సార్ నాకు బ్రేకప్ అయ్యింది.. లీవ్ కావాలి!
posted on Oct 30, 2025 @ 1:20PM
నాట్ డేటింగ్ లో పని చేసే ఒక ఎంప్లాయి తన బాస్ కి సెలవు కావాలి అంటూ పెట్టుకున్న అప్లికేషన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇంతకీ ఆ యువకుడు తనకు లీవ్ కావాలంటూ తన బాస్ కు పంపిన సందేశం సారాంశం ఏమిటొ చూస్తే మీరు కూడా నోరెళ్ల బెడతారు అందులో సందేహం లేదు. సరే విషయానికి వస్తే.. సార్ నాకు ఇటీవల బ్రేకప్ అయ్యింది. దీంతో పని మీద దృష్టి సారించలేకపోతున్నా. దయ చేసి ఈ నెల 28 నుంచి- వచ్చే నెల 8 వ తేదీ వరకూ బ్రేకప్ లీవ్స్ కావాలి. కనుక మన్నించి సెలవు మంజూరు చేయాల్సిందిగా ప్రార్ధన.. అంటూ ఆ యువకుడు తన బాస్ కి మెసేజ్ చేశాడు . ఆ అభ్యర్థనలో నిజాయితీ ఉంది. అది నచ్చి లీవ్ శాంక్షన్ చేసేశాను అని చెప్పారు ఆ సంస్థ సీఈవో జస్వీర్ సింగ్.
ఇప్పటి వరకూ పెళ్లి, ప్రెగ్నెన్సీ వంటి లీవ్స్ మాత్రమే చూశాం. ఇది తాజా లీవ్ రీజన్ గా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతడి నిజాయితీ నచ్చింది అన్న ట్యాగ్ లైన్ తో ఈ రీజన్ దూసుకుపోతోంది. మాములుగా ఇలాంటి కారణాలు చాలా మంది బయటకు చెప్పుకోరు. కారణం బ్రేకప్ అన్నదాన్ని ఒక ఫెయిల్యూర్ లేదా అవమానంగా భావిస్తుంటారు. కానీ కొందరు ఔట్ స్పోకన్ పర్సన్స్ ఉంటారు. ఇటీవలి కాలంలో.. ఈ టెండెన్సీ ఎక్కువయ్యింది.
ఈ మధ్య జనం ఆర్గానిక్ ఫుడ్ ప్రిఫర్ చేయడం మాత్రమేకాదు.. ఆర్గానిక్ మైండ్ సెట్ పై కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నారు. సిల్లీ రీజన్ అయినా.. అందులో నిజాయితీ ఉంటే వారికి ప్రయారిటీ పెరుగుతోంది. అది గుర్తించాను కాబట్టే.. అతడు అడిగిన వెంటనే లీవు ఇచ్చినట్టు చెబుతున్నారు ఆ సంస్థ సీఈవో.