మెయిడ్ ఇన్ ఇండియా
చందు హర్ష వర్ధన్
నాంది:
అంతవరకు
అనంత విశ్వాన్ని శాసిస్తూ.......భూమండలాన్ని గడ గడ లాడించిన ఉదయ భానుడు ఆ రోజుకు తన దిన చర్య ముగిసిందన్నట్టు పడమరకు వాలిపోతున్న అమర సంధ్య వేళ అది........
అక్కడొక సహజసిద్దమయిన ద్వీపం .........కృష్ణా నది జలాల నడుమ ప్రక్రుతి కాంత ఒడిలో ఊయలలూగుతున్నట్టు అత్యంత శోభాయమానంగా పచ్చదనంతో విరాజిల్లుతున్న భవానీ ద్వీపము.
అది విజ్జులకు విజ్జానలని ...మహాఋషులకు మానసోల్లాసిని తాత్వికులకు తత్వభోధిని, కవులకు పకృతి కాంత........సగటు మనిషికి సరివి, ధర్పల పిచ్చి మొక్కలతో నదీజలాల మధ్య ఏర్పడిన ఇసుక మేట!
అప్పుడే వినిపిస్తున్నాయి పక్షుల కిలకిలరావాలు.....
మరోవేపు అందరి మనసులను రంజింపజేస్తూ పిల్లగాలుల సమ్మోహనానికి కృష్ణవేణినదీ తీరాన్ని తాకి వేనుకకుపోతూ సంగీత ఝురులు కురిపిస్తున్న ఆ అలల హోరు లయబద్దంగా వినిపిస్తోంది.
అంతేకాదు.........
నది ఆవలి ఒడ్డున ఆమడ దూరంలో వున్న ఇంద్రకీలాద్రిపై కొలువై వున్న జగజ్జనని ఆలయం నుంచి మంద్ర స్వరంతో వెలువడుతున్న మంత్రోచ్చాటన ఆ పరిసరాలను మరింత ప్రభావితం చేస్తోంది.
అక్కడ ఎన్నో గంటల నుండి పద్మాసనంలో పరమశివుని ధ్యానంలో వున్న అతని ఏకాగ్రతను అంతటి సుందర ప్రకృతి , సంగీత ఝురులు, వేద మంత్రోచ్చాటనలు కూడా భగ్నం చేయలేకపోతున్నాయి.
అతను ఒక యోగి..........
సర్వసంగపరిత్యాగి.....!
అది దైవారాధానో......జాగ్రదావష్నో .....నామాదిస్థితో ....తెలియని స్థితిలో వున్న నిశ్చల తపస్వి అతడు!
ఆ సమయంలో భూమ్యాకాశాలు ఏకమై ఉత్సాతమే , సంభవించినా, ప్రకృతి విలయ తాండవం చేసి కుంభ సృష్టినే కురిపించినా , ఝుంఝుమారుతం ప్రళయఘోషగా మారి సముద్రాలే ఉప్పొంగినా, భూదేవి ప్రకంపనాలకు గురై నిట్టనిలువునా బ్రద్దలై రెండుగా విడిపోయినా చలించని మనోనిబ్బరం కలవాడతను....
అరిషడ్వార్గాలను జయించవలసిన సాధుపుంగవులు కొందరు తాము మాత్రమే మహాదైవశక్తి సంపన్నులుగా కొనియాడబడాలని తహతహ లాడుతుంటారు.
ఆ ప్రశాంత ప్రకృతి ఏకాంత ధ్యానంలో ఒక సర్వ సంగపరిత్యాగి......
విష్ణుమూర్తి నామధేయుడు!
అప్పటికి పూర్తిగా ప్రొద్దు వాలిపోయింది.
భవానీద్వీపం ఒడ్డున వున్న చిన్నపాటి దోనే నెక్కి నీళ్ళలో తెడ్డు వేశాడు విష్ణు.
అంతే......
అతనేక్కిన మరికొన్ని నిమిషాలకే నీరు నిండిన ఆ దోనే కృష్ణా నదీ జలాలతో మునిగిపోయింది.
అది ఎవరో విద్రోహుల చర్య అని అర్ధమవుతోంది...
అయినా విష్ణుమోముపై చిరునగవు.....అతని కళ్ళలో ఆ విద్రోహుల పట్ల జాలి గోచరిస్తున్నాయి.
అక్కడకు కొంచెం దూరంలో చేపల వేటలో వున్న ఇరువురు జాలర్లు విష్ణు ఎక్కిన దోనే మునిగి పోవడం గమనించి అతణ్ణి రక్షింతా అన్న ధ్యేయంతో తామున్న దోనేలో ఆ వైపుకు పయనమయ్యారు.
అంతే ఒక్క క్షణం గాలి స్థంభించింది. అప్పటి వరకు ఆ గాలికి పరవశంగా ఆటలాడుకుంటున్న అలలు తమ గమనాన్ని అపాయి. సిమెంట్ రోడ్డుపై వెళుతూన్నట్టు అతి సునాయాసంగా ఆ నదీ జలాల పై నడచి వెళ్ళిపోతున్నాడు విష్ణు.
అయితే ఆ జాలర్లు కళ్ళలో ఒత్తులు వేసుకుని చూసినా విష్ణు గమనాన్ని గుర్తించలేకపోయారు. అంతటి శరవేగంతో విష్ణు.....దుర్గాఘాట్ కు చేరుకున్నాడు.
మానసమాత్రులకు అలని గాని అంతటి అద్భుతాన్ని, ఆ అనూహ్య పరిణామాన్ని నోరెళ్ళబట్టి చూస్తూ వుండిపోయారు జాలర్లు......
అప్పుడే ఇంద్రకీలాద్రిపై ఆలయ పూజార్లు మంత్రోచ్చాటన ఆపారు.
భక్తులు గుడిగంటలు మ్రోగిస్తున్నారు.
విష్ణు.....దేవి సాన్నిధ్యంలో వున్నారు......
* * * *
గ్రేటర్ బొంబాయి......
శాంతాక్రజ్ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్!
వాషింగ్ టన్ డి.సి. నుంచి వచ్చిన అమెరికన్ కారవేల్లీ లాండ్ అయింది. ముందు ఒక విదేశీ వనిత ఫ్లయిట్ దిగింది.
ఆమె కట్టు బొట్టు తీరు మాత్రం అందరికన్నా భిన్నంగా కనిపిస్తున్నది. లండన్ యువతి అయినప్పటికీ పట్టుచీర ధరించడం విశేషం!
నెమలి పించం రంగు చీర..... నుదుట అరుణరాగరంజితమయిన కుంకుమ తిలకం....కాటుకతో తీర్చిదిద్దిన నీలికన్నులు...దొండ పండు లాంటి ఎర్రటి పెదవులు....హిమశిఖరాల వంటి వక్షద్వయం...పిడికిట అమరిపోయే సన్నని నడుము.....
