జ్ఞాపకశక్తికి సూపర్ ఫుడ్స్.. ఇవి తిన్నారంటే బ్రెయిన్ పవర్ మాములుగా ఉండదు..

ఆహారమే ఆరోగ్యం అనే మాట చాలాసార్లు వినే ఉంటారు. అయితే శరీరంలో ఒక్కో అవయవానికి ఒక్కో రకమైన పోషకాలు, విటమిన్లు అవసరం అవుతాయి. ఆయా విటమిన్లు తీసుకుంటేనే ఆయా భాగాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. శరీరంలో ప్రతి అవయం పనితీరు మెదడు మీదనే ఆధారపడి ఉంటుంది. మెదడు సరిగా పనిచేయకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మెదడు పనితీరు మందగిస్తే జ్ఞాపకశక్తి తగ్గుతుంది. చాలావరకు జ్ఞాపకశక్తి తగ్గడం అనేది వయసు పైబడిన వారిలోనే కనిపిస్తుంది. కానీ కొందరిలో మాత్రం చిన్నవయసులోనే జ్ఞాపకశక్తి లోపిస్తుంటుంది. కానీ మెదడుకు శక్తిని ఇచ్చే ఆహారాలు కొన్ని ఉన్నాయి. వాటిని తింటే బ్రెయిన్ సూపర్ ఫాస్ట్ గా పనిచేస్తుంది.

తృణధాన్యాలు..

శనగలు, ఓట్స్, పెసలు, మిల్లెట్స్ మొదలైన తృణధాన్యాలు  తీసుకోవాలి.  వీటిలో ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇవి మెదడుకు మేలు చేస్తాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.

చేపలు..

సాల్మన్, సార్డినెస్ లేదా ట్యూనా వంటి  చేపలను వారానికి ఒకసారి తినాలి. వీటిలో అధిక మొత్తంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది విటమిన్ డి,  ఇతర ఖనిజాలను భర్తీ చేస్తాయి.  ఇది  మెదడుకు అలాగే మొత్తం ఆరోగ్యానికి మంచిది.

బీన్స్..

బీన్స్, కాయధాన్యాలు,  సోయాబీన్స్ మెదడుకు  కావల్సిన  ఆహారంలో ప్రముఖమైనవి.  ఎందుకంటే అవి అధిక మొత్తంలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు,  ఖనిజాలను కలిగి ఉంటాయి. వారానికి కనీసం నాలుగు సార్లు వాటిని తినాలి.

చికెన్

మెడిటరేనియన్,  DASH డైట్‌లతో రూపొందించబడిన మైండ్ డైట్‌ని అనుసరిస్తుంటే వారానికి రెండుసార్లు చికెన్ తినమని సలహా ఇస్తారు. చికెన్ లో  అధిక ప్రోటీన్, విటమిన్లు,  ఖనిజాల  ఉంటాయి.

పచ్చని ఆకుకూరలు..

పచ్చని ఆకు కూరలు ప్రతి వారం 6 సార్లు కంటే ఎక్కువగా తినడం మెదడుకు అలాగే  ఆరోగ్యానికి రెండింటికీ మేలు చేస్తుంది. ఇందులో బచ్చలికూర, బ్రోకలీ, పాలకర, ఆకుకూరలు, పొట్లకాయ,  మెంతులు మొదలైన కూరగాయలు ప్రముఖమైనవి.

బెర్రీలు

బెర్రీలు కొన్నిప్రాంతాలలో మాత్రమే లభ్యమవుతాయి. పైగా ఇవి ఖరీదైనవి. కానీ వారానికి రెండుసార్లు బెర్రీలు తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్,  బ్లాక్బెర్రీస్ వంటి బెర్రీలు  మెదడు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో ఉండే ప్రత్యేక యాంటీ ఆక్సిడెంట్లు మెదడు సామర్థ్యాన్ని పెంచుతాయి.

గింజలు

 గింజలను తీసుకోవడం  మెదడు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.   ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు  యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక రకాల పోషకాలను కలిగి ఉంటాయి. వారానికి 5 లేదా అంతకంటే ఎక్కువ సార్లు నట్స్ తినాలి. వీటి వినియోగం మెదడును చాలా షార్ప్ గా మారుస్తుంది.

                                                    *నిశ్శబ్ద.

Teluguone gnews banner

దీపావళికి...షుగర్ పెరగకుండా స్వీట్లు లాగించాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే..!

