Previous Page Next Page 
సంసారంలో శ్రీశ్రీ పేజి 4

 

    "నీ సజెషన్స్  అవసరంలేదు. ఆ మాత్రం  మాకూ తెలుసు" అన్నారావిడ.

    అంటూనే  లోపలికి  వచ్చేశారు. నేనూ వెంటపడ్డాను.

    సంచిలో  నుండి  ఆవిడ  తెచ్చిన  పళ్ళూ, ఓవల్టీన్ అన్నీ బయటపెట్టారు.

    'అమ్మయ్య' అనుకున్నాను.

    "నేను ఇంటికి వెళుతున్నానండీ" అని ఆయనతో చెప్పి బయటికొచ్చి డ్రైవర్ సుబ్బారావుతో "ఇంటికి వెళ్ళాలి" అన్నాను.

    "వెళ్ళండమ్మా! ఎవరొద్దన్నారు" అన్నాడు సుబ్బారావు.

    "కారు తియ్యి" అన్నాను.

    "కార్లో  అయ్యగారినీ  అమ్మగారినీ  తప్ప మరెవ్వరినీ  ఎక్కనివ్వను" అన్నాడు.

    "ఆ మాట అనడానికి  నువ్వెవరివి? ఇది అయ్యగారి కారు" అన్నాను.

    వెనక నుండి  గట్టిగా  "కాదు ఆ కారు నాది" అన్నారావిడ.

    "ఇది మీ ఇల్లుకాదు, హాస్పిటల్. అరవకండి" అని చకచక నడుచుకుంటూ  పక్కనే వున్న  ఉడ్ లేండ్స్ హోటల్ దగ్గరికొచ్చి  టేక్సీలో  ఇంటికి వెళ్ళిపోయాను. తరువాత  రెండు రోజుల వరకూ నేను హాస్పిటల్ కి  వెళ్ళలేదు.


            శ్రీశ్రీ  ఆముద్రిత భావాలు


    ఏదో నవభారం

    ఏదో నవభావం

    కదలించే  మధుర మధుర గానం                 !!ఏదో!!
    సుమదళాల  పరిమళాల తేటలలో

    మయూరాల వయారాల ఆటలలో
    ఎలతుమ్మెద  నెరతెమ్మెర  మాటలలో             !!ఏదో!!

    తలిరుటాకు  మెరుగు  బాకు  పదునులో
    తరతరాల  తురంగాల  కదనులో

    ఘన సాధన  కొనసాగిన  అదనులో             !!ఏదో!!

    కులం లేదు మతం లేదు దరిద్రానికి

    నరం లేదు స్థిరం లేదు సమాజానికి
   
    ఈ దేశం ఎటుపోతోంది
    ఈ మీదట  ఏమవుతుంది
   
    ఆదివారం  అమావాస్య  అంతా  చీకటి
    లేదు ద్వారం ఏది తీరం అయ్యో ఆకలి
    నలుదెసలా  పలు  బాధల  అలల తాకిడి

    కథ వ్రాసిన  కవి శ్రీశ్రీ నిర్దారకుడు
    విశ్వేశ్వరరావు  దీని నిర్దేశికుడు
    అన్నిటికీ  మన సత్యం  నిర్వాహకుడు

    ఉభేత్తునా  హఠాత్తుగా  పిడుగు పడింది
    జీవితాల  తెరచాపకు  (తుఫానులో) చిరుగుపడింది
   
    పోయేవి మనకేమున్నాయి
    బంధించే  సంకెళ్ళే తప్ప
    బానిస  బ్రతుకుల ముళ్ళే తప్ప

    వచ్చే రాజ్యం శ్రామిక రాజ్యం
    పేదల నొకచో  చేర్చేది
    భువినే  డివిగా  మార్చేది
   
    గొడ్డలి గునపం  సుత్తీ కొడవలి
    పట్టిన  చెయ్యే ఎత్తును పిడికిలి

    మన శ్రమ ఫలితం  మనకే దక్కే
    దినమెంతో  దూరంలో లేదు
   
    రండి రండి మీరంతా  రండి
    తట్టల మట్టిని  కుప్పలు పోసే

    కూతీల్లారా రారండీ
    నాగలి దాల్చే నాటులు వేసే
    రైతుల్లారా రారండీ

    వనసీమలలో  బొగ్గు  గనులలో   
    పనిచేసే  వాళ్ళంతా  రారండి

    ప్రాజెక్టులలో  ఫాక్టరీలలో   
    చెమటోడ్చే  జనులారా  రండి

    మన కన్నీళ్ళే  మహాసముద్రం   
    మన సంకల్పం  హిమాలయం

    మన సాహసమే  పిడుగుల  వర్షం
    మన ఆవేశం  ప్రభంజనం

    మా నెత్తురు  పీల్చి  బలిసి
    మా నెత్తురు  కొట్టి బతికి
   
    ఊరేగే  కామందులు
    చెలరేగే  రాబందులు

    మా కోపపు  మంటల్లో   
    మూడే దినముంది  ముందు

    కబడ్దార్ కబడ్దార్
    కార్మికులారా  ఉషార్

    పొగరు  బోతునా?
    నేను పొగరు బోతునా?
   
    ఔను ! పొగరు  బోతునే
    నేను పొగరు బోతునే
   
    చింతకు  చిగురే సింగారం
    మనిషికి  పొగరే  బంగారం

    తడిగుడ్డలతో  గొంతులు  కోసే
    చెడులోకంలో  బతకాలంటే 
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS