస్ కు కారణం అనుకుంటే పొరపడినట్టే.. రోజువారీ ఆహారపు అలవాట్ల మీద డయాబెటిస్ ముడిపడి ఉంటుందని వైద్యులు అంటున్నారు. రోజు వారి తీసుకునే కొన్ని ఆహారాలు.. ఇవి ఏం చేస్తాయి లే అనుకునే పదార్థాలు టైప్-2 డయాబెటిస్ కు కారణం అవుతాయని అంటున్నారు వైద్యులు.  ఈ ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల డయాబెటిస్ ఈజీగా వస్తుందట. డయాబెటిస్ కు కారణమయ్యే ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. డీప్ ఫ్రైడ్ స్నాక్స్.. సమోసాలు, పకోడాలు,  చిప్స్  ఇవన్నీ చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు చాలా ఇష్టమైన స్నాక్స్.  కానీ ఈ ఆహారాలలో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ కొవ్వు క్రమంగా శరీరంలో పేరుకుపోతుంది.  బరువు పెరగడానికి దారి తీస్తుంది. బరువు పెరగడం  ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది, ఇది టైప్ 2 డయాబెటిస్‌కు ప్రధాన కారణం. ఫాస్ట్ ఫుడ్‌లో ఉపయోగించే నూనెను  పదే పదే వేడి చేయడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్ ఏర్పడుతుంది. ఇది రక్తంలో చక్కెరను మరింత పెంచుతుంది. మార్కెట్ ఫుడ్స్.. మార్కెట్లో అమ్మే గ్రానోలాతో పాటు  అనేక బ్రేకఫాస్ట్  తృణధాన్యాలు ఆరోగ్యకరమైనవని అనుకుంటారు.   కానీ వాటిలో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది.  గ్రానోలా బార్‌లు, ఓట్ బార్‌లు,  రెడీ టూ ఈట్ ఫుడ్స్ లో చాలా ఎక్కువ మొత్తంలో చక్కెరలు ఉంటాయి. వీటి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు చాలా వేగంగా పెరుగుతాయి. ప్రాసెస్డ్ మీట్.. సాసేజ్, బేకన్,  సలామీ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలలో సోడియం,  నైట్రేట్లు అధికంగా ఉంటాయి.  ఇవి గుండెకు హాని చేయడమే కాకుండా   డయాబెటిస్‌కు నేరుగా కారణం అవుతాయి. ప్రాసెస్ చేసిన మాంసాలు వాపును పెంచుతాయి,  జీవక్రియను నెమ్మదిస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడం కష్టతరం చేస్తాయి. డ్రింక్స్.. శీతల పానీయాలు,  ప్యాక్ చేసిన సోడాలలో చక్కెర చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక సోడా డ్రింక్ లో  ఉండే చక్కెర పరిమాణం కొన్ని  రోజులు తీసుకునే నేచురల్  చక్కెర కంటే ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పానీయాలు వెంటనే రక్తంలో గ్లూకోజ్‌ను పెంచుతాయి.  క్లోమంపై  ఒత్తిడిని ఎక్కువగా  కలిగిస్తాయి. ఇలాంటి డ్రింక్స్ తీసుకున్న ప్రతి  సారి  శరీరం అదనపు ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఇది కాలక్రమేణా ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. రిపైండ్ ఫ్లోర్,  బ్రెడ్.. తెల్ల బ్రెడ్, బన్స్, కుకీలు,  నాన్ వంటి ఆహారాలు మైదాతో తయారు చేస్తారు. ఈ ఆహారాలలో గ్లూకోజ్ చాలా త్వరగా విచ్చిన్నమవుతుంది. ఈ రిఫైండ్ ఫ్లోర్ లో  ఫైబర్ ఉండదు.  దీని వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలను తరచుగా తీసుకోవడం వల్ల శరీరం రక్తంలో చక్కెర సమతుల్యతను కాపాడుకోవడానికి కష్టపడి పనిచేయవలసి వస్తుంది. ఈ అలవాటు క్రమంగా మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. వైట్ రైస్.. తెల్ల బియ్యం భారతీయ ఆహారంలో ముఖ్యమైన భాగం. కానీ ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే.  ఇది తిన్న తర్వాత గ్లూకోజ్‌గా మారుతుంది. ఇది నేరుగా రక్తంలో చక్కెరను పెంచుతుంది. రోజూ పెద్ద మొత్తంలో తెల్ల బియ్యం తినడం వల్ల బరువు పెరగడం,  రక్తంలో చక్కెర నియంత్రణ బలహీనపడటం జరిగి, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా చాలా పాలిష్ పట్టిన బియ్యంతో వండే అన్నం ఎక్కువ తినడం మానేయాలి.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

టీతో పాటు బిస్కెట్లు తింటున్నారా? దిమ్మ తిరిగే నిజాలు ఇవి..!

భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం ఈ టీ-బిస్కెట్ కాంబినేషన్ ను చాలా చెత్త కాంబో గా చెబుతున్నారు. టీ-బిస్కెట్ చాలా సింపుల్ గా రుచిగా అనిపిస్తుంది కానీ ఇది ఆరోగ్యాన్ని చాలా దారుణంగా దెబ్బతీస్తుందని అంటున్నారు. అసలు టీ-బిస్కెట్లు తీసుకోవడం వల్ల జరిగేదేంటి? పోషకాహార నిపుణులు ఏమంటున్నారు? తెలుసుకుంటే.. టీ-బిస్కెట్ కహానీ.. మార్కెట్లో లభించే ప్యాక్ చేసిన బిస్కెట్లు ఎక్కువగా పాశ్చరైజ్ చేయబడతాయి. వాటిలో శుద్ధి చేసిన పిండి అంటే మైదా, అధిక మొత్తంలో చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు,  అనేక ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి. ఈ  పదార్థాలు టీలోని కెఫిన్,  టానిన్‌లతో కలిపినప్పుడు అది జీర్ణక్రియను చాలా  ప్రభావితం చేస్తుంది. శరీరంలో అనవసరమైన చక్కెర,  కొవ్వు పేరుకోవడాన్ని  పెంచుతుంది. టీ-బిస్కెట్ తినడం అనేది రోజువారీ అలవాటుగా మారితే  అది ఊబకాయం, మధుమేహం  జీర్ణ సమస్యల ప్రమాదాన్ని చాలా సులువుగా  పెంచుతుంది. పోషకాలు జీరో.. మార్కెట్లో దొరికే బిస్కెట్లు మైదా నుండి తయారవుతాయి.  వీటిలో  ఫైబర్, విటమిన్లు,  ఖనిజాలు ఏమీ ఉండవు.ఇందులో జీరో కేలరీలు ఉంటాయి. టీతో వాటిని తినడం వల్ల అప్పటిక్పుడు ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ పోషకాహారం ఏమీ ఉండదు. ట్రాన్స్ ఫ్యాట్స్.. బిస్కెట్లను క్రిస్పీగా చేయడానికి,  వాటి షెల్ఫ్ లైప్  పొడిగించడానికి హైడ్రోజనేటెడ్ నూనెలు లేదా ట్రాన్స్ ఫ్యాట్‌లను ఎక్కువగా ఉపయోగిస్తారు. ట్రాన్స్ ఫ్యాట్‌లు గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఈ కొవ్వులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.  మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె జబ్బులు,  స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. చక్కెర .. బిస్కెట్లలో చక్కెర,  శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వాటిని టీతో కలిపి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి, ఆపై పడిపోతాయి. ఈ హెచ్చుతగ్గులు ఎక్కువగా జరిగితే అవి  శక్తి లేకపోవడానికి దారితీయడమే కాకుండా, దీర్ఘకాలంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచడం ద్వారా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. జీర్ణక్రియ, యాసిడ్.. బిస్కెట్-టీల కాంబో  జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది. శుద్ధి చేసిన పిండిలో ఉండే  జిగట,  టీలోని టానిన్లు కలిసి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి.  టీలోని ఆమ్లతత్వం,  బిస్కెట్లలోని నూనె కడుపులో గ్యాస్, ఉబ్బరం,  యాసిడ్ ఎఫెక్ట్ ను ఎక్కువ  చేస్తాయి.                                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

వందేళ్లకు పైగా బ్రతకడానికి ఆయుర్వేదం చెప్పిన రహస్య చిట్కాలు..!

  ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు.  ఆయుష్షును పెంచడానికి ఎటువంటి మాయా సూత్రం లేదని,  ఇప్పటికీ కొన్ని పురాతన ఆయుర్వేద పద్ధతులను ఆచరించడం ప్రారంభిస్తే వంద సంవత్సరాలకు పైగా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఈ విషయాన్ని స్వయంగా  చరక మహర్షి శిష్యుడైన  వాగ్భటాచార్యుడు  చెప్పారు. ఆయన ఆయుర్వేదంలో కొన్ని పద్దతులను వివరించాడు. వీటని పాటించడం వల్ల వందేళ్లకు పైగా ఆరోగ్యంగా జీవించడం సాధ్యమట.  ఇంతకీ ఆ రహస్య చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. భారతదేశ జనాభా దాదాపు 1.4 బిలియన్లు అయితే.. అందులో కేవలం 300 మిలియన్లు మాత్రమే పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. మిగిలిన వారు మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కడుపు సమస్యలు, కీళ్ల నొప్పులు,  వాత-పిత్త-కఫ సమస్యలు వంటి వివిధ వ్యాధులతో బాధపడుతున్నారట. ప్రతి వ్యక్తి ఆరోగ్యకరమైన జీవనశైలి,  ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా వారికి వచ్చే  85 శాతం అనారోగ్యాలకు స్వయంగా చికిత్స చేసుకోగలరని, కేవలం  15 శాతం అనారోగ్యాలకు మాత్రమే నిజంగా వైద్యుడు అవసరమవుతారని వాగ్భటాచార్యుడు పేర్కొన్నారు. తాగునీరు.. 3 నియమాలు.. ప్రతిరోజూ నీరు తాగుతాము, కానీ సరైన రీతిలో త్రాగడం కూడా అంతే ముఖ్యమని వాగ్బటాచార్యుడు చెప్పాడు.  మొదటి నియమం.. తిన్న వెంటనే నీరు త్రాగకూడదు, ఎందుకంటే ఇది జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. రెండవ  నియమం.. నీటిని ఎల్లప్పుడూ గుటకలుగా త్రాగాలి. కొంచెం కొంచెంగా సిప్ చేస్తూ తాగాలి. నీటిని  గ్లాసు లేదా చెంబు, బాటిల్ తో ఎత్తుకుని ఒక్కసారిగా ఎక్కువ మొత్తం తాగడం  ఆరోగ్యానికి మంచిది కాదు. మూడవ నియమం.. చల్లటి నీరు ఎప్పుడూ త్రాగకూడదు. చాలా చల్లటి నీరు కడుపులోని అగ్నిని బలహీనపరుస్తుంది. ఇది ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి ఆటంకం కలిగిస్తుంది. గోరువెచ్చని నీరు త్రాగడం ఎల్లప్పుడూ ఉత్తమంగా పరిగణించబడుతుంది. నిద్ర లేచిన వెంటనే నీరు.. ఉదయం నిద్ర లేచిన వెంటనే నోరు శుభ్రం చేసుకోకుండా నీరు త్రాగడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. రాత్రిపూట ఉత్పత్తి అయ్యే లాలాజలంలో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ లాలాజలం శరీరం లోపలి నుండి శుభ్రపరచడంలో సహాయపడుతుంది.  అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఉదయం ఈ నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.  శరీరం విష పదార్థాలను తొలగిస్తుంది. ఆహారం, సమయం.. వాగ్భటుడు చెప్పిన దాని ప్రకారం సూర్యోదయం తర్వాత రెండున్నర గంటల పాటు శరీరం యొక్క జీర్ణాగ్ని బలంగా ఉంటుంది. ఉదాహరణకు.. సూర్యుడు ఉదయం 7 గంటలకు ఉదయిస్తే శరీరం యొక్క జీర్ణశక్తి ఉదయం 7:00 నుండి  9:30 గంటల మధ్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమయాల్లో తినే ఆహారం బాగా జీర్ణమవుతుంది,  పూర్తి పోషణను అందిస్తుంది. అందువల్ల ఉదయం ఎక్కువగా, మధ్యాహ్నం కొంచెం తక్కువగా, రాత్రి తేలికైన భోజనం తినాలని ఆయన సలహా ఇచ్చారు. ఇష్టమైన ఆహారం, నియమాలు.. చాలామందికి ఇష్టమైన ఆహారాలు అంటూ  పరాఠాలు, స్వీట్లు, రబ్రీ, రసగుల్లాలు లేదా ఏదైనా భారీ ఆహారాన్ని ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారు  ఇష్టమైన ఆహారాన్ని ఉదయం తినాలట. ఉదయం  జీర్ణశక్తి చాలా బలంగా ఉంటుంది.  