భారతదేశంలో డయాబెటిస్ ఉన్నవారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, 45 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు 20% మంది దీని బారిన పడ్డారు. దీని అర్థం భారతదేశంలో 50 మిలియన్లకు పైగా ప్రజలు డయాబెటిస్ కలిగి ఉన్నారు. అయితే డయాబెటిస్ ఉంది కదా అని కొన్ని సంతోషాలు వదిలేసుకోలేం. వాటిలో పండుగ నాడు తీసుకునే ఆహారం ప్రథమ స్థానంలో ఉంటుంది. సాధారణ రోజుల్లో నోరు కట్టేసుకున్నా.. పండుగ రోజుల్లో మాత్రం తప్పనిసరిగా నోటికి రుచులతో వింధు చేయాల్సి వస్తుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు ఆహారం తీసుకునే విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటిది ఏకంగా స్వీట్లు తినాలి,  ఆరోగ్యం పాడవ్వకూడదు అంటే కొన్ని చిట్కాలు పాటించాలి.  అవేంటో తెలుసుకుంటే.. షుగర్  షాక్.. దీపావళి వంటి పండుగల సమయంలో ఇంట్లో చాలా స్వీట్లు ఉంటాయి. రసగుల్లా, గులాబ్ జామున్ లేదా లడ్డులో చక్కెర,  నెయ్యి ఎక్కువగా ఉంటాయి. ఈ ఆహారాలు శరీరంలోకి గ్లూకోజ్‌ను త్వరగా విడుదల చేస్తాయి, దీనివల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది.  డయాబెటిస్ ఉన్నవారిలో ఇది ఇన్సులిన్ సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తే, మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తంలో చక్కెర స్థాయిలు పండుగల సమయంలో 20-30% పెరుగుతాయి. స్వీట్లతో పాటు, వేయించిన చిరుతిళ్లు,  ఒత్తిడి కూడా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అయితే ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఈ సమస్యను నివారించవచ్చు. పండుగ సందర్భంలో స్వీట్లు తినే మార్గం.. ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయకుండా రుచికరంగా ఉండే విధంగా స్వీట్లు  తినడం ముఖ్యం. దీనికి ఉత్తమ మార్గం మితంగా స్వీట్లు తినడం. ఒకేసారి ఎక్కువ స్వీట్లు తినకూడదు.  స్వీట్లు తినడం  కోసం ఒక నిర్దిష్ట సమయాన్ని నిర్ణయించుకోవచ్చు. వాటిని తినడానికి ముందు తగినంత ప్రోటీన్,  ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. అంటే  సలాడ్ లాంటివి  తిన్న తర్వాత కొద్దిగా స్వీట్లు తినవచ్చు. స్వీట్లు తినడానికి మంచి చిట్కాలు.. ఖాళీ కడుపుతో స్వీట్లు తినకూడదు.. ఖాళీ కడుపుతో స్వీట్లు తినడం వల్ల గ్లూకోజ్ త్వరగా రక్తప్రవాహంలోకి విడుదలై చక్కెర పెరుగుదలకు కారణమవుతుంది. కడుపులో కొంత ప్రోటీన్ లేదా ఫైబర్ ఉన్నప్పుడు స్వీట్లు తింటే చక్కెర నెమ్మదిగా విడుదల అవుతుంది. భోజనంలో ముందుగా స్వీట్లు తినకూడదు.. ప్రధాన భోజనానికి ముందు స్వీట్లు తినడం వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. కూరగాయలు, పప్పులు లేదా సలాడ్లు ముందుగా తినడం వల్ల గ్లూకోజ్ శోషణ నెమ్మదిస్తుంది. ఒకేసారి ఎక్కువ స్వీట్లు తినకూడదు.. ఎక్కువ తీపి పదార్థాలు తినడం వల్ల ఇన్సులిన్ పై అకస్మాత్తుగా ఒత్తిడి పడుతుంది. శరీరం దానిని నియంత్రించలేకపోతుంది.  చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. భోజనానికి ముందు ప్రోటీన్, ఫైబర్ తినాలి.. ప్రోటీన్,  ఫైబర్ చక్కెర శోషణను నెమ్మదిస్తాయి. రక్తంలో చక్కెర పెరుగుదలను తగ్గిస్తాయి.  ఇన్సులిన్ బాగా పనిచేయడానికి సహాయపడతాయి. కొవ్వు తక్కువగా ఉండే స్వీట్లను ఎంచుకోవాలి.. డ్రైఫ్రూట్స్,  స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసిన స్వీట్లు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు చక్కెరను నెమ్మదిగా రక్తప్రవాహంలోకి విడుదల చేస్తాయి. అకస్మాత్తుగా  చక్కెర పెరగడాన్ని నివారిస్తాయి. కొవ్వు లేకుండా చక్కెర మాత్రమే ఉన్న స్వీట్లు వద్దు.. కొవ్వు లేకుండా చక్కెర మాత్రమే ఉన్న స్వీట్లు రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతాయి. ఇది ఇన్సులిన్ నిరోధకత,  బరువు పెరగడానికి దారితీస్తుంది. కృత్రిమ తీపి పదార్థాలు కలిగిన స్వీట్లు వద్దు.. కృత్రిమ తీపి పదార్థాలు కొంతమందిలో గ్లూకోజ్ జీవక్రియను ప్రభావితం చేస్తాయి. సహజమైన,  తక్కువ చక్కెర కలిగిన స్వీట్లు మంచివి. పడుకునే ముందు స్వీట్లు తినకూడదు.. రాత్రిపూట రక్తంలో చక్కెర తక్కువగా ఉంటుంది. రాత్రి స స్వీట్లు తినడం వల్ల ఉదయం హైపర్గ్లైసీమియా వస్తుంది. నిద్రలో ఇన్సులిన్ స్థాయిలు  సరైనవి కావు. భోజనం తర్వాత 1 టీస్పూన్ వెనిగర్ తీసుకోవాలి..  ఎక్కువగా స్వీట్లు తిన్నట్లయితే.. తిన్న తర్వాత అర కప్పు నీటిలో ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి త్రాగాలి. ఇది రక్తంలో చక్కెర వేగంగా పెరగకుండా నిరోధిస్తుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా మెరుగుపరుస్తుంది.                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

వాటర్ చెస్ట్ నట్స్.. ఆరోగ్యానికి ఎంత గొప్ప ఔషదమో..!

  సీజన్‌ను బట్టి మార్కెట్లో వివిధ రకాల పండ్లు లభిస్తాయి. వాటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా ఆ సీజన్ లో వచ్చే  అనారోగ్యాలకు ఆ సీజన్ లో లభించే పండ్లే చెక్ పెడుతుంటాయి.  వీటిలో ఒకటి వాటర్ చెస్ట్‌నట. ఇది  శీతాకాలపు సూపర్‌ఫుడ్‌.  ఇతర సీజన్ లలో డ్రై ఫ్రూట్ రూపంలో కూడా లభిస్తుంది. వాటర్ చెస్ట్ నట్ ఆరోగ్యానికి చాలా చక్కని ఔషదం అని, దీంతో అనేక ఆరోగ్య ప్రయోజాలు ఉన్నాయని అంటున్నారు. దీని గురించి  తెలుసుకుంటే.. వాటర్ చెస్ట్ నట్ లో పోషకాలు.. ఈ పండులో అనేక విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు,  యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వాటర్ చెస్ట్‌నట్‌లను తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. దీనిలోని ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు,  యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని వివిధ వ్యాధుల నుండి రక్షించడంలో,   ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పాత్ర పోషిస్తాయి.   ఆయుర్వేదంలో వాటర్ చెస్ట్ నట్స్ కు చాలా   ప్రాముఖ్యత కలిగి ఉంది, ఈ పండు రుచిగా మాత్రమే కాదు, ఆరోగ్య ఔషధం కూడా. పిసిఓఎస్ మహిళలకు.. PCOS, లేదా పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనేది  హార్మోన్ సమస్యల వల్ల వచ్చే  సమస్య. దీనిలో హార్మోన్ల స్థాయిలు అసమతుల్యమవుతాయి,  అండాశయాలలో తిత్తులు ఏర్పడతాయి. ఇది నెలసరి సరిగా రాకపోవడం,  పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు, , అవాంఛిత రోమాలు, మొటిమలు,  బరువు పెరగడం వంటి లక్షణాలకు దారితీస్తుంది.  PCOSతో బాధపడేవారు వాటర్ చెస్ట్‌నట్‌లను తినడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఇది హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది,  సంతానోత్పత్తికి సపోర్ట్  ఇస్తుంది. డయాబెటిస్.. వాటర్ చెస్ట్‌నట్‌లు డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది, ఇది చక్కెర పెరుగుదలను నివారిస్తుంది . వీటిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం సులభం చేస్తుంది. జీర్ణక్రియ.. వాటర్ చెస్ట్‌నట్‌లు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.  ఎందుకంటే వాటిలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు సపోర్ట్  ఇస్తుంది. జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.  వీటిని తినడం వల్ల అసిడిటీ,  గుండెల్లో మంట నుండి ఉపశమనం లభిస్తుంది. ఎముకలు, జుట్టు ఆరోగ్యం.. వాటర్ చెస్ట్‌నట్‌లు ఎముకలు, జుట్టు ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి. వాటర్ చెస్ట్‌నట్‌లలో కాల్షియం, మెగ్నీషియం,  భాస్వరం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా,  బలంగా ఉంచడానికి సహాయపడతాయి. దంతాలు,  జుట్టును కూడా బలోపేతం చేస్తాయి. బలహీనత, అలసట.. వాటర్ చెస్ట్‌నట్‌లను తీసుకోవడం వల్ల సాధారణ బలహీనత,  అలసట నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ పండు శరీరానికి సమృద్ధిగా పోషణను అందిస్తుంది, ఎనర్జీని  పెంచుతుంది.                       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

వాల్నట్స్ తింటే ఈ ప్రయోజనాలు అన్నీ మీ సొంతం..!

  బాదం, జీడిపప్పు లాగా వాల్నట్స్ ను కూడా చాలామంది డ్రై ఫ్రూట్ గా తింటారు.  ఇవి ధర కాస్త ఎక్కువే కానీ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.  మెదడు ఆకారాన్ని పోలి ఉండే ఈ వాల్నట్స్ ను రెగ్యులర్ గా డైట్ లో భాగం చేసుకుంటే అద్బుతమైన ప్రయోజనాలు ఉంటాయి. సాధారణంగా ఎండు వాల్నట్స్ మాత్రమే ఎక్కువ అందుబాటులో ఉంటాయి. కానీ నిజానికి వాల్నట్స్ ను పచ్చిగా ఉండగానే తింటే దాదాపు వెనీలా సువాసనతో చాలా రుచిగా ఉంటాయి.  అసలు వాల్నట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. బ్రెయిన్ పవర్.. చూడ్డానికి అచ్చం మెదడు ఆకారాన్ని, మెదడుకు ఉన్న మలుపులను పోలి ఉండే వాల్నట్స్ తింటే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. వాల్నట్స్ లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.  ఇవి జ్ఞాపకశక్తిని,  ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుతాయి. మెదడు ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి వాల్నట్స్ బాగా సహాయపడతాయి. గుండె ఆరోగ్యం.. వాల్నట్స్ లో ఉండే ఒమేగా-3 ప్యాటీ కొవ్వులు ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందినవి.  ఇవి గుండెకు చాలా అవసరం.  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయి.  ముఖ్యంగా ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి అందుతూ ఉంటే.. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కూడా నెమ్మదిగా తగ్గుతుంది.  అంటే.. వాల్నట్స్ తింటే చెడు కొవ్వులను కూడా తగ్గించుకోవచ్చు. ఫైబర్, ప్రోటీన్.. వాల్నట్స్ లో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి.  ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. వీటిని తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీల్ ఇస్తుంది. పదే పదే ఆకలి కావడం,  ఎక్కువగా తినడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. తద్వారా బరువు కూడా తగ్గవచ్చు. జీర్ణక్రియ.. వాల్నట్స్ లో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది.  ఇది జీర్మవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. బోన్ స్ట్రెంత్.. వాల్నట్స్ లో కాల్షియంతో పాటు ఇతర ఖనిజాలు కూడా ఉంటాయి.  ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండటంలో కూడా సహాయపడతాయి. మానసిక ఆరోగ్యం.. వాల్నట్స్ లో ఉండే సమ్మేళనాలు మానసిక స్థితిని మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడతాయి.  ఇవి మెదడు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి కాబట్టి మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతాయి.  చిరాకు, అసహనం,  ఒత్తిడి వంటి వాటిని అదుపులో ఉంచుకునే దిశగా మెదడుకు ఓదార్పును ఇస్తాయి. హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. నిద్ర.. వాల్నట్స్ లో మెలటోనిన్ అనే పదార్థం ఉంటుంది.  ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సాయంత్రం వాల్నట్స్ తింటే రాత్రి సమయంలో హాయిగా నిద్రపోవచ్చు. ఇమ్యూనిటీ.. వాల్నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  ఇవి శరీరంలో హానికరమైన కణాలతో పోరాడి శరీరాన్ని వ్యాధుల బారి నుండి రక్షిస్తాయి.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

హాయిగా నిద్రపోవడం మంచిదే.. కానీ అతిగా నిద్రపోతే ఈ జబ్బులు తప్పవట..!

నిద్ర దివ్యౌషధం అంటారు.  ఆరోగ్యకరమైన నిద్ర శరీరం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది.  ప్రతి వ్యక్తికి రోజుకు 7 నుండి 8 గంటల నిద్ర  కచ్చితంగా ఉండాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే హాయిగా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కదా అని మరీ అతిగా నిద్రపోవడం ఆరోగ్యానికి చేటు చేస్తుందట. అతిగా నిద్రపోవడం వల్ల కొన్ని జబ్బులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే.. ఊబకాయం.. అతిగా నిద్రపోవడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుంది.  ఎక్కువ సేపు నిద్రపోయే వారు శారీరక కష్టం ఏమీ చేయని వారై ఉంటారు.  ఎందుకంటే ఎక్కువ నిద్రపోయే అలవాటు ఉన్నవారు వృత్తి కార్యకలాపాలు నిర్వర్తించడం, చిన్న పనులు చేయడాన్నే పెద్దగా ఫీలైపోతారు.  శారీరక శ్రమ,   వ్యాయామం,  ఇతర విషయాలు, పనులను కూడా వాయిదా వేస్తుంటారు. దీనివల్ల దీర్షకాలిక వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. జీవక్రియ.. ఎక్కువ సేపు నిద్రపోయే వారిలో జీవక్రియ మందగిస్తుంది.  బరువు  పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది.  శరీరంలో కేలరీలను బర్న్ చేసే అవకాశం ఉండదు.  జీర్ణక్రియ సరిగా లేకపోవడం వల్ల ఇతర సమస్యలు కూడా పెరుగుతాయి. గుండె.. ఎక్కువ సేపు నిద్రపోవడం గుండెకు ప్రమాదం అని వైద్యులు అంటున్నారు.  ఎందుకంటే ఎక్కువ సేపు నిద్రపోవడం అనేది రక్తప్రసరణను నెమ్మదిస్తుంది.  ఈ కారణంగా గుండెకు రక్తప్రసరణ తగ్గి గుండె జబ్బులు,  హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎంతసేపు.. రోజుకు 7 గంటల నిద్రపోవడం ఆరోగ్యకరం.  7 గంటల కంటే ఎక్కువ అయినా 9 గంటలు నిద్రపోవడం ఆరోగ్యమే.. కానీ 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోయే వారికి స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలా 9 గంటలు నిద్రపోయే వారిలో 46శాతం ఎక్కువగా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుందని పరిశోధనలలో తేలింది. థైరాయిడ్.. అధిక నిద్ర కారణంగా థైరాయిడ్ సమస్యలు,  అతిగా తినడం అనే సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుందట.  వీటి కారణంగా అధిక బరువు,  ఊబకాయం,  డయాబెటిస్ కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.                                       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధి గురించి తెలుసా...

