Read more!

ఒక నాడి వంద తెరఫీలు...

 

నాడి చూడగానే రోగం గుర్తు పట్టేస్తారా ? ఊర్కోండి ఎటి ఉదయాన్నే జోకులు అనుకుంటున్నారా ? నాడీ వైద్యం చేయాలంటే అసలు ఎలా నిర్ధారణ చేస్తారు. రోగికి చేసే పరీక్షలు టేస్ట్లు ఏమిటి? అన్నదే సందేహం కదా .

నాడీ పతి ప్రత్యేకత ఏమిటి ?...

నేటి ఆధునిక తెరఫీలలో శరీరం  ఉన్న వివిదరకాల వ్యాధులను గుర్తించిన తరువాతే చికిత్స చేస్తారు.అయితే నాడీ పతి లో భవిష్యత్తు లో వ్యాధులకు కూడా గుర్తించి వాటిని నయం చేస్తాము అంటున్నారు ప్రముఖ నాడీ పతి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు. ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే మరో అంశం ఏమిటి అంటే గర్భంలో ఉండే పిండం లో వస్తున్న మార్పుల ను గుర్తించడం గర్భంలో ఉన్న పిండం ఏ స్థాయిలో ఉన్నా వాటిని నివారించ వచ్చని అంటున్నారు నాడీ వైద్యులు.వారి ముఖకవళికలు, వారి చేతి వేళ్ళ కదలికలను బట్టి,వారి గోళ్ళను బట్టి వారి ఆరోగ్య స్థితి ని అంచనా వేయవచ్చని  ఒక నిర్ధారణకు రావచ్చని.వారి యొక్క ఏడు తరాల గతం వర్తమానం భావిష్యత్హు ను గుర్తించవచ్చని వాటిని శాస్త్రీయంగా రూపించామని  అంటునారు నాడీ వైద్యులు. 

నాడీ పతి ప్రాముఖ్యత...

మనశరీరం లో గుండె, ఊపిరి తిత్తులు ,మానసిక స్థితి ని పెంచుతుంది. వారిలో శారీరక శక్తిని పెంచే శక్తి నాడీ పతికి ఉందని. చాలా మంది ఎవరైతే పక్ష వాతం రోగులు నాడీ పద్ధతి ద్వారా  పూర్తిగా కోలుకున్నారని. వారు వారి జీవితాన్ని ఆనందంగా గడుపు తున్నారని ఏరకమైన మందులు వాడకం లేకుండా. థైరా యిద్ ను గణనీయంగా తగ్గించగలిగామని అంటున్నారు నాడీ వైద్యులు  కృష్ణం రాజు.
నాడీ పతి ద్వారా ప్రత్యేకంగా  ప్యాం క్రియాస్ స్టి  మ్యులేటింగ్ చేయడం ద్వారా డయాబెటిస్ ను శాశ్వతంగా నియంత్రించ వచ్చు అని అంటునారు డాక్టర్ కృష్ణం రాజు.ఈ పద్ధతి చాలా మందికి అమలు చేసామని గణనీయంగా డయాబెటిస్ ను నియంత్రించ గలిగామని అంటునారు వైద్యులు.సరిగా పనిచేయని మరో అంగం కిడ్నీ దీర్ఘ కాలిక కంగా సరిగా పనిచేయని కిడ్నీ పనితీరును మెరుగు పరి చేందుకు నాడీ పతి వైద్యం ఉపయోగ పడుతుందని అన్నారు.కొన్ని నిమిషాలు గంటల  లోనే అద్భుత చికిత్స చేయవచ్చని ముఖ్యంగా టీనేజి లో లో ఉండే పిల్లలో ఎత్తు పెరగడానికి దీనిని కేవలం 2౩ సంవత్సరాల వరకు చేయవచ్చని తెలుస్తోంది.అలాగే వెన్నుపూస ,వెన్నునొప్పి వంటి సమస్యలు దీర్ఘ కాలిక నరాల సమస్యలు.ఇండో గ్లాండ్స్ సమస్యలు కిడ్నీ లో రాళ్ళ ను తొలగించ వచ్చు.కొన్ని గంటలు లేదా కొన్ని వారాలాలో కిడ్నీలో రాళ్ళూ తొలగించవచ్చు.ఇవి కేవలం మన పూర్వీకులు మనకు అందించిన  సాంప్రదాయ అతి పురాతన మైన తెరఫీ పద్దతులు వీటిని వాడిన వారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు.

