అక్షయ్‌కుమార్ భార్యగా కరీనాకపూర్
on Jun 9, 2018

తల్లి అయిన తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న కరీనాకపూర్ కెరీర్ మళ్లీ ఊపందుకున్నట్లుంది. వీర్ ది వెడ్డింగ్ ఆర్థికంగా మంచి లాభాలు తీసుకురావడంతో, వరుస సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ దశలో ఆమె కరణ్‌జోహార్ నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇందులో కరీనాకపూర్ ఓ తల్లి పాత్రను చేయనున్నదట. అంతేకాదు! వరుస విజయాలతో దూసుకుపోతున్న అక్షయ్‌కుమర్ ఇందులో తండ్రి పాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. అక్షయ్, కరీనా జోడీ బాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. వీరిద్దరూ కలిసి ఎతరాజ్, బేవఫా, తలాష్, అజ్‌నబీ, తషాన్, దోస్తీలాంటి చాలా చిత్రాలలోనే చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



