Read more!

ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు గొంతు నొప్పి, వాపు, కఫం అన్ని మటాష్!

 

చలికాలం వచ్చిందంటే చాలారకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వాటిలో ఎక్కువగా  గొంతు, ముక్కు, చెవి సమస్యలే అధికం. ఈ మూడు ఒకదానికొకటి అనుబంధంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా గొంతుకు సంబంధించిన సమస్యలు చాలావరకు చాలా ఇబ్బంది పెడతాయి. తినాలన్నా, తాగాలన్నా, మాట్లాడాలన్నా చెప్పలేనంత ఇబ్బంది ఉంటుంది.  గొంతు నొప్పి, గొంతు పట్టేయడం, గొంతులో పేరుకుపోయిన కఫం మొదలైన సమస్యలనను ఇంటివద్దే సింపుల్ చిట్కాలతో తగ్గించేసుకోవచ్చు. చాలా తొందరగా రిలీఫ్ ఇచ్చే ఈ చిట్కాల గురించి తెలుసుకుంటే..

హెర్బల్ టీ..

గొంతు నొప్పి ఇబ్బంది పెడుతుంటే దానికి హెర్బల్ టీ చక్కని ఉపశమనాన్ని ఇస్తుంది.  ఇందుకోసం చమోమిలే టీ, అల్లం, పిప్పరమెంటు, అతిమధురం వేర్లు వంటి పదార్థాలలో హెర్బల్ టీ చేసుకుని తాగాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గొంతుకు చురుకుదనాన్ని ఇస్తాయి. గొంతువాపు, నొప్పి తగ్గిస్తాయి.

గోరు వెచ్చని తేనె, నిమ్మరసం..

గోరువెచ్చని తేనె, నిమ్మరసం గొంతునొప్పి తగ్గించడంలో ఇతర గొంతు సమస్యలు తగ్గించడంలో సహాయపడతాయి. సహజంగానే గొంతునొప్పికి తేనె దివ్యౌషదంగా పనిచేస్తుంది. తేనె సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. గొంతు ఇన్పెక్షన్లను నయం చేస్తుంది. తేనెతో పాటు ఉపయోగించే నిమ్మకాయలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది  ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది.

ఆహారం..

గొంతు నొప్పి ఉన్నప్పుడు ఆహారం తినాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటి సమయాలలో ఘనాహారం జోలికి వెళ్లకపోవడమే మంచిది. గంజి, జావ వంటి ఆహారాలు గొంతు నొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. పనిలో పనిగా ఆకలి కూడా తీరుస్తాయి.

బెస్ట్ ఆప్షన్..

గొంతునొప్పి వేధిస్తున్నప్పడు దానికి బెస్ట్ ఆప్షన్ గా సూప్ పనిచేస్తుంది. ఇది ఇమ్యునిటీని పెంచడంలోనూ, గొంతునొప్పి తగ్గించడంలోనూ, శరీరానికి శక్తిని ఇవ్వడంలోనూ, గొంతులో కఫాన్ని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. సూప్ తయారీలో ఉపయోగించే మిరియాలు, వెల్లుల్లి, అల్లం వంటివి నొప్పి, మంట తగ్గించడంలోనూ, ఇమ్యూనిటీ పెంచడంలోనూ సహాయపడతాయి. చికెన్ సూప్ లేదా వెజిటబుల్ వంటివి తాగడం వల్ల దగ్గు లాంటి సమస్యలు కూడా మంత్రించినట్టు మాయం అవుతాయి.

గోల్డెన్ మిల్క్..

పసుపు పాలను అందరూ గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు. పేరుకు తగ్గట్టే ఈ పాలు బంగారంలాంటి ఆరోగ్యాన్ని చేకూర్చుతాయి. పసుపు పాలలో యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇమ్యునిటీ తక్కువగా ఉన్నవారు పసుపు పాలను తాగుతూంటే రోగనిరోధక శక్తి బలపడుతుంది. పసుపు పాలలో చిటికెడు పసుపు, కొద్దిగా నల్ల మిరియాల పొడి, తేనె కలిపి తాగితే అద్భుతమైన ఫలితం ఉంటుంది.  

                                                        *నిశ్శబ్ద.