తమ డబ్బు మొత్తాన్ని కోల్పోయిన 5 మంది బిలియనీర్లు
posted on Mar 17, 2021 @ 9:30AM
సంపద తెలియకుండానే టెంకాయ లోపలి నీరు వచ్చినట్లు వస్తుంది. సంపద తెలియకుండానే ఏనుగు మింగిన వెలగపండులోని గుజ్జువలె మాయమవుతుంది అంటూ సుమతీశతకంలో చెప్పారు. ఈ విషయం కొంతమంది జీవితాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. చాలా తక్కువ సమయంలో కోట్లకు పడగలెత్తిన వారు అంతే తక్కువ సమయంలో పాతాళానికి పడిపోతారు. అలాంటి కొందరు బిలియనీర్ల గురించి తెలుసుకుందాం...
ఐకే బాటిస్టా
బ్రెజిలియన్ వ్యాపారవేత్త, కానీ అతను దురదృష్టవశాత్తు తన డబ్బు మొత్తాన్ని కోల్పోయాడు. మైనింగ్ , చమురు పరిశోధన పరిశ్రమలో రాణించిన అతను రెండు దశాబ్దాల కాలంలో తన వైభవాన్ని దానిని కోల్పోయాడు. 2011 సంవత్సరంలో అతని ఆస్తుల విలువ 30 బిలియన్ డాలర్లు. ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో ఎనిమిదో వ్యక్తిగా నిలిచాడు, బ్రెజిల్‌లో అత్యధిక సంపన్నుడి స్థాయిని అందుకున్నాడు. అయితే మైనింగ్ పరిశ్రమలో అకస్మాత్తుగా పతనం ప్రారంభమైంది. తన అతిపెద్ద కంపెనీలలో ఒకటైన ogx కుప్పకూలింది. ఆ తర్వాత సంపద తగ్గిపోతూ బిలియనీర్ స్థాయి పడిపోయింది. 2013 సంవత్సరంలో, ఫోర్బ్స్ ప్రకారం దాదాపు 20 బిలియన్ల ఆస్తులను అతను కోల్పోయాడు. కేవలం ఒక సంవత్సరంలోనే విపరీతమైన నష్టాలను చవిచూశాడు. ఆ తర్వాత అతని అపారమైన అప్పులు, పడిపోతున్న కంపెనీ స్టాక్ కారణంగా ఆస్తులన్నీ కోల్పోయాడు. తన వ్యక్తిగత సంపదలో ఎక్కువ భాగాన్ని అమ్మేశాడు. 2017 సంవత్సరంలో బ్రెజిల్ అధికారులు అతన్ని 100 మిలియన్ డాలర్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేశారు.
అలెన్ స్టాన్ఫోర్డ్
ఈ వ్యక్తి మాజీ బిలియనీర్, ఫైనాన్షియర్. అయితే ఇప్పుడు మాత్రం శ్రీకృష్టుడి జన్మస్థానంలో ఉన్నాడు. 2009లో అతనికి 110 సంవత్సరాల జైలు శిక్ష ఖరారు కాగా ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్నాడు. ఆర్థిక కుంభకోణంలో దోషిగా నిర్ధారించబడిన తరువాత శిక్ష పడింది. అతను ఇప్పుడు వాడుకలో లేని ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ స్టాన్ఫోర్డ్ ఫైనాన్షియల్ గ్రూప్ చైర్మన్. 136 వివిధ దేశాలలో కనీసం 30,000 మంది ఖాతాదారులలో 8.5 బిలియన్ డాలర్లు ఉన్న సహాయక సంస్థలలో ఒకటి. ఈ సంస్థ 2009 లో ప్రారంభమైంది. అయితే ఈ కంపెనీ ప్రారంభమైన సెకన్ లోనే అలెన్ స్టాన్ఫోర్డ్ పై అన్వేషణ ప్రారంభించింది. 8 బిలియన్ డాలర్ల అధిక దిగుబడి ధృవీకరణ పత్రాలను అక్రమంగా విక్రయించినందుకు అతనిపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. మనీలాండరింగ్, చీటింగ్ తదితర ఆరోపణలతో 2009 జూన్ లో అరెస్ట్ చేశారు. విచారణ తర్వాత 110 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.