శరీరంలో ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు ప్రధానమైనవి.  వీటిని శరీర వడపోత యంత్రాలు అని అంటారు.  ఇవి నిరంతరం శరీరంలో రక్తాన్ని వడగట్టి మలినాలను,  అదనపు నీటిని తొలగించి మూత్రాన్ని తయారు చేస్తాయి.  అయితే ఈ మూత్రపిండాల పనితీరు దెబ్బతింటే రక్తంలో మలినాలు,  అదనపు నీరు వంటివి అలాగే ఉండిపోయి అది అనేక సమస్యలకు దారితీస్తుంది.  కానీ నేటి కాలంలో జీవనశైలి వల్ల  కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయి.  కిడ్నీ పనితీర దెబ్బతిన్నప్పుడు డయాలసిస్ చేస్తారు.  అసలు డయాలసిస్ అంటే ఏంటి? డయాలసిస్ ద్వారా ఎన్నేళ్ళు బ్రతకవచ్చు? 19 ఏళ్లుగా డయాలసిస్ చేయించుకుంటూ ప్రాణం నిలబెట్టుకుంటున్న ఒక పేమస్ వ్యక్తి  ఉన్నారు.  ఆయన ఎవరు? ఈ విషయాలు తెలుసుకుంటే.. ప్రేమానంద్ మహారాజ్ తెలుసా? ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ గురించి చాలామంది వినే ఉంటారు. ఈయన కిడ్నీ సమస్యల కారణంగా డయాలసిస్ పొందుతున్నారు.  అది కేవలం ఒకటి, రెండు కాదు.. దాదాపుగా 19ఏళ్ల నుండి ఆయన డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. దైవమే తన ప్రాణాన్ని నిలబెడుతున్నాడు అనేది ఆయన చెప్పే విషయం.   చాలామంది  కిడ్నీ సమస్యలు ఉన్నాయని తెలిసినా,  కిడ్నీ పనితీరు దెబ్బతిన్నదని తెలిసినా,  డయాలసిస్ చేయించుకోవాలి అనే మాటను డాక్టర్లు చెప్పినా చాలా బెంబేలు పడిపోతుంటారు. కానీ డయాలసిస్ చేయించుకుంటూ కూడా చాలా ఏళ్లు ఆరోగ్యంగా ప్రాణాలతో ఉండవచ్చని ప్రేమానంద్ మహారాజ్ నిరూపిస్తున్నారు. పాలిసిస్టిక్ కిడ్నీ సమస్య.. పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధిలో మూత్రపిండాలలో సిస్ట్‌లు అని పిలువబడే చిన్న, నీటిలాంటి సంచులు ఏర్పడతాయి. ఈ సిస్ట్‌లు పెరిగేకొద్దీ, మూత్రపిండాల పరిమాణం కూడా పెరుగుతుంది.  ఈ ఒత్తిడి కారణంగా మూత్రపిండాలు పనిచేయడం మానేస్తాయి. పాలిసిస్టిక్ తిత్తులు అధిక రక్తపోటు,  మూత్రపిండాల వైఫల్య ప్రమాదాన్ని పెంచుతాయి. ఇది సాధారణంగా వారసత్వంగా వస్తుంది. అంటే వంశపారంపర్య సమస్యగా చెప్పవచ్చు. డయాలసిస్ అంటే.. ఒక వ్యక్తి మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే డయాలసిస్ అవసరం. మూత్రపిండాల పని రక్తం నుండి మలినాలు,  విషాన్ని తొలగించడం, తరువాత అవి మూత్రం ద్వారా బయటకు పోయేలా చేస్తాయి. అవి యూరియా, క్రియాటినిన్,  ఆమ్లం వంటి మలినాలను ఫిల్టర్ చేస్తాయి. శరీరం సరిగ్గా పనిచేయడానికి డయాలసిస్ ఈ పనిని నిర్వహిస్తుంది. డయాలసిస్ ఎవరికి అవసరం? ఒక వ్యక్తి మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు  లేదా దాదాపు పూర్తిగా పనిచేయనప్పుడు డయాలసిస్ అవసరమవుతుంది. మూత్రపిండాల వైఫల్యానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిలో మధుమేహం  అధిక రక్తపోటు సర్వసాధారణం. డయాలసిస్ ఎవరికి అవసరం? ఒక వ్యక్తి మూత్రపిండాలు చివరి దశకు చేరుకున్నప్పుడు లేదా దాదాపు పూర్తిగా పనిచేయనప్పుడు డయాలసిస్ అవసరమవుతుంది. మూత్రపిండాల వైఫల్యానికి అనేక కారణాలు ఉన్నాయి, వాటిలో మధుమేహం మరియు అధిక రక్తపోటు సర్వసాధారణం. మూత్రపిండ వైఫల్యం సంభవించి డయాలసిస్ చేయకపోతే, యూరియా వంటి విషపదార్థాలు రక్తంలో పేరుకుపోతాయి. ఇవి క్రమంగా శరీరాన్ని విషపూరితం చేస్తాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే, కొన్ని రోజులు లేదా వారాలలో మరణించవచ్చు. హీమోడయాలసిస్ అంటే.. ఇది అత్యంత సాధారణ పద్ధతి. ఒక యంత్రం రక్తాన్ని శుభ్రపరుస్తుంది. ఇది చేతిలోని సిర నుండి రక్తాన్ని తీసుకుంటుంది. ఈ రక్తం డయలైజర్ అనే కృత్రిమ మూత్రపిండం ద్వారా వెళుతుంది, ఇది మలినాలను తొలగిస్తుంది. శుద్ధి చేసిన రక్తం శరీరానికి తిరిగి వస్తుంది. చాలా మంది ఈ చికిత్సను వారానికి మూడు సార్లు చేయించుకుంటారు. డయాలసిస్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? హీమోడయాలసిస్ కొన్నిసార్లు రక్త ప్రసరణ తగ్గడానికి లేదా సిరలో అడ్డంకిని కలిగించవచ్చు. అరుదైన సందర్భాల్లో, సూది బయటకు రావచ్చు, కానీ యంత్రం వెంటనే ఆగిపోతుంది. సూదిని పర్యవేక్షించడానికి వైద్య సిబ్బంది ప్రక్రియ అంతటా అప్రమత్తంగా ఉంటారు. డయాలసిస్ చాలా బాధాకరంగా ఉంటుందా.. హీమోడయాలసిస్ సమయంలో సూదిని చొప్పించినప్పుడు కొంచెం గుచ్చుతున్న అనుభూతిని ఉండవచ్చని వైద్యులు చెబుతారు. కానీ డయాలసిస్ ప్రక్రియ బాధాకరమైనది కాదని వైద్యుల అభిప్రాయం. డయాలసిస్ మీద  ఎంతకాలం జీవించవచ్చు.. ఇది పూర్తిగా వ్యక్తి వయస్సు,  మొత్తం ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. మూత్రపిండాల వైఫల్యానికి కారణం కూడా ఒక ప్రధాన కారకంగా ఉంటుంది. కొంతమంది డయాలసిస్ మీద చాలా సంవత్సరాలు జీవిస్తారు.  సాధారణంగా 5-10 సంవత్సరాలు జీవిస్తారు. కొంతమంది 20, 30 సంవత్సరాలు కూడా జీవిస్తారు. డయాలసిస్ తో  సాధారణ జీవితం గడపవచ్చా..? మొత్తం ఆరోగ్యం బాగుండి, మూత్రపిండాలు మాత్రమే దెబ్బతిన్నట్లయితే, చాలా మంది డయాలసిస్‌లో ఉన్నప్పుడు చురుకైన జీవితాన్ని గడపవచ్చు. రోజువారీ  పనులు కొనసాగించవచ్చు,                                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

అసిడిటీ మందులు ఎక్కువగా వాడటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

