సీఎం రేవంత్‌రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువ
posted on Nov 8, 2025 @ 8:03PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పుట్టినరోజు సందర్బంగా రాజకీయ ప్రముఖులతో పాటు సినీ సెలబ్రిటీలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ .. సీఎంకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్నాటక సీఎం సిద్దరామయ్య, తమిళనాడు సీఎం స్టాలిన్, రేవంత్‌రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి నారా లోకేష్ కూడా ఆయన బర్త్ డే విషెస్ తెలిపారు. ఆయన ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ట్వీట్టర్‌లో ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు పవన్ పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, సందీప్ రెడ్డి వంగా, రామ్ చరణ్, నాగవంశీ, ఎక్స్ లో బర్త్ డే విషెస్ చెప్పారు. పాలమూరు నెల నుంచి రాష్ట్రం ఆకాశం వరకు మీ ప్రయాణం వికాసించాలని సందీప్ రెడ్డి వంగా ఆకాంక్షించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు కేబినెట్ మంత్రులు, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరియు ఇతర పార్టీల నాయకులు స్వయంగా కలిసి లేదా సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించేందుకు ఆయనకు ఈ జన్మదినం మరింత శక్తిని ఇవ్వాలని నేతలు ఆకాంక్షించారు.ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం రేవంత్ కు ఎక్స్ లో బర్త్ డే విషెస్ చెప్పారు