సంవత్సరానికి 15 బిలియన్ డాలర్ల విలువైన పనిచేసే తేనెటీగలు
posted on Dec 10, 2020 @ 9:30AM
తేనెటీగలు అంతరించిపోతే ..
పార్క్ లోనూ... ఎప్పుడైనా పొలాల వైపు వెళ్లినప్పుడో తేనెటీగలను చూస్తాం.
అవి ఎక్కడ కుడ్డతాయో అని భయపడతాం. కానీ, ఆ తేనెటీలు లేకపోతే మనకు ఆహారమే కష్టం అన్న విషయం మాత్రం గమనించం. వాటి మకరందం సేకరణ వెనుక జీవజాతి ఆహారం ఆధారపడి ఉంది అన్నది వాస్తవం.. శివుడి ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదు అన్నది నిత్యసత్యం. తేనెటీగలకు మనం తినే ఆహారానికి ఎంటో సంబంధం అనుకుంటున్నారా..
చాలా ఉంది..
పర పరాగ సంపర్కం.. సైన్సు పాఠ్య పుస్తకాల్లో కనిపించే సామాన్య పదం ఇది. కొన్ని రకాల కీటకాలు ఒక పువ్వు నుంచి మరో పువ్వు మీద వాలినప్పుడు, వాటి కాళ్లకు అంటుకున్న పుప్పొడి రేణువుల ద్వారా పర పరాగ సంపర్కం జరిగి ఆయా మొక్కల ప్రత్యుత్పత్తి జరుగుతుందని ఈ పాఠం చెబుతుంది. అంటే ప్రకృతి పచ్చగా కళకళలాడాలంటే కీటకాల పాత్ర కీలకం. తేనెటీగలు, తుమ్మెదలు, తూనీగలు... ఇవన్నీ కూడా పుప్పొడి వాహక కీటకాలే. పర పరాగ సంపర్క చోదకాలే. ఇలాంటి వాటన్నిటినీ కలిపి ‘పాలినేటర్స్’ అంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక మానవ తప్పిదాల వల్ల క్రమక్రమంగా ఈ ‘పాలినేటర్స్’ అంతరించిపోతున్నాయి. ‘పాలినేటర్స్’ లేని ప్రపంచాన్ని ఊహించడమంటే... పోషకాలనిచ్చే పండ్లు, గింజలు, కూరగాయల మొక్కలు లేని ప్రకృతిని వీక్షించడమే. అందుకే పలు గుణపాఠాల అనంతరం యావత ప్రపంచం అప్రమత్తమయ్యింది. పలు దేశాలు యుద్ధప్రాతిపదికన వీటిని అభివృద్ధి చేయడానికి నడుం బిగించాయి.
తేనెటీగలు మీకు ఇష్టమైన కీటకాలు కాకపోవచ్చు. ఎందుకంటే అవి కుడితే నిజంగా బాధేస్తుంది. అయితే పర పరాగ సంపర్కం జరిపే ముఖ్యమైన కీటక జాతుల్లో తేనెటీగలు అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రపంచ జనాభాకు కావల్సిన ఆహారంలో అధికశాతం ఈ తేనెటీగల పరాగ సంపర్కం ములానే లభిస్తుంది. . కానీ నేడు రికార్డ్ స్థాయిలో ఈ తేనెటీగలు చనిపోతున్నాయి. ఒకవేళ ఈ తేనెటీగలే లేకపోతే, మన ప్రపంచ ఆహార సరఫరా పరిస్థితి ఏమైపోతుంది..? రేపు ఒకవేళ సడన్ గా ఈ భూమిపై ఉన్న తేనెటీగలనీ చనిపోతే పరిస్తితులేం బావుండవు. సమతుల్య ఆహారం కోసం, మానవులకు అవసరమైన పండ్లు, ఇతర కూరగాయలు, మొక్కల పునరుత్పత్తి చేయడానికి, వాటిని పెంచడానికి ఈ పరాగ సంపర్కం అవసరం. ఈ సంపర్కాన్ని తేనెటీగలు బెస్ట్ అని చెప్పవచ్చు. కొన్ని మిలియన్ సంవత్సరాల నుండి పుష్పించే మొక్కలతో కలిసి ఉండటం వల్ల ఇవి పరాగ సంపర్క యంత్రాలుగా