బరువైన ఆహారాలు కూడా సులభంగా జీర్ణమవుతాయి. అయితే, రాత్రిపూట అదే ఆహారాలు తినడం వల్ల ఊబకాయం, గ్యాస్,  అనారోగ్యానికి దారితీస్తుంది. ఆహారం ఇలా ఉండాలి.. ఆహారం కడుపు నింపుకోవడానికి మాత్రమే కాకుండా మానసిక సంతృప్తికి కూడా అవసరమని వాగ్భటాచార్యులు  అన్నారు. మనస్సు సంతృప్తి చెందినప్పుడు శరీరం సరైన మొత్తంలో హార్మోన్లు,  ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇది నిరాశ,  మానసిక అనారోగ్యాన్ని నివారిస్తుంది.  శరీరం చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంటుంది.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

వారెవ్వా మందారం టీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు.. మందరాన్ని మంచి హెల్త్ కోసం కూడా వాడవచ్చు.  విదేశాలలో పువ్వులతో టీ తయారు చేసుకుని తాగుతారు.  అలాంటి లిస్ట్ లో మందారం కూడా ఉంది.  అసలు మందారం టీలో ఉండే ఔషద గుణాలేంటి? మందారం టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకుంటే.. మందారం టీ.. మందారం టీ చూడటానికి చాలా కలర్ పుల్ గా ఉంటుంది. ఇది రుచిలో పుల్లగా, క్రాన్బెర్రీ లాంటి రుచిని కలిగి ఉంటుంది.  ఈ టీలో కెఫిన్ ఉండదు. కాబట్టి ఆరోగ్యం కోసం ఎలాంటి సంకోచం లేకుండా దీన్ని తాగవచ్చు. మందారం టీ బెనిఫిట్స్.. మందారం టీ తాగడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుందట.  అధిక రక్తపోటు నియంత్రించడానికి మందారం టీ గొప్ప ఔషదంగా పనిచేస్తుంది. ఇది నరాలను సడలించి గుండెపై ఒత్తిడి తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు.. మందారం టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ప్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. బరువు తగ్గడంలో.. మందారం టీ శరీరంలో అమైలేస్ అనే ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.  ఇది కార్బోహేడ్రేట్లు, స్టార్చ్ ల శోషణను నెమ్మదిస్తుంది.  ఈ ప్రక్రియ జరగడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాలేయం.. మందారం టీ తాగడం వల్ల కాలేయం శుద్ది అవుతుంది. కాలేయంలో  పేరుకున్న కొవ్వును తగ్గించడంలో మందారం టీ  చాలా బాగా సహాయపడుతుంది.                         మందారం టీ తయారు విధానం.. మందారం టీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు.. మందారం రెక్కలు.. గుప్పెడు నిమ్మకాయ..  సగం చెక్క తేనె.. స్పూన్ నీరు.. ఒక గ్లాస్ తయారీ విధానం.. ఒక పాత్రలో ఒక గ్లాసు నీరు పోయాలి. అందులో శుభ్రం చేసుకున్న గుప్పెడు మందారం రెక్కలను వేయాలి. ఐదు నిమిషాల పాటు బాగా మరిగిన తరువాత స్టౌ ఆప్ చేయాలి.  కొంచెం వేడి తగ్గిన తర్వాత వడగట్టి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగాలి.  తేనె, నిమ్మరసం రుచి కోసం మాత్రమే.  అవి లేకుండా కూడా తాగవచ్చు.                                      *రూపశ్రీ.

