విజయ ఏకాదశి.. ఈ ఏకాదశి తిథి ఎంత శక్తివంతమైనదో తెలుసా!
విజయ ఏకాదశి.. ఈ ఏకాదశి తిథి ఎంత శక్తివంతమైనదో తెలుసా!
హిందూ మతంలో ఏకాదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఒక సంవత్సరంలో 24 ఏకాదశి తిథిలు ఉంటాయి. వీటిలో కొన్ని ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. మాఘ మాసపు కృష్ణ పక్షఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. శత్రువులపై విజయం సాధించడానికి ఈ ఏకాదశి ఉపవాసం చాలా కీలకమైనదని చెబుతారు. విజయ ఏకాదశి ఉపవాసం ఆచరించి ఈ రోజున విష్ణువును భక్తితో పూజించడం వల్ల ప్రయత్నాలలో విజయం లభిస్తుంది, అలాగే శత్రువులను ఓడిస్తుంది, కష్టాలను అధిగమించడానికి బలాన్ని అందిస్తుంది. రావణుడిని చంపడానికి లంకపై దాడి చేసే ముందు శ్రీరాముడు విజయ ఏకాదశి ఉపవాసం ఆచరించడానికి చెబుతారు. దీన్ని బట్టి ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. విజయ ఏకాదశి గురించి పూర్తీగా తెలుసుకుంటే..
మాఘ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తిథి ఫిబ్రవరి 12, 2026న మధ్యాహ్నం 12:22 గంటలకు ప్రారంభమై, ఫిబ్రవరి 13, 2026న మధ్యాహ్నం 2:25 గంటల వరకు ఉంటుంది. ఉదయతిథి ప్రకారం విజయ ఏకాదశి ఉపవాసం ఫిబ్రవరి 13, 2026న శుక్రవారం నాడు పాటించబడుతుంది.
విజయ ఏకాదశి ప్రాముఖ్యత..
విజయ ఏకాదశి ఉపవాసం అత్యంత ఫలవంతమైనది, శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం శ్రీరాముడు కూడా ఈ ఉపవాసాన్ని ఆచరించాడు. లంకను జయించే ముందు ఆయన విజయ ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించాడని చెబుతారు. ఈ ఉపవాసం పాటించడం వల్ల అనారోగ్యం, దుఃఖం తొలగిపోతాయి, శత్రువులను ఓడించవచ్చు. జీవితంలోని అడ్డంకుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇంకా ఈ ఉపవాసం పుణ్యానికి మూలం. కోర్టు లేదా చట్టపరమైన విషయాలలో విజయానికి సహాయపడుతుందని నమ్ముతారు.
విష్ణు ఆరాధన..
ఈ రోజున ఉపవాసం ఉండే భక్తులు విష్ణువును సాంప్రదాయబద్దంగా పూజిస్తారు. పూజ సమయంలో ప్రత్యేక మంత్రాలను జపించడం వల్ల మహా విష్ణువు అనుగ్రహం పొందవచ్చు. పూజ సమయంలో తెలుపు లేదా పసుపు రంగు వస్తువులు, పువ్వులు,అక్షంతలు, పండ్లు నైవేద్యంగా పెడతారు. పూర్తి భక్తి, విశ్వాసంతో ఉపవాసం పాటిస్తారు.
విష్ణు సహస్రనామాలు, విష్ణు అష్టోత్తరం, విష్ణు పురాణం, ఏకాదశి వ్రత ప్రాముఖ్యత కథ.. వంటివి ఈ రోజు వినడం వల్ల ఎంతో గొప్ప పుణ్య ఫలితం, విష్ణు అనుగ్రహం పొందగలుగుతారు.
*రూపశ్రీ.