  గుండెల్లో మంట,   కడుపులో మంట వంటి లక్షణాలు చాలా మంది ఎదుర్కుంటూ ఉంటారు.  ఇదే అసిడిటీ.. ఈ సమస్య వచ్చినప్పుడు చాలా మంది సింపుల్ గా మెడికల్ స్టోర్ లో టాబ్లెట్లు లేదా సిరప్ వంటివి తెచ్చి వాడుతూ ఉంటారు. ఇవి వాడినప్పుడు ఉపశమనం కూడా ఉంటుంది.  కానీ అసిడిటీ మందులు ఎక్కువగా వాడటం వల్ల చాలా ప్రమాదకరమన సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందని వైద్యులు అంటున్నారు.  అవేంటో.. అసలు అసిడిటీ ఎందుకు వస్తుందో.. దీనికి పరిష్కార మార్గాలేంటో తెలుసుకుంటే.. అసిడిటీ సమస్య వచ్చినప్పుడు చాలా మంది మెడికల్ స్టోర్ లో మందులు తెచ్చుకుని వాడుతూ ఉంటారు. వీటిలో ఒమెప్రజోల్ అనేది చాలా ముఖ్యమైనది.  ఈ ఔషధం భారతదేశంలో వివిధ పేర్లతో పిలవబడుతుంది. ఇది అనేక బ్రాండ్లను కూడా కలిగి ఉంది. అసిడిటీ సమస్య ఉపశమనం కు వాడే మందులు కడుపులో ఆమ్లాన్ని తగ్గిస్తాయట.  ఇది మంచి బ్యాక్టీరియాను కోల్పోవడానికి,  సి.డిఫిసిల్ వంటి హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు దారి తీస్తుందట. దీని వల్ల కలిగే ఇన్పెక్షన్ ప్రేగులను ప్రభావితం చేస్తుంది.  దీని వల్ల విరేచనాలు,  కడుపునొప్పి, జ్వరం,  శరీరం డీహైడ్రేట్ కు గురికావడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు..  విటమిన్-బి12 లోపం,  ఎముకలు బలహీనపడటం, మూత్రపిండాల సమస్యలు వంటి ఇతర ప్రమాదాలు కూడా వస్తాయని అంటున్నారు వైద్యులు. అసిడిటి మందులు ఎక్కువగా వాడితే ఎవరికి ఎక్కువ ప్రమాదం.. అసిడిటీ మందులు ఎక్కువగా వాడటం వల్ల ప్రమాదం ఉన్నప్పటికీ .. కొందరికి ఈ ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులు. చాలా కాలంగా మందులు వాడుతున్న వ్యక్తులు. వృద్ధులు. మూత్రపిండాలు లేదా కాలేయ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు. ఇతర మందులు తీసుకునే వ్యక్తులకు అసిడిటీ మందులు ఎక్కువగా వాడటం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అసిడిటీకి సహజమైన నివారణలు.. ఎక్కువ నూనె పదార్థాలు, మసాలా పదార్థాలు, కారం ఎక్కువ ఉన్న పదార్థాలు తినడం తగ్గించాలి. రాత్రి నిద్రపోవడానికి కనీసం 2 నుండి 3 గంటల ముందుగా భోజనం  ముగించడం వల్ల అసిడిటీ రాకుండా జాగ్రత్త పడవచ్చు. బరువును అదుపులో ఉంచుకోవాలి. ధూమపానం, మద్యపానం కు దూరంగా ఉండాలి. అలాంటి అలవాట్లు ఉంటే మానేయాలి. ఆహారం తీసుకున్న ప్రతి సారి జస్ట్ ఒక 5నిమిషాల సేపు వాకింగ్ చేయడం మంచిది. యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు రోజులో కొద్దిసేపు ప్రాక్టీస్ చేయాలి. ప్రోబయోటిక్ ఆహారాలు బాగా తీసుకోవాలి. రోజువారీ తీసుకునే ఆహారంలో ఫైబర్ బాగుండేలా జాగ్రత్త పడాలి. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి మందులు వేసుకోకూడదు.  అలాగే ఏదైనా సమస్య  ఎక్కువ ఉంది కదా అనే ఉద్దేశ్యంతో డాక్టర్ చెప్పిన మోతాదు కంటే ఎక్కువ డోస్ లో మందులు వాడకూడదు. అసిడిటీ సమస్య పదే పదే వస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.                                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  

పప్పు ధాన్యాలు ఉడికించిన నీటి పవర్ తెలుసా?

పప్పు ధాన్యాలు భారతీయుల ఆహారంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పప్పు, సాంబార్, రసం,  కిచిడి.. ఇవి మాత్రమే కాకుండా చాలా రకాల పిండి వంటల తయారీలో కూడా పప్పు ధాన్యాలు బాగా వాడతారు. వీటిలో ముఖ్యంగా శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు.. ఇవన్నీ చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే కొంతమంది పప్పు ఉడికించిన తర్వాత నీరు ఎక్కువ   ఉంటే ఆ నీటిని పడేస్తుంటారు. కానీ ఈ నీటి పవర్ తెలిస్తే షాకవుతారు.  ఇంతకీ ఈ నీటి ప్రయోజనాలు ఏంటి తెలుసుకుంటే.. జీర్ణక్రియ.. పప్పు ధాన్యాలు ఉడికించిన నీరు తేలికగా ఉంటుంది. ఇది చాలా సులభంగా జీర్ణమవుతుంది. ఇది మలబద్దకం,  గ్యాస్,  అజీర్ణం వంటి కడుపు సంబంధ సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. పోషకాలు.. పప్పు ఉడికించిన నీటిలో ఏముంటుంది ఇదంతా జస్ట్ వాటర్ కదా అని అనుకుంటారు చాలా మంది.  కానీ ఈ నీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.  ఈ నీరు శరీరానికి పోషణను అందించే ప్రోటీన్, విటమిన్లు, ఐరన్,  పోలేట్, మెగ్నీషియం వంటి ఖనిజాలు కలిగి ఉంటుంది. బలం.. పప్పు ఉడికించిన నీరు తేలికగా ఉండటం,  జీర్ణానికి సులువుగా ఉండటం వంటి కారణాల వల్ల  ఆరోగ్యం బాగాలేనప్పు ఈ నీరు చాలా బాగా సహాయపడుతుంది.  ఇది శరీరానికి తక్షణ శక్తి ఇస్తుంది.  అలసట, నీరసం నుండి ఉపశమనం ఇస్తుంది. బరువు.. పప్పు ఉడికించిన నీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి.  ప్రోటీన్లు సమృద్దిగా ఉంటాయి.  ఈ కారణం వల్ల  ఇది ఒకవైపు కడుపు నిండుగా ఉంచుతూ మరొకవైపు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఆకలిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి.. పప్పు ఉడికించిన నీటిలో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో, బలంగా మార్చడంలో సహాయపడతాయి. హైడ్రేట్.. పప్పు ఉడికించిన నీరు నీటికి సంబంధిన సోర్స్ కావడం వల్ల ఈ నీరు తీసుకోవడం వల్ల శరీరానికి అదనపు నీరు అందించినట్టు అవుతుంది.  దీని వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా హైడ్రేట్ గా ఉంటుంది.  పిల్లలకు బెస్త్.. చిన్న పిల్లలకు చిన్నగా ఉన్నప్పుడ ఎక్కువ ఘనంగా ఉన్న ఆహారం ఇవ్వలేము. అలాంటప్పుడు పప్పు ఉడికించిన నీరు చాలా బాగా సహాయపడుతుంది. పిల్లలకు పోషణ, ఎముకలు బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది.                                        *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ పండ్లు తింటే భలే ఆరోగ్యం..!

  పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.   చాలా మంది  పండ్లను సలాడ్లు, జ్యూస్‌లు,  షేక్‌ల రూపంలో తీసుకుంటారు.ఒక్కోరకమైన పండు తినడం వల్ల ఒక్కో ప్రయోజనం లభిస్తుంది.  కానీ కొన్ని పండ్లు ఖాళీ కడుపుతో తింటే వాటి ప్రయోజనాలను రెట్టింపుగా లభిస్తాయి.  ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈ మధ్యకాలంలో పండ్లు అంటే కేవలం ఉపవాసం ఉన్నప్పుడు లేదా ఆరోగ్యం బాగాలేనప్పుడు తినేవనే  అలవాటు వచ్చేసింది.  అయితే కొన్ని పండ్లు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.  ఆ పండ్లు ఏంటో..అవి కలిగించే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. ఖాళీ కడుపుతో ఏ పండ్లు తింటే ఆరోగ్యానికి డబుల్ బెనిఫిట్స్ ఉంటాయి? ఆపిల్.. జామ.. నేరేడు.. పుచ్చకాయ.. కర్బూజ.. డయాబెటిస్ ఉన్నవారు ఉదయాన్నే పండ్లు తినవ్చచా.. ఖాళీ కడుపుతో పండ్లు తినడం  కంటే వాటిని ప్రోటీన్, కొవ్వు లేదా ఫైబర్ అధికంగా ఉండే ఆహారంతో తినడం ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. ఇలా చేయడం వల్ల, పండ్లలో లభించే చక్కెర పరిమాణం చిన్న ప్రేగులకు నెమ్మదిగా చేరుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరగవు. డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లను ఖాళీ కడుపుతో తినకూడదు.. పుచ్చకాయ.. లి చీ.. అరటిపండు.. మామిడి.. ద్రాక్ష.. ఖాళీ కడుపుతో పండ్లు తినడం ఎందుకు మంచిది? పండ్లలో అనేక విటమిన్లు, ఖనిజాలు,  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కడుపు పూర్తిగా ఖాళీగా ఉన్నప్పుడు, అది పండ్లలో లభించే పోషకాలను బాగా గ్రహిస్తుంది. ఖాళీ కడుపుతో తినకూడని పండ్లు ఏవి? విటమిన్ సి అధికంగా ఉండే కొన్ని పండ్లను ఖాళీ కడుపుతో తినకూడదు. ఖాళీ కడుపుతో వాటిని తినడం వల్ల గ్యాస్, అజీర్ణంతో పాటు అనేక ఇతర సమస్యలు వస్తాయి. శరీరాన్ని డిటాక్స్ చేసే పండ్లు.. కొన్ని పండ్లు శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడతాయి. నిమ్మకాయలు, ఆపిల్, నారింజ,  బెర్రీలు వంటి పండ్లు శరీరాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడతాయి. ఈ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి,  ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి,  కాలేయాన్ని శుభ్రపరుస్తాయి. నిమ్మకాయ నీరు,  పుచ్చకాయ వంటి పండ్లను, ముఖ్యంగా ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల డిటాక్స్  ప్రక్రియ వేగవంతం అవుతుంది.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

భోజనం తర్వాత యాలకులు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే..!

  యాలకులు ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో ఒకటి.  వీటి ధర ఇప్పుడు బాగానే ఉంది.  చాలామంది యాలకులను స్వీట్లు,  ట్రెడిషన్ వంటకాలలోనూ, మసాలా పొడుల తయారీలోనూ, బిర్యానీ వంటి మసాలా వంటకాల తయారీలోనూ వాడుతుంటారు. ఈ సుగంధ ద్రవ్యాలు కేవలం  రుచిని, సువాసనను మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. వీటిలో చాలా ఔషద గుణాలు ఉంటాయి. భోజనం తర్వాత కొందరికి ఏదో ఒకటి నోట్లో వేసుకుని నమిలే అలవాటు లేదా తినే అలవాటు ఉంటుంది.  ఇవి జీర్ణశక్తిని ప్రోత్సహిస్తాయని చెబుతారు. కొందరు సొంపు తింటారు. మరికొందరు తాంబూలం తింటారు. అయితే భోజనం తరువాత ఒక యాలకు నోట్లో వేసుకుని మెల్లిగా నమిలి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో తెలుసుకుంటే.. జీవక్రియను మెరుగుపరుస్తుంది.. యాలకులలో యాంటీ ఇన్ఫమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. భోజనం తర్వాత  యాలకులు తినడం వల్ల  గ్యాస్,  ఆమ్లతత్వం,  మలబద్దకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మౌత్ ప్రెషనర్.. యాలకులు మంచి సువాసన కలిగి ఉంటాయి. ఉల్లి, వెల్లుల్లి లాంటి వాసన కలిగిన ఆహారాలు లేదా మసాలా ఆహారాలు తిన్న తర్వాత నోరు వాసన వస్తూ ఉంటుంది.  అలాంటప్పుడు ఆహారం తిన్న తర్వాత యాలకు తింటే మౌత్ ఫ్రెషనర్ గా పనిచేస్తుంది.  శ్వాసను తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. నిద్రను మెరుగుపరుస్తుంది.. రాత్రి భోజనం తర్వాత పడుకునే ముందు పచ్చి ఏలకులు తినడం వల్ల నిద్ర మెరుగుపడుతుంది. ఇది శరీరంలో  సెరోటోనిన్ స్థాయిలను పెంచి మంచి నిద్రకు సహాయపడుతుంది. రక్తపోటు.. యాలకులు తినడం వల్ల రక్తపోటును కూడా నియంత్రించవచ్చు. యాలకులలో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. కొవ్వును తగ్గిస్తుంది.. యాలకులు ఊబకాయాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.  ఇది శరీరం నుండి టాక్సిన్లను తొలగించి ఊబకాయాన్ని తొలగిస్తుంది. ల్యుకోరియా.. ల్యుకోరియాతో బాధపడుతున్న మహిళలకు యాలకులు ప్రయోజనకరంగా ఉంటాయని చెబుతారు.  రెండు యాలకులను బాగా నమిలి తిని, నీరు తాగడం వల్ల ఉపశమనం లభిస్తుందట. నోటి పూతలు.. నోటి పూతలు ఇబ్బంది పెడుతుంటే యాలకులను నోట్లో వేసుకుని నెమ్మదిగా నమిలి తినాలి. ఇది నోటి పూత నొప్పి, పుండు నుండి ఉపశమనం లభిస్తుంది.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

చేతులు, కాళ్ళలో జలదరింపు ఉంటోందా? ఈ విటమిన్ లోపం ఉన్నట్టే..!

  కొంతమంది కూర్చొన్నప్పుడు, పడుకున్నప్పుడు  చేతులు లేదా కాళ్ళలో జలదరింపుగా ఉంటుందని కంప్లైంట్ చేస్తుంటారు. ఇది సాధారణంగా ఒకే స్థితిలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల నరాల కుదింపు వల్ల సంభవిస్తుంది,  ఇది కాలక్రమేణా తగ్గిపోతుంది. అయితే ఇలా  జలదరింపు  ఉండటాన్ని పదే పదే..  ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా అనుభవిస్తుంటే మాత్రం దాన్ని నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జలధరింపుకు కారణం.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది ఒక ముఖ్యమైన విటమిన్  అయిన విటమిన్ B12 లోపానికి  ప్రారంభం కావచ్చని అంటున్నారు. ఈ విటమిన్ మన నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి చాలా అవసరం. విటమిన్ బి12  లోపం  నరాలు శాశ్వతంగా  నష్టానికి గురికావడానికి కారణమవుతుంది. విటమిన్ బి12 లోపిస్తే.. చేతులు,  కాళ్ళలో జలదరింపు  ఇతర వ్యాధులకుకు కూడా సంకేతంగా ఉంటుంది. వీటిలో  మధుమేహం, విటమిన్ బి12 లోపం, నరాల నొప్పి, రక్త ప్రసరణ సరిగా లేకపోవడం, థైరాయిడ్, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ మొదలైనవి ప్రధానంగా ఉన్నాయి. అయితే   చాలా సందర్భాలలో ఇది విటమిన్ బి12 లోపం వల్ల ఎక్కువగా వస్తుంది.అసలు విటమిన్ బి12 లోపం లక్షణాలు ఎలా ఉంటాయో పూర్తీగా తెలుసుకుంటే.. విటమిన్ బి 12 ఎందుకు ముఖ్యమైనది? విటమిన్-బి12 ను కోబాలమిన్ అని కూడా పిలుస్తారు.  ఇది  శరీరానికి అవసరమైన పోషకం. దీని ప్రాథమిక విధి నరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం,  వాటిని రక్షించే మైలిన్ తొడుగును ఏర్పరచడం. ఇది శరీరమంతా ఆక్సిజన్‌ను మోసుకెళ్ళే ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ బి12 లోపం  నాడీ వ్యవస్థను,  రక్తాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. విటమిన్ బి12 లోపం  ఇతర లక్షణాలు.. విటమిన్ బి12 లోపం ఉన్నప్పుడు చేతులు,  కాళ్ళలో జలదరింపు లేదా తిమ్మిరి మాత్రమే కాకుండా శరీరంలో ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. చాలా అలసటగా,  బలహీనంగా అనిపిస్తుంది. నడుస్తున్నప్పుడు తడబడటం లేదా బాలెన్స్డ్ గా ఉండలేకపోవడం జరుగుతుంది.  తరచుగా నోటి పూతలు, లేదా నోరు, నాలుక ఎర్రగా మారడం జరుగుతుంది. చర్మం కొద్దిగా పసుపు రంగులోకి మారడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, గందరగోళం లేదా చిరాకుగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. విటమిన్-బి12 లోపం ఎవరికి  వచ్చే ప్రమాదం ఎక్కువ.. శాఖాహారులు విటమిన్ బి12 లోపం బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ విటమిన్ సహజంగా మాంసాహార ఆహారాలైన మాంసం, చేపలు, గుడ్లు వంటివాటిలో ఎక్కువ. అలాగే  పాల ఉత్పత్తులలో కూడా ఉంటుంది. వృద్ధులలో కడుపులో జీర్ణరసాలు తగ్గడం వల్ల   పోషకాల శోషణ తగ్గవచ్చు. జీర్ణ వ్యాధులైన క్రోన్'స్ వ్యాధి వంటివి ఉన్నవారికి కూడా విటమిన్ బి12 లోపం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పరిష్కారమేంటి..? మాంసాహారులైతే, గుడ్లు, చేపలు,  మాంసాన్ని  ఆహారంలో చేర్చుకోవచ్చు. శాఖాహారులు పాలు, పెరుగు, జున్ను,  ఇతర పాల ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించవచ్చు. ఫోర్టిఫైడ్ తృణధాన్యాలు, ఈస్ట్,  సప్లిమెంట్ల ద్వారా శాకాహారులు విటమిన్-బి12 పొందవచ్చు.  పైన పేర్కొన్న లక్షణాలను కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. విటమిన్-బి12 లోపాన్ని గుర్తించడానికి ఒక సాధారణ పరీక్ష నిర్వహిస్తారు.  ఈ పరీక్ష అనంతరం విటమిన్-బి12 లోపం ఉంటే.. ఆహారం,  సప్లిమెంట్లు సూచిస్తారు. *రూపశ్రీ.