2 నుంచి చంద్రబాబు లండన్ పర్యటన
posted on Oct 30, 2025 @ 1:09PM
ఏపీ ఫస్ట్ అన్నది చంద్రబాబు నినాదం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొంథా రూపంలో పెను ముప్పు ఉన్నదన్న సమాచారంతో తుపాను నష్టాన్ని కనిష్టానికి తగ్గించి, ప్రజలను క్షేమంగా ఉంచడమే లక్ష్యంగా ఆయన గత మూడు రోజులుగా నిద్రాహారాలతో సంబంధం లేకుండా నిర్విరామంగా కృషి చేశారు. ఆయన కృషి, శ్రమ ఫలించాయి. తుపాను వల్ల రాష్ట్రానికి పెద్దగా నష్టం వాటిల్ల కూడదన్న ఆయన సంకల్పబలం ముందు మొంథా తుపాను తోకముడిచింది. అతి భీకరంగా తీరం వైపునకు దూసుకువచ్చిన తుపాను.. పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తీరం దాటి బలహీనపడింది. తుపాను విపత్తు నుంచి ఏపీని సురక్షితంగా బయటపడేసిన వెంటనే రాష్ట్రానికి ప్రగతి బాటలు పరిచే పనిలో నిగమ్నమైపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. గత నాలుగు రోజులుగా తుపాను పరిస్థితిపై నిరంతర సమీక్షలు, రియల్ టైమ్ పర్యవేక్షణతో క్షణం తీరిక లేకుండా గడిపిన చంద్రబాబు గురువారం ఉదయం కూడా తుపాను ప్రభావిత ప్రాంతాలల సమాయ పునరావాస చర్యలపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఇక ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన మరోమారు విదేశీ పర్యటనకు సిద్ధమైపోయారు. నవంబర్ 2 నుంచి అంటే ఆదివారం నుంచి చంద్రబాబు ఐదు రోజుల పాటు లండన్ లో పర్యటించనున్నారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా చంద్రబాబు ఈ పర్యటనకు బయలు దేరు తున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు అంతర్జాతీయ పెట్టుబడిదారులతో భేటీ అవుతారు.
విశాఖపట్నంలో త్వరలో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు పెట్టుబడిదారులను ఆహ్వానించడంపై ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు లండన్‌లో సీఐఐ ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్ షోలో పాల్గొని ఆంధ్రప్రదేశ్‌లోని పెట్టుబడి అవకాశాలను ఈ పర్యటనలో ఆయన పలు గ్లోబల్ కంపెనీల ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించి, పెట్టుబడుల సహకారం, టెక్నాలజీ మార్పిడి, ఉద్యోగావకాశాల సృష్టి వంటి అంశాలపై చర్చించనున్నారు. నవంబర్ 6న సీఎం చంద్రబాబు అమరా వతికి తిరిగి రానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పెట్టుబడిదారుల కేంద్రంగా నిలపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కదులుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన ముగించుకుని చంద్రబాబు నవంబర్ 6న అమరావతికి తిరిగి వస్తారు.