చైత్ర మాసం మాస శివరాత్రి.. శివుడిని ఇలా ఆరాధిస్తే అనుగ్రహం తథ్యం!

 

చైత్ర మాసం మాస శివరాత్రి.. శివుడిని ఇలా ఆరాధిస్తే అనుగ్రహం తథ్యం!

మాస శివరాత్రి అనేది ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్దశి తిథి నాడు జరిపే శివారాధన.  మాఘ మాసంలో వచ్చే మాస శివరాత్రిని మహా శివరాత్రిగా పేర్కొనగా.. మిగిలిన పదకొండు మాసాలలో వచ్చే కృష్ణపక్ష చతుర్థి తిథులను మాస శివరాత్రిగా జరుపుకుంటారు.  చైత్ర మాసంలో  మాస శివరాత్రిని ఏప్రిల్ 15, 2026న జరుపుకుంటారు. మహా శివరాత్రి లాగే మాస శివరాత్రి రోజు కూడా పరమ శివుడిని అత్యంత భక్తి శ్రద్దలతో ఆరాధిస్తారు. ముఖ్యంగా మాస శివరాత్రి రోజు శివుడి ఆరాధన సాయంత్రం ప్రదోష కాలం నుండి ప్రారంభం అవుతుంది. మాస శివరాత్రి రోజు శివుడిని ఎలా ఆరాధిస్తే.. పరమేశ్వరుడి అనుగ్రహం  కలుగుతందో తెలుసుకుంటే..

సాయంత్రం నుండి రాత్రి పూజ.. ఎందుకంటే..

శివ పురాణం , స్కంద పురాణం ప్రకారం, రాత్రి సమయం అత్యంత ఆధ్యాత్మిక శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఆ సమయంలో వాతావరణం ప్రశాంతంగా, మనస్సు ఏకాగ్రతతో ఉండి, ఆధ్యాత్మిక సాధనకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. శివుడు లింగ రూపంలో  అవతరించినది రాత్రి సమయంలోనే.. , అందువల్ల ఈ సమయంలో ఆయనను పూజించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి.

మాసశివరాత్రి.. ఆరాధన..

చాలామంది మహా శివరాత్రి నాడు మాత్రమే ఆరాధన, జాగరణ,  అభిషేకాలు.. వంటివి చేస్తుంటారు. కానీ.. మాస శివరాత్రి రోజు కూజా ఇదే ఆరాధన చేయడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు.

నాలుగు ఝాములు.. ఆరాధనా ఫలితాలు..

మొదటి జాము ఆరాధన శారీరక శుద్ధీకరణకు సంబంధించినది, దీనిలో ఒక వ్యక్తి తన కర్మల వల్ల కలిగిన పాపాల నుండి విముక్తి కోసం ప్రార్థన చేస్తే ఫలితం లభిస్తుంది.

రెండవ జాములో చేసే పూజ మానసిక శుద్ధీకరణను ఇస్తుంది, ఇది ప్రతికూల ఆలోచనలను , ఒత్తిడిని తొలగిస్తుంది.

మూడవ జాము అభ్యాసాన్ని ఆధ్యాత్మిక జాగృతి సమయంగా పరిగణిస్తారు, ఈ సమయంలో భక్తుని మనస్సు ధ్యానం , భక్తిలో గాఢంగా లీనమవుతుంది.

నాలుగవ జాము అయిన చివరి జాములో ఆరాధించడం సంపూర్ణ ఫలితాలను , మోక్షాన్ని పొందడానికి మార్గం సుగమం చేస్తుంది, ఎందుకంటే ఈ సమయం అత్యంత దైవికమైనదిగా , శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది.

రాత్రి ఈ నాలుగు జాములలో నీరు, పాలు, తేనె, బిల్వపత్రం మొదలైన వాటితో రకరకాల అభిషేకాలు చేసినప్పుడు శివుడు చాలా సంతోషిస్తాడు.

పైన పేర్కొన్నట్టు చేయలేని వారు.. కనీసం ప్రతి మాస శివరాత్రికి.. ప్రదోష కాలంలో శివుడికి పంచామృత అభిషేకం.. కుదరని వారు నీటితో అబిషేకం.. భస్మాన్ని నీటిలో కలిపి అబిషేకం చేయాలి. శివుడికి బిల్వపత్రాలు సమర్పించాలి. శివ సహస్రనామాలు,  నమకం, చమకం, రుద్రం,  శివ తాండవ స్తోత్రం, ప్రదోష స్తోత్రాలు మొదలైనవి పఠించడం వల్ల శివానుగ్రహం లభిస్తుంది.

                                  *రూపశ్రీ.