మాసశివరాత్రి రోజు ఈ 5 పనులు చేస్తే చాలు.. అదృష్టం తలుపులు తెరచుకుంటాయి!
మాసశివరాత్రి రోజు ఎవ్వరికీ చెప్పకుండా ఈ 5 పనులు చేస్తే చాలు..
అదృష్టం తలుపులు తెరచుకుంటాయి!
హిందూ పంచాంగం ప్రకారం మాఘ మాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్థశి తిథిని మహాశివరాత్రి అని అంటారు. మిగిలిన మాసాల్లో వచ్చే కృష్ణపక్ష చతుర్దశి తిథిని మాస శివరాత్రి అని అంటారు. ప్రస్తుతం వైశాఖ మాసంలో కృష్ణపక్ష చతుర్దశి తిథి మే 15వ తేదీన వచ్చింది. మే 15వ తేదీన శుక్రవారం రోజు మాసశివరాత్రిని జరుపుకుంటారు. మాస శివరాత్రి రోజు శివుడిని పూజించి కొన్ని పనులు చేయడం వల్ల శివుడి అనుగ్రహం కలిగి అదృష్టం తలుపులు తెరచుకుంటాయని చెబుతారు. జాతకంలో గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని చెబుతారు. మాస శివరాత్రి రోజు ఏ పనులు చేయాలో తెలుసుకుంటే..
మాసశివరాత్రి పరిహారాలు..
బిల్వపత్ర అర్చన..
మాసశివరాత్రి రోజు రాత్రి, 101 లేదా 1000 బిల్వ పత్రాలపై "ఓం నమః శివాయ" అని వ్రాసి శివలింగానికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అకాల మరణ భయం తొలగిపోతుంది. శివుడు ప్రసన్నుడై ఆశీర్వదిస్తాడు.
మంత్ర జపం..
ప్రతినెల మాస శివరాత్రి రోజు రాత్రి, 'ఓం నమః శివాయ' మంత్రాన్ని వీలైనంత ఎక్కువగా జపించాలి. మాస శివరాత్రి రాత్రి జాగరణ చేసి ఈ మంత్రాన్ని జపించే వారి కోరికలు నెరవేరుతాయి.
శివాభిషేకం..
మాస శివరాత్రి రాత్రి శివాభిషేకం చేయాలి. దీనిని చేయడానికి, శివలింగానికి నీరు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె , గంగా జలంతో అభిషేకం చేయాలి. అక్షతలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల సకల బాధలు తొలగిపోయి, పనిలోని ఆటంకాలు తొలగిపోతాయి.
బిల్వవృక్షం పరిహారం..
ప్రతి నెలా వచ్చే మాస శివరాత్రి సాయంత్రం, మారేడు చెట్టు కింద మట్టితో శివలింగాన్ని తయారు చేసి పూజించాలి. ఈ పరిహారం కోరికలు నెరవేరడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది , ఎన్నో కష్టాల నుండి ఉపశమనాన్ని కూడా అందిస్తుంది.
మహామృత్యుంజయ మంత్ర జపం..
ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటే, ప్రతి నెల మాస శివరాత్రి రాత్రి మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రం అనారోగ్యాలను నయం చేయడానికి చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. కుటుంబ సభ్యులలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, వారి కోసం మరొకరు ఈ మంత్రాన్ని జపించవచ్చు. ఈ పరిహారం వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
*రూపశ్రీ.