భూమిని రక్షించే 22 ఆవిష్కరణలు...!
posted on Dec 11, 2020 @ 9:30AM
విపరీతంగా ప్లాస్టిక్ వాడకం వల్ల భూమి ఉష్టోగ్రతలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ కారణంగా వాతావరణంలో వచ్చే పెనుమార్పులు ప్రకృతివైపరీత్యాలకు దారితీస్తున్నాయి. ఆధునిక జీవనశైలిని పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా మార్చేలా అనేక కొత్త కొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. వాటిలో కొన్ని..
1. పాత ప్లాస్టిక్ బాటిళ్లను బల్బులుగా మార్చడం.
నీళ్లు, కూల్ డ్రింక్స్ ఎక్కువగా బాటిల్స్ లోనే లభ్యమవుతున్నాయి. ఇవి అంత త్వరగా భూమిలో కలిసిపోవు. వీటిని రీ యూజ్ చేయడం ద్వారా చాలావరకు పర్యావరణాన్ని రక్షించవచ్చు. పాత ప్లాస్టిక్ బాటిళ్లలో సూక్ష్మమైన సోలార్ పానెల్ లు ఉంచడం వల్ల వీటిని బల్బులుగా మార్చవచ్చు. ఇవి పేద వర్గాల నివాసప్రాంతాలకు విద్యుత్ కాంతిని అందించడానికి వీలుగా ఉంటాయి.
2. తినదగిన వాటర్ బాల్స్
నీళ్ల కోసం ఉపయోగించే ప్లాస్టిక్ బాటిల్స్ ను తగ్గించే ప్రయత్నంలో భాగంగా వచ్చిన ఆవిష్కరణ ఇది. వాటర్ ను బాల్స్ గా అందుబాటులోకి తీసుకురావడంతో ప్లాస్టిక్ బాటిల్స్ ఉపయోగం చాలావరకు తగ్గుతుంది. తినదగిన వాటర్ బాల్స్ ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడానికి సహాయపడతాయి.
3. మిస్టర్ ట్రాష్
నదుల్లో చెత్త పెరుకుపోవడంతో నదీజలాలు, సముద్రజలాలు కలుషితం అవుతున్నాయి. కోట్లాది జలచరాలు ప్రాణాలో కోల్పోతున్నాయి. ఈ ముప్పును తగ్గించడానికి అందుబాటులోకి వచ్చిన ఆవిష్కరణ మిస్టర్ ట్రాష్. ఇది నదుల నుండి చెత్తను తొలగిస్తుంది. కరెంట్ లేదా సోలార్ తో పనిచేసే ఇది బెల్టిమోర్ లో 999 టన్నుల చెత్తను తొలగించింది.
4. ప్లాస్టిక్ రహిత షాంపో పాడ్లను, కరిగే ఫిల్మ్స్ ద్వారా తయారు చేస్తారు. బెంజమిన్ స్ట్రెయిన్ తన 14వ ఏట దీన్ని రూపొందించాడు. కేవలం 5 మిల్లిలీటర్లు ఉన్న ఆ పాడ్ ఎంతటి పొడవైన జుట్టునైన శుభ్రం చేస్తుంది.
5. మెల్లిగా కదిలే నీళ్ళద్వారా టర్బైన్ హార్వెస్ట్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. దీని కోసం మోటార్ పనిచేయాలంటే అతి తక్కువగా 2mph కరెంటు ఉంటే చాలు.
6. పాత కంటైనర్లును బాగుచేసి, షిప్పింగ్ కంటైనర్ పూల్ ను తయారు చేస్తారు. వాటిలో నీటిని ఫిల్లర్ చేసే పరికరాలు, మెట్లు, డెక్ అన్ని అమర్చబడి ఉంటాయి.
7. సీబిన్ సముద్రంలోని చెత్తను సేకరిస్తుంది. అందులో ఉన్న పంపు నీటి ప్రవాహాన్ని సృష్టించి చెత్త అంతా ఆ బ్యాగ్ లో నిండేలా చేస్తుంది. మరోవైపు నుండి నీరు అంతా బయటకు వెళ్ళిపోతుంది.
8. తినదగిన ఈ స్పూన్లు
చిన్న చిన్న ఫంక్షన్స్ లోనూ ప్లాస్టిక్ స్పూన్లు ఉపయోగిస్తారున్నారు. వీటిని తగ్గించే ప్రయత్నమే తినదగిన స్పూన్లను రూపకల్పన. ఇవి ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గిస్తుంది. అవి వేపర్స్ లాగా రుచిగా ఉంటాయి. వీటిని రైస్, మిల్లెట్స్, గోధుమల నుండి తయారు చేస్తారు.
9.సాల్ట్ వాటర్ బ్రేవరీ
సముద్ర జీవులకు ఆహారంగా తీసుకోవడానికి వీలుగా ప్యాకింగ్ చేస్తుంది. ఉత్పత్తి చేసే రింగ్స్ ను బార్లీ, గోధుమలతో తయారు చేస్తారు. వీటిని జలచరాలు సులభంగా తిన గలవు.
10. ఈ పోర్టబుల్ టర్బైన్ అనేది 24 గంటలూ విద్యుతును ఉత్పత్తి చేస్తునే ఉంటుంది. ఇది 12 kwh వరకు ఉత్పత్తి చేస్తుంది. ఒక ఇంటికి ఇంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. ఇది పర్యావరణ రహితం కూడా.
11. ప్లాస్టిక్ బాటిల్ కట్టర్ అనేది బాటిళ్లను దారాలుగా కట్ చేయడానికి ఉపయోగపడుతుంది. బాటిళ్ల దారాన్ని వేరే రూపంగా ఉపయోగించుకునేందుకు పనికొస్తాయి. కార్లకు కట్టి లాక్కెళ్లాడానికి మొదలైన వాటికి పనికొస్తాయి.
12. ఈ టూత్‌పేస్ట్ మాత్రలు అనేవి ప్యాకేజీలో దొరుకుతాయి. లిండ్సే మెకార్మీస్ వీటిని తయారుచేసింది. వాటిని ఫ్రెష్ గా భద్రపరచాల్సిన అవసరం కూడా లేదు.
13. పాత టైర్లను ముక్కలుగా చేయడం..
పాత టైర్లను ముక్కలుగా చేసే ఈ భారీ యంత్రం టైర్లకు సెకండ్ లైఫ్ ఇస్తుందనే చెప్పవచ్చు. ఇది కాటన్, ఫైబర్, ఉక్కు మొదలైన వాటి నుండి రబ్బరును వేరు చేస్తుంది. ఈ మెటీరియల్ ను తిరిగి ఉపయోగించుకునేలా చేస్తుంది.
14. వాటర్ లిల్లీ..
ఈ చిన్న టర్బైన్ అనేది గ్రిడ్ శక్తిని పెంచుతుంది. ఈ వాటర్ లిల్లీ గాలి లేదా నీటి నుండి శక్తిని సేకరించి విద్యుత్ గా మారుస్తుంది. ఇది ఎటువంటి పవర్ డివైజ్ ను అయినా ఛార్జ్ చేస్తుంది.
15. సోయాబీన్స్ తయారు చేయబడిన పౌడర్ నీటి నుండి మురికిని వేరు చేస్తుంది. దీన్ని మురికినీటిలోనో, పొల్యూషన్ నీటిలోనో మిక్స్ చేస్తే ఆ
మురికినంతా అడుక్కు చేరేలా చేసి నీటిని శుభ్రపరుస్తుంది.
16. ఈ బాల్స్ మానుషుల విసర్జనతో తయారుచేయబడిన బొగ్గులు. మానవ వ్యర్థాలను రెండు మూడు వారాలపాటు గ్రీన్ హౌస్ లో ఎండబెట్టి ఆ తర్వాత వాసనను పోగొట్టడానికి 700 సెంటిగ్రేడ్ దగ్గర వాటిని వేడి చేస్తారు. ఆ తర్వాత బాల్స్ గా తయారుచేస్తారు.
17. ఈ బయోడిగ్రేడబుల్ బ్యాగులు నీటిలో కరిగిపోతాయి. వీటిని దుంపజాతి పంటలైన కర్రపెండలం నుండి తయారు చేస్తారు. నీటిలో అవి కరిగిపోయిన తర్వాత తాగేందుకు ఉపయోగపడతాయి.
18. ఈ వర్ల్పూల్ టర్బైన్బైన్లు చాలా ఇండ్లకు కరెంటును అందిస్తాయి. ఇవి 24 గంటలు విద్యుత్ ను ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి కోసం వీటిని రూపొందించారు.
19. ఈ కంపోస్ట్ బిన్ అనేది చెత్తను గ్యాస్ గా మారుస్తుంది. ఒక లీటరు సేంద్రియ వ్యర్థాలకు 200 లీటర్ల గ్యాస్ ను ఇది ఉత్పత్తి చేస్తుంది. ఈ బిన్ ను ఒక పైప్ ద్వారా ఇంటికి కనెక్ట్ చేసుకోవాలి.
20. ఈ యంత్రం కరెంట్ లేకుండా వాషింగ్ మిషన్ లో బట్టలు ఉతికి పెడుతుంది. దీనికి కావాల్సిందంతా మానవ శక్తి , కొన్ని నీళ్లు. పెడల్ తొక్కడం ద్వారా తిరిగే ఈ యంత్రాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలను లక్ష్యంగా చేసుకొని కనుక్కోబడింది.
21. క్యాప్ స్టవ్ 2 అనేది పొగను తగ్గించే యంత్రం. ఇంధన వినియోగాన్ని సగానికి పైగా తగ్గిస్తుంది. స్టవ్ నుండి పొగ వెలువడటం ద్వారా సంవత్సరంలో 1.5 మిలియన్ మంది ప్రజలు చనిపోతున్నారు.
22. హైడ్రో వీల్ ఒక మైలు దూరం వరకు నీటిని పంపుచేస్తుంది. దీనికి ఎటువంటి విద్యుత్ అవసరం ఉండదు. పైగా దీనికి పెద్దగా మెకానికల్ పార్ట్స్ ఉండవు కాబట్టి సులభంగా మెంటేన్ చేయవచ్చు.