నాడీ  పతిని ఎలా నిర్ధారిస్తారు...

నాడీ ద్వారా రోగాన్ని గుర్తించే పద్ధతి కొన్ని ఏళ్లుగా మనపూర్వీకులు మన భారతీయులు రూపొందించిన చికిత్స పద్దతులు.నాడి ఆధారంగా ప్రాధాన భాగం, లేదా మధ్య భాగం, కింది  భాగం ద్వారా  శక్తి సమగ్ర సమాచారం మనం  తెలుసుకోవచ్చు.మనం వ్యాధి నిర్ధారణకు శరీర తత్వం లో ఉన్న దోషాల ఆధారంగా అంటే వాత,పిత్త, కఫనాడీ ని పరీక్షించి 12 రకాల శరీర అవయవాల స్థితిని గమనించ వచ్చు.వీటి ఆధారంగా పంచ భూత్హాలు వంటి పరిగణలోకి తీసుకుంటారు.ఎప్పుదైతే ఒక ఘటన జరిగిన తరువాత  శరీరం బలహీన పడుతుందో మన ఆహారపు అలవాట్లు సహజంగా మారి పోయాయి .ఏదైనా ఒక నాడి పని చేయనట్లితే అవి మరిన్ని నరాలలో నాడులలో సమస్యల కు విస్తరించ వచ్చు.ఈ సమస్య మల్టిపుల్ లేదా డబుల్, త్రిబుల్  గా మారచ్చు.దీనికారణం గా నాడులలో శక్తి తగ్గి.సూక్ష్మ శరీరానికి చేరి  అది శరీరం పై తీవ్ర ప్రభావం చూపుతుంది.అప్పుడే ఆధునిక డాక్టర్స్ వ్యాధిని నిర్ధారిస్తారు.మన శరీరం 2,72, ౦౦౦ నాడులతో నిర్మితమై ఉంటుంది. ప్రతి అవయవానికి ఒకదానికి ఒకటి కలప బడి ఉంటాయి. ఇందులో ఎక్కడైనా నాడులలో బ్లాక్స్ వచ్చినప్పుడు ఆ నాడి సరిగా పనిచేయదు.అప్పుడు ఆ అవయవాల లలో శక్తిని కోల్పోతాయి.సరిగా పని చేయవు.దీనికి ముందుగా నాడీ పతి చికిత్స రూట్ కాజ్ ను కనుగోని తగిన చికిత్స చేయవచ్చని అంటున్నారు నాడీ వైద్యులు కృష్ణం రాజు.నాడి ని ఎప్పుడైనా గుర్తించ వచ్చు. అయితే మీ నాడిని గుర్తించాలంటే మాత్రం ఉదయం వేళ పరగడుపున ఖాళీ కడుపు తో ఉన్నప్పుడు  మాత్రమే.ఆతరువాత వారాంతం లో  ఆ అంగాన్ని గుర్తించి చ్జికిత్స దానికి అనువైన  తెరఫీ చికిత్స అలాగే మీ కు సరి పడా ఆహారం సూచిస్తారు.నాడీ పతిలో కొన్ని తరాలుగా వ్యాధిని గుర్తించడం గతం, వర్తమానం భవిష్యత్తు లో వ్యాధులను సైతం గుర్తించడం లో కీలక పాత్ర   పోషిస్తుంది.

ముఖం చూసి గుర్తించవచ్చు ....

