RELATED EVENTS
EVENTS
"వనితా వేదిక" టాంటెక్స్

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో వనితావేదిక కార్యక్రమం "గృహలక్ష్మి" స్థానిక మయూరి రెస్టారెంట్‌లో ఘనంగా జరిగింది. వివిధరంగాలలో కృషి చేస్తున్న మహిళల ప్రసంగాలూ, ఫెంగ్ షుయ్ విశేషాలూ, ఆవకాయ పెట్టడం నేర్పించడం వంటి విభిన్నమైన అంశాలతో కార్యక్రమం వైవిధ్యభరితంగా సాగింది.

 

Tantex, north texas telugu association, tantex vanitha vedhika gruhalakshmi, tantex gurhalakshmi mayuri restaurant, telugu nri news

 

మహిళల సమస్యలనుద్దేశించి వక్తలందరూ చేసిన ఉపన్యాసాలు అందరికీ ఉపయుక్తమైన, ఎంతో విలువయిన సమాచారాన్ని అందించాయి. డా. నిర్మల వల్లూరిపల్లి రొమ్ముకాన్సర్‌కు సంబంధించి తీసుకోవలసిన ముందు జాగ్రత్తల గురించి ప్రస్తావించారు. న్యాయవాది కవిత ఆకుల గృహహింస అన్ని వర్గాల మహిళలూ ఎదుర్కొంటున్న సమస్యగా అభివర్ణిస్తూ కుటుంబ ఆర్థిక వ్యవహారాలు భార్యలకు తెలిసి ఉండవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. టాంటెక్స్ కార్యవర్గ నిర్వాహకురాలు రాజేశ్వరి జుజ్జారె స్వచ్ఛంద సేవకురాలిగా తన అనుభవాలు పంచుకున్నారు.ప్రముఖ మానసిక వైద్యురాలు కాంతి రాజు స్త్రీల మానసిక సమస్యలపై మాట్లాడగా, చేతన సంస్థ గృహహింస బాధితులకు అందిస్తున్న సహాయ సహకారాల గురించి ఆ సంస్థ కార్యకర్త మాధవి రెడ్డి వివరించారు. ఆపై జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సభికులంతా ఉత్సాహంగా పాల్గొని తమ సంశయాలను నివృత్తి చేసుకున్నారు.

 

Tantex, north texas telugu association, tantex vanitha vedhika gruhalakshmi, tantex gurhalakshmi mayuri restaurant, telugu nri news

 

అనంతరం కవిత వెంకట్ ఫెంగ్ షుయ్ లోని మౌలిక సూత్రాలు తెలియజేయగా, అన్నపూర్ణ చిలుకూరి,అపర్ణ గంగసాని,స్రవంతి ధగం పలు రకాల ఆవకాయలు ఎలా పెట్టుకోవచ్చో చేసి చూపించారు. సీత ముల్లుకుట్ల తన వీణానాదంతో, శాంత పులిగండ్ల,మధుమతి కృష్ణ తమ గానమాధుర్యంతో సభికులను అలరించారు. వనితావేదిక కమిటీ చైర్ శిరీష బావిరెడ్డి  అధ్యక్షతన మంజులత కన్నెగంటి, డా. హిమ రెడ్డి, శారద నంబూరి, మనోజ్ఞ ముద్ద, కల్యాణి తడిమేటి, రేణు చిచ్చుల, శ్రీలక్ష్మి మందిగ నిర్వహించిన ఈ సదస్సులో ఎందరో మహిళలు అత్యుత్సాహంగా పాల్గొన్నారు.

 

Tantex, north texas telugu association, tantex vanitha vedhika gruhalakshmi, tantex gurhalakshmi mayuri restaurant, telugu nri news

 

 

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;