English | Telugu

నందమూరి నటసింహం బాలకృష్ణ బర్త్ డే స్పెషల్

on Jun 9, 2018

 

కొంత మంది చరిత్రలో తమకంటూ ప్ర్యతేక స్థానం సంపాదించుకుంటారు.. కాని కొంత మంది మాత్రం చరిత్ర సృష్టిస్తారు.. కాని అలాంటి చరిత్రను కొంత మంది మాత్రమే కొనసాగించగలుగుతారు.. అలా ఎన్టీఆర్‌ సృష్టిచిన అరుదైన చరిత్రను అంతే ఘనంగా కొనసాగిస్తున్న అద్భుతమైన నటుడు నందమూరి బాలకృష్ణ.. ఈ నటిసింహ పుట్టినరోజు సందర్భంగా బాలయ్య కెరీర్‌ పై ఓ లుక్‌..

 

తెలుగు సినిమాకు మాస్‌ఫార్ములా చూపించిన నటుడు ఎన్టీఆర్‌ అయితే ఆ అభిమానాన్ని ఆకాశం ఎత్తుకు తీసుకుపోయిన నటుడు బాలయ్య.. అందుకే నందమూరి వారి అబ్బాయిగా అభిమానులు తన మీద పెంచుకున్న నమ్మకానికి వంద శాతం న్యాయం చేశాడు బాలకృష్ణ.

ఎన్టీఆర్‌ తనయుడి గా బాలయ్యకు సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఈజీగా లభించినా.. ఎన్టీఆర్‌ పేరుకు ఉన్న విలువ కాపాడం కోసం మాత్రం చాలా శ్రమించాడు.. 1974 లో తాతమ్మకల అనే చిత్రం ద్వారా 14 ఏళ్ల వయసులో ఆయన సినీరంగ ప్రవేశం జరిగింది. ఆ తరువాత ఆయన రామ్ - రహీం ... వేములవాడ భీమకవి చిత్రాల్లో ఇంపార్టెంట్‌ రోల్స్‌ లో నటించాడు.  తరువాత అన్నదమ్ముల అనుబంధం ... దానవీర శూర కర్ణ ... అక్బర్ సలీం అనార్కలి చిత్రాలు  నటుడిగా బాలకృష్ణ కి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.

1980 ల్లో వచ్చిన మంగమ్మగారి మనవడు సినిమాతో బాలకృష్ణ హీరోఇజానికి తెరతీస్తూ అఖండ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో పల్లెటూరి బుల్లోడిగా బాలక్రిష్ణని నటనకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు.. ఇక ఈ సినిమా తరువాత వచ్చిన ముద్దుల క్రిష్నయ్య ... అనసూయమ్మగారి అల్లుడు ... అపూర్వ సహోదరులు సినిమాలు  బాలయ్యకు భారీ సక్సెస్‌లతో పాటు మాస్‌ ఫాలోయింగ్‌ను కూడా అందించాయి..

ఇక బాలకృష్ణ కెరీర్‌లో మరో మైలురాయి సీతారామ కల్యాణం. అప్పటివరకూ బాలకృష్ణకి ఉన్న మాస్ ఇమేజ్ కి ఈ సినిమా రొమాంటిక్ టచ్ ఇచ్చింది. తరువాత వచ్చిన అల్లరి క్రిష్నయ్య ... మువ్వగోపాలుడు ... ముద్దుల మావయ్య వంటి చిత్రాలతో తాను ఎటువంటి పాత్రలకైన న్యాయం చేయగలనని నిరూపించాడు బాలయ్య.. బాలకృష్ణ పల్లెటూరి చిన్జ్నోడులా పంచె కట్టి కర్రచేత బడితే  ఆ సినిమా కాసులు వర్షం కురిపిస్తుంది అన్న క్రేజ్‌ సంపాదించాడు..

బాలకృష్ణ సినిమాల్లో ఓ డిఫరెంట్‌ మూవీగా గుర్తింపు తెచ్చుకున్న సినిమా ఆదిత్య 369 ఈ సినిమాలో లో హీరోగా కనిపించిన బాలయ్య కొన్ని సీన్స్‌ లో శ్రీకృష్ణ దేవరాయలుగా కనిపించి అలరించాడు...ఆ పాత్రలో బాలయ్య నటన చూసిన అభిమానులు మరోసారి ఎన్టీఆర్‌ ను గుర్తు చేసుకున్నారు..

బాలయ్య కెరీర్‌లో మరో అరుదైన రికార్డ్‌ బంగారు బుల్లోడు, నిప్పురవ్వ.. ఈరెండు సినిమాలను ఒకే రోజు విడుదల చేసిన బాలయ్య చరిత్ర సృష్టించాడు.. మరే హీరో కూడా అలాంటి సాహసం చేయలేని రికార్డ్‌ నెలకొల్పాడు.. ఆ తరవాత బాలయ్య జానపపద కథానాయకుడిగా తనను తాను నిరూపించుకున్న సినిమా భైరవధ్వీపం.. కమర్షియల్‌ సినిమాలో జోరులో కూడా ఓ ఫాంటసీలో భారీ సక్సెస్‌ కొట్టిన బాలయ్య బాక్సాఫీస్‌ మీద తన ఆదిపత్యాన్ని నిరూపించుకున్నాడు..


ఇక తెలుగు సినిమా ఫ్యాక్షన్‌ ట్రెండ్‌ తీసుకువచ్చిన హీరో కూడా బాలయ్యే. ఆయన సమరసింహా రెడ్డి చిత్రంతో ఫ్యాక్షన్ నేపథ్య  చిత్రాలకి శుభారంభాన్ని పలికారు. చాలామంది హీరోలు ఈ తరహా పాత్రలను చేసినా, ఎక్కువ మార్కులు బాలకృష్ణ కే దక్కాయి. అంతేకాదు బాలకృష్ణ కెరీర్‌ తడబడుతున్న కాలంలో కూడా మరోసారి ఫ్యాక్షన్‌ నేపధ్యంతో సాగే సింహా సినిమాతో మరోసారి సక్సెస్‌ అందుకున్నాడు బాలయ్య..

ఇక బాలయ్య చేసిన సినిమాలో అన్నింటికంటే ముఖ్యమైనవి పౌరాణికాలు.. తండ్రి వారసత్యంగా వచ్చిన నటనే కాదు ఆయన అలరించిన పాత్రలను కూడా తాను మాత్రమే చేయగలనని నిరూపించుకున్నాడు బాలయ్య.. శ్రీ కృష్ణార్జున విజయం, శ్రీరామరాజ్యం లాంటి సినిమాల లో పురాణ పురుషుడిగా నిరాజనాలు అందుకున్నాడు..

ప్రస్తుతం బాలకృష్ణ, అన్నగారు ఎన్టీఆర్ బయోపిక్లో నటిస్తున్నారు. బాలకృష్ణతో కలిసి 'గౌతమిపుత్ర శాతకర్ణి ' లాంటి అద్భుతమైన సినిమాని మనకి అందించిన 'క్రిష్' ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.. త్వరలోనే అన్నగారిగా బాలకృష్ణని మనం వెండితెర మీద చూడబోతున్నాం.. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేస్తున్నారు బాలయ్య ..

బాలయ్య పని అయిపోయిందనే వ్యాఖ్యలు వినిపించిన ప్రతిసారి.. ఆ వ్యాఖ్యలకు చెంపపెట్టుగా ఓ సంచలన విజయం అందివ్వడం బాలయ్యకు అలవాటే. నేడు జన్మదినం జరుపుకుంటున్న నందమూరి బాలకృష్ణ మరెన్నో సంచలన విజయాలు సాధించాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటు సెలవు.


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here