బలమైన గుండె కావాలా? ఇవి తినండి చాలు..!

శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె.  ఏ ఇతర అవయవాలు సరిగా పని చేయకపోయినా ప్రాణం నిలబడుతుందేమో కానీ.. గుండె కొట్టుకోవడం కొన్ని నిమిషాల పాటు ఆగిపోతే శరీరం నిర్జీవం అవుతుంది.   అయితే ఈ మధ్య కాలంలో గుండె సంబంధ సమస్యలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలామందిలో గుండె  బలహీనంగా మారడం వల్ల తొందరగా గుండె జబ్బులు రావడం జరుగుతోంది.  అందుకే గుండెకు బలాన్ని ఇచ్చే ఆహారాలు తీసుకోవాలని వైద్యులు చెబుతారు.  గుండెకు బలాన్ని పెంచే ఆహారాలు ఏవి? ఆ లిస్ట్ ఒక్కసారి చూస్తే.. గుండెను బలంగా ఉంచే ఆహారాలు.. సాల్మన్.. సాల్మన్ వంటి కొవ్వు చేపలలో గుండెకు బలాన్ని చేకూర్చే  ఒమేగా-3 కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. సాల్మన్ చేపలు EPA,  DHA లను అందిస్తాయి.  ఇవి ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో, గుండె లయను స్థిరంగా ఉంచడంలో, రక్త నాళాల లైనింగ్‌ను మెరుగుపరచడంలో సహాయపడతాయి.  క్రమం తప్పకుండా తింటే హృదయ సంబంధ సమస్యలను చాలా వరకు   తగ్గించడంలో సహాయపడతాయి. ఈ ఒమేగా-3 లు గుండె కణ త్వచాలలో కలిసిపోయి ఆరోగ్యకరమైన విద్యుత్ కమ్యునికేషన్ కు సహాయపడతాయి. ఆలివ్ ఆయిల్.. ఎక్స్టా వర్జిన్ ఆలివ్ ఆయిల్ నూనెలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు,  పాలీఫెనాల్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మెరుగైన ఆరోగ్యకరమైన  కొలెస్ట్రాల్ ను అందిస్తాయి. అలాగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.  రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.  ఆలివ్ నూనె తీసుకోవడం  వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి. అవకాడో.. అవకాడోలు సహజంగా ఒలీక్ ఆమ్లం, ఫైబర్, పొటాషియం, ఫోలేట్,  విటమిన్ E లతో నిండి ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్,  రక్తపోటు స్థాయిలకు మద్దతు ఇస్తాయి. వాల్నట్స్. క్రమం తప్పకుండా వాల్‌నట్‌లను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వాల్‌నట్‌లలో మొక్కల ఆధారిత ఒమేగా-3లు, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు,  యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వాల్‌నట్‌లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన కొవ్వులను భర్తీ చేయడంలో సహాయపడుతుంది.  రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. బ్లూబెర్రీస్.. బ్లూబెర్రీస్ యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. బ్లూబెర్రీస్‌లో ఉండే ఆంథోసైనిన్లు,  పాలీఫెనాల్స్ రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని,  ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయని చెబుతారు. ఇది రక్తపోటును తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుందట. ముదురు ఆకుకూరలు.. ముదురు ఆకుకూరలు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.  సహజ నైట్రేట్లతో సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. విటమిన్ K, ఫోలేట్, పొటాషియం,  యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి గుండెను బలంగా మారుస్తాయి.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

నెల రోజుల పాటు టీ మానేసి చూడండి.. షాకవుతారు..!

