భూవివాదాల్లో నేతల జోక్యం సంహించం : డిప్యూటీ సీఎం పవన్
posted on Dec 18, 2025 @ 8:02PM
భూ వివాదాల్లో రాజకీయ నాయకుల జోక్యాన్ని ఎంత మాత్రమూ సహించొద్దని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు డిప్యూటీ సీఎం పవన్, సీఎం చంద్రబాబు ఆదేశించారు. విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పారిశ్రామిక ప్రాంతాల్లో కొన్ని భూ వివాదాల్లో రాజకీయ నాయకుల ప్రమేయంపై ఫిర్యాదులు వచ్చాయిని ముఖ్యమంత్రి తెలిపారు. విశాఖ జోన్ లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. రాజకీయ నాయకుల ప్రమేయం వల్ల అధికారులు కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నారని సీఎం పేర్కొన్నారు.
విశాఖ, విజయనగరం, అనకాపల్లి తదితర జిల్లాల్లో రాజకీయ నాయకుల జోక్యంపై ఫిర్యాదులు రాకూడదని, ఎవరి మీద ఫిర్యాదు వచ్చినా వదిలిపెట్టవద్దని ముఖ్యమంత్రి కలెక్టర్లును కోరారు. సౌండ్ పొల్యూషన్ గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. మతం పేరుతో విపరీతమైన సౌండ్ పెట్టి కార్యక్రమాలు, వేడుకలు, ప్రార్థనలు చేయడం తప్పుని పేర్కొన్నారు. ఎక్కడైనా కేవలం చట్టం మరియు సుప్రీంకోర్టు ఆదేశం మాత్రమే అమలులో ఉంటాయి డిప్యూటీ సీఎం తెలిపారు.
నిర్దేశించిన డెసిబుల్స్ లోనే సౌండ్ ఉండాలి. ఇందుకు సంబంధించి ఉన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలకు పవన్ తెలిపారు. భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత తీసుకువచ్చేందుకు అన్ని రిజిస్ట్రేషన్, ఆస్తి పత్రాలను డిజిటలైజేషన్ చేస్తున్నామని సీఎం వివరించారు. 20-30 ఏళ్లుగా ఇళ్లలో నివసిస్తున్న వారికి పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. చివరగా, జిల్లాల వారీగా రెవెన్యూ రాబడులపై దృష్టి సారించాలని, పన్ను ఎగవేతలు, మానిప్యులేషన్ జరగకుండా చూడాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రం ఒక్కరోజు కూడా ఆదాయం కోల్పోవడానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు.