Facebook Twitter
ఆకలి (కవిత)

 

ఆకలి (కవిత)

 

 


జారిపోతున్న కాలనికి బాగా తెలుసు
ఆనాడు కారిపోయిన కధ కాశీమజీలీ కాదని,
వీడిపోయిన మిత్రుడెక్కడున్నాడోనని
రోజూ వెతుకుతా మూడు పూట్లా..
కాసింత ఆదమరచి సొదచెపుదామనుకుంటే దరికి రాడే?
జేబు బరువెక్కాక
వాడేం గురుతులే..
వాడు నేర్పిన పాఠమేగా ఇది
నాటి తోటి ఆకలి మిత్రుడేడి?
జ్ఞాపకాల్లోనే మిగులు..
అదే దారిచ్చిన పగలు!
స్దితిమంతుడిని చేసి
స్దితప్రజ్ఞుడిగా మిగిలిన "వాడి" రూపెప్పుడూ
పదిలమే..
పరుగిలిడిన ఆనాటి పేగుల "ఆకలి" సాక్షిగా..
నా మిత్రుడైన ఆ"కలి" నీడగా!!

 

-రఘు ఆళ్ల