భారతీయులు రిఫ్రెషింగ్ కోసం తీసుకునే పానీయాలలో టీ చాలా  ముఖ్యమైనది.  ఉదయం లేవగానే బ్రష్ చేసి టీ తాగాలి,  టిఫిన్ తినగానే టీ తాగాలి,  స్నేహితులతో బయట కలిస్తే టీ తాగాలి,  ఆఫీసు వర్క్ లో కాసింత బ్రేక్ కావాలంటే టీ తాగాలి,  అన్నింటికి మించి తలనొప్పి వచ్చినా,  ఫుడ్ లేటయినా కనీసం టీ  అయినా తాగాలి.  ఇలా టీ అనేది పానీయంలా కాకుండా ఒక ఎమోషన్ లా మారిపోయింది. అయితే టీ తాగడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు ఆరోగ్య నిపుణులు.  మరీ ముఖ్యంగా నెలరోజుల పాటు టీ తాగడం మానేయండి,  ఫలితాలు చూసి మీరే షాకవుతారు అని అంటున్నారు. ఇంతకూ నెలరోజుల పాటు టీ తాగడం మానేయడం వల్ల కలిగే మార్పులేంటో తెలుసుకుంటే.. నెలరోజులు టీ తాగడం మానేస్తే.. ఒక నెల పాటు టీ తాగడం మానేయడం వల్ల శరీరం నుండి  హానికరమైన సమ్మేళనాలను తొలగించడంలో సహాయపడుతుందట. ఇది కడుపులో యాసిడ్ ఎఫెక్ట్,  ఉబ్బరాన్ని తొలగించడమే కాకుండా,శరీర శక్తి స్థిరంగా ఉండేలా చేస్తుందట. ఇలా శరీరంలోపల శుద్ది కావడం శరీరానికి  రీసెట్ బటన్ గా పనిచేస్తుంది. నెల రోజుల పాటు టీ తాగడం మానేస్తే  నాలుగు ముఖ్యమైన మార్పులు ప్రధానంగా చోటు చేసుకుంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జీర్ణక్రియ.. టీ మానేయడం వల్ల కలిగే మొట్టమొదటి,  అత్యంత ప్రయోజనకరమైన విషయం జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగవ్వడం. టీలోని కెఫిన్,  టానిన్లు కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచుతాయి. ఒక నెల పాటు టీ తాగకుండా ఉండటం వల్ల కడుపులో ఆమ్ల స్థాయిలు నార్మల్ అవుతాయి. ఆమ్లత్వం, గుండెల్లో మంట,  అజీర్ణం దాదాపుగా తొలగిపోతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఐరన్ శోషణ.. టీలోని టానిన్లు ఆహారం నుండి ఐరన్ ను గ్రహించడంలో  ఆటంకం కలిగిస్తాయి. టీ మానేసిన తర్వాత శరీరం ఆహారం నుండి ఐరన్ ను పూర్తి స్థాయిలో గ్రహిస్తుంది. రక్తహీనత లేదా అలసటతో బాధపడేవారికి ఇది చాలా మెరుగైన ఫలితాలు ఇస్తుంది. టీ మానేయడం వల్ల ఐరన్ గ్రహించే సామర్ఱ్యం పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం.. టీలో కెఫిన్ ఉంటుంది. ఇది నిద్ర హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఒక నెల పాటు టీ తాగకుండా ఉండటం వల్ల  నిద్ర చక్రం తిరిగి రికవర్ అవుతుంది. గాఢంగా,   నాణ్యమైన నిద్రను పొందడంలో  సహాయపడుతుంది. మంచి నిద్ర నేరుగా  మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక కల్లోలం,  ఒత్తిడిని తగ్గిస్తుంది. చర్మం, దంతాల ఆరోగ్యం.. టీలోని టానిన్లు దంతాల మీద మరకలుగా మారి  దంతాల  రంగు మారుస్తాయి. టీ తాగడం మానేయడం వల్ల సహజంగా  దంతాలు శుభ్రంగా,  ప్రకాశవంతంగా కనిపిస్తాయి.  శరీరం హైడ్రేషన్ గా ఉండటం,  వాపు తగ్గడం మొదలైన వాటి వల్ల  పొడిబారడం తగ్గుతుంది.  చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

మూత్రాన్ని ఆపుకునే అలవాటుందా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?

ప్రతి మనిషి శరీరానికి సహజ ధర్మాలు ఉంటాయి.  ఆకలి వేసినప్పుడు ఆహారం తినడం,  దాహం వేసినప్పుడు నీరు త్రాగడం ఎలాగో.. మలమూత్ర విసర్జన కూడా అలాగే జరగాలి.  కానీ చాలామందికి మూత్రాన్ని ఆపుకునే అలవాటు ఉంటుంది.  పరిస్థితులు, సందర్భాలు ఏవైనా మూత్రం వచ్చినప్పుడు ఆపుకుంటూ ఉంటారు. దీని వల్ల ఇబ్బంది కలిగినా గత్యంతరం లేక ఇలా చేస్తుంటారు.  అయితే ఇలా మూత్రాన్ని ఆపుకోవడం అనేది చాలా లైట్ గా తీసుకోవాల్సిన విషయం కాదు. దీని వల్ల శరీరానికి చాలా నష్టం జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  ఇంతకూ మూత్రాన్ని ఆపుకోవడం వల్ల కలిగే నష్టాలేంటి? శరీరానికి కలిగే ప్రమాదాలేంటి? తెలుసుకుంటే.. చలికాలం కష్టం.. చలికాలం చాలామందిని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది.  వాటిలో మూత్రానికి వెళ్లడానికి బద్దకించే వారు కూడా ఉంటారంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఇది చాలా నిజం. ఇదే కాకుండా బయటకు వెళ్లినప్పుడు లేదా ఏదైనా గుడి,  పూజా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కూడా మూత్రాన్ని ఆపుకుంటూ ఉంటారు.  ఇలా మూత్రాన్ని ఆపుకోవడం చాలా డేంజర్. మూత్రాన్ని ఆపుకోవడం వల్ల కలిగే నష్టాలు.. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల కలిగే చాలా పెద్ద నష్టం మూత్రంలో ఇన్పెక్షన్ ఏర్పడటం.  మూత్రం మానవ శరీరంలో ఇన్ఫెక్షన్లు తొలగించడానికి సహాయపడుతుంది. కానీ మూత్రాన్ని ఆపుకోవడం వల్ల మూత్రంలో ఉండే విష పదార్థాల ప్రభావం వల్ల మూత్రాశయ ద్వారం ఇన్పెక్షన్ కు లోనవుతుంది. మూత్రాన్ని ఎక్కువ సేపు పట్టి ఉంచడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది.  ఇది మూత్ర పిండాల సంబంధిత  సమస్యలకు దారితీస్తుంది.   మానవ శరీరంలో ముఖ్యమైన అవయవాలలో మూత్రపిండాలు చాలా ప్రముఖమైనవి. మూత్రాన్ని ఎక్కువసేపు పట్టి ఉంచడం వల్ల మూత్రాశయం బలహీనంగా మారుతుంది.  మూత్రాశయ కండరాలు బలహీనం అవుతాయి.  ఇది మూత్రం లీకేజికి దారి తీస్తుంది.  ఇది చాలా ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యగా మారే అవకాశం ఉంటుంది. ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకోవడం వల్ల మూత్రంలోని మలినాలు, విసర్జక పదార్థాలు కలిసి గట్టిపడి రాళ్లుగా మారే అవకాశం ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి దారి తీస్తుంది.  ఈ సమస్య కిడ్నీలను మరింత ప్రమాదానికి గురిచేస్తుంది.  అందుకే మూత్రాన్ని ఆపుకోవడం అస్సలు మంచిది కాదు.                                  *రూపశ్రీ.  

చలికాలంలో నిండుగా దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?

ప్రతి ఏడాది ఎండలు పెరుగుతున్నట్టే చలి కూడా పెరుగుతోంది.   చివరి ఏడాది కంటే ఈ ఏడాది చలి తీవ్రత కూడా పెరిగింది.  చలి ఉదయం, రాత్రి వేళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది నిజానికి చాలా మంది నిద్రించే సమయం.  చలి ఎక్కువగా ఉన్నప్పుడు వెచ్చగా పడుకోవాలని అందరూ అనుకుంటారు. దీనికి తగ్గట్టే మందంగా ఉన్న దుప్పటిని నిండుగా కప్పుకొని పడుకుంటారు.  ఇలా పడుకున్నప్పుడు ఏకంగా ముఖాన్ని కూడా పూర్తీగా కవర్ చేసుకుని పడుకునే వారు ఎక్కువే ఉంటారు.  దీనివల్ల ముక్కు, నోరు, చెవులకు చలితీవ్రత సోకదని అనుకుంటారు. అయితే ఇలా పడుకోవడం మంచిదేనా? దీనివల్ల ఏదైనా ప్రమాదం ఉందా? తెలుసుకుంటే.. చలికాలంలో నిండుగా దుప్పటి కప్పుకోవడం అనే అలవాటు వల్ల చలి నుండి ఉపశమనం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ  ఇలా చేయడం వల్ల  కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉన్న అదే గాలిని పదే పదే పీల్చుకుంటారు. తక్కువ ఆక్సిజన్, ఎక్కువ  కార్బన్ డయాక్సైడ్ ఉన్న గాలిలో నిద్రపోవడం మెదడుకు,  శరీరానికి హానికరం. ఈ అలవాటు నిద్ర నాణ్యతను దెబ్బతీయడమే కాకుండా, కొన్ని శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు,  గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఫుల్ గా దుప్పటి కప్పుకుని నిద్రపోవడం వల్ల  శరీరంలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. ఇది  మెదడు,  గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది.  ఇది మాత్రమే కాకుండా ఇలా నిద్రపోయే అలవాటు ఉన్నవారిలో ఉదయం తలనొప్పి, అలసట,  నోరు పొడిబారడం కూడా జరుగుతుందట.  12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. నోటి నుండి వచ్చే తేమ దుప్పటి  బట్టలో చిక్కుకుపోతుంది. దీని వలన దుప్పటి లోపల వాతావరణం వెచ్చగా,  తేమగా ఉంటుంది. ఈ వాతావరణం ఫంగస్  పెరుగుదలకు అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.  ముఖం మీద ఫుల్ గా దుప్పటి కప్పుకుని నిద్రపోవడం వల్ల ఈ అలెర్జీ కారకాలు నేరుగా ఊపిరితిత్తులలోకి వెళతాయి.  వీటి వల్ల  అలెర్జీలు,  శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెరుగుతుంది. ఆక్సిజన్ సరిగా  లేకపోవడం వల్ల  మెదడు రాత్రంతా విశ్రాంతి లేకుండా ఉంటుంది.   మంచి, గాఢమైన నిద్ర పట్టడం కష్టంగా ఉంటుంది.  ఒకవేళ నిద్ర పట్టినా ఉదయం లేవగానే తలనొప్పి, అలసట వంటివి ఏర్పడతాయి.   CO2కి అధికంగా గురికావడం వల్ల రక్త నాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది హృదయ స్పందన రేటు,  రక్తపోటును ప్రభావితం చేస్తుంది. అందుకే చలికాలంలో వెచ్చదనం కోసం ముఖాన్ని కూడా కప్పుకుని నిద్రపోవడానికి బదులు,  వెచ్చని దుస్తులు,  టోపి, కాళ్లకు సాక్స్ వంటివి ధరించి నిద్రపోవడం మంచిది. మరీ ముఖ్యంగా ఎంత చలి ఉన్నా ఫ్యాన్ ఉండాలి,  కానీ దుప్పటి కప్పుకోవాలి అని అనుకోకూడదు.                                            *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...