అతిగా ఆలోచించడం వల్ల ఇబ్బంది పడుతున్నారా.. ఇదిగో ఇలా చేయండి!

 

అతిగా ఆలోచించడం వల్ల ఇబ్బంది పడుతున్నారా.. ఇదిగో ఇలా చేయండి!


నేటి వేగవంతమైన జీవితంలో, అతిగా ఆలోచించడం ఒక సాధారణ సమస్యగా మారింది. చిన్న విషయాల గురించి పదే పదే ఆలోచించడం వల్ల మనస్సు కలవరపడుతుంది,  ఒత్తిడి, భయం,  నిద్రలేమికి దారితీస్తుంది. అతిగా ఆలోచించడం వల్ల మానసిక స్థిరత్వం కోల్పోతారు.  పైగా నెగిటివ్ ఆలోచనలు కూడా పెరుగుతాయి.  చాలామంది ఇలా అతిగా ఆలోచించడాన్ని సైకలాజికల్ ప్రాబ్లం అనుకుని వైద్యుల వద్దకు వెళుతుంటారు. కానీ కొన్ని ఆధ్యాత్మిక పరిహాలు పాటించడం ద్వారా అతిగా ఆలోచించే అలవాటును,  అతిగా ఆలోచించడం వల్ల వచ్చే ఇబ్బందులను పరిష్కరించుకోవచ్చు.  ఇంతకీ ఆ పరిహారాలు ఏంటో తెలుసుకుంటే..

ధ్యానం..

మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం అత్యంత ప్రభావవంతమైన మార్గం. ప్రతి ఉదయం 10-15 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని, లోతుగా శ్వాస తీసుకుంటూ ఆలోచనలను గమనించాలి. ఇది క్రమంగా మనస్సును ప్రశాంతపరుస్తుంది.  అనవసరమైన ఆలోచనలను తగ్గిస్తుంది.

మంత్ర జపం..

ఆధ్యాత్మికతలో మంత్రాల శక్తి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. "ఓం నమః శివాయ" లేదా గాయత్రి మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల మనస్సులో అశాంతి తగ్గిపోతుంది.  పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఉదయం లేదా సాయంత్రం మంత్రాలను జపించడానికి కొంత సమయం కేటాయించడం మంచిది.

భగవంతుడి పట్ల నమ్మకం..

మనిషి ప్రతిదీ నియంత్రించడానికి ప్రయత్నించినప్పుడు, అతిగా ఆలోచించే సమస్య పెరుగుతుంది. కొన్ని విషయాలను దేవునికి వదిలివేయాలని పెద్దల నుండి ఆధ్యాత్మిక తత్వవేత్తల వరకు అందరూ చెబుతారు. ప్రతిరోజూ భగవంతుడిని ప్రార్థించాలి,  ప్రతి ఆలోచనను దేవుడి ముందు వ్యక్తం చేయాలి. ఇలా  చేస్తే మనసు తేలిక అవుతుంది.

ప్రాణాయామం..

మన శ్వాస మన మనసుకు నేరుగా అనుసంధానించబడి ఉంటుంది. అనులోమ-విలోమ,  భ్రమరి ప్రాణాయామం ప్రతిరోజూ చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది,  ఆందోళన తగ్గుతుంది. ఇది మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

సానుకూల ఆలోచనలు..

ఆధ్యాత్మికత ప్రకారం మనిషి  జీవితం మనిషి  ఆలోచనల ద్వారా రూపుదిద్దుకుంటాయి. కాబట్టి, ప్రతికూల ఆలోచనలను గుర్తించి, వాటిని సానుకూల ఆలోచనలతో భర్తీ చేయడానికి ప్రయత్నించాలి. ఎప్పుడు తనను తాను నెగిటివ్ గా నిందించుకోకూడదు.  పాడిటివ్ గా మాట్లాడుకోవాలి.  అదే విదంగా పాజిటివ్ ఆలోచనలు చేయాలి. ఏ పని చేసినా, ఏం జరిగినా అందులో పాజిటివ్ ను చూసే విధంగా అలవాటు చేసుకోవాలి.

ప్రకృతితో కనెక్ట్..

ఉదయం సూర్యరశ్మిలో గడపడం,  ఆలయ వాతావరణం, లేదా భజనలు,  కీర్తనలు వినడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. పగటిపూట కొంత సమయం ప్రకృతిలో గడపడం లేదా భక్తి సంగీతం వినడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.  ఆలోచనల వేగం తగ్గుతుంది.

వర్తమానంలో జీవించడం..

అతిగా ఆలోచించే అలవాటు తరచుగా భవిష్యత్తు గురించి చింతలు లేదా గత జ్ఞాపకాలతో ముడిపడి ఉంటుంది. మతం,  ఆధ్యాత్మికత మనిషిని వర్తమానంలో జీవించడం నేర్పుతాయి. ప్రస్తుతం ఉన్నదానిపై దృష్టి పెట్టడం,  ప్రతి క్షణాన్ని అంగీకరించడం అలవాటు చేసుకుంటే అతి ఆలోచనలు తగ్గుతాయి.

                                *రూపశ్రీ