ఎలిజబెత్ హోమ్స్
ఎలిజబెత్ అమెరికన్ ఆవిష్కర్త , ఎంటర్ ప్రెన్యూర్, ఆమె హెల్త్ కేర్ టెక్నాాలజీ కార్పోరేషన్ ప్రారంభించిన తర్వాత 2015లో సెల్ఫ్ మెడ్ మహిళా బిలియనీర్ గా రికార్డ్ సృష్టించారు. ఆ సంస్థ 9 బిలియన్ డాలర్ల విలువకు చేరుకోవడంతో పాటు భారీగా లాభాలు ఆర్జించింది. 2015 నాటి 100 మంది అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఆమె పేరు చేరడంతో సెలబ్రిటీ అయ్యారు. ఆ తర్వాత ఎలిజబెత్ కంపెనీపై అన్వేషణ జరిగింది. కొత్త ఇన్వెంటివ్ బ్లడ్ టెస్టింగ్ టెక్నాలజీ గురించి పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆమెపై విశ్వసనీయత, ఆమె వ్యక్తిగత ఆస్తులు రెండూ తగ్గిపోవడం ప్రారంభమైంది. . ప్రపంచంలోని అత్యంత నిరాశపరిచిన నాయకులలో ఒకరిగా హోమ్స్ పేరును ఫోర్బ్స్ పేర్కోంది. మెడికేర్ , మెడిసిడ్ సేవలు అందించే ఆమె కంపెనీలో రెండు సంవత్సరాలు ఎలాంటి పోజిషన్ ఇవ్వలేదు.
బెర్నార్డ్ మాడాఫ్
పోంజీ పథకాలకు(చైన్ లింక్) రూపకల్పన చేసిన వ్యక్తి బెర్నార్డ్. 2008 లో అరెస్టు అయ్యేవరకు దాదాపు 20 ఏళ్ళపాటు మార్కెట్ లో చైన్ లింగ్ సామాజ్యాన్ని పరిపాలించాడు. స్ప్లిట్ స్ట్రైక్ కన్వర్షన్ అనే తన వెంచర్ వ్యూహంతో అతను వేలకొలది బిలియన్ డాలర్ల పెట్టుబడిదారులను విజయవంతంగా మోసం చేశాడు. అతను తన ఖాతాదారులకు అధిక , స్థిరమైన రాబడిని ఇస్తానని వాగ్దానం చేశాడు. తన నిధులను ఒకే బ్యాంకు ఖాతాలో జయ చేయడం ద్వారా కంపెనీ కార్యకలాపాలను నిర్వహించేవాడు. అయితే 2008 ఆర్థిక సంక్షోభ సమయంలో అతని పథకం విఫలమైంది. మార్కెట్లలో ఎక్కువ మంది ఖాతాదారులను ఆకర్షించలేకపోయాడు. ఆ తర్వాత అతని 64.8 బిలియన్ డాలర్ల మోసం బయటపడింది. దాదాపు బిలియన్ డాలర్ల సంపద కూడబెట్టినట్లు అంచనా.
విజయ్ మాల్యా
భారతీయ వ్యాపారవేత్త , మాజీ బిలియనీర్, అతను ప్రస్తుతం ఆర్థిక నేరాల నుంచి తప్పించుకునేందుకు బ్రిటన్ లో తలదాచుకున్నాడు. అతనిని UK నుండి భారతదేశానికి అప్పగించే అంశంపై చర్యలు జరుగుతున్నాయి. విజయ్ మాల్యా 28 ఏళ్ళ వయసులో తన తండ్రి సంస్థను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత వ్యాపారాన్ని విస్తరిస్తూ కింగ్ ఫిషర్ బ్రాండ్ మద్యం మార్కెట్ లోకి తీసుకువచ్చి సంపన్నుల జాబితాలో చేరాడు. మద్యం వ్యాపారాన్ని మల్టీ బిలియన్ డాలర్ల సంస్థగా మార్చాడు. కానీ దురదృష్టవశాత్తు, అతని విమానయాన సంస్థలు నష్టాల బాటపట్టింది. బ్యాంకులతో తీసుకున్న అప్పులు ఎగవేతకు పాల్పడ్డాడు. యునైటెడ్ స్పిరిట్స్ అని పిలువబడే తన సంస్థపై నియంత్రణను కోల్పోయాడు . చైర్మన్ పదవి నుండి తప్పుకోవలసి వచ్చింది. అతని ఆస్తులు వేలం వేయమని ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం అతనిని యూకె నుంచి భారత్ కు రప్పించడానికి చర్చలు జరుగుతున్నాయి.