ఇందులో నాలుగు రకాల పద్దతులలో ప్రాధమిక నిర్ధారణ చేస్తారు అందులో అడగడం, వినడం, వాసన ద్వారా గుర్తించ వచ్చు చాలా సందర్భాలలో ముఖ కవళికలు చూసిన వెంటనే అవ్యక్తిలో ఏ ఎలిమెంట్ గ్రహించి ఆ నాడిని తెలుసుకుని వ్యాధిని నిర్దారిస్తాము.కిడ్నీ పని తీరు. లివర్ పని తీరు, గుండె పని తీరు,ఆహారం అన్న వాహిక పని తీరు, ఊపిరి తిత్తుల పనితీరు.ఉదాహరణకు పెదవుల కింది భాగం చూసినప్పుడు మీ పెద్ద పేగులు ఎలా ఉనాయో తెలుసుకోవచ్చు.అలాగే మీ కుడి  బుగ్గ కుడి ఊపిరి తిత్తులు.ఎడమ బుగ్గ ఎడమ ఊపిరి తిత్తులు  పని తీరును తెలుసుకోవచ్చు.

నాలుక ద్వారా నిర్ధారణ ....

మీ నాలుక మీ వ్యక్తిలోని బలమైన సంతోషం అశాంతి శరీరం రంగు మీ నాలుక రంగును బట్టి మీలో ఉన్న అనారోగ్యం ఆరోగ్యం సమస్యలు తెలుసుకోవచ్చు.మీనాలుక ఆకారం,రంగు, సైజ్,టిప్స్, నోటి చివరలు,మీ నాలుక మందంగా ఉందా? పలుచగా ఉందా?వారి ఆరోగ్యం ఎలా ఉందొ తెలుసుకోవచ్చు నాడీ పతిలో నాడి కాకుండా మీ పల్స్ ను పరీక్షిస్తారు. నాలికను పరీక్షించడం ద్వారా రోగి యొక్క వ్యాధి ని మదింపు చేస్తారు.

ఇరిడా లజీ...

ఇరిడో లజీ అన్నది ఒక స్వ్క్రీనింగ్ టూల్ ఇరిడో లజీ అనేది పాత కాలం నాటి పద్ధతి.రోగి యొక్క ఆరోగ్య ఖచితమైన  ఆరోగ్య సమాచారం కోసం ఇరి డో లజీ ని వినియోగిస్తారు.శరీర భాగం లో ఉన్న వివిదరకాల జోన్స్ ఐరిస్ ద్వారా ఆయా భాగాలను మార్క్ చేసి వాటిని సరి పోలుస్తారు.ఈ చార్ట్స్ ను ఐరిస్ ను డివైస్ దగ్గర దగ్గర 8౦ -9౦ జోన్స్ ఉదాహరణకు మీ కిడ్నీ ఐరిస్ కింది భాగం లో ఉంటుంది. 6 గంటలకు ముందు ఆ ప్రాంతం  లో ఉంటుంది

మీ పంటి వరుస పంటి ని చూసి నిర్ధారిస్తారు...

మీ పళ్ళను చూసినప్పుడు వాటిలో ఒక్కో సారి కొన్ని రకాల ఇన్ఫెక్షన్ లు ఉండవచ్చు. రోగి యొక్క అనారోగ్యాన్ని మీ నోటిని పంటిని చూసి నిర్దారించడం .అన్నది పాత పద్దతిగా పేర్కొన్నారు. మీనోటిలో ఉన్న ఇన్ఫెక్షన్ కారణంగా మీ శరీరం లో ఉన్న ఇతర అవయవాలు తీవ్రంగా దెబ్బ తింటాయి ఇన్ఫెక్షన్ కు గురి అవుతాయి ఇది నాడీ పతి ద్వారా తెలుస్తుంది దీనిద్వారా పాడైన ఆ అవయవానికి నాడీ వైద్యం చేయవచ్చు అంటున్నారు వైద్యులు.మీ పళ్ళు,చిగుళ్ళు, వ్యాధి తగ్గిన తరువాత మళ్ళీ ప్రేరేపిత మౌతాయి