మారిపోయాయి. మనం తినే 84శాతం పంటలను పరాగ సంపర్కం చేయడానికి తేనెటీగలు సహాయపడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇది ఆహార వార్షిక ఉత్పత్తిలో 236 బిలియన్ డాలర్ల నుండి 577 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. ఒకవేళ తేనెటీగలు లేదా పరాగ సంపర్కం చేసే ఇతర కీటకాలు లేకుంటే ఇవాళ ఉండే సూపర్ మార్కెట్లలోని కూరగాయలు, పండ్లు సగం వరకు ఉంటాయి. తేనెటీగల్లో విలుప్త వినాశనకరమైన డొమైన్ ను కలిగివుంటుంది. అది మొక్కలను తినే జంతువులని సంహరించడమే కాకుండా ఫుడ్ చైన్ ను పెంచుతూ పోతుంది. అమెరికన్ వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం తేనెటీగలు మనకు చేసే పని సంవత్సరానికి 15 బిలియన్ డాలర్ల విలువతో సమానం అని లెక్కకట్టింది. ఒకవేళ అవే లేకుంటే మన ఉత్పత్తి ఖర్చు ఆకాశాన్ని అంటుకునేదేమో..?సామాజికంగా, ఆర్థికంగా సవాళ్ళను ఎదుర్కొంటున్న వాళ్ళు సమతుల్యమైన ఆహారాన్ని ఇప్పటికే పొందేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వాళ్లపై మరింత ఘోరమైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
మనం ఊహించిన దానికంటే కూడా తేనెటీగలు తక్కువ స్థాయిలో ఉన్నాయి. 2018 సంవత్సరంలో అమెరికాలోని తేనెటీగల పెంపకందారుల్లో తమ కాలనీలో 45శాతం కోల్పోయామని చెప్పారు. అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా గత దశాబ్ద కాలంగా రికార్డ్ స్థాయిలో తేనెటీగలు చనిపోతున్నాయి. తేనెటీగలు అకస్మాత్తుగా ఇలా తగ్గిపోవడానికి శాస్త్రవేత్తలు కచ్చితమైన కారణాలను కనుగొనలేదు కానీ, గ్లోబల్ వార్మింగ్, అధిక మోతాదులో పురుగుల మందుల వాడకం, తేనెటీగల పెంపకంపై వైరసును వ్యాప్తి చేసే పరాన్నజీవి వర్రోవా వంటి పురుగులు కారణం అని భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తేనెటీగలను పర్యవేక్షణ చేయడానికి, రోబోట్లను ఉపయోగించి కొత్త పరాగ సంపర్క పద్దతులను
రూపొందించడానికి కృషి చేస్తున్నారు.
సగటు మనిషి తేనెటీగలతో స్నేహంగా ఉండటానికి ఏమిచేయవచ్చు అనే ప్రశ్న రావచ్చు. మీకు ఉద్యానవనం ఉంటే అందులో పువ్వులను నాటండి, వాటిపై వాలిన తేనెటీగలు సంవత్సరం పొడవునా అమృతాన్ని ఇస్తాయి. తేనెటీగల్లో స్థానిక తేనెటీగలు, అడవి తేనెటీగలు అని రకాలు ఉంటాయి. కొన్ని మట్టిలో గుడుకట్టుకొని ఉంటాయి. ఒకవేళ మట్టిని చదును చేస్తుంటే తేనెటీగలు ఉన్న వాటిని వదిలివేయడం, ఆ మట్టికి నీళ్ల అందేలా చూడటం, సాధ్యమైతే పురుగుల మందులకు దూరంగా ఉండటం కూడా వాటికి సహాయ పడినట్లే.
ప్రపంచ తేనెటీగల జనాభాను కాపాడటానికి ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నప్పటికీ భూమిని రక్షించు కోవడానికి ఇంకా చేయాల్సింది మాత్రం చాలానే ఉంది.