ఆమె అణువణువూ భారతీయ సంప్రదాయం తొణికిసలాడుతున్నప్పటికీ ఆమెకున్న బ్రౌన్ హెయిర్ ని బట్టి మాత్రం విదేశీ వనిత అని తెలిసిపోతున్నది.
ఆమెకు కొంచెం వెనుకగా అడుగులు వేస్తున్న భారత వనిత వైపు చూసినా ప్రతి ఒక్కరు కూడా ....విదేశీ వనితను చూసినట్టే ఆమె అందాచందాలను సమ్మోహితులై కళ్ళు అప్పగించి చూస్తున్నారు.
జీన్స్ ఫాంట్......టీ షర్టు. హై హేల్డ్స్ జిప్ షూ....రేబాన్ గాగుల్స్ నల్లటీ పొడవాటి జడ....
ఒకేసారి ఇద్దరు దేవకన్యలు దివినుంచి భువికి దిగి వస్తున్న అనుభూతి.....
కస్టమ్స్ అధికారులు ఒక్కొక్కరి లగేజిని చెక్ చేసి పంపిస్తున్నారు.
విదీశీ వనిత వంతు వచ్చింది....
కస్టమ్స్ ఆఫీసర్ కు అంత అందమయిన అమ్మాయిని సమీపంలో చూడగానే కొన్ని క్షణాల పాటు మతిపోయినట్టయింది.
ఆ అపురూప లావణ్యవాటిని చూసి మైమరచిపోయి అసలు ఏమీ చెక్ చేయకుండానే క్లియరెన్స్ ముద్ర వేశాడతను.
"థాంక్యు హ్యాండ్ సమ్...." చిరునవ్వులు చిందించిందామే......
ఆమె మాటలు చిలక పలుకుల్లా ......మాటలు రాని అమ్మాయి అక్షరాలను ఏరుకుని కూడబలుక్కుని మాట్టాడినట్టు వున్నాయి.
ఒక్కొక్కరుగా క్యూ ముందుకు కదులుతున్నది.....
ఎయిర్ పోర్టు బయటకు వచ్చిన విదీశీ వనితను టాక్సీ డ్రైవర్లు ఒక్కసారిగా చుట్టుముట్టారు. ఆమె అందరివైపు ఒకసారి పరిశీలనగా చూసి ఎదురుగా వున్న టాక్సీ ఎక్కింది.
టాక్సీ రద్దీగా వున్న రోడ్లవెంట మెత్తగా దూసుకుపోతున్నది .....
"మిస్టర్......"
డ్రయివర్ ఉలికిపడుతూ ఆమె వైపు అనుమానంగా చూశాడు.
"నిన్నే పిలిచేది......' హిందీలో మరోసారి రెట్టించింది.
'ఏమిటి మేడమ్ ........"
"నీ పేరు..."
"సురేష్......"
"నీకు పెళ్ళి అయ్యిందా?"
"ఆ...అయ్యింది మేడమ్ ........!" అబద్దం ఆడలేకపోయాడతను.
"వెరీ గుడ్ ........మరి పిల్లలు ఎంతమంది?"
"లేరు....' నిరుత్సాహంగా అన్నాడు అతను.
"వాట్.......?" ఆమె కళ్ళల్లో విస్మయం......
'అవును మేడమ్ .....మాకు పెళ్ళి అయ్యి నాలుగేళ్ళు అవుతుంది. కాని ఇంకా ఆ అదృష్టానికి నోచుకోలేదు.
"ప్చ్ బాడ్ లక్....మీ ఆవిడ అందగత్తెనా?"
"బాగానే వుంటుంది"
ఆమె తన భార్య గురించి అంత వివరంగా ఎందుకు గుచ్చి గుచ్చి అడుగుతుందో అర్ధం కాలేదు అతనికి.
'సెక్స్ పై నీ అభిప్రాయం ఏమిటోయ్....."
ఏదో వినకూడని మాట విన్నట్టు బంగారు పడిపోతూ షడన్ బ్రేక్ వేసినంత పనిచేశాడు సురేష్.
హటాత్తుగా ఆగిపోయిన టాక్సీ వెనుక వస్తున్న వాహనాలు కూడా హడావుడిగా బ్రేకులు వేసి వుండకపోతే అక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ సీన్ క్రియేట్ అయి వుండేది.
"ఏమ్మా సెక్స్ పేరు ఎత్తగానే అలా అయిపోయావు........?"
'అబ్బే ఏమీ లేదు మెడమ్ ....మీరు , మీరు ......' తిరిగి టాక్సీని స్టార్ట్ చేశాడు.
"ఆ నేను ...........ఏం అడిగాను .....సెక్స్ అంటే ఏమిటి అని అడిగాను ....అంతేగా?"
"అవును మేడమ్ ........అందుకే అలా అయిపోయాను."
"పరవాలేదు ....ఆడపిల్లని.....నాకు లేని సిగ్గు నీకు ఎందుకోయ్.....అయినా నీ భార్య అందంగా వుంటుందన్నావు. మరి నీకు ఎందుకు పిల్లలు పుట్టలేదు."
'అందంగా వున్నంత మాత్రానా పిల్లలు పుట్టి తీరాలని ఎక్కడా లేదు మేడమ్" ఒకింత సీరియస్ గా అన్నాడతను.
'అలాగా ...సెక్స్ లో నువ్వు వీక్ అన్నమాట."\
'కాదు.'
"మరి, మీ ఆవిడ పూర్ అయి వుంటుంది."
"అదేమీ కాదు......'
"ఏమీ కాకపోతే సెక్స్ లో ఇద్దరు స్ట్రాంగ్ అయినప్పుడు మీ ఇద్దరికీ పెళ్ళయి ఇంత కాలం అయినా మీకు పిల్లలు పుట్టలేదంటే ఇంకేదో కారణం ఖచ్చితంగా వుండి వుండాలి. యామ్ ఐ రైట్....."
'అవును......" అన్నాడు అయోమయావస్థలో సురేష్.
'అది ఏమిటో నేను చెప్పనా?"
అవును కాదు అన్నట్టు సందిగ్ధంగా తలవూపాడు అతను.
"మీ ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎక్కువ అనుకుంటున్నారు కానీ అది ఒట్టి మోసం.....కోరిక మాత్రమే వుంది. అదే మీ బాషలో కామం.....ఇక మీ మధ్య ఆప్యాయత , అ నురాగాలు లేవు...అందుకే మనస్పూర్తిగా సుఖించలేకపొతున్నారు. ఆ కారణం వాళ్ళనే సెక్స్ లో ఫెయిల్ అవుతున్నారు. మానసికంగా జడత్వం పేరుకు పోయిన మీకు పిల్లలు ఈ జన్మలో కలగరు......"
బిత్తరపోయాడు అతను......ఇదేక్కడ సైన్స్..? కాకపోతే లాజిక్కా లేక జిమిక్కా...?
ఆమె చెబుతున్న మాటలు యదర్ధమేనా? యాంత్రికంగా శారీరక కోర్కెలు తీర్చుకుంటున్నారే తప్ప ఆమె అన్నట్టు మనస్పూర్తిగా లాలింపు, అలరింపులకు చాలా దూరంలో వున్నమాట నిజమేనా? ఆమె తర్కం విన్న తరువాత డాక్టర్ పరీక్షలు వగైరాల గురించి మరచిపోయి ఆ చోట అతనికి ఇన్నాళ్ళ తమ కాపురం మీదే అనుమానం మొట్ట మొదటి సారిగా కలిగింది.
