గంటలు గంటలు డెస్క్ ముందు పనిచేస్తుంటారా? అయితే ఇది మీ కోసమే..

ఇప్పట్లో ఉద్యోగాలన్నీ కంప్యూటర్ల ముందు కూర్చుని చేసేవే ఎక్కువ. డెస్క్ జాబ్ లేదా ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని ఉద్యోగం చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చాలా పరిశోధనలు చెబుతున్నాయి.  ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాల కారణంగా  లైఫ్ స్టైల్ తటస్థంగా మారుతుంది. ఈ  నిశ్చల జీవనశైలి శారీరక,  మానసిక ఆరోగ్యానికి హాని చేకూరుస్తుంది.  ప్రతిరోజూ 8-10 గంటలసేపు  కూర్చొని పని చేస్తుంటే మాత్రం ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.  డెస్క్ ఉద్యోగాలు ఉన్న వ్యక్తులలో  కాలక్రమేణా తీవ్రమైన నరాల సంబంధిత రుగ్మతలు  ఏర్పడే  ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.  ఇది అల్జీమర్స్ వంటి తీవ్రమైన వ్యాధులను కలిగిస్తుంది.

చిత్తవైకల్యానికి ప్రధాన కారణాలలో ఒకటైన అల్జీమర్స్ వ్యాధి ఇంతకు ముందు వరకు 60 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా వచ్చేది. కానీ   ఈ వ్యాధి ముప్పు  ఇప్పుడు ఎక్కువ సేపు డెస్క్ ముందు కూర్చుని పనిచేసేవారిలో  పెరుగుతోంది.

నిశ్చల జీవనశైలి,  చిత్తవైకల్యం ప్రమాదం..

కొన్ని దశాబ్దాల క్రితం వరకు పెద్దవారిలో చిత్తవైకల్యం లేదా అల్జీమర్స్ వ్యాధి ప్రమాదం చాలా తక్కువగా పరిగణించబడింది.  కానీ కాలక్రమేణా కేవలం పెద్ద వయసులోనే కాకుండా  అన్ని వయసుల వారిలో ఈ ప్రమాదం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రస్తుతం 55 మిలియన్ల మంది అల్జీమర్స్-డిమెన్షియాతో బాధపడుతున్నారు. జీవనశైలి సమస్యల కారణంగా ఈ ప్రమాదం మరింత పెరిగింది. కొన్ని అధ్యయనాల ప్రకారం  ప్రతిరోజూ 10 గంటల కంటే ఎక్కువసేపు కూర్చొని ఉద్యోగం చేస్తే  డిమెన్షియా సమస్య  అభివృద్ధి చెందుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

నిశ్చలంగా పనిచేయడం ప్రమాదం ఎందుకంటే..

అమెరికన్లలో చేసిన ఒక పరిశోధనలో సగం కంటే ఎక్కువ మంది అమెరికన్లు రోజుకు తొమ్మిదిన్నర గంటల కంటే ఎక్కువ సమయం కూర్చొని గడుపుతారు ఈ అలవాటు మెదడు వృద్ధాప్యం,  అభిజ్ఞా  పనితీరు మందగించడం వంటి  వాటితో  ముడిపడి ఉంటుంది. ఒకే చోట ఎక్కువసేపు ఆఫీసులో కూర్చోవడమే కాకుండా, ఎక్కువసేపు కూర్చొని టీవీ  చూడడం, కంప్యూటర్లలో పని చేయడం,  డ్రైవింగ్ చేయడం వంటివి ఉంటాయి.


ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

డిమెన్షియా ప్రమాదాల గురించి అధ్యయనం నిపుణుల ప్రకారం  స్థూలకాయం, అధిక రక్తపోటు,  మధుమేహం వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలకు నిశ్చల జీవనశైలి ఇప్పటికే కారణమవుతోందని  తెలిపారు. దీని కారణంగా ఇప్పుడు చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతోంది.  ఒకే చోట కూర్చుని పనిచేయడం వల్ల శరీరంలో రక్తప్రవాహం మందగిస్తుంది.   ఇది మెదడుకు రక్త ప్రవాహాన్ని తగ్గించడం ద్వారా సెరెబ్రోవాస్కులర్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.

                                                            *నిశ్శబ్ద.