అలీ అంత్యక్రియలకు హాజరవనున్న హాలీవుడ్ హీరో..!
on Jun 9, 2016

బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీ అంత్యక్రియలు ఈ నెల 10 న జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అలీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. క్రీడాకారులు, రాజకీయ సీనీ ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. వీరిలో ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ కూడా ఉన్నాడు. మహ్మద్ అలీ జీవిత కథ ఆధారంగా 2001 లో తెరకెక్కిన హాలీవుడ్ సినిమా ' అలీ ' లో విల్ స్మిత్ నటించాడు. ఆ సినిమాకు స్మిత్ ఆస్కార్ నామినేషన్ పొందాడు. అలీ తో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పిన బాక్సింగ్ దిగ్గజం మరణం పట్ల తన విచారాన్ని వ్యక్తం చేసిన స్మిత్, ఆయన శవపేటికను స్వయంగా మోస్తానని ప్రకటించాడు. మంచి స్నేహితుణ్ని, గురువును కోల్పోయానని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు స్మిత్. ఇక ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు కాబట్టి, అలీ అంత్యక్రియలకు సామాన్యులు కూడా హాజరయ్యేలా 30 వేల పాసుల్ని విడుదల చేశారు ఆయన కుటుంబసభ్యులు. అలీ అంత్యక్రియలు ఆయన స్వస్థలమైన కెంటకీలో జరగనున్న సంగతి తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



