నెల రోజుల పాటు టీ మానేసి చూడండి.. షాకవుతారు..!
posted on Dec 10, 2025 @ 11:51AM
భారతీయులు రిఫ్రెషింగ్ కోసం తీసుకునే పానీయాలలో టీ చాలా ముఖ్యమైనది. ఉదయం లేవగానే బ్రష్ చేసి టీ తాగాలి, టిఫిన్ తినగానే టీ తాగాలి, స్నేహితులతో బయట కలిస్తే టీ తాగాలి, ఆఫీసు వర్క్ లో కాసింత బ్రేక్ కావాలంటే టీ తాగాలి, అన్నింటికి మించి తలనొప్పి వచ్చినా, ఫుడ్ లేటయినా కనీసం టీ అయినా తాగాలి. ఇలా టీ అనేది పానీయంలా కాకుండా ఒక ఎమోషన్ లా మారిపోయింది. అయితే టీ తాగడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు ఆరోగ్య నిపుణులు. మరీ ముఖ్యంగా నెలరోజుల పాటు టీ తాగడం మానేయండి, ఫలితాలు చూసి మీరే షాకవుతారు అని అంటున్నారు. ఇంతకూ నెలరోజుల పాటు టీ తాగడం మానేయడం వల్ల కలిగే మార్పులేంటో తెలుసుకుంటే..
నెలరోజులు టీ తాగడం మానేస్తే..
ఒక నెల పాటు టీ తాగడం మానేయడం వల్ల శరీరం నుండి హానికరమైన సమ్మేళనాలను తొలగించడంలో సహాయపడుతుందట. ఇది కడుపులో యాసిడ్ ఎఫెక్ట్, ఉబ్బరాన్ని తొలగించడమే కాకుండా,శరీర శక్తి స్థిరంగా ఉండేలా చేస్తుందట. ఇలా శరీరంలోపల శుద్ది కావడం శరీరానికి రీసెట్ బటన్ గా పనిచేస్తుంది. నెల రోజుల పాటు టీ తాగడం మానేస్తే నాలుగు ముఖ్యమైన మార్పులు ప్రధానంగా చోటు చేసుకుంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
జీర్ణక్రియ..
టీ మానేయడం వల్ల కలిగే మొట్టమొదటి, అత్యంత ప్రయోజనకరమైన విషయం జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగవ్వడం. టీలోని కెఫిన్, టానిన్లు కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచుతాయి. ఒక నెల పాటు టీ తాగకుండా ఉండటం వల్ల కడుపులో ఆమ్ల స్థాయిలు నార్మల్ అవుతాయి. ఆమ్లత్వం, గుండెల్లో మంట, అజీర్ణం దాదాపుగా తొలగిపోతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ఐరన్ శోషణ..
టీలోని టానిన్లు ఆహారం నుండి ఐరన్ ను గ్రహించడంలో ఆటంకం కలిగిస్తాయి. టీ మానేసిన తర్వాత శరీరం ఆహారం నుండి ఐరన్ ను పూర్తి స్థాయిలో గ్రహిస్తుంది. రక్తహీనత లేదా అలసటతో బాధపడేవారికి ఇది చాలా మెరుగైన ఫలితాలు ఇస్తుంది. టీ మానేయడం వల్ల ఐరన్ గ్రహించే సామర్ఱ్యం పెరుగుతుంది.
మానసిక ఆరోగ్యం..
టీలో కెఫిన్ ఉంటుంది. ఇది నిద్ర హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఒక నెల పాటు టీ తాగకుండా ఉండటం వల్ల నిద్ర చక్రం తిరిగి రికవర్ అవుతుంది. గాఢంగా, నాణ్యమైన నిద్రను పొందడంలో సహాయపడుతుంది. మంచి నిద్ర నేరుగా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక కల్లోలం, ఒత్తిడిని తగ్గిస్తుంది.
చర్మం, దంతాల ఆరోగ్యం..
టీలోని టానిన్లు దంతాల మీద మరకలుగా మారి దంతాల రంగు మారుస్తాయి. టీ తాగడం మానేయడం వల్ల సహజంగా దంతాలు శుభ్రంగా, ప్రకాశవంతంగా కనిపిస్తాయి. శరీరం హైడ్రేషన్ గా ఉండటం, వాపు తగ్గడం మొదలైన వాటి వల్ల పొడిబారడం తగ్గుతుంది. చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...