బాలయ్య ఫస్ట్ లుక్ లో కుమ్మేశాడు..!
on Jun 9, 2016
పౌరాణికాలు చేయాలన్నా, జానపదాల్ని రక్తి కట్టించాలన్నా అప్పటి వాళ్లల్లో ఎన్టీఆర్ అయితే, ఇప్పుడున్న స్టార్స్ లో బాలకృష్ణ కే సాధ్యం. అలాంటి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు బాలయ్య. అన్ని రకాల జానర్స్ లో సినిమా చేసిన హీరోగా బాలయ్య గురించి చెప్పుకోవాలి. జయాపజయాలతో సంబంధం లేకుండా కొత్త పాత్రలు, కొత్త సినిమాలు చేసుకుంటూ వెళ్లడం ఆయనకే సాధ్యం. ఇలా ఎన్నో ఎత్తు పల్లాల మీదుగా పయనిస్తూ బాలయ్య తన వందో సినిమా అనే మైల్ స్టోన్ కు చేరువయ్యారు.
చరిత్ర సృష్టించిన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాను తన సబ్జెక్ట్ గా ఎంచుకున్న బాలయ్య, ఇది చరిత్ర సృష్టించే సినిమా అవుతుందని భావిస్తున్నారు. శుక్రవారం బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని మూవీ టీం, ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇప్పటికే వార్ సీక్వెన్స్ లను ఫస్ట్ షెడ్యూల్ లో పూర్తి చేసిన మూవీ టీం, యుద్ధ సన్నివేశాల్లోని గెటప్ నే ఫస్ట్ లుక్ గా వదిలారు. ముఖం మీద రక్తంతో, యుద్ధంలో అలసిపోయిన వీరుడిలా కనిపిస్తున్న ఈ ఫస్ట్ లుక్ అభిమానుల్లో అంచనాల్ని మరింత పెంచేస్తోంది. బాలయ్య అభిమానులు సినిమా రిలీజయ్యే వరకూ ఆగడం చాలా కష